| Title | యేమి సేతు | yEmi sEtu |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | కాంబోది | kAmbOdi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | యేమి సేతు యెటుల సైతు మరులు తాళలేనుర | yEmi sEtu yeTula saitu marulu tALalEnura |
| సామి ధర్మపుర నివాస సమయము నన్నేలుకోర | sAmi dharmapura nivAsa samayamu nannElukOra | |
| చరణం charaNam 1 | పిలువ బిగువు చేసేది మేరగాదురా అలుక నాటి సుఖము గోరి చెలువుడ దయసేయు మిటుల | piluva biguvu chEsEdi mEragAdurA aluka nATi sukhamu gOri cheluvuDa dayasEyu miTula |
| చరణం charaNam 2 | రామప్రాణసఖిని బాసి రాముడెటుల తాళెనో ప్రేమ మాటలాడిన సామి చేర రారా యిపుడు | rAmaprANasakhini bAsi rAmuDeTula tALenO prEma mATalADina sAmi chEra rArA yipuDu |
| చరణం charaNam 3 | మాటిమాటికి నీయడ మట్టు విడువ బాగాయె గట్టు విల్తుని పగతుడిపుడు మట్టు మీరి వచ్చెనయ్యయ్యో | mATimATiki nIyaDa maTTu viDuva bAgAye gaTTu viltuni pagatuDipuDu maTTu mIri vachchenayyayyO |
Category: Javali
#202 వచ్చితె vachchite
| Title | వచ్చితె (ప్రతి) | vachchite (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | వచ్చితె మేలాయర వహ్వవా మెచ్చవచ్చుర | vachchite mElAyara vahvavA mechchavachchura |
| మచ్చికతో మదివచ్చి యిచ్చోటికి | machchikatO madivachchi yichchOTiki | |
| చరణం charaNam 1 | అలదానిగూడి నీవట కాపురముగా నిలిచెదవని నిన్నెదబూని దలచితి పలుమరు వలపు గలిగి యిటు | aladAnigUDi nIvaTa kApuramugA nilichedavani ninnedabUni dalachiti palumaru valapu galigi yiTu |
| చరణం charaNam 2 | చక్కని మోవిని నొక్కుచు వేగమే పక్కను జేరి చెక్కులు జీరి యక్కున జేర్చి రతి స్రుక్కించిన మక్కువచే | chakkani mOvini nokkuchu vEgamE pakkanu jEri chekkulu jIri yakkuna jErchi rati srukkinchina makkuvachE |
| చరణం charaNam 3 | ధైర్య పిఠాపురి ధాముడవౌ శ్రీ సూర్యరాయసుగుణ విధేయ చర్యనుతించిన నీ పర్యాయమాశ్చర్యమాయ | dhairya piThApuri dhAmuDavau SrI sUryarAyasuguNa vidhEya charyanutimchina nI paryAyamAScharyamAya |
#201 వలచితే valachitE
| Title | వలచితే | valachitE |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | వలచితే యింత చలమేల రారా సామి | valachitE yimta chalamEla rArA sAmi |
| చెలువుడనుచు మది దలచి దలచి నిను | cheluvuDanuchu madi dalachi dalachi ninu | |
| చరణం charaNam 1 | మక్కువతో నా మనసిటు నిల్వక మిక్కిలి వేడితి తామసమేలర యెక్కువ మమతతొ బిలచిన బలుకవు | makkuvatO nA manasiTu nilvaka mikkili vEDiti tAmasamElara yekkuva mamatato bilachina balukavu |
| చరణం charaNam 2 | వెన్నెల రేయిని వేడిని తాళను నిన్నటి మాటలు సేయకురా సామి నిన్నెడబాసి నే నిముసము తాళర | vennela rEyini vEDini tALanu ninnaTi mATalu sEyakurA sAmi ninneDabAsi nE nimusamu tALara |
| చరణం charaNam 3 | ధర భీమేశుడ నేరము లెంచకు సారస నేత్రుడ సమ్మతమా సామి యేర సుందరాకార నిన్నే నేమముతో | dhara bhImESuDa nEramu lemchaku sArasa nEtruDa sammatamA sAmi yEra sumdarAkAra ninnE nEmamutO |
#200 యెంత మోహ yemta mOha
