| Title | న్యాయమేమిరా | nyAyamEmirA |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | న్యాయమేమిరా నీకిది సామి వేయి మాట లేలర నా విభుడని నెఱ నమ్మినార మాయలాడి బోధనకే మమత జెంది యుండ నీకు | nyAyamEmirA nIkidi sAmi vEyi mATa lElara nA vibhuDani ne~ra namminAra mAyalADi bOdhanakE mamata jendi yunDa nIku |
| చరణం charaNam 1 | విరహ మోర్వరా నను వేగ నేలరా మరుడు నా యురమునను విరి శరముల వడి నేసెనురా కరుణ మఱవ వలదుర యీ కాయము నీ సొమ్మేర | viraha mOrvarA nanu vEga nElarA maruDu nA yuramunanu viri Saramula vaDi nEsenurA karuNa ma~rava valadura yI kAyamu nI sommEra |
| చరణం charaNam 2 | పంతమేలరా సామి పాడి గాదురా అంతరంగ మెఱిగి నన్నిటు లారడి పెట్టేవదేర చెంత జేరి తావులంటి వింత రతుల గూడవేర | pantamElarA sAmi pADi gAdurA antaranga me~rigi nanniTu lAraDi peTTEvadEra chenta jEri tAvulanTi vinta ratula gUDavEra |
| చరణం charaNam 3 | వలచినానురా నాపై చలము మానురా అలగి యుండు టేలర నా యపరాధము లేమిరా పలుకవేర రాజగోపాల నీకు మ్రొక్కేరా | valachinAnurA nApai chalamu mAnurA alagi yunDu TElara nA yaparAdhamu lEmirA palukavEra rAjagOpAla nIku mrokkErA |
#444 సరగున నిటరారా saraguna niTarArA
| Title | సరగున నిటరారా | saraguna niTarArA |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | యమన్ | yaman |
| తాళం tALa | త్రిశ్ర లఘువు | triSra laghuvu |
| పల్లవి pallavi | సరగున నిటరారా మరియాదటరా వినురా మరుని బారి కోర్వ లేక మరులైతిరా సామి నీకు సరివారలు నవ్వగ జేయుట న్యాయము గాదుర నేనెఱ నెమ్మిన దాననురా | saraguna niTarArA mariyAdaTarA vinurA maruni bAri kOrva lEka marulaitirA sAmi nIku sarivAralu navvaga jEyuTa nyAyamu gAdura nEne~ra nemmina dAnanurA |
| చరణం charaNam 1 | బాస లొసగి ఇటు నను నెడబాయ నగునా నను నెడ మోసమెందుకు చేసేవురా మది నెంచర యీ తనువే నీ సొమ్ముగ చేకొనరా | bAsa losagi iTu nanu neDabAya nagunA nanu neDa mOsamenduku chEsEvurA madi nenchara yI tanuvE nI sommuga chEkonarA |
| చరణం charaNam 2 | బ్రాణనాథ రాజ గోపాల చలమా రాజగో మాన మెంచవదేమిర నాయెడ నేరము లేమిర నే నిను జూడక తాళనురా | brANanAtha rAja gOpAla chalamA rAjagO mAna menchavadEmira nAyeDa nEramu lEmira nE ninu jUDaka tALanurA |
#443 రారా మనవి rArA manavi
| Title | రారా మనవి | rArA manavi |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | రారా మనవి చేకోరా మారుని బారికి నోర్వగ లేర | rArA manavi chEkOrA mAruni bAriki nOrvaga lEra |
| చరణం charaNam 1 | వలచినట్టి నను చులకన సేయుట మేరా సామి పలుకవ దేరా చలము మాని కలసెడు సరసులు లేరా సుకుమారా సమయమిదేర | valachinaTTi nanu chulakana sEyuTa mErA sAmi palukava dErA chalamu mAni kalaseDu sarasulu lErA sukumArA samayamidEra |
| చరణం charaNam 2 | చెలుల బోధనలు విని నను నాడగలేదా నాతో పలుమాఱు వాదా సలిపినట్టి చెలిమిని మది నిడరాదా మరియాదా వంచన పోదా | chelula bOdhanalu vini nanu nADagalEdA nAtO palumA~ru vAdA salipinaTTi chelimini madi niDarAdA mariyAdA vanchana pOdA |
| చరణం charaNam 3 | రాను రాను నీ గుణమిటు లాయెన దేలా శ్రీ రాజ గోపాలా కానివారు నవ్వగ బ్రదుకిక నేలా శ్రీ లోలా తాళగ జాల | rAnu rAnu nI guNamiTu lAyena dElA SrI rAja gOpALA kAnivAru navvaga bradukika nElA SrI lOlA tALaga jAla |
#442 రావేలర చెంతకు rAvElara chentaku
| Title | రావేలర చెంతకు | rAvElara chentaku |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రావేలర చెంతకు రాజసమా ఏ వనిత చెవి గఱిచె | rAvElara chentaku rAjasamA E vanita chevi ga~riche |
