#570 చాలులేరా chAlulErA

TitleచాలులేరాchAlulErA
Written Byపట్టాభిరామయ్య?paTTAbhirAmayya?
Book
రాగం rAgaబేగడbEgaDa
తాళం tALa
పల్లవి pallaviచాలులేరా నీ నేస్తము
తాళవన లోలా నీదు పరిహాసము
chAlulErA nI nEstamu
tALavana lOlA nIdu parihAsamu
చరణం
charaNam 1
ధీర నీవు ఆలకించితి యని
క్షీరము నా హారమునే
మనసార నీకు జేరనీవు
నొల్లక పారద్రోసి దురీ జోరు తోనే పోతివి
dhIra nIvu Alakinchiti yani
kshIramu nA hAramunE
manasAra nIku jEranIvu
nollaka pAradrOsi durI jOru tOnE pOtivi
చరణం
charaNam 2
ఎవ్వరైను రేపు మాపు కోపమెల్ల బాపెరా ప్రియా
పరితాప మెల్ల బాసి నన్ను గూడిన దాపు జేర
తాపమార తాపమార్చుకకనే పోతివి
evvarainu rEpu mApu kOpamella bAperA priyA
paritApa mella bAsi nannu gUDina dApu jEra
tApamAra tApamArchukakanE pOtivi

#569 ఏమందునే చెలియా EmandunE cheliyA

Titleఏమందునే చెలియాEmandunE cheliyA
Written By
Book
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALa
పల్లవి pallaviఏమందునే చెలియా నా సామి
నా మీద ఏమో అలకాయెనిక
EmandunE cheliyA nA sAmi
nA mIda EmO alakAyenika
చరణం
charaNam 1
ఏ మాయలాడి వాని కే మందు బెట్టెనో
దిట్టముగా నాదు పట్టు పాన్పు చేరి
పట్టి పిలిచితే నన్ను ముట్టవద్దనే యిక
E mAyalADi vAni kE mandu beTTenO
diTTamugA nAdu paTTu pAn&pu chEri
paTTi pilichitE nannu muTTavaddanE yika
చరణం
charaNam 2
ప్రీతితో బాలచంద్ర నాతోను కూడితే ఆ
నాతి బోధనచే ప్రీతి తప్పెను ఇక
prItitO bAlachandra nAtOnu kUDitE A
nAti bOdhanachE prIti tappenu ika

#568 వారేమి చేసెదరే vArEmi chEsedarE

Titleవారేమి చేసెదరేvArEmi chEsedarE
Written Byధర్మపురి?dharmapuri?
Book
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaఏకEka
పల్లవి pallaviవారేమి చేసెదరే ప్రియుడు
జార చోరుడనే వేరైతే
vArEmi chEsedarE priyuDu
jAra chOruDanE vEraitE
చరణం
charaNam 1
ఊరివారు యింతిరో భిగుడాడ వేసమై
కులకాంతల నేచితే ఎట్లోర్తురే
UrivAru yintirO bhiguDADa vEsamai
kulakAntala nEchitE eTlOrturE
చరణం
charaNam 2
నీరజముఖి వాడా రమణి మగని
తీరున పోయుట తానే పైకొంటే
nIrajamukhi vADA ramaNi magani
tIruna pOyuTa tAnE paikonTE
చరణం
charaNam 3
శ్రీకరుడగు శ్రీ ధర్మ పురీశుడు
లోకాప కీర్తికి లోనైతే ఈ వూరివారేమి చేసెదరే
SrIkaruDagu SrI dharma purISuDu
lOkApa kIrtiki lOnaitE I vUrivArEmi chEsedarE

#567 చెలువుడ నీవు cheluvuDa nIvu

Titleచెలువుడ నీవుcheluvuDa nIvu
Written Byధర్మపురి?dharmapuri?
Book
రాగం rAgaఖమాసుkhamAsu
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviచెలువుడ నీవు అటునిటు నిలుంటక నన్ను
నలుగురిలో నన్ను బలిమి సేయ వద్దురా
cheluvuDa nIvu aTuniTu nilunTaka nannu
nalugurilO nannu balimi sEya vaddurA
చరణం
charaNam 1
అంతరంగము వలె సొంతముగా
పంతము చేసెద వింత నేనెరుగనా
antarangamu vale sontamugA
pantamu chEseda vinta nEneruganA
చరణం
charaNam 2
పడక ఇంటికి వచ్చి పయ్యెద చేకొని
పుక్కిటి విడమిచ్చితే వెర్రిదాననా
paDaka inTiki vachchi payyeda chEkoni
pukkiTi viDamichchitE verridAnanA
చరణం
charaNam 3
ధర్మపురీశ మగవారల మర్మము
సారసారెకొక తీరు నేనెరుగనా
dharmapurISa magavArala marmamu
sArasArekoka tIru nEneruganA