| Title | యెంత మోహ (ప్రతి) | yemta mOha (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | యెంత మోహాపరచినాడే యేమి సేతునే నన్నింత సంతతము విడనిబాస సల్పి కాంతుడు | yemta mOhAparachinADE yEmi sEtunE nannimta samtatamu viDanibAsa salpi kAmtuDu |
| చరణం charaNam 1 | పట్టిరట్టు కెట్టవద్దు గట్టు గుబ్బెత నన్నిట్టులాడి తానట్టెజేరి చన్నుగవ బట్టి నవ్వుచు | paTTiraTTu keTTavaddu gaTTu gubbeta nanniTTulADi tAnaTTejEri channugava baTTi navvuchu |
| చరణం charaNam 2 | మక్కువ పెంపెక్కగ రతిస్రుక్క జేయుచు నా పక్కడాయుచు చక్కని కెమ్మోవి పంట నొక్కి స్రొక్కుచు | makkuva pempekkaga ratisrukka jEyuchu nA pakkaDAyuchu chakkani kemmOvi pamTa nokki srokkuchu |
| చరణం charaNam 3 | రావు సూర్యరాయ మహరాజధీరుడే భావజాకారుడే ఆ వనిత గూడి నేడు అయ్యయో రాడే | rAvu sUryarAya maharAjadhIruDE bhAvajAkAruDE A vanita gUDi nEDu ayyayO rADE |
#199 ముద్దుబెట్టి muddubeTTi
| Title | ముద్దుబెట్టి | muddubeTTi |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ముద్దుబెట్టి పోయినాడే మోహనంగిరో నాకొక | muddubeTTi pOyinADE mOhanangirO nAkoka |
| చరణం charaNam 1 | సద్దుసేయ వద్దనుచు సైగ జేయుచు నాడొక టక్కులొల్క వాడు నాదుపక్కలో జేరి వలపెక్కగ గోరి చెక్కులోన చెక్కు జేర్చి మ్రొక్కివేడుచు నాకొక | saddusEya vaddanuchu saiga jEyuchu nADoka Takkulolka vADu nAdupakkalO jEri valapekkaga gOri chekkulOna chekku jErchi mrokkivEDuchu nAkoka |
| చరణం charaNam 2 | కప్పురంపు విడెమిచ్చి కొప్పును బెట్టి తల త్రిప్పగ తట్టి సర్పవేణి యేరితోడ చెప్పవద్దని నాకొక | kappurampu viDemichchi koppunu beTTi tala trippaga taTTi sarpavENi yEritODa cheppavaddani nAkoka |
#198 కోపము జేసేవేలర kOpamu jEsEvElara
| Title | కోపము జేసేవేలర (ప్రతి) | kOpamu jEsEvElara (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | కోపము జేసేవేలర సామిగా యింత | kOpamu jEsEvElara sAmigA yimta |
| ప్రాపుగోరి నే యుంటిర | prApugOri nE yumTira | |
| చరణం charaNam 1 | చిన్ననాటనుండి నిన్ను నమ్మి యున్న కన్నెను గానటర | chinnanATanumDi ninnu nammi yunna kannenu gAnaTara |
| చరణం charaNam 2 | వన్నెకాడ వలచియున్న చిన్నదియని కన్నడ శాయకుర | vannekADa valachiyunna chinnadiyani kannaDa SAyakura |
| చరణం charaNam 3 | యెన్నడు నిన్ను బాసియున్న దానగాను సన్నుతి గైకొనరా | yennaDu ninnu bAsiyunna dAnagAnu sannuti gaikonarA |
| చరణం charaNam 4 | ధరణిశ్రీ సూర్యరాయ దానరాధేయ సరసుడనయ విధేయా | dharaNiSrI sUryarAya dAnarAdhEya sarasuDanaya vidhEyA |
#197 మాట్లాడవెందుకురా mATlADavendukurA
| Title | మాట్లాడవెందుకురా | mATlADavendukurA |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మాట్లాడవెందుకురా సామిగ నాతో | mATlADavendukurA sAmiga nAtO |
| అరమర యిక యేలర సామి | aramara yika yElara sAmi | |
| చరణం charaNam 1 | చిరుత ప్రాయమునాడు చేసిన చెలిమిని మరచుట తగునటరా సామి | chiruta prAyamunADu chEsina chelimini marachuTa tagunaTarA sAmi |
| చరణం charaNam 2 | సొగసుగ నిను జూచి సోలి వచ్చినదాని అగడేల జేసేవుర సామి | sogasuga ninu jUchi sOli vachchinadAni agaDEla jEsEvura sAmi |
