#382 నే పిలచితె nE pilachite

Titleనే పిలచితెnE pilachite
Written Byమైసూరు వాసుదేవాచారిmaisUru vAsudEvAchAri
Book
రాగం rAgaకమాచిkamAchi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviనే పిలచితె రావదేమిరా ఓ ప్రాణనాథా
కోపమో నే జేసిన పాపమో నీకు పరి
తాపమేల రాకున్నది ఓ ప్రాణనాథ (?)
nE pilachite rAvadEmirA O prANanAThA
kOpamO nE jEsina pApamO nIku pari
tApamEla rAkunnadi O prANanAtha (?)
నీవే నా దైవమని నమ్మి యున్నానురా
నీవు లేక నేనెంత జీవింతురా సామి
nIvE nA daivamani nammi yunnAnurA
nIvu lEka nEnenta jIvinturA sAmi
నీరజాక్ష వాసుదేవ నా మనవిని వినరాదా
నీ రాకను కోరుకుంటె నీకేల పరాకురా
nIrajAksha vAsudEva nA manavini vinarAdA
nI rAkanu kOrukunTe nIkEla parAkurA

#381 నిన్ను బాసి ninnu bAsi

Titleనిన్ను బాసిninnu bAsi
Written Byమైసూరు వాసుదేవాచారిmaisUru vAsudEvAchAri
Book
రాగం rAgaజంఝూటిjanjhUTi
తాళం tALaమిశ్ర చాపుmiSra chApu
పల్లవి pallaviనిన్ను బాసి నిమిషమైన నేనెట్లు జీవింతునే
నన్ను విడచుట న్యాయమా నీకు నా ముద్దురాణి
ninnu bAsi nimishamaina nEneTlu jIvintunE
nannu viDachuTa nyAyamA nIku nA muddurANi
చరణం
charaNam 1
నీ మనసు కరగదేమి నా పాలి దైవమా
వాసుదేవ మనోహరి ఓర జూపు జూపవే
nI manasu karagadEmi nA pAli daivamA
vAsudEva manOhari Ora jUpu jUpavE

#380 నిన్నెంతగా ninnentagA

Titleనిన్నెంతగాninnentagA
Written Byమైసూరు వాసుదేవాచారిmaisUru vAsudEvAchAri
Book
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviనిన్నెంతగా విసిగింతునే ప్రియే
నన్ను మచ్చికతో మన్నించవే
ninnentagA visigintunE priyE
nannu machchikatO manninchavE
చరణం
charaNam 1
నీరజాక్షి నీవెవరి మాట విని నన్నుపేక్ష జేతున్నావే
పగలు రేయి నిన్నే దలచుకొంటిని
పరవాసుదేవుడే నాకు సాక్షి అమ్మా
nIrajAkshi nIvevari mATa vini nannupEksha jEtunnAvE
pagalu rEyi ninnE dalachukonTini
paravAsudEvuDE nAku sAkshi ammA
Audio Linkhttps://www.youtube.com/watch?v=G0vTE1S_b38

#379 ప్రేమతో నాతో prEmatO nAtO

Titleప్రేమతో నాతోprEmatO nAtO
Written Byమైసూరు వాసుదేవాచారిmaisUru vAsudEvAchAri
Book
రాగం rAgaకానడkAnaDa
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviప్రేమతో నాతో మాటాడవా
ప్రియా నాపై కోపమా
prEmatO nAtO mATADavA
priyA nApai kOpamA
ప్రియ వాక్కులచే నన్నాదరింపవా
పాపుగల నామీద కరుణ లేదా
priya vAkkulachE nannAdarimpavA
pApugala nAmIda karuNa lEdA
చిరునవ్వు గల మోముతో నన్ను
కరుణించి చూడవా చిర కాలమున నీ కటాక్షమును
కోరుతున్న ఈ వాసుదేవునితో
chirunavvu gala mOmutO nannu
karuNinchi chUDavA chira kAlamuna nI kaTAkshamunu
kOrutunna I vAsudEvunitO

