#375 సరసకు రారాయని sarasaku rArAyani

స్వరపద జావళీ svarapada jAvaLI

Titleసరసకు రారాయనిsarasaku rArAyani
Written Byధర్మపురి సుబ్బరాయర్ / సుబ్బరావుdharmapuri subbarAyar / subbarAvu
Book
రాగం rAgaశుధ్ధ దేశిSudhdha dESi
తాళం tALa????
పల్లవి pallaviసరసకు రారాయని నే పిలిచితే
కరుణమింతైన లేదా సామీ
sarasaku rArAyani nE pilichitE
karuNamintaina lEdA sAmI
చరణం
charaNam 1
ధరపురీశ సరసిజనిభ నేత్ర నిదుర రాదు
పర వనితనే గాదుర
dharapurISa sarasijanibha nEtra nidura rAdu
para vanitanE gAdura
చరణం
charaNam 2
కరమున కౌగిట సేయుట కెందుకు బిగువ
మగువాయనితి వపుడు బిలువా
karamuna kaugiTa sEyuTa kenduku biguva
maguvAyaniti vapuDu biluvA
చరణం
charaNam 3
ఒక ముద్దీయ గలిగితె సుఖ మెప్పటికిది యని
మిక్కిలి ప్రీతితో తరుణుల
గురుతుంచి చన్నులను గోరెదవు
oka muddIya galigite sukha meppaTikidi yani
mikkili prItitO taruNula
gurutunchi channulanu gOredavu

#374 ఎక్కడున్నావు ekkaDunnAvu

Titleఎక్కడున్నావుekkaDunnAvu
Written Byమైసూరు సదాశివయ్యmaisUru sadASivayya
Bookరసరాజ వైభవrasarAja vaibhava
రాగం rAgaఅఠాణా aThANA
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఎక్కడున్నావు నా చక్కని సామి
ఇక్షు చాపుని చేత చిక్కినే నొందితి
ekkaDunnAvu nA chakkani sAmi
ikshu chApuni chEta chikkinE nonditi
అనుపల్లవి anupallaviఊరకుండ ఇంక మేరగాదుర
మేరుధీర రారా కౌగలించరా
ఊరకుండ ఇంక మేరగాదుర మేరుధీర
UrakunDa inka mEragAdura
mErudhIra rArA kaugalimcharA
UrakunDa inka mEragAdura mErudhIra
— మధ్యమ కాలం —
తాపసాదులకు మోహము వచ్చితే ధ్యానము సేయుట సాధ్యమా యిక
పాపి మారుడు నాపై వెడలి
నేను సైరించుట వశమా
ఎంత వేడినా పంతమేలరా
కంతురూప శ్రీకృష్ణ రాజేంద్ర
— madhyama kAlam —
tApasAdulaku mOhamu vachchitE
dhyAnamu sEyuTa sAdhyamA yika
pApi mAruDu nApai veDali
nEnu sairinchuTa vaSamA
enta vEDinA pantamElarA
kanturUpa SrIkRshNa rAjEndra
సదాశివుని మూడో కన్నులలో కూడ
ఇంతటి తాపము లేదు కాదేమిరా
నారీమణిని బాధ దీర్చకు ఎవరున్నారురా
నిను వినా గతి మాకురా
sadASivuni mUDO kannulalO kUDa
intaTi tApamu lEdu kAdEmirA
nArImaNini bAdha dIrchaku evarunnArurA
ninu vinA gati mAkurA
— మధ్యమ కాలము తపసాదులకు వలె —
పూలపాన్పుపై పొరలుచు నిన్నే
కలసి మెలయుటకు వలచితిరా
తాళజాల నీ అధరామృతముల
చెలిమితో నాకొసగుమురా
వలపుతో మీసలు తిరువుతొ రతిని
సలిపి ఆసలు దీర్చురా వ్యత
దీర్చరా నెరవేర్చురా
ఇంటిలో ఎవరు లేరురా ఎనిన
— madhyama kAlamu tapasAdulaku vale —
pUlapAn&pupai poraluchu ninnE
kalasi melayuTaku valachitirA
tALajAla nI adharAmRtamula
chelimitO nAkosagumurA
valaputO mIsalu tiruvuto ratini
salipi Asalu dIrchurA vyata
dIrcharA neravErchurA
inTilO evaru lErurA enina
AV Linkhttps://www.youtube.com/watch?v=75BCdVa_ahI
Updated: 01 Dec 2020: Some minor changes carried out as per the printed book. Earlier text was based on my mother’s hand-written notes. ఈ రోజు పుస్తకంలో ఉన్న సాహిత్యం ఆధారంగా కొన్ని చిన్న మార్పులు చేయడం జరిగింది.

