#240 రారా శివశంకర rArA SivaSamkara

Titleరారా శివశంకర (ప్రతి)rArA SivaSamkara (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
రారా శివశంకర నన్ను రక్షించు గంగాధరrArA SivaSamkara nannu rakshimchu gamgAdhara
చరణం
charaNam 1
యే పాపముజేసితి నికనెట్లెయిన నీవేగతిyE pApamujEsiti nikaneTleyina nIvEgati
చరణం
charaNam 2
పతితుల బ్రోవలేదా నన్ను భక్తులలో జేర్చరాదpatitula brOvalEdA nannu bhaktulalO jErcharAda
చరణం
charaNam 3
మాతంగ చర్మచేల సన్మానిత భక్తపాలాmAtamga charmachEla sanmAnita bhaktapAlA
చరణం
charaNam 4
జాలముసేయ రాదా యో సర్వేశ్వరా మ్రొక్కెదjAlamusEya rAdA yO sarvESvarA mrokkeda
చరణం
charaNam 5
అన్యుల వేడబోను వేడక నాపదల జెందలేనుanyula vEDabOnu vEDaka nApadala jemdalEnu
చరణం
charaNam 6
పూర్వజన్మ ప్రారభ్ధము బాధ బుట్టించె నన్నేలుముpUrvajanma prArabhdhamu bAdha buTTimche nannElumu
చరణం
charaNam 7
పద్మాసంజాతభంగ అనంతపల్లి శ్రీ వేగిలింగాpadmAsamjAtabhamga anamtapalli SrI vEgilimgA
చరణం
charaNam 8
కొండగూంటూరి నాగభూషణ కోవిదుని బ్రోవవేగాkomDagUmTUri nAgabhUshaNa kOviduni brOvavEgA

#239 రారా రాజగోపాల rArA rAjagOpAla

Titleరారా రాజగోపాలrArA rAjagOpAla
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
రారా రాజగోపాల నన్ను రక్షించ రావదేలాrArA rAjagOpAla nannu rakshimcha rAvadElA
చరణం
charaNam 1
కారుణ్య మూర్తివని నిన్నే కడువడి నమ్మితినీkAruNya mUrtivani ninnE kaDuvaDi nammitinI
చరణం
charaNam 2
పారావార గంభీర నాతో పలుకవేమనందురాpArAvAra gambhIra nAtO palukavEmanamdurA
చరణం
charaNam 3
గ్రక్కున నను గావరా నిన్ను మక్కువతో నమ్మితిరాgrakkuna nanu gAvarA ninnu makkuvatO nammitirA
చరణం
charaNam 4
సమ్మతి తోడ నను నా సామి దయనేలుముsammati tODa nanu nA sAmi dayanElumu
చరణం
charaNam 5
మురహరి యేచకురా నీ ముద్దుమోము జూపరాmurahari yEchakurA nI muddumOmu jUparA
చరణం
charaNam 6
అన్నా వీరరాఘవా సుప్రసన్నా క్రన్నన బ్రోవాannA vIrarAghavA suprasannA krannana brOvA
చరణం
charaNam 7
ధర సికింద్రాపురీశా నేరమేరా జేసితిలెసdhara sikindrApurISA nEramErA jEsitilesa
చరణం
charaNam 8
నీ సుదర్శనమివ్వరా రామానుజదాసు గదరాnI sudarSanamivvarA rAmAnujadAsu gadarA