#378 వాని జోలి నీకేలే vAni jOli nIkElE

Titleవాని జోలి నీకేలేvAni jOli nIkElE
Written By
Book
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaమిశ్ర చాపుmiSra chApu
పల్లవి pallaviవాని జోలి నీకేలే ఇందుముఖిరో
ఇందుముఖిరో ఆ వనితా బోధనచే మైమరచే
vAni jOli nIkElE indumukhirO
indumukhirO A vanitA bOdhanachE maimarachE
అనుపల్లవి anupallaviమానినిరో వాని మమత లెందుబోయే
పూనిదాని ఇల్లుని విడిచి రాక యున్న అతడినా
mAninirO vAni mamata lendubOyE
pUnidAni illuni viDichi rAka yunna ataDinA
చరణం
charaNam 1
ఇంతిరో నిను బాయని నాతో ఎన్నో
బూటకముల బలికే నా
సంతసమెల్లన చాన కొసగి నన్ను
పంతముతో మరుని పలు చేసెనిక
intirO ninu bAyani nAtO ennO
bUTakamula balikE nA
santasamellana chAna kosagi nannu
pamtamutO maruni palu chEsenika
చరణం
charaNam 2
మాట తప్పనివాడని నేను మనసున నెంచితి గదవే
బోటిరో అలవాని మోము జూడనగునా
సాటివారలు నవ్వజాలరేమె ఇక
mATa tappanivADani nEnu manasuna nenchiti gadavE
bOTirO alavAni mOmu jUDanagunA
sATivAralu navvajAlarEme ika
చరణం
charaNam 3
సింగర సుతుడు నాతో మును చేసిన చెలిమిని మరచెనే
బంగారము వంటి వాని గుణములెల్ల
అంగనామణి మోహాబ్ధి జేరెనిక
singara sutuDu nAtO munu chEsina chelimini marachenE
bangAramu vanTi vAni guNamulella
anganAmaNi mOhAbdhi jErenika

#377 సామి నెడబాసి sAmi neDabAsi

Titleసామి నెడబాసిsAmi neDabAsi
Written Byతచ్చూరు సింగరాచార్యులుtachchUru singarAchAryulu
Book
రాగం rAgaదేవ మనోహరిdEva manOhari
తాళం tALaమిశ్రచాపుmiSrachApu
పల్లవి pallaviసామి నెడబాసి నేనెట్లు సైరింతునే
కోమలీ శ్రీ కోమలీ శ్రీ కోమలీ శ్రీ రాజగోపాల
sAmi neDabAsi nEneTlu sairintunE
kOmalI SrI kOmalI SrI kOmalI SrI rAjagOpAla
చరణం
charaNam 1
మరుడురమున విరిశరముల నేసెనే
సరసిజాక్షి ఇదే సమయము రమ్మనవే
maruDuramuna viriSaramula nEsenE
sarasijAkshi idE samayamu rammanavE
చరణం
charaNam 2
కలువల దొర పగ నాపై గావించెనే
కలికిరో తమి నిలుప నా తరమటే
kaluvala dora paga nApai gAvinchenE
kalikirO tami nilupa nA taramaTE
చరణం
charaNam 3
సింగర సుతుడు మోసము జేసెనే
అంగనామణి ఇపుడైనను బిలువవే
singara sutuDu mOsamu jEsenE
anganAmaNi ipuDainanu biluvavE

#376 ముందటివలె mundaTivale

TitleముందటివలెmundaTivale
Written By
Book
రాగం rAgaభైరవిbhairavi
తాళం tALaమిశ్రచాపుmiSrachApu
పల్లవి pallaviముందటివలె నన్ను ప్రేమించకుంటే
అందగాడా నిను వదలనురా
mundaTivale nannu prEminchakunTE
andagADA ninu vadalanurA
కందర్ప జనక నీ దర్పములెందుకు
అందమా నీకిది చందమా
kandarpa janaka nI darpamulenduku
andamA nIkidi chandamA
పుట్టిల్లు వదలి నేనెట్లు వచ్చితిరా
కట్టకడకు నా చెయి విడిచితివయ్యో
puTTillu vadali nEneTlu vachchitirA
kaTTakaDaku nA cheyi viDichitivayyO
మట్ట మాయము జేసినట్టి వేణుగోపా
లెట్ల నిను నమ్ముదు తెలియదేమి సేతురా
maTTa mAyamu jEsinaTTi vENugOpA
leTla ninu nammudu teliyadEmi sEturA

#375 సరసకు రారాయని sarasaku rArAyani

స్వరపద జావళీ svarapada jAvaLI

Titleసరసకు రారాయనిsarasaku rArAyani
Written Byధర్మపురి సుబ్బరాయర్ / సుబ్బరావుdharmapuri subbarAyar / subbarAvu
Book
రాగం rAgaశుధ్ధ దేశిSudhdha dESi
తాళం tALa????
పల్లవి pallaviసరసకు రారాయని నే పిలిచితే
కరుణమింతైన లేదా సామీ
sarasaku rArAyani nE pilichitE
karuNamintaina lEdA sAmI
చరణం
charaNam 1
ధరపురీశ సరసిజనిభ నేత్ర నిదుర రాదు
పర వనితనే గాదుర
dharapurISa sarasijanibha nEtra nidura rAdu
para vanitanE gAdura
చరణం
charaNam 2
కరమున కౌగిట సేయుట కెందుకు బిగువ
మగువాయనితి వపుడు బిలువా
karamuna kaugiTa sEyuTa kenduku biguva
maguvAyaniti vapuDu biluvA
చరణం
charaNam 3
ఒక ముద్దీయ గలిగితె సుఖ మెప్పటికిది యని
మిక్కిలి ప్రీతితో తరుణుల
గురుతుంచి చన్నులను గోరెదవు
oka muddIya galigite sukha meppaTikidi yani
mikkili prItitO taruNula
gurutunchi channulanu gOredavu

