#580 మరుబారికకి marubArikaki

TitleమరుబారికకిmarubArikaki
Written By
Book
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviమరుబారికని తాళలేనురా ఏరా ఏరా ఏరా నా సామి
తాళలేనురా తాళలేనురా ఏరా నా సామి
marubArikani tALalEnurA ErA ErA ErA nA sAmi
tALalEnurA tALalEnurA ErA nA sAmi
చరణం
charaNam 1
ఎంత వేడినా నా చెంతకు రారమ్మని
సుంతయు దయరాదా పంతము జేసెదవేరా
enta vEDinA nA chentaku rArammani
suntayu dayarAdA pantamu jEsedavErA
చరణం
charaNam 2
సుందరాంగ నాపై కోపమేలరా
తాపమాయెరా పరితాప మాపజాలర
sundarAnga nApai kOpamElarA
tApamAyerA paritApa mApajAlara
చరణం
charaNam 3
పోయిన వేళను మా బోటి నంపితే
పిలచిన పలుక వైతివేర సామి
pOyina vELanu mA bOTi nampitE
pilachina paluka vaitivEra sAmi

#579 సుందరుడా sundaruDA

TitleసుందరుడాsundaruDA
Written By
Book
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviసుందరుడా నా ప్రాణ సఖుడా నా ప్రాణ నాథుడ
నన్నెడబాయుట న్యాయము కాదురా
sundaruDA nA prANa sakhuDA nA prANa nAthuDa
nanneDabAyuTa nyAyamu kAdurA
చరణం
charaNam 1
కన్నెరికము నాడు నిన్ను నే కోరితి
జాలమింకేల సుందరుడా
kannerikamu nADu ninnu nE kOriti
jAlaminkEla sundaruDA
చరణం
charaNam 2
చిన్ననాట నుండి నిన్ను నే నమ్మితి
నన్నెడబాయుట న్యాయము కాదురా
రాజ రాజ శ్రీ ఆనంద గజపతి
ఆనంద వర్మ రా ఏరా
chinnanATa nunDi ninnu nE nammiti
nanneDabAyuTa nyAyamu kAdurA
rAja rAja SrI Ananda gajapati
Ananda varma rA ErA

#578 అతని నొక్కపరి atani nokkapari

Titleఅతని నొక్కపరిatani nokkapari
Written By
Book
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviఅతని నొక్కపరి యిటు రమ్మనే చెలి
పిలచిన పలుకడ యే అలుక యేల గలిగి నాపా
atani nokkapari yiTu rammanE cheli
pilachina palukaDa yE aluka yEla galigi nApA
చరణం
charaNam 1
చక్కని మోము జూచి చాలనే వలచితి
చుక్కల రాయుని ధిక్కరించిన వాని
చక్కని మోము జూచి చాలనే వలచితి
chakkani mOmu jUchi chAlanE valachiti
chukkala rAyuni dhikkarinchina vAni
chakkani mOmu jUchi chAlanE valachiti
చరణం
charaNam 2
బంతులాడ బోయి పనిచిరి నా షోకు మాని
ఎంత వేడిన గాని చెంతకు రాడు వాడు
నా మది కలయి కోరిక దాపు జాలా నీకేలా
bantulADa bOyi panichiri nA shOku mAni
enta vEDina gAni chentaku rADu vADu
nA madi kalayi kOrika dApu jAlA nIkElA

#577 నిన్ను కోరి ninnu kOri

Titleనిన్ను కోరిninnu kOri
Written By
Book
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviనిన్ను కోరి యున్నది
నన్ను విన్నపము శేయమన్నది
విన్నపము శేయమన్నది యేరా
నిన్ను నేరా రమ్మన్నది
ninnu kOri yunnadi
nannu vinnapamu SEyamannadi
vinnapamu SEyamannadi yErA
ninnu nErA rammannadi
చరణం
charaNam 1
కామశాస్త్రము చదివెరా అది కలికి చిలుకల కొలికిరా
కలికి చిలుకల కొలికిరా అది మాణిక్యముల మాటరా
అది నిదుర గ్రమ్మిన నిప్పురా
మాటలకు నెరజాణరా సయ్యాటలను తానేర్చెరా
సయ్యాటలను తానేర్చెరా అది చిగురు మామిడి మొగ్గరా
kAmaSAstramu chadiverA adi kaliki chilukala kolikirA
kaliki chilukala kolikirA adi mANikyamula mATarA
adi nidura grammina nippurA
mATalaku nerajANarA sayyATalanu tAnErcherA
sayyATalanu tAnErcherA adi chiguru mAmiDi moggarA