| చరణం charaNam 1 | భావభవుని బారికి నను ద్రోసి బాధ నొంద జేయకు నే వేడగ | bhAvabhavuni bAriki nanu drOsi bAdha nonda jEyaku nE vEDaga |
| చరణం charaNam 2 | ఆనాటి నేస్తమెంచకను నన్నగడు చేయ న్యాయమటర సామిగ ఏణాక్షి వలను దగిలి చలమును మానవేర కరుణ సుంత లేక | AnATi nEstamenchakanu nannagaDu chEya nyAyamaTara sAmiga ENAkshi valanu dagili chalamunu mAnavEra karuNa sunta lEka |
| చరణం charaNam 3 | వాదేల చేసేవురా నావంటి చెలిని నేచగ తగునటరా నీ దాన ననుచు నమ్మినందుకు నెనరుతోను కలిసి మెలసి యుండగ | vAdEla chEsEvurA nAvanTi chelini nEchaga tagunaTarA nI dAna nanuchu namminanduku nenarutOnu kalisi melasi yunDaga |
| చరణం charaNam 4 | శ్రీ రాజగోపాల నీదు చిత్తమీ రీతి యైన నా సరి వారిజాక్షులెల్ల నన్ను నెంతుర మేరగాదు నేరమేమి చేసితి | SrI rAjagOpAla nIdu chittamI rIti yaina nA sari vArijAkshulella nannu nentura mEragAdu nEramEmi chEsiti |
#441 సామిని తోడి తేగదే sAmini tODi tEgadE
| Title | సామిని తోడి తేగదే | sAmini tODi tEgadE |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | హిందోళ | hindOLa |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | సామిని తోడి తేగదే నా సకియరో జాగు సేయవలదే బిరాన | sAmini tODi tEgadE nA sakiyarO jAgu sEyavaladE birAna |
| చరణం charaNam 1 | భామరో నేనేమి సేతు కాముని బారికి తాళగ జాలనే ప్రేమ యుంచి రా రమ్మటంచు | bhAmarO nEnEmi sEtu kAmuni bAriki tALaga jAlanE prEma yunchi rA rammaTanchu |
| చరణం charaNam 2 | ఇంతిరో వాడిందు రాక పంతము సాధించెను గదవే అంతరంగ మెఱిగించి వేగ | intirO vADindu rAka pantamu sAdhinchenu gadavE antaranga me~riginchi vEga |
| చరణం charaNam 3 | కమల వైరి గాసి చేయ రమణిరో రాజగోపాలుని జూడక నిమిషమైన తమి నిలుపజాల | kamala vairi gAsi chEya ramaNirO rAjagOpAluni jUDaka nimishamaina tami nilupajAla |
#440 రారా రమ్మనెరా rArA rammanerA
| Title | రారా రమ్మనెరా | rArA rammanerA |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | రారా రమ్మనెరా చెలియ నిను మారుబారి కోర్వలేక వేగమే | rArA rammanerA cheliya ninu mArubAri kOrvalEka vEgamE |
| చరణం charaNam 1 | కోరి యున్నదిరా సుదతిపై కోపము చేయకురా సరోజ ముఖి విరాళి మై మఱచెనురా ఇటు విరసము తగదుర | kOri yunnadirA sudatipai kOpamu chEyakurA sarOja mukhi virALi mai ma~rachenurA iTu virasamu tagadura |
| చరణం charaNam 2 | చలమేలరా మగువకును సాటెవరున్నారురా విలాసముగను నేలుటకు సమయమురా మనవిని విని కరుణను | chalamElarA maguvakunu sATevarunnArurA vilAsamuganu nEluTaku samayamurA manavini vini karuNanu |
| చరణం charaNam 3 | రాజగోపాలా నీకిటుల రాజసమేలా నిజమ్ముగను సదా వలచినది వినురా మునుపటి దయ తలచుచు | rAjagOpAlA nIkiTula rAjasamElA nijammuganu sadA valachinadi vinurA munupaTi daya talachuchu |
#439 ఎందుకే యాచలము endukE yAchalamu
| Title | ఎందుకే యాచలము | endukE yAchalamu |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | ఎందుకే యాచలము నీ కిందు వదనరో సుందరాంగి నిన్ను జూచి సొక్కి చాల మరులు కొంటి | endukE yAchalamu nI kindu vadanarO sundarAngi ninnu jUchi sokki chAla marulu konTi |
| చరణం charaNam 1 | నిను బాసి నిదుర రాదు నిమిషమైన ప్రొద్దు పోదు మనసిజు బారి కోర్వరాదు మమత నిలుప పశము గాదు | ninu bAsi nidura rAdu nimishamaina proddu pOdu manasiju bAri kOrvarAdu mamata nilupa paSamu gAdu |