#373 సిగ్గు లేదేమి siggu lEdEmi

Titleసిగ్గు లేదేమిsiggu lEdEmi
Written Byunknown
Bookunknown
రాగం rAgaబేగడbEgaDa
తాళం tALaఖండ చాపుkhanDa chApu
పల్లవి pallaviసిగ్గు లేదేమిరా నీకు కొంతైనsiggu lEdEmirA nIku kontaina
అనుపల్లవి anupallaviముగ్గులన్ని వేయుచున్నపుడే దాచుకొని
దగ్గులు జేసి సైగలన్ని జేయుటకు
muggulanni vEyuchunnapuDE dAchukoni
daggulu jEsi saigalanni jEyuTaku
చరణం
charaNam 1
వగవగగా మాట్లాడి నన్నేమరించి
నగలు నాట్యాలన్ని దోచేయుట
మృగనయనినే కాదు నాతో నీదేమి వాదు
మొగుడున్నాడింటిలో ముగుద నీకంటితో
vagavagagA mATlADi nannEmarinchi
nagalu nATyAlanni dOchEyuTa
mRganayaninE kAdu nAtO nIdEmi vAdu
moguDunnADinTilO muguda nIkanTitO

#372 వారిజాక్షి vArijAkshi

Titleవారిజాక్షిvArijAkshi
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Book
రాగం rAgaకేదారగౌళkEdAragauLa
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviవారిజాక్షి నా మనవిని వినవేvArijAkshi nA manavini vinavE
అనుపల్లవి anupallaviసారమైన సంసార శరధిలో
సారెకు వచ్చిన సారసవదన
sAramaina samsAra SaradhilO
sAreku vachchina sArasavadana
చరణం
charaNam 1
చిరకాలము సంతోషముగా
సరసము లాడుట కెంత వింత
స్మరతాపములను దీర్చకుండుట
సరిగాదే (నీకు) తాళవనలోలుని
chirakAlamu santOshamugA
sarasamu lADuTa kenta vinta
smaratApamulanu dIrchakunDuTa
sarigAdE (nIku) tALavanalOluni

#371 ఏమిత్తునే EmittunE

Titleఏమిత్తునేEmittunE
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookuknown
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఏమిత్తునే చెలియా నీకు నేనేమిత్తునేEmittunE cheliyA nIku nEnEmittunE
అనుపల్లవి anupallaviకామిని నీతో నేనేమేమో జేసిన
సామి నీవే గతియని నాతో వచ్చిన నీకేమిత్తునే
kAmini nItO nEnEmEmO jEsina
sAmi nIvE gatiyani nAtO vachchina nIkEmittunE
చరణం
charaNam 1
తాళవనుని మనవ్యాలకించి సుర
తాలన్ని జేయుట కాలంబమైతివే
చాలక కూడి ముద్దాడి మాటాడి చిర
కాలము సుఖమిచ్చే లోలాక్షి నీకు నేనేమిత్తునే
tALavanuni manavyAlakinchi sura
tAlanni jEyuTa kAlambamaitivE
chAlaka kUDi muddADi mATADi chira
kAlamu sukhamichchE lOlAkshi nIku nEnEmittunE

#370 ఏది మంచి సుఖము Edi manchi sukhamu

వైరాగ్య జావళి – vairAgya jAvaLi

Titleఏది మంచి సుఖముEdi manchi sukhamu
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Book
రాగం rAga
తాళం tALaప్రతాప శేఖరpratApa SEkhara
పల్లవి pallaviఏది మంచి సుఖము పరాత్పరా
మానవులకు సదా కాలము
Edi manchi sukhamu parAtparA
mAnavulaku sadA kAlamu
అనుపల్లవి anupallaviమోదమో వేదాంతమో స్వాంతమైన
కాముసుఖమో తెలియలేనైతిరా
mOdamO vEdAntamO svAntamaina
kAmusukhamO teliyalEnaitirA
చరణం
charaNam 1
కామము తగదనవారు కొంత కాలములో
కామ వశమయ్యెదరు
కామహరుడే కామాక్షికి ప్రియుడై
కామించినాడే తలవనాధినాధ
kAmamu tagadanavAru konta kAlamulO
kAma vaSamayyedaru
kAmaharuDE kAmAkshiki priyuDai
kAminchinADE talavanAdhinAdha

