| Title | పలుకవు నాతో | palukavu nAtO |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | పలుకవు నాతో మఱి ఇదేటి మోడిరా | palukavu nAtO ma~ri idETi mODirA |
| చరణం charaNam 1 | చెలుల బోధన లెల్ల తలకెక్కె నేమో కాని చెలిమిని దలచవు మేరా | chelula bOdhana lella talakekke nEmO kAni chelimini dalachavu mErA |
| చరణం charaNam 2 | విడెమొసగుచు ముద్దు లిడగబోతే నను విదలించుట మరియాదా | viDemosaguchu muddu liDagabOtE nanu vidalinchuTa mariyAdA |
| చరణం charaNam 3 | సరివారిలో నను చౌక చేయకుర సరసుడ రాజ గోపాలా | sarivArilO nanu chauka chEyakura sarasuDa rAja gOpAlA |
#454 సామి నాపై sAmi nApai
| Title | సామి నాపై | sAmi nApai |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | ముఖారి | mukhAri |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | సామి నాపై చలమేలా సరగ నేలుకొనరా | sAmi nApai chalamElA saraga nElukonarA |
| కాము బారి కోర్వ జాల కరుణ నేలుకొనరా | kAmu bAri kOrva jAla karuNa nElukonarA | |
| నిమిషమైన బాయనట్టి నెనరు మఱవ నగునా | nimishamaina bAyanaTTi nenaru ma~rava nagunA | |
| మరులు కొంటి నిన్నె చాల మనవి చేకొనరా | marulu konTi ninne chAla manavi chEkonarA | |
| పంతమేల రాజ గోపాల సామి వినురా | pantamEla rAja gOpAla sAmi vinurA |
#453 మగువరో వానిపైని maguvarO vAnipaini
| Title | మగువరో వానిపైని | maguvarO vAnipaini |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | త్రిశ్ర లఘువు | triSra laghuvu |
| పల్లవి pallavi | మగువరో వానిపైని మమత యెటుల తీఱునే | maguvarO vAnipaini mamata yeTula tI~runE |
| చరణం charaNam 1 | పొగరున సుమ శరుడు పొంచి విలు వంచెనే అంతంతకు తమి మించెనే | pogaruna suma SaruDu ponchi vilu vanchenE antantaku tami minchenE |
| చరణం charaNam 2 | వానితో సుఖింపని ప్రాయమది యేటికే ఈ కాయమది యేటికే | vAnitO sukhimpani prAyamadi yETikE I kAyamadi yETikE |
| చరణం charaNam 3 | రతి పతి గన్న శ్రీ రాజ గోపాలుడే ఉదార గుణ శీలుడే | rati pati ganna SrI rAja gOpAluDE udAra guNa SIluDE |
#452 రారా మా రమణి rArA mA ramaNi
| Title | రారా మా రమణి | rArA mA ramaNi |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | బ్యాగు | byAgu |
| తాళం tALa | మిశ్ర లఘువు | miSra laghuvu |
| రారా మా రమణి తాళలేదురా ||సామి|| | rArA mA ramaNi tALalEdurA ||sAmi|| | |
| తాళలేదురా ఇది పాడి గాదురా ||సామి|| ||రా|| | tALalEdurA idi pADi gAdurA ||sAmi|| ||rA|| | |
| మారుబారి వేమఱు సొమ్మ సిల్లినది ||రా|| | mArubAri vEma~ru somma sillinadi ||rA|| | |
| చెలులతో నెప్పుడు పలుకదురా నిన్నే తలచుచు నున్నదిరా సామి నిన్నె | chelulatO neppuDu palukadurA ninnE talachuchu nunnadirA sAmi ninne | |
| అన్న పానములపై ఆశయే లేదురా కన్నె నిక నేలురా దయ యుంచి | anna pAnamulapai ASayE lEdurA kanne nika nElurA daya yunchi | |
| రసికుడైన శ్రీ రాజ గోపాల రట్టు సేయుటేలరా చెలి నిటు | rasikuDaina SrI rAja gOpAla raTTu sEyuTElarA cheli niTu | |
#451 చెలియ నేనెట్లోర్తునే cheliya nEneTlOrtunE
| Title | చెలియ నేనెట్లోర్తునే | cheliya nEneTlOrtunE |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | చెలియ నేనెట్లోర్తునే చెలువుని బాసి నే నిలువగ జాలనె | cheliya nEneTlOrtunE cheluvuni bAsi nE niluvaga jAlane |
| చరణం charaNam 1 | అలివేణి నా విభు డలగి రాడాయెనో చెలి బోధన విని చలమును బూనెనొ | alivENi nA vibhu Dalagi rADAyenO cheli bOdhana vini chalamunu bUneno |
| చరణం charaNam 2 | మరుడురమున విరి శరముల నేసెనె సరగున సామితో సరసము లాడక | maruDuramuna viri Saramula nEsene saraguna sAmitO sarasamu lADaka |
| చరణం charaNam 3 | వెన్నెల కాకల వెత జెంద లేనే కన్నెరో చెలువుని కౌగిట జేరక | vennela kAkala veta jenda lEnE kannerO cheluvuni kaugiTa jEraka |
| చరణం charaNam 4 | రమణుడైన శ్రీ రాజ గోపాలుని నిమిషము జూడక నిదుర రాదు గదే | ramaNuDaina SrI rAja gOpAluni nimishamu jUDaka nidura rAdu gadE |
#450 మాటలేటికి పోపోరా mATalETiki pOpOrA
