| Title | పగలు రేయి తెలియదే | pagalu rEyi teliyadE |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ / సుబ్బారావు | dharmapuri subbarAyar / subbArAvu |
| Book | ||
| రాగం rAga | మోహన | mOhana |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | పగలు రేయి తెలియదే నీ వగలు జూచి చూచి యిపుడు | pagalu rEyi teliyadE nI vagalu jUchi chUchi yipuDu |
| సగము జూపించి నవ్వుచు నగలు కావలెనని సుగుణయని నన్ను పొగడి మగమాయలు జేసితివిక | sagamu jUpinchi navvuchu nagalu kAvalenani suguNayani nannu pogaDi magamAyalu jEsitivika | |
| నిదుర రాదు దగ్గరికి సుధాంశు సమ వదన నీవు రాక నిరాకరణ మిక చేయ వద్దనగ ముదము లేని వృధ్ధుల కంత మధుర మాటలేల యని సురబరన నీవు ధర్మపురీశునికి మనసు నిచ్చితోవిక | nidura rAdu daggariki sudhAmSu sama vadana nIvu rAka nirAkaraNa mika chEya vaddanaga mudamu lEni vRdhdhula kanta madhura mATalEla yani surabarana nIvu dharmapurISuniki manasu nichchitOvika | |
#384 మానినీ మణి mAninI maNi
| Title | మానినీ మణి | mAninI maNi |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | ||
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మానినీమణి నిన్ను కోరియున్నది నీ సరసకు తగినది | mAninImaNi ninnu kOriyunnadi nI sarasaku taginadi |
| చాన మాటలేల దాని విరహము బూని తగ్గని దాయెనని యరచినది | chAna mATalEla dAni virahamu bUni taggani dAyenani yarachinadi | |
| మోహ మాధుర్య మాటలు మా మానినికి గావలెనురా వినరాదురా సాహసంబు చూపించి సుదతికి రచించెను గొనుమురా చామరాజేంద్ర | mOha mAdhurya mATalu mA mAniniki gAvalenurA vinarAdurA sAhasambu chUpinchi sudatiki rachinchenu gonumurA chAmarAjEndra | |
#383 ఏరా నా సామి ErA nA sAmi
| Title | ఏరా నా సామి | ErA nA sAmi |
| Written By | మైసూరు వాసుదేవాచారి | maisUru vAsudEvAchAri |
| Book | ||
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏరా నా సామి పగవారు ఏమి బోధించెరు సామి నీకు సారస దళ నయన కృప విరహ తాపమును తెలియక పోతివి | ErA nA sAmi pagavAru Emi bOdhincheru sAmi nIku sArasa daLa nayana kRpa viraha tApamunu teliyaka pOtivi |
| చరణం charaNam 1 | పరులనుమాట విని పరాకు జేయుట ధర్మము గాదుర పర వాసుదేవ నా జీవాధారుడు నీవేరా ననువిడచి కదలకురా సామి | parulanumATa vini parAku jEyuTa dharmamu gAdura para vAsudEva nA jIvAdhAruDu nIvErA nanuviDachi kadalakurA sAmi |
#382 నే పిలచితె nE pilachite
| Title | నే పిలచితె | nE pilachite |
| Written By | మైసూరు వాసుదేవాచారి | maisUru vAsudEvAchAri |
| Book | ||
| రాగం rAga | కమాచి | kamAchi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | నే పిలచితె రావదేమిరా ఓ ప్రాణనాథా | nE pilachite rAvadEmirA O prANanAThA |
