| Title | వానిటు రమ్మని (ప్రతి) | vAniTu rammani (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హుసేని | husEni |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వానిటు రమ్మని దెల్పవే వానిటు రమ్మని దెల్పవే వరదుని నను కల్పవే | vAniTu rammani delpavE vAniTu rammani delpavE varaduni nanu kalpavE |
| చరణం charaNam 1 | మానిని కుసుమమాలను బంపిన పూనుకొనెనా పూనుకొనెనా పూజీడికిమ్మనెనా | mAnini kusumamAlanu bampina pUnukonenA pUnukonenA pUjIDikimmanenA |
| చరణం charaNam 2 | చలువ పన్నీరును సరసున కంపిన అలదుకొనెనా అలదుకొనెనా ఆ వెలదికిమ్మనెనా | chaluva pannIrunu sarasuna kampina aladukonenA aladukonenA A veladikimmanenA |
| చరణం charaNam 3 | యువిదరొ వానికి యుత్తరమంపిన చదువుకొనెనా చదువుకొనెనా యాధూర్తకిమ్మనెనా | yuvidaro vAniki yuttaramampina chaduvukonenA chaduvukonenA yAdhUrtakimmanenA |
Category: Javali
#183 వాడెటు బల్కెనో vADeTu balkenO
| Title | వాడెటు బల్కెనో | vADeTu balkenO |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హుసేని | husEni |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వాడెటు బల్కెనో దెల్పవే వాడెటు బల్కెనో దెల్పవే బోటిరో బూటక మేలనే | vADeTu balkenO delpavE vADeTu balkenO delpavE bOTirO bUTaka mElanE |
| చరణం charaNam 1 | కొమ్మరో నేనంపిన కమ్మను వాడే కొనెనా వాడే కొనెనా ఒక చెలి చేతికిమ్మనెనా | kommarO nEnampina kammanu vADE konenA vADE konenA oka cheli chEtikimmanenA |
| చరణం charaNam 2 | ఇంతిరొ నేనంపిన పూబంతుల వాడే కొనెనా వాడే కొనెనా ఒక రమణి కిమ్మనెనా | imtiro nEnampina pUbantula vADE konenA vADE konenA oka ramaNi kimmanenA |
| చరణం charaNam 3 | బాలరో ధర్మపురి పాలుడు యేలెనెననెనా యేలెనెననెనా వాని చెలి పోపొమ్మనెనా | bAlarO dharmapuri pAluDu yElenenanenA yElenenanenA vAni cheli pOpommanenA |
#182 కామిని వాని kAmini vAni
| Title | కామిని వాని (ప్రతి) | kAmini vAni (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | జంఝూటి | jamjhUTi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | కామిని వానితోడ గరుణ యుంచు మనవే | kAmini vAnitODa garuNa yumchu manavE |
| సామి ప్రేమ నిక్కమని చాల నమ్మియుంటినే వో | sAmi prEma nikkamani chAla nammiyumTinE vO | |
| చరణం charaNam 1 | నెలత నన్ను విడచి దాని పలుకులు విని బూరుగ చెంత వలచి నిలుచు చిలుక సామెత వలెను జేయవలదనవే | nelata nannu viDachi dAni palukulu vini bUruga chemta valachi niluchu chiluka sAmeta valenu jEyavaladanavE |
| చరణం charaNam 2 | చిగురు విల్తుడు ములుకు లేయ తెగువ శాయ వలదాయ పగవారిలో నగడు శేయ భామ యెటుల తాళుదునే | chiguru viltuDu muluku lEya teguva SAya valadAya pagavArilO nagaDu SEya bhAma yeTula tALudunE |
| చరణం charaNam 3 | సుదతి శ్రీ రావు వంశజ సూర్య నృపతి మదిగోరి ముదితా యిటులున్న దాని మోసబుచ్చుట పాయమేవో | sudati SrI rAvu vamSaja sUrya nRpati madigOri muditA yiTulunna dAni mOsabuchchuTa pAyamEvO |