| చరణం charaNam 3 | వరభీమేశుని వలచిన దానర సరసతో నన్నేలరా సామి | varabhImESuni valachina dAnara sarasatO nannElarA sAmi |
#196 జాలమిదేర jAlamidEra
| Title | జాలమిదేర (ప్రతి) | jAlamidEra (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | జాలమిదేర సరసకు రార బాలామణి నిను బ్రార్థించెనుర | jAlamidEra sarasaku rAra bAlAmaNi ninu brArthinchenura |
| చరణం charaNam 1 | యెమ్మెకాడ నిను రమ్మని ముద్దుల గుమ్మ రమ్మ నీకిమ్మని బంపెను | yemmekADa ninu rammani muddula gumma ramma nIkimmani bampenu |
| చరణం charaNam 2 | కమ్మవిల్తుడు శరమ్ము వేయు మది నమ్మి నిన్ను పొమ్మనరమ్మనే | kammaviltuDu Sarammu vEyu madi nammi ninnu pommanarammanE |
| చరణం charaNam 3 | యింతి రావిరుల బంతి రామరుని దంతి రాడగు పొలంతిరా వినర | yimti rAvirula banti rAmaruni damti rADagu polamtirA vinara |
| చరణం charaNam 4 | రావుకులజ మహరాజ కుమార పావన సూర్యనృపాలక యేరా | rAvukulaja maharAja kumAra pAvana sUryanRpAlaka yErA |
#194 మాటలేల mATalEla
| Title | మాటలేల (ప్రతి) | mATalEla (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | సురట | suraTa |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | మాటలేల చాలుచాలుర నా సామి | mATalEla chAluchAlura nA sAmi |
| బోటి తోడను పొందుగాను భోగించినావేమిర | bOTi tODanu pomdugAnu bhOgimchinAvEmira | |
| చరణం charaNam 1 | మాటికి కుంకుమ మైజారెనురా కాటుక రెప్పల కంటినదేరా యేటికి భ్రమ మదియేరా జాడ దెల్పర | mATiki kumkuma maijArenurA kATuka reppala kamTinadErA yETiki bhrama madiyErA jAda delpara |
| చరణం charaNam 2 | చిందిన గంధపు పూతలవేరా చెక్కిట చెమటలు బుట్టునదేరా సుందర నీ యధరమందు పలునొక్కులుర | chimdina gamdhapu pUtalavErA chekkiTa chemaTalu buTTunadErA sumdara nI yadharamamdu palunokkulura |
| చరణం charaNam 3 | కన్నుల నిద్దుర మబ్బులవేరా కరుణాకర సూర్యప్రభువౌర చిన్నెలు జూచి సంతసించితినేర పోపోరా | kannula niddura mabbulavErA karuNAkara sUryaprabhuvaura chinnelu jUchi samtasimchitinEra pOpOrA |
#193 మాయలాడి mAyalADi
| Title | మాయలాడి | mAyalADi |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | సురట | suraTa |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | మాయలాడి బోధనచే మయిమరచితి వేమొ మాటలాడ రావదేమిరా నా సామి | mAyalADi bOdhanachE mayimarachiti vEmo mATalADa rAvadEmirA nA sAmi |
| చరణం charaNam 1 | కాయజు బారికి తాళగలేరా కౌగిట జేర్చి నన్ను గారవించరా న్యాయమటరా నీకిది తగదుర సరగున | kAyaju bAriki tALagalErA kaugiTa jErchi nannu gAravimcharA nyAyamaTarA nIkidi tagadura saraguna |
| చరణం charaNam 2 | కలకాలము నన్ను గాసిబెట్టకురా కాంతల నేచుట కార్యము గాదుర చెలువుడవని నిను నెరనమ్మినందుకిక | kalakAlamu nannu gAsibeTTakurA kAmtala nEchuTa kAryamu gAdura cheluvuDavani ninu neranamminandukika |
| చరణం charaNam 3 | సరివారిలో నన్ను చౌక సేయకురా చాల నమ్మితి రతికేళి గూడర వరదుడ మువ్వపురి నిలయుడ చనువున | sarivArilO nannu chouka sEyakurA chAla nammiti ratikELi gUDara varaduDa muvvapuri nilayuDa chanuvuna |