| కోపమో నే జేసిన పాపమో నీకు పరి తాపమేల రాకున్నది ఓ ప్రాణనాథ | kOpamO nE jEsina pApamO nIku pari tApamEla rAkunnadi O prANanAtha | |
| నీవే నా దైవమని నమ్మి యున్నానురా నీవు లేక నేనెంత జీవింతురా సామి | nIvE nA daivamani nammi yunnAnurA nIvu lEka nEnenta jIvinturA sAmi | |
| నీరజాక్ష వాసుదేవ నా మనవిని వినరాదా నీ రాకను కోరుకుంటె నీకేల పరాకురా | nIrajAksha vAsudEva nA manavini vinarAdA nI rAkanu kOrukunTe nIkEla parAkurA | |
| AV Link | https://www.youtube.com/watch?v=uFqRn7UOQq8 |
#381 నిన్ను బాసి ninnu bAsi
| Title | నిన్ను బాసి | ninnu bAsi |
| Written By | మైసూరు వాసుదేవాచారి | maisUru vAsudEvAchAri |
| Book | ||
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
| పల్లవి pallavi | నిన్ను బాసి నిమిషమైన నేనెట్లు జీవింతునే నన్ను విడచుట న్యాయమా నీకు నా ముద్దురాణి | ninnu bAsi nimishamaina nEneTlu jIvintunE nannu viDachuTa nyAyamA nIku nA muddurANi |
| చరణం charaNam 1 | నీ మనసు కరగదేమి నా పాలి దైవమా వాసుదేవ మనోహరి ఓర జూపు జూపవే | nI manasu karagadEmi nA pAli daivamA vAsudEva manOhari Ora jUpu jUpavE |
#380 నిన్నెంతగా ninnentagA
| Title | నిన్నెంతగా | ninnentagA |
| Written By | మైసూరు వాసుదేవాచారి | maisUru vAsudEvAchAri |
| Book | ||
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | నిన్నెంతగా విసిగింతునే ప్రియే నన్ను మచ్చికతో మన్నించవే | ninnentagA visigintunE priyE nannu machchikatO manninchavE |
| చరణం charaNam 1 | నీరజాక్షి నీవెవరి మాట విని నన్నుపేక్ష జేతున్నావే పగలు రేయి నిన్నే దలచుకొంటిని పరవాసుదేవుడే నాకు సాక్షి అమ్మా | nIrajAkshi nIvevari mATa vini nannupEksha jEtunnAvE pagalu rEyi ninnE dalachukonTini paravAsudEvuDE nAku sAkshi ammA |
| Audio Link | https://www.youtube.com/watch?v=G0vTE1S_b38 |
#379 ప్రేమతో నాతో prEmatO nAtO
| Title | ప్రేమతో నాతో | prEmatO nAtO |
| Written By | మైసూరు వాసుదేవాచారి | maisUru vAsudEvAchAri |
| Book | ||
| రాగం rAga | కానడ | kAnaDa |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ప్రేమతో నాతో మాటాడవా ప్రియా నాపై కోపమా | prEmatO nAtO mATADavA priyA nApai kOpamA |
| ప్రియ వాక్కులచే నన్నాదరింపవా పాపుగల నామీద కరుణ లేదా | priya vAkkulachE nannAdarimpavA pApugala nAmIda karuNa lEdA | |
| చిరునవ్వు గల మోముతో నన్ను కరుణించి చూడవా చిర కాలమున నీ కటాక్షమును కోరుతున్న ఈ వాసుదేవునితో | chirunavvu gala mOmutO nannu karuNinchi chUDavA chira kAlamuna nI kaTAkshamunu kOrutunna I vAsudEvunitO | |
#378 వాని జోలి నీకేలే vAni jOli nIkElE
| Title | వాని జోలి నీకేలే | vAni jOli nIkElE |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
| పల్లవి pallavi | వాని జోలి నీకేలే ఇందుముఖిరో ఇందుముఖిరో ఆ వనితా బోధనచే మైమరచే | vAni jOli nIkElE indumukhirO indumukhirO A vanitA bOdhanachE maimarachE |