#566 నిన్ను నమ్మినార ninnu namminAra

Titleనిన్ను నమ్మినారninnu namminAra
Written Byధర్మపురి?dharmapuri?
Book
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALaఆదిAdi
Previously Posted At403
పల్లవి pallaviనిన్ను నమ్మినార నీరజ నయన
నన్ను విడనాడ న్యాయమా నా సామి
ninnu namminAra nIraja nayana
nannu viDanADa nyAyamA nA sAmi
కమ్మనీ మోవిచ్చి కౌగిలియ్యవేరా
నమ్మిన దానరా నా సామి ఈ వేళ
kammanI mOvichchi kaugiliyyavErA
nammina dAnarA nA sAmi I vELa
ఎంత వేడినను పంతమా నా పైని
సంతతంబు నిన్నే చింతించు చున్నారా
enta vEDinanu pantamA nA paini
santatambu ninnE chintinchu chunnArA
మరుని బారికి నోర్వజాల
మర్మమెల్ల దెలిసె శ్రీ ధర్మపురి నివాస
maruni bAriki nOrvajAla
marmamella delise SrI dharmapuri nivAsa

#565 ఇది నీకు మరియాదగా idi nIku mariyAdagA

Titleఇది నీకు మరియాదగాidi nIku mariyAdagA
Written Byధర్మపురి?dharmapuri?
Book
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviఇది నీకు మరియాదగా ఏరా నా సామి
ఇది నీకు మరియాదగా
దానింటికి పోయి అలసి సొలసి గూడి
యిందున రావైతివి అయ్యయ్యో
idi nIku mariyAdagA ErA nA sAmi
idi nIku mariyAdagA
dAninTiki pOyi alasi solasi gUDi
yinduna rAvaitivi ayyayyO
1పట్టి మంచము బిగి పట్టించి
నా పడకింట పవళించమని వేడితే
నన్ను చట్ట చేయక నందు ఆ సవతి
గుడిసె కేగి పట్టిలో పవళించితివి అయ్యయ్యో
paTTi manchamu bigi paTTinchi
nA paDakinTa pavaLinchamani vEDitE
nannu chaTTa chEyaka nandu A savati
guDise kEgi paTTilO pavaLinchitivi ayyayyO
2గుత్తపు గుబ్బల గదియు కౌగిలించుచు
వద్దికగా ముద్దియ్య వేడితే
దిద్ది పోలిన పాత చిలికిన పాలించు కొత్తు నిపుడు
కౌగలించ వైతి వయ్యయ్యో
guttapu gubbala gadiyu kaugilinchuchu
vaddikagA muddiyya vEDitE
diddi pOlina pAta chilikina pAlinchu kottu nipuDu
kaugalincha vaiti vayyayyO
3ధరను వెలయు ధర్మపురి వేణుగోపాలా
మరుకేలిత మై మరువ గూడమని వేడ
సారె సారెకు నాతో చలము చేయుచు చాల
పర నారీ మణుల పొందను పో అయ్యయ్యో
dharanu velayu dharmapuri vENugOpAlA
marukElita mai maruva gUDamani vEDa
sAre sAreku nAtO chalamu chEyuchu chAla
para nArI maNula pondanu pO ayyayyO

#564 చాలు నిలుపంతట chAlu nilupantaTa

Titleచాలు నిలుపంతటchAlu nilupantaTa
Written Byధర్మపురి?dharmapuri?
Book
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaఏకEka
పల్లవి pallaviచాలు నిలుపంతట
నట్టి ఉపచారము లెందుకురా
నిన్న రేయి చిన్న దానింటను
నన్ను జూచి నవ్వినారటరా
chAlu nilupantaTa
naTTi upachAramu lendukurA
ninna rEyi chinna dAninTanu
nannu jUchi navvinAraTarA
అనుపల్లవి anupallaviఅదెల్ల నా పెను సిగ్గయెరా
కాంతా మణిని రాణి వనుచు
కీర్తిం బొగిడికొని
ఆడినా వింతలు విన చలల్ల నాయెనురా
adella nA penu siggayerA
kAntA maNini rANi vanuchu
kIrtim bogiDikoni
ADinA vintalu vina chalalla nAyenurA
చరణం
charaNam 1
తారాధిప సంకాశా గంభీరా
భూధారా శ్రీ ధర్మ పురీశుడు
నను జేసి దూరుట మరియాద
గాదటరా ఎందుకు వందన ఏలుమురా
tArAdhipa samkASA gambhIrA
bhUdhArA SrI dharma purISuDu
nanu jEsi dUruTa mariyAda
gAdaTarA enduku vandana ElumurA

#563 ఏమి బల్కెనో Emi balkenO

Titleఏమి బల్కెనోEmi balkenO
Written Byదుడ్డు సీతారామయ్య (1883-1949)duDDu sItArAmayya