| Title | ఓరి సామి మాటలేటికి పోపోరా | Ori sAmi mATalETiki pOpOrA |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | మాటలేటికి పోపోరా నీ వలచిన మగువ యిల్లిది గాదురా | mATalETiki pOpOrA nI valachina maguva yillidi gAdurA |
| చరణం charaNam 1 | బోటిని గూడిన నీటు దెలిసెరా మాటిమాటికి రాకురా || ఓరి సామి|| | bOTini gUDina nITu deliserA mATimATiki rAkurA || Ori sAmi|| |
| చరణం charaNam 2 | ఇంతి నీ రాకకు ఎదురు చూచునురా ఎంతో ప్రొద్దాయెరా || ఓ|| | inti nI rAkaku eduru chUchunurA entO proddAyerA || O|| |
| చరణం charaNam 3 | అతివ చూచిన నన్ను నారడి పెట్టును హితవుగ మది నెంచరా || ఓ|| | ativa chUchina nannu nAraDi peTTunu hitavuga madi nencharA || O|| |
| చరణం charaNam 4 | రచ్చ సేయుటేలా రాజ గోపాలా మచ్చికతో గావరా || ఓ మాట|| | rachcha sEyuTElA rAja gOpAlA machchikatO gAvarA || O mATa|| |
#449 వాని మాటలిక vAni mATalika
| Title | వాని మాటలిక | vAni mATalika |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | వాని మాటలిక మనకేలే వంచనలకు గురు పీఠము గదే వేడుకతో నే విడెమీబోతే జాడగా తీసి యా చాన కొసగె | vAni mATalika manakElE vanchanalaku guru pIThamu gadE vEDukatO nE viDemIbOtE jADagA tIsi yA chAna kosage |
| చరణం charaNam 1 | మోము మోమున జేర్చి ముద్దిడ బోతే మోమటు త్రిప్పి యా ముదిత దలచె | mOmu mOmuna jErchi muddiDa bOtE mOmaTu trippi yA mudita dalache |
| చరణం charaNam 2 | అడుగులకు నే మడుగులు పరచిన జడియక సవతికి సరిగాదనే | aDugulaku nE maDugulu parachina jaDiyaka savatiki sarigAdanE |
| చరణం charaNam 3 | పణతిరో రాజగోపాలుడీ రీతిని కనికర మెంచక గాసి బెట్టెనే | paNatirO rAjagOpAluDI rItini kanikara menchaka gAsi beTTenE |
#448 తామసమేలరా tAmasamElarA
| Title | తామసమేలరా | tAmasamElarA |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | తామసమేలరా నా మనోహర తాళగ జాలనురా | tAmasamElarA nA manOhara tALaga jAlanurA |
| కాముడు నాపై కరుణ దప్పెనురా కళ లంటి నను గూడరా | kAmuDu nApai karuNa dappenurA kaLa lanTi nanu gUDarA | |
| మునుపటి దయ నీ మనసున లేదా మోహము దీర్చరా చక్కగ నాపై చనువు చూపకు మని సవతి చెప్పెనటరా | munupaTi daya nI manasuna lEdA mOhamu dIrcharA chakkaga nApai chanuvu chUpaku mani savati cheppenaTarA | |
| అంతరంగుడవై అరమర చేయుట వింతగ నున్నదిరా రమణుడైన శ్రీ రాజ గోపాలా సమయము దెలసి కోరా | antaranguDavai aramara chEyuTa vintaga nunnadirA ramaNuDaina SrI rAja gOpAlA samayamu delasi kOrA | |
#447 ఈ విరహ I viraha
| Title | ఈ విరహ | I viraha |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | హిందుస్థాని భైరవి | hindusthAni bhairavi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | ఈ విరహ మెటుల సైతునె కామినీ ఏవియు నా మది కింపు లేదాయెనే భావజుడెంతో నను బాధింపగ సాగెనే | I viraha meTula saitune kAminI Eviyu nA madi kimpu lEdAyenE bhAvajuDentO nanu bAdhimpaga sAgenE |
| చరణం charaNam 1 | వెన్నెల నా మదికి వెగటుగ దోచెనే కన్నెరో చల్లని గాలి విష మాయెనే | vennela nA madiki vegaTuga dOchenE kannerO challani gAli visha mAyenE |
| చరణం charaNam 2 | బాలరో రాజ గోపాలుడు మును నను నేలిన ప్రీతి మది నెంచి యిటు రాడాయెనే | bAlarO rAja gOpAluDu munu nanu nElina prIti madi nenchi yiTu rADAyenE |
#446 మనసిజు బారికి manasiju bAriki
| Title | మనసిజు బారికి | manasiju bAriki |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | మనసిజు బారికి నెటులోర్తునే వనితరో విభు నెడబాసిన మొదలు దినమొక యుగమాయెనే | manasiju bAriki neTulOrtunE vanitarO vibhu neDabAsina modalu dinamoka yugamAyenE |
| చరణం charaNam 1 | ముదితరో రమణిపై మోహమగ్గలమై నిదురయు రాదాయెనే | muditarO ramaNipai mOhamaggalamai nidurayu rAdAyenE |
| చరణం charaNam 2 | కన్నెరో చెలువుని కనుల జూడమిచే అన్నము సైచ దాయెనే | kannerO cheluvuni kanula jUDamichE annamu saicha dAyenE |
| చరణం charaNam 3 | పణతిరో రాజ గోపాలుడు నాపై కనికర మెంచ డాయెనే | paNatirO rAja gOpAluDu nApai kanikara mencha DAyenE |