#238 దీనుని బ్రోవ dInuni brOva

Titleదీనుని బ్రోవ (ప్రతి)dInuni brOva (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబ్యేగ్byEg
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
దీనుని బ్రోవ రావ దేవాది దేవdInuni brOva rAva dEvAdi dEva
చరణం
charaNam 1
మానితజిత్ప్రభావ మన్నించ నీవే కావా
సూనాస్త్ర జనక దేవా మహానుభావ
mAnitajitprabhAva mannimcha nIvE kAvA
sUnAstra janaka dEvA mahAnubhAva
చరణం
charaNam 2
మానక నిను మతిధ్యానము జేసితి
శ్రీనాధా నీవేగతి సీతాపతి
mAnaka ninu matidhyAnamu jEsiti
SrInAdhA nIvEgati sItApati
చరణం
charaNam 3
కారణకారణ కరిభవమోచన
సారసాయత లోచన సద్గుణావన
kAraNakAraNa karibhavamOchana
sArasAyata lOchana sadguNAvana
చరణం
charaNam 4
భక్తజన వరద పావన సరసద
ముక్తేశ్వరాయరుదా మురహర బిరుదా
bhaktajana varada pAvana sarasada
muktESwarAyarudA murahara birudA
చరణం
charaNam 5
పరమపావన నామ పాలితామరస్తోమ
కరుణించి నన్నేలుమా కదనభీమ
paramapAvana nAma pAlitAmarastOma
karuNimchi nannElumA kadanabhIma
చరణం
charaNam 6
సుమహిత రంగపురీ సుస్థిరసద్విహారి
అమిత కౌస్తుభధారీ అచ్యుతశౌరి
sumahita ramgapurI susthirasadihAri
amita kaustubhadhArI achyutaSauri
చరణం
charaNam 7
గీర్వాణభాషాధార కేవలానిత్యాకార
సర్వదురితౌఘ హరా సర్వేశ్వర
gIrwANabhAshAdhAra kEvalAnityAkAra
sarvaduritaugha harA sarvESwara
చరణం
charaNam 8
సురుచిరానంతపురవర నిలయ భూధర నిరవయ నిర్వికారా నిరాధారsuruchirAnamtapuravara nilaya bhUdhara niravaya nirvikArA nirAdhAra
చరణం
charaNam 9
నాగభూషణపాల నవ్యగోపికాలోల
వేగమే రావదేలా వేణుగోపాలా
nAgabhUshaNapAla navyagOpikAlOla
vEgamE rAvadElA vENugOpAlA

#237 దాశరధే dASaradhE

TitleదాశరధేdASaradhE
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబ్యేగ్byEg
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
దాశరధే యిటురాdASaradhE yiTurA
మోదరదా దాశరధే యిటుmOdaradA dASaradhE yiTu
చరణం
charaNam 1
దాసుని బ్రోవర ధర
నిన్నే నమ్మినారా దామోదర
dAsuni brOvara dhara
ninnE namminArA dAmOdara
చరణం
charaNam 2
శ్రీధర నా మొర చేకొనవేమిర
చాలానే నమ్మినారా దామోదర
SrIdhara nA mora chEkonavEmira
chAlAnE namminArA dAmOdara
చరణం
charaNam 3
పరిపరి విధముల బ్రస్తుతించినా గాని
పలుకకున్నావేమిరా దామోదర
paripari vidhamula brastutimchinA gAni
palukakunnAvEmirA dAmOdara
చరణం
charaNam 4
వరవేంకటగిరి వరద శ్రీ నరహరి
వరములొసగ రారా దామోదర
varavEmkaTagiri varada SrI narahari
varamulosaga rArA dAmOdara