#181 మానిని వాని mAnini vAni
| Title | మానిని వాని | mAnini vAni |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | జంఝూటి | jamjhUTi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | మానిని వాని జోలి దానను నే గానే | mAnini vAni jOli dAnanu nE gAnE |
| కాని దాని మాట విని కరుణ మరచియుండెనే వో | kAni dAni mATa vini karuNa marachiyumDenE vO | |
| చరణం charaNam 1 | కలికిరొ నను బాయనని పలికినదేమాయెనే అల చెలితో కలిశి రావే అయిదార్నెల లాయెనే వో | kalikiro nanu bAyanani palikinadEmAyenE ala chelitO kaliSi rAvE ayidArnela lAyenE vO |
| చరణం charaNam 2 | బోటిరొ నను వీడనని బూటకములు జేసెనే మాట దప్పియున్న వాని మోముజూడ రాదే వో | bOTiro nanu vIDanani bUTakamulu jEsenE mATa dappiyunna vAni mOmujUDa rAdE vO |
| చరణం charaNam 3 | సన్నుతాంగి చాల వలసి యిన్ని దినములుంటినే నిన్ను గూడి వెంకటేశుడన్న మాట వింటినే వో | sannutAmgi chAla valasi yinni dinamulumTinE ninnu gUDi vemkaTESuDanna mATa vimTinE vO |
#180 యింతలో yimtalO
| Title | యింతలో (ప్రతి) | yimtalO (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | భైరవి | bhairavi |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | యింతలో మరచితి వేమిరా సామి | yimtalO marachiti vEmirA sAmi |
| కంతుకేళిలోనం గారవించుట | kamtukELilOnam gAravimchuTa | |
| చరణం charaNam 1 | దారిజూచి నన్ను దలచి చెలిని నా పేరనె బిలుచుదును సారెకు గాకున్న చాల సొమ్మసిల్లె | dArijUchi nannu dalachi chelini nA pErane biluchudunu sAreku gAkunna chAla sommasille |
| చరణం charaNam 2 | కన్నె నిన్ను బాసి ఘడియై గాకను సన్నుతాంగి యనుచు కన్నీరు నించుచు కడుబాధ నొందిన | kanne ninnu bAsi ghaDiyai gAkanu sannutAmgi yanuchu kannIru nimchuchu kaDubAdha nomdina |
| చరణం charaNam 3 | ప్రేమతో ముద్దులు బెట్టుచు నన్ను కామించి శ్రీ రేపలె ధామ కౌగిలించి దయతోడ నెనసిన | prEmatO muddulu beTTuchu nannu kAmimchi SrI rEpale dhAma kaugilimchi dayatODa nenasina |
#178 సామిని దేగదే sAmini dEgadE
| Title | సామిని దేగదే (ప్రతి) | sAmini dEgadE (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సామిని దేగదే చానరో వేగమే | sAmini dEgadE chAnarO vEgamE |
| చరణం charaNam 1 | కామజనకుడే కామిని యింటను ఘనమని యుండెనో వో చెలి | kAmajanakuDE kAmini yimTanu ghanamani yumDenO vO cheli |
| చరణం charaNam 2 | జగతిని పురుషుల సఖియరో నమ్మగ తగదని దెల్పిరే వో చెలి | jagatini purushula sakhiyarO nammaga tagadani delpirE vO cheli |
| చరణం charaNam 3 | పడతి రేపలె గోపాలుడు మది నను బాగని మరచెనె వో చెలి | paDati rEpale gOpAluDu madi nanu bAgani marachene vO cheli |
#177 మానాభిమానము mAnAbhimAnamu
This jAvaLi was published earlier too – from a different book. Lyrics have minor differences
| Title | మానాభిమానము | mAnAbhimAnamu |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మానాభిమానము లాతనిదే చెలి | mAnAbhimAnamu lAtanidE cheli |