#576 విరహమాయనురా virahamAyanurA

TitleవిరహమాయనురాvirahamAyanurA
Written By
Book
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviవిరహమాయనురా యిక తాళజాలరాvirahamAyanurA yika tALajAlarA
చరణం
charaNam 1
వినవేలరా మొర ఈ వేళ
శ్రీధరా యిక నిలువ జాలరా
ఇటు వచ్చి చూడర
vinavElarA mora I vELa
SrIdharA yika niluva jAlarA
iTu vachchi chUDara
చరణం
charaNam 2
వన్నెకాడరా నెర వలచితిరా నీపై
వగలు జెందకురా నరసింహ నుత
బాల శ్రీ వేణుగోపాల
vannekADarA nera valachitirA nIpai
vagalu jendakurA narasim^ha nuta
bAla SrI vENugOpAla

#575 సుకుమారా sukumArA

TitleసుకుమారాsukumArA
Written By
Book
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviసుకుమారా సుందరాకారా
యిందు రారా నిన్నే నమ్మితి రారా
కోపామేలరా రారా నాపై
sukumArA sundarAkArA
yindu rArA ninnE nammiti rArA
kOpAmElarA rArA nApai
చరణం
charaNam 1
సమయమిదేరా సరసుడ రారా పంతమటరా
పన్నగ శయన రారా నిన్నే చాలగా నమ్మితి
samayamidErA sarasuDa rArA pantamaTarA
pannaga Sayana rArA ninnE chAlagA nammiti
చరణం
charaNam 2
మోహనాకారా మోహమాయనురా మోహ మాప జాలను
రారా రాధాకృష్ణ లేచి రారా
mOhanAkArA mOhamAyanurA mOha mApa jAlanu
rArA rAdhAkRshNa lEchi rArA

#574 వన్నెకాడు నన్ను vannekADu nannu

Titleవన్నెకాడు నన్నుvannekADu nannu
Written By
Book
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviవన్నెకాడు నన్ను కేళికి వనిత రాడాయె
కలువా కంటి నన్ను కనులా చూడడాయె
కనికారమున నాతో మాటలాడడే
vannekADu nannu kELiki vanita rADAye
kaluvA kanTi nannu kanulA chUDaDAye
kanikAramuna nAtO mATalADaDE
చరణం
charaNam 1
పన్నీరు చల్లేదా పడతి వాడొచ్చిన
పగమేమో తెలియదు అనకపల్లి పురమున వెలిసిన
నరసింహ సుతుడు శ్రీ లక్ష్మీ సన్నుతుడు
pannIru challEdA paDati vADochchina
pagamEmO teliyadu anakapalli puramuna velisina
narasim^ha sutuDu SrI lakshmI sannutuDu

#573 నేనేమి సేతునే nEnEmi sEtunE

Titleనేనేమి సేతునేnEnEmi sEtunE
Written By
Book
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviనేనేమి సేతునే సఖీ నేనెటుల తాళుదునే సఖి
నేనెటులోర్తునే నేనెటుల తాళుదునే
nEnEmi sEtunE sakhI nEneTula tALudunE sakhi
nEneTulOrtunE nEneTula tALudunE
చరణం
charaNam 1
నా విభుడూర లేడాయెనె నేనేమి సేతునే
మందులా దాని మరిగియే నా పొందు దలచడే
మందులా నా సవతి దానికి మందూ రాసెనే
విభునకు మందూ రాసెనే తలాకు మందురుద్దెనే
nA vibhuDUra lEDAyene nEnEmi sEtunE
mandulA dAni marigiyE nA pondu dalachaDE
mandulA nA savati dAniki mandU rAsenE
vibhunaku mandU rAsenE talAku mandu ruddenE
చరణం
charaNam 2
మొన్నటి దినమూన నన్ను మోసపుచ్చెనే
విభుడూ మోసపుచ్చెనే
వచ్చెద ననుచు నాతో యని యా సవతినీ గూడెనే
monnaTi dinamUna nannu mOsapuchchenE
vibhuDU mOsapuchchenE
vachcheda nanuchu nAtO yani yA savatinI gUDenE
చరణం
charaNam 3
సుందరాకారుడే ముద్దుల మోహనాంగుడే
మోహనాంగుడే మదన గోపాలుడే
sundarAkAruDE muddula mOhanAnguDE
mOhanAnguDE madana gOpAluDE