| చరణం charaNam 2 | తరుణిరో నే తాళజాల దయ నాపై దాచనేల కరుణ యుంచి యీ వేళ కలయుట కిక జాగులేల | taruNirO nE tALajAla daya nApai dAchanEla karuNa yunchi yI vELa kalayuTa kika jAgulEla |
| చరణం charaNam 3 | కోపము నాపై మాను కోమలి నిను నమ్మినాను ప్రాపు కోరి వచ్చినాను పరక నీకు పుణ్యమౌను | kOpamu nApai mAnu kOmali ninu namminAnu prApu kOri vachchinAnu paraka nIku puNyamaunu |
#438 మాయ చేసేవేరా mAya chEsEvErA
| Title | మాయ చేసేవేరా | mAya chEsEvErA |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | నాదనామక్రియ | nAdanAmakriya |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | మాయ చేసేవేరా నాతో సామి నాతో | mAya chEsEvErA nAtO sAmi nAtO |
| చరణం charaNam 1 | హాయి మీఱ నిన్న రేయి దాని ననుభవించలేదా ఱాయివంటి దాయె లేర నీమది రాను రాను జాడలెల్ల దెలిసెర | hAyi mI~ra ninna rEyi dAni nanubhavinchalEdA ~rAyivanTi dAye lEra nImadi rAnu rAnu jADalella delisera |
| చరణం charaNam 2 | నల్లవాని నమ్మరాదనే నుడి సల్లగాదు గదరా చెల్లదురా నీ నడతలు నా యెడ చేరరాకు దక్కితినని పలుకుచు | nallavAni nammarAdanE nuDi sallagAdu gadarA chelladurA nI naDatalu nA yeDa chErarAku dakkitinani palukuchu |
| చరణం charaNam 3 | తరుణి యెట్టి వలపు మందు పెట్టెనొ తాళ లేవు గదరా సరసుడైన రాజగోపాల చాలు చాలు వగలు చేయకుర ఇట | taruNi yeTTi valapu mandu peTTeno tALa lEvu gadarA sarasuDaina rAjagOpAla chAlu chAlu vagalu chEyakura iTa |
#437 ఊరక చలమేల Uraka chalamEla
| Title | ఊరక చలమేల | Uraka chalamEla |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | తిశ్ర లఘువు | tiSra laghuvu |
| పల్లవి pallavi | ఊరక చలమేల నీకిది మేరగాదురా సామి వారిజాక్షి వలచిన నను గారవించి చూడరా | Uraka chalamEla nIkidi mEragAdurA sAmi vArijAkshi valachina nanu gAravinchi chUDarA |
| చరణం charaNam 1 | పద్దు చేయ వలదుర నా యొద్దికి రారా సుద్దులనే తేలించి ప్రొద్దు పుచ్చకురా | paddu chEya valadura nA yoddiki rArA suddulanE tElinchi proddu puchchakurA |
| చరణం charaNam 2 | తరుణుల వలె నే వలపు దాచ జాలరా మరునిల్లు చెమ్మగిలి మైమఱవ సాగెరా | taruNula vale nE valapu dAcha jAlarA marunillu chemmagili maima~rava sAgerA |
| చరణం charaNam 3 | అక్కఱ తెలిసికొని నీదు ప్రక్క జేర్చరా ఎక్కువైన రతులచే గ్రక్కున నను నేలుకోరా | akka~ra telisikoni nIdu prakka jErcharA ekkuvaina ratulachE grakkuna nanu nElukOrA |
| చరణం charaNam 4 | పచ్చ విల్తు కేళి సుఖము పడయ జేయరా రచ్చ సేయ వలదురా రాజగోపాల సామి | pachcha viltu kELi sukhamu paDaya jEyarA rachcha sEya valadurA rAjagOpAla sAmi |
#436 మేరగాదురా mEragAdurA
| Title | మేరగాదురా | mEragAdurA |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | చతురశ్ర లఘువు | chaturaSra laghuvu |
| పల్లవి pallavi | మేరగాదురా నీకిది సామి ఇది కోరిన చెలినిటు వేఱుగ దలచుట | mEragAdurA nIkidi sAmi idi kOrina cheliniTu vE~ruga dalachuTa |
| చరణం charaNam 1 | సారెసారెకా చానను నేలుచు వారిజాక్ష నను వంచన చేయుట | sAresArekA chAnanu nEluchu vArijAksha nanu vanchana chEyuTa |
| చరణం charaNam 2 | వాసి కెక్కిన వాడని నమ్మితే గాసి పెట్టి నను మోసము చేయుట | vAsi kekkina vADani nammitE gAsi peTTi nanu mOsamu chEyuTa |
| చరణం charaNam 3 | వరద రాజగోపాల సామి కరుణ మాని నను నిరతము దూఱుట | varada rAjagOpAla sAmi karuNa mAni nanu niratamu dU~ruTa |