#236 యీశ్వరాజ్ఞ yISwarAjna

Titleయీశ్వరాజ్ఞ (ప్రతి)yISwarAjna (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaతోడిtODi
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
యీశ్వరాజ్ఞ యేమొ తెలియదు
అది యెవరెరుంగుదురు
yISwarAjna yEmo teliyadu
adi yevarerumguduru
చరణం
charaNam 1
శాశ్వతైశ్వర్యమొసగి సదా నను బ్రోచునొకో
విశ్వాసము లేక నన్ను విడచునొ దయజూచునో
పర ||మే||
SASwataiSwaryamosagi sadA nanu brOchunokO
viSWAsamu lEka nannu viDachuno dayajUchunO
para ||mE||
చరణం
charaNam 2
దారాపుత్రాదుల యెడ ధైర్యమిచ్చి యేలునొకో
సారహీనమైన యీ సంసారాబ్ధిని ద్రోయునో జగ
dArAputrAdula yeDa dhairyamichchi yElunokO
sArahInamaina yI samsArAbdhini drOyunO jaga
చరణం
charaNam 3
జ్ఞానాజ్ఞానముల రెంటి క్రమమెరుగంగ దెలుపునొకో
మానహీనమైన యట్టి దుర్మదము గలుగజేయునోగో
jnAnAjnAnamula renTi kramamerugamga delupunokO
mAnahInamaina yaTTi durmadamu galugajEyunOgO
చరణం
charaNam 4
మాయను తొలిగించియు సన్మానము దయచేయునొకొ
యే యుపాయమునైనను నన్నేలక విడనాడునొ కా
mAyanu toligimchiyu sanmAnamu dayachEyunoko
yE yupAyamunainanu nannElaka viDanADuno kA
చరణం
charaNam 5
సమశీల వ్రతము నడువ సద్గుణములు గలుగజేయునో
యముని బారికిని ద్రోచి నాకతి శ్రమ కలిగించునో
samaSIla vratamu naDuva sadguNamulu galugajEyunO
yamuni bArikini drOchi nAkati Srama kaligimchunO
చరణం
charaNam 6
రాగద్వేషాది రహిత రంజకము గలుగ జేయునో
భోగమోహపాశములను బుధ్దిని బంధించునో లోక
rAgadwEshAdi rahita ramjakamu galuga jEyunO
bhOgamOhapASamulanu budhdini bamdhimchunO lOka
చరణం
charaNam 7
కొండగుంటూరి సత్కుల కోవిదుడౌ నాగభూషణు
దండజేరి నిండుమది నఖండ విభవమొసగునో విశ్వ
komDagumTUri satkula kOviduDau nAgabhUshaNu
damDajEri nimDumadi nakhamDa vibhavamosagunO viSwa

#235 యీశ్వరాజ్ఞ yISwarAjna

Titleయీశ్వరాజ్ఞyISwarAjna
Written By
BookprAchIna-navIna
రాగం rAgaతోడిtODi
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
యీశ్వరాజ్ఞ యేమొ తెలియదు
అది యెవరెరుగుదురు
yISwarAjna yEmo teliyadu
adi yevareruguduru
చరణం
charaNam 1
శాశ్వతైశ్వర్యమిచ్చి సదా నను బ్రోచునొకో
సకల బాధలను బెట్టి సంకటపడజూచునో జగ
SASwataiSwaryamichchi sadA nanu brOchunokO
sakala bAdhalanu beTTi samkaTapaDajUchunO jaga
చరణం
charaNam 2
యెందున కొరలేని బ్రహ్మానందమొసగి గాచునో
యెప్పటికీలాగున నన్ను హింసపరచి వేచునోపర
yemduna koralEni brahmAnamdamosagi gAchunO
yeppaTikIlAguna nannu himsaparachi vEchunOpara
చరణం
charaNam 3
నందనునిగ భావించి నను గారవించునో
నలువురిలోపల మిక్కిలి నగుబాటుగ జేసునో
namdanuniga bhAvimchi nanu gAravimchunO
naluvurilOpala mikkili nagubATuga jEsunO
చరణం
charaNam 4
వెరవకుమని యభయమిచ్చి వేగమే రక్షించునో
వీడధముడు దుష్టుడనుచు విడువక శిక్షించునో
veravakumani yabhayamichchi vEgamE rakshimchunO
vIDadhamuDu dushTuDanuchu viDuvaka SikshimchunO
చరణం
charaNam 5
నిరతము నన్నాదాయపరునిగా నొనరించునో
నిర్దయపరుడై నన్ను నీచమతుల జేర్చునో
niratamu nannAdAyaparunigA nonarimchunO
nirdayaparuDai nannu nIchamatula jErchunO
చరణం
charaNam 6
ధరణిలోన నన్ను భగవద్దాసకోటి జేర్చునొ
దారాపుత్రాదుల వల తగులుకొనగ గూర్చునో
dharaNilOna nannu bhagavaddAsakOTi jErchuno
dArAputrAdula vala tagulukonaga gUrchunO
చరణం
charaNam 7
కూరిమితో సుదర్శనమొసగి గొబ్బున నను గారవించునో
కొరమాలిన మానవులను కొనియాడగజేసునో ||జగదేశ్వరాజ్ఞ||
kUrimitO sudarSanamosagi gobbuna nanu gAravimchunO
koramAlina mAnavulanu koniyADagajEsunO ||jagadESwarAjna||