#369 వయసులంత vayasulanta

Titleవయసులంతvayasulanta
Written Byధర్మపురి సుబ్బరాయర్ / సుబ్బారావుdharmapuri subbarAyar / subbArAvu
Book
రాగం rAgaద్విజావంతిdvijAvanti
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviవయసులంత పనికి రాదుగదరా
భయము లేనివాడే పురుషుడు
vayasulanta paniki rAdugadarA
bhayamu lEnivADE purushuDu
అనుపల్లవి anupallaviచిరుత ప్రాయముండగ మంచి
చిరునవ్వు లేనివానికి
chiruta prAyamunDaga manchi
chirunavvu lEnivAniki
చరణం
charaNam 1
మనసుంటే తనువు తిరుగును మొరుగును
మనసుండేవాడు మానవుడు
మనసులేక తనువు దెంచితె
ఘనము కాదు ధరపురీశ
manasunTE tanuvu tirugunu morugunu
manasunDEvADu mAnavuDu
manasulEka tanuvu denchite
ghanamu kAdu dharapurISa

#368 ఔరరా భళిరా aurarA bhaLirA

Titleఔరరా భళిరాaurarA bhaLirA
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Book
రాగం rAgaకాపిkApi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఔరరా భళిరా రాజకుమారా
తీరని మోహమిదేరా తామసించకురా
aurarA bhaLirA rAjakumArA
tIrani mOhamidErA tAmasinchakurA
చరణం
charaNam 1
తీయని మాటలతో సుయనే మారుతములో
పయ్యద రా స్వైర విహారము
చయ్యని కాలము వ్యర్థము గదరా
సయ్యాట పాటలకు సమయమిదేర
tIyani mATalatO suyanE mArutamulO
payyada rA svaira vihAramu
chayyani kAlamu vyarthamu gadarA
sayyATa pATalaku samayamidEra
చరణం
charaNam 2
ఊగుమా రాగముతో ఉయ్యల
బాగుగా నుండుటకు బాధలా
జాగుసేయక వేవేగము నన్నేలు
ఈ గతి సుదతికి తాళవనేశుడ
UgumA rAgamutO uyyala
bAgugA nunDuTaku bAdhalA
jAgusEyaka vEvEgamu nannElu
I gati sudatiki tALavanESuDa

#367 సరసకు బిగువేలే sarasaku biguvElE

Titleసరసకు బిగువేలేsarasaku biguvElE
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Book
రాగం rAgaకాంబోదిkAmbOdi
తాళం tALaచారులీలchArulIla
పల్లవి pallaviసరసకు బిగువేలే ఓ చెలియా
sarasaku biguvElE O cheliyA
పలుకవేల బాలా నిన్నే ప్రేమించితి చాలా
తాళజాల కోపమేల
palukavEla bAlA ninnE prEminchiti chAlA
tALajAla kOpamEla
విరిశరములు నాదురమున చిక్కి నేనొందితినే
వెత జెందితినే నిను జూచితినే నాతో
viriSaramulu nAduramuna chikki nEnonditinE
veta jenditinE ninu jUchitinE nAtO
ప్రేమించేవారు భయములు వీడ
ఏమైనగాని మనసు నెంచరాదు
చామభూపాలుడు నాకిపుడు సామియంటినే
నిను నేడు గంటినే నాదు యింటికే జరుగే
prEminchEvAru bhayamulu vIDa
EmainagAni manasu nencharAdu
chAmabhUpAluDu nAkipuDu sAmiyanTinE
ninu nEDu ganTinE nAdu yinTikE jarugE

#366 సఖియ నేనెందుబోదు sakhiya nEnendubOdu

Titleసఖియ నేనెందుబోదుsakhiya nEnendubOdu
Written Byచామ రాజేంద్ర వడయారుchAma rAjEndra vaDayAru
Bookunknown
రాగం rAgaదర్బారీ కానడdarbArI kAnaDa
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviసఖియా నేనెందు బోదుమిక నా మనసు నీదైనదిsakhiyA nEnendu bOdumika nA manasu nIdainadi
చరణం
charaNam 1
కపట నాటక మెరుగని వాడే
చపలాక్షుడు నేను కాదే
kapaTa nATaka merugani vADE
chapalAkshuDu nEnu kAdE
చరణం
charaNam 2
అసమ సుందరి నీ చిరు నవ్వులకు
కుసుమశరుడు విరిశరములు వేయ
asama sundari nI chiru navvulaku
kusumaSaruDu viriSaramulu vEya
చరణం
charaNam 3
కోమలాంగుడౌ చామభూపాలుడు నే
కామిని నిన్నిపుడు కామించితి
kOmalAnguDau chAmabhUpAluDu nE
kAmini ninnipuDu kAminchiti