#374 ఎక్కడున్నావు ekkaDunnAvu

Titleఎక్కడున్నావుekkaDunnAvu
Written Byమైసూరు సదాశివయ్యmaisUru sadASivayya
Bookరసరాజ వైభవrasarAja vaibhava
రాగం rAgaఅఠాణా aThANA
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఎక్కడున్నావు నా చక్కని సామి
ఇక్షు చాపుని చేత చిక్కినే నొందితి
ekkaDunnAvu nA chakkani sAmi
ikshu chApuni chEta chikkinE nonditi
అనుపల్లవి anupallaviఊరకుండ ఇంక మేరగాదుర
మేరుధీర రారా కౌగలించరా
ఊరకుండ ఇంక మేరగాదుర మేరుధీర
UrakunDa inka mEragAdura
mErudhIra rArA kaugalimcharA
UrakunDa inka mEragAdura mErudhIra
— మధ్యమ కాలం —
తాపసాదులకు మోహము వచ్చితే ధ్యానము సేయుట సాధ్యమా యిక
పాపి మారుడు నాపై వెడలి
నేను సైరించుట వశమా
ఎంత వేడినా పంతమేలరా
కంతురూప శ్రీకృష్ణ రాజేంద్ర
— madhyama kAlam —
tApasAdulaku mOhamu vachchitE
dhyAnamu sEyuTa sAdhyamA yika
pApi mAruDu nApai veDali
nEnu sairinchuTa vaSamA
enta vEDinA pantamElarA
kanturUpa SrIkRshNa rAjEndra
సదాశివుని మూడో కన్నులలో కూడ
ఇంతటి తాపము లేదు కాదేమిరా
నారీమణిని బాధ దీర్చకు ఎవరున్నారురా
నిను వినా గతి మాకురా
sadASivuni mUDO kannulalO kUDa
intaTi tApamu lEdu kAdEmirA
nArImaNini bAdha dIrchaku evarunnArurA
ninu vinA gati mAkurA
— మధ్యమ కాలము తపసాదులకు వలె —
పూలపాన్పుపై పొరలుచు నిన్నే
కలసి మెలయుటకు వలచితిరా
తాళజాల నీ అధరామృతముల
చెలిమితో నాకొసగుమురా
వలపుతో మీసలు తిరువుతొ రతిని
సలిపి ఆసలు దీర్చురా వ్యత
దీర్చరా నెరవేర్చురా
ఇంటిలో ఎవరు లేరురా ఎనిన
— madhyama kAlamu tapasAdulaku vale —
pUlapAn&pupai poraluchu ninnE
kalasi melayuTaku valachitirA
tALajAla nI adharAmRtamula
chelimitO nAkosagumurA
valaputO mIsalu tiruvuto ratini
salipi Asalu dIrchurA vyata
dIrcharA neravErchurA
inTilO evaru lErurA enina
Updated: 01 Dec 2020: Some minor changes carried out as per the printed book. Earlier text was based on my mother’s hand-written notes. ఈ రోజు పుస్తకంలో ఉన్న సాహిత్యం ఆధారంగా కొన్ని చిన్న మార్పులు చేయడం జరిగింది.

#373 సిగ్గు లేదేమి siggu lEdEmi

Titleసిగ్గు లేదేమిsiggu lEdEmi
Written Byunknown
Bookunknown
రాగం rAgaబేగడbEgaDa
తాళం tALaఖండ చాపుkhanDa chApu
పల్లవి pallaviసిగ్గు లేదేమిరా నీకు కొంతైనsiggu lEdEmirA nIku kontaina
అనుపల్లవి anupallaviముగ్గులన్ని వేయుచున్నపుడే దాచుకొని
దగ్గులు జేసి సైగలన్ని జేయుటకు
muggulanni vEyuchunnapuDE dAchukoni
daggulu jEsi saigalanni jEyuTaku
చరణం
charaNam 1
వగవగగా మాట్లాడి నన్నేమరించి
నగలు నాట్యాలన్ని దోచేయుట
మృగనయనినే కాదు నాతో నీదేమి వాదు
మొగుడున్నాడింటిలో ముగుద నీకంటితో
vagavagagA mATlADi nannEmarinchi
nagalu nATyAlanni dOchEyuTa
mRganayaninE kAdu nAtO nIdEmi vAdu
moguDunnADinTilO muguda nIkanTitO