| చరణం charaNam 1 | మునుపటి నెనరైన తన మది నెంచక ననబోడి రాడాయనే ఆయనె చెలి | munupaTi nenaraina tana madi nemchaka nanabODi rADAyanE Ayane cheli |
| చరణం charaNam 2 | తరుణి బోధన విని తానిందు రాడాయె కరుణయు లేదాయెనె ఆయనె చెలి | taruNi bOdhana vini tAnimdu rADAye karuNayu lEdAyene Ayane cheli |
| చరణం charaNam 3 | వనితరొ గోపాలుడు నన్నేలుట తనదె భారమనెనే అనెనె చెలి | vanitaro gOpAluDu nannEluTa tanade bhAramanenE anene cheli |
#176 రారా మేర rArA mEra
| Title | రారా మేర (ప్రతి) | rArA mEra (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రారా మేర నేరము లేలర | rArA mEra nEramu lElara |
| మారునికేళికి మదనజనక యిటు | mArunikELiki madanajanaka yiTu | |
| చరణం charaNam 1 | కూరిమితో దానిగూడిటు రాకను సారెకు నన్నేచ సరసుడ చాలుర | kUrimitO dAnigUDiTu rAkanu sAreku nannEcha sarasuDa chAlura |
| చరణం charaNam 2 | యెంతసేపు నేనిటు తాళుదుర దంతము జేసేవా పడతి బోధనేర | yemtasEpu nEniTu tALudura damtamu jEsEvA paDati bOdhanEra |
| చరణం charaNam 3 | స్థిరముగ రేపలెపుర మందిర నీ కరుణ గోరితిర కఠినము లేలర | sthiramuga rEpalepura mamdira nI karuNa gOritira kaThinamu lElara |
#174 రామరో rAmarO
| Title | రామరో (ప్రతి) | rAmarO (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | కమాచి | kamAchi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రామరో సామి నిటు రమ్మనవే ఓ | rAmarO sAmi niTu rammanavE O |
| కామించి గూడుటకు కలకంఠి సమయము | kAminchi gUDuTaku kalakamThi samayamu | |
| చరణం charaNam 1 | సరసిజలోచనుడు సమయమెరుగక నను మరుకేళి గూడుమనెనే ఓ | sarasijalOchanuDu samayamerugaka nanu marukELi gUDumanenE O |
| చరణం charaNam 2 | వదలక ఈ రేయి వరునితో గూడుటకు సదయుడై తామెచ్చునే ఓ | vadalaka I rEyi varunitO gUDuTaku sadayuDai tAmechchunE O |
| చరణం charaNam 3 | వనిత రేపలె పురవాసుడు నను జూచి కనికరముంచుమనెనే ఓ | vanita rEpale puravAsuDu nanu jUchi kanikaramumchumanenE O |
#173 రమణిరో ramaNirO
| Title | రమణిరో | ramaNirO |
| Written By | తిరుమల దేవరాయలు | tirumala dEvarAyalu |
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | కమాచి | kamAchi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రమణిరో సామి రాతి రేమనెనే ఓ | ramaNirO sAmi rAti rEmanenE O |
| చరణం charaNam 1 | కమల నయనరొ నా కాంతుడు జూచి తా సుముఖుడై వరియించెనే ఓ | kamala nayanaro nA kAmtuDu jUchi tA sumukhuDai variyimchenE O |
| చరణం charaNam 2 | కర్పూర వీటికాగంధ పుష్పాదుల నర్పణశాయ గైకొనెనే ఓ | karpUra vITikAgandha pushpAdula narpaNaSAya gaikonenE O |
| చరణం charaNam 3 | తిరుమల దేవరాయ కరివీరకాదీయ కరుణతో జూచి గైకొనెనే ఓ | tirumala dEvarAya karivIrakAdIya karuNatO jUchi gaikonenE O |
01 Oct 2025: Added “Written By” as tirumala dEvarAyalu – as found in the Thesis Section 4.1.2