#572 రారా సుకుమార rArA sukumAra

Titleరారా సుకుమారrArA sukumAra
Written By
Book
రాగం rAga
తాళం tALa
Previously Published at 413
పల్లవి pallaviరారా సుకుమార ధీర
రాజాధి రాజ లేరా
పరిమళ మిదే గంధ మిదే
పట్టి పూసేది రారా
rArA sukumAra dhIra
rAjAdhi rAja lErA
parimaLa midE gandha midE
paTTi pUsEdi rArA
చరణం
charaNam 1
లేదా నాపై ప్రేమా రాదా
నాపై దయ సరసుడ
లేచి రారా సమయ మిదే రారా
lEdA nApai prEmA rAdA
nApai daya sarasuDa
lEchi rArA samaya midE rArA
చరణం
charaNam 2
వన్నెకాడ నిన్నె చాల నమ్మి యుంటీర మరీ
సుందరాకారా నిన్నే చాలగ నమ్మితిరా
vannekADa ninne chAla nammi yunTIra marI
sundarAkArA ninnE chAlaga nammitirA
చరణం
charaNam 3
మల్లె పూల హారములు మెడ నిండ వేసెదరా
జాస్మిన్ సెంటు యిదే జేటా జేటా జల్లెదరా
malle pUla hAramulu meDa ninDa vEsedarA
jAsmin senTu yidE jETA jETA jalledarA
చరణం
charaNam 4
పగ దానిగ నను పాటింపకు రావేమిరా
సరసుడా రావేమిరా
మోహనాకారా మోహమాయెరా
మోహనాంగా నిను నమ్మితి గదరా
మోహమాపా జాలను రావేమిరా
paga dAniga nanu pATimpaku rAvEmirA
sarasuDA rAvEmirA
mOhanAkArA mOhamAyerA
mOhanAngA ninu nammiti gadarA
mOhamApA jAlanu rAvEmirA
చరణం
charaNam 5
విరు శరములు నాపై విపరీత మాయే
మరులు కొంటిరా మోహనాకారా
మరు కొల్పునకు సమయ మిదేరా రావేమిరా
viru Saramulu nApai viparIta mAyE
marulu konTirA mOhanAkArA
maru kolpunaku samaya midErA rAvEmirA

#571 ముందటివలె mundaTivale

TitleముందటివలెmundaTivale
Written By
Book
రాగం rAgaభైరవిbhairavi
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి pallaviముందటి వలె నాపై నెనరున్నదా
సామి ముచ్చటలిక ఏలరా
mundaTi vale nApai nenarunnadA
sAmi muchchaTalika ElarA
అనుపల్లవి anupallaviఎందుకీ మొగ మిచ్చకపు మాట లాడేవు
యిది మేర గాదురా ఏరా నా సామి
endukI moga michchakapu mATa lADEvu
yidi mEra gAdurA ErA nA sAmi
చరణం
charaNam 1
పిలువ నంపిన రావు పిలచిన గైకొనవు పలుమారు వేడిన
పలుకవు వలపు నిలుప లేక చెలువు డనుచు నిన్ను
తలచి తలచి చాల తల్లడిల్లుటే కొని
piluva nampina rAvu pilachina gaikonavu palumAru vEDina
palukavu valapu nilupa lEka cheluvu Danuchu ninnu
talachi talachi chAla tallaDilluTE koni
చరణం
charaNam 2
చిన్న నాటి నుండి చేరిన దెంచక నన్ను చౌక చేసేది న్యాయమా
వన్నెకాడ నీదు వంచన లెరుగక నిన్నన బని లేదు నే జేయు పూజకు
chinna nATi nunDi chErina denchaka nannu chauka chEsEdi nyAyamA
vannekADa nIdu vanchana lerugaka ninnana bani lEdu nE jEyu pUjaku
చరణం
charaNam 3
కలువల రేడంచు కంచి వరదా నిన్ను లలనా యింత దూరము రానిచ్చేనా
అలరు విల్తుని కేళిని నలుము కొనుచు నన్ను కలసిన
పాపాన కాకన్నుల జూడ వచ్చితి ఓ
kaluvala rEDanchu kanchi varadA ninnu lalanA yinta dUramu rAnichchEnA
alaru viltuni kELini nalumu konuchu nannu kalasina
pApAna kAkannula jUDa vachchiti O
చరణం
charaNam 4
కన్యను గద నేను కన్నెత్తి చూడవేరా వన్నెకాడ
లేచి రారా వగలు చెందకురా
kanyanu gada nEnu kannetti chUDavErA vannekADa
lEchi rArA vagalu chendakurA