#234 పరమేశ రార paramESa rAra

Titleపరమేశ రార (ప్రతి)paramESa rAra (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaయమునా కల్యాణిyamunA kalyANi
తాళం tALaచాపుchApu
పల్లవి
pallavi
పరమేశ రార పాలింపవేరparamESa rAra pAlimpavEra
కరుణాద్రభావ కరుణించు దేవదేవkaruNAdrabhAva karuNimchu dEvadEva
చరణం
charaNam 1
కమనీయరూప కంజాక్షరోప విమల
ప్రదీప విశ్వాత్మ రూప భూప
kamanIyarUpa kamjAksharOpa vimala
pradIpa viSWAtma rUpa bhUpa
చరణం
charaNam 2
సురుచిరగాత్ర సుందరీ కళత్ర
పరమచారిత్ర పద్మభవ స్తోత్ర పాత్ర
suruchiragAtra sumdarI kaLatra
paramachAritra padmabhava stOtra pAtra
చరణం
charaNam 3
ధరణి ముట్లూరిధామ పోషసూరి
స్మరభస్మధారి మాయాపహారి కోరి
dharaNi muTlUridhAma pOshasUri
smarabhasmadhAri mAyApahAri kOri
చరణం
charaNam 4
రామలింగేశా రహితా విపాశ
కామాదినాశ గౌరీశ వ్యోమకేశ
rAmalingESA rahitA vipASa
kAmAdinASa gourISa vyOmakESa
చరణం
charaNam 5
శర్వ నాగభూష సన్నుత వేష
ఆర్య వరభూష యమిత ప్రతోష భాష
Sarva nAgabhUsha sannuta vEsha
Arya varabhUsha yamita pratOsha bhAsha

#233 సుడిగాలి suDigAli

TitleసుడిగాలిsuDigAli
Written By
BookprAchIna-navIna
రాగం rAgaయమునా కల్యాణిyamunA kalyANi
తాళం tALaచాపుchApu
పల్లవి
pallavi
సుడిగాలి రక్కసుడు వచ్చెనొక్క
కడు వేగమొప్పగను ధూళిగప్ప గొప్ప
suDigAli rakkasuDu vachchenokka
kaDu vEgamoppaganu dhULigappa goppa
చరణం
charaNam 1
యొండొరుల గానకుండగ బిరాన
అండంబు బ్రద్దలైపోవా ప్రొద్ద పెద్ద
yomDorula gAnakumDaga birAna
amDambu braddalaipOvA prodda pedda
చరణం
charaNam 2
గోకులమందంద వ్యాకులము జెంద
మూకలైన బిడ్డలిక నేడ్వ చెడ్డదొడ్డ
gOkulamamdamda vyAkulamu jemda
mUkalaina biDDalika nEDva cheDDadoDDa
చరణం
charaNam 3
జనులంత సుదర్శనధరుని యెద
గొనియాడ నెల్లగోసమితి తల్లడిల్ల
janulamta sudarSanadharuni yeda
goniyADa nellagOsamiti tallaDilla