| అనుపల్లవి anupallavi | మానినిరో వాని మమత లెందుబోయే పూనిదాని ఇల్లుని విడిచి రాక యున్న అతడినా | mAninirO vAni mamata lendubOyE pUnidAni illuni viDichi rAka yunna ataDinA |
| చరణం charaNam 1 | ఇంతిరో నిను బాయని నాతో ఎన్నో బూటకముల బలికే నా సంతసమెల్లన చాన కొసగి నన్ను పంతముతో మరుని పలు చేసెనిక | intirO ninu bAyani nAtO ennO bUTakamula balikE nA santasamellana chAna kosagi nannu pamtamutO maruni palu chEsenika |
| చరణం charaNam 2 | మాట తప్పనివాడని నేను మనసున నెంచితి గదవే బోటిరో అలవాని మోము జూడనగునా సాటివారలు నవ్వజాలరేమె ఇక | mATa tappanivADani nEnu manasuna nenchiti gadavE bOTirO alavAni mOmu jUDanagunA sATivAralu navvajAlarEme ika |
| చరణం charaNam 3 | సింగర సుతుడు నాతో మును చేసిన చెలిమిని మరచెనే బంగారము వంటి వాని గుణములెల్ల అంగనామణి మోహాబ్ధి జేరెనిక | singara sutuDu nAtO munu chEsina chelimini marachenE bangAramu vanTi vAni guNamulella anganAmaNi mOhAbdhi jErenika |
#377 సామి నెడబాసి sAmi neDabAsi
| Title | సామి నెడబాసి | sAmi neDabAsi |
| Written By | తచ్చూరు సింగరాచార్యులు | tachchUru singarAchAryulu |
| Book | ||
| రాగం rAga | దేవ మనోహరి | dEva manOhari |
| తాళం tALa | మిశ్రచాపు | miSrachApu |
| పల్లవి pallavi | సామి నెడబాసి నేనెట్లు సైరింతునే కోమలీ శ్రీ కోమలీ శ్రీ కోమలీ శ్రీ రాజగోపాల | sAmi neDabAsi nEneTlu sairintunE kOmalI SrI kOmalI SrI kOmalI SrI rAjagOpAla |
| చరణం charaNam 1 | మరుడురమున విరిశరముల నేసెనే సరసిజాక్షి ఇదే సమయము రమ్మనవే | maruDuramuna viriSaramula nEsenE sarasijAkshi idE samayamu rammanavE |
| చరణం charaNam 2 | కలువల దొర పగ నాపై గావించెనే కలికిరో తమి నిలుప నా తరమటే | kaluvala dora paga nApai gAvinchenE kalikirO tami nilupa nA taramaTE |
| చరణం charaNam 3 | సింగర సుతుడు మోసము జేసెనే అంగనామణి ఇపుడైనను బిలువవే | singara sutuDu mOsamu jEsenE anganAmaNi ipuDainanu biluvavE |
#376 ముందటివలె mundaTivale
| Title | ముందటివలె | mundaTivale |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | భైరవి | bhairavi |
| తాళం tALa | మిశ్రచాపు | miSrachApu |
| పల్లవి pallavi | ముందటివలె నన్ను ప్రేమించకుంటే అందగాడా నిను వదలనురా | mundaTivale nannu prEminchakunTE andagADA ninu vadalanurA |
| కందర్ప జనక నీ దర్పములెందుకు అందమా నీకిది చందమా | kandarpa janaka nI darpamulenduku andamA nIkidi chandamA | |
| పుట్టిల్లు వదలి నేనెట్లు వచ్చితిరా కట్టకడకు నా చెయి విడిచితివయ్యో | puTTillu vadali nEneTlu vachchitirA kaTTakaDaku nA cheyi viDichitivayyO | |
| మట్ట మాయము జేసినట్టి వేణుగోపా లెట్ల నిను నమ్ముదు తెలియదేమి సేతురా | maTTa mAyamu jEsinaTTi vENugOpA leTla ninu nammudu teliyadEmi sEturA | |