#232 కర్మసంచయ karmasamchaya

Titleకర్మసంచయ (ప్రతి)karmasamchaya (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేగడbEgaDa
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
కర్మసంచయ ధూమిజకుఠారీ మాహేశ్వరీ శ్రీ
కాళి శాంభవి దుర్గ కౌమారి మర్మమేలను రావె శ్రీ గౌరీ
యే నిను దలంప నిర్మలాంగివి గదవె త్రిపురారీ మనోహారి
karmasamchaya dhUmijakuThArI mAhESwarI SrI
kALi SAmbhavi durga koumAri marmamElanu rAve SrI gourI
yE ninu dalampa nirmalAmgivi gadave tripurArI manOhAri
చరణం
charaNam 1
శీతశైలకుమారి సుకుమారీ నతపతసౌరి
శ్రీకరంబుగ నిన్ను మదిగోరి పాతకుడనన
నిగమసంచారీ యేల బ్రోవవు పావనిగాదా
మనోజారీ కవిజనాధారి
SItaSailakumAri sukumArI natapatasauri
SrIkarambuga ninnu madigOri pAtakuDanana
nigamasamchArI yEla brOvavu pAvanigAdA
manOjArI kavijanAdhAri
చరణం
charaNam 2
నీలకంధరు రాణి కల్యాణి నను బ్రోవు
జలధరవేణి యంబుజపాణి శార్వాణి
జాలమేలను రావె శుభవాణి మౌని సంత్రాణి
చాలనమ్మితి నిన్ను నెదబూని శైకతత్రోణి
nIlakamdharu rANi kalyANi nanu brOvu
jaladharavENi yambujapANi SArvANi
jAlamElanu rAve SubhavANi mauni samtrANi
chAlanammiti ninnu nedabUni SaikatatrONi
చరణం
charaNam 3
నాగభూషణ సుకవి పరిపాలా కరుణాలవాల
నాగకంకణలోల శ్రీ బాలా జాగుసేయుట నీకు
యిది మేలా యేవగనైన శాంభవీ
దయజూడుమీవేళా యికను చలమేలా
nAgabhUshaNa sukavi paripAlA karuNAlavAla
nAgakamkaNalOla SrI bAlA jAgusEyuTa nIku
yidi mElA yEvaganaina SAmbhavI
dayajUDumIvELA yikanu chalamElA

#231 ధర్మ సంవర్ధని dharma samvardhani

Titleధర్మ సంవర్ధనిdharma samvardhani
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేగడbEgaDa
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
ధర్మ సంవర్ధని మాయమ్మా
నమ్మితి నేనీ దాసుడను నను బ్రోవవలెనమ్మా
చర్మవసనుని రాణియౌ కొమ్మా ముఖ్యముగా నీ
చరణమేగతి వేరు లేదమ్మా బంగరుబొమ్మా
dharma samvardhani mAyammA
nammiti nEnI dAsuDanu nanu brOvavalenammA
charmavasanuni rANiyou kommA mukhyamugA nI
charaNamEgati vEru lEdammA bangarubommA
చరణం
charaNam 1
తల్లి గర్భమునందు పడి పొరలీ
తల్లడిల్లి యెన్ని జన్మములెత్తితినొ తొల్లి
యిక యెన్ని జన్మములున్నవో మల్లీ
యేవగనైన అన్ని భయములు తీర్పవే తల్లి కల్పకవల్లి
talli garbhamunandu paDi poralI
tallaDilli yenni janmamulettitino tolli
yika yenni janmamulunnavO mallI
yEvaganaina anni bhayamulu tIrpavE talli kalpakavalli
చరణం
charaNam 2
తప్పులెంచుట యేమొ యిటు గలదా నా వెతలెల్ల
దలచి జూచుట నీకు దయరాద
యిప్పుడును నా మొరలు వినలేదా
వూరకుంటే నీ గొప్పతనమున కేమి మర్యాదా
పావనివి గాదా
tappulenchuTa yEmO yiTu galadA nA vetalella
dalachi jUchuTa nIku dayarAda
yippuDunu nA moralu vinalEdA
vUrakumTE nI goppatanamuna kEmi maryAdA
pAvanivi gAdA
చరణం
charaNam 3
శ్రీ రమేశుని తోడ నటియించి అందు భ్రమయించి
శీఘ్రముగ మహిషాసురుని ద్రుంచి దీనరక్షక
నీదు దయయుంచి యేవగనైనా దనరక
నీదు కృపయుంచి బ్రోవ రక్షించి
SrI ramESuni tODa naTiyimchi amdu bhramayimchi
SIghramuga mahishAsuruni drumchi dInarakshaka
nIdu dayayumchi yEvaganainA danaraka
nIdu kRpayumchi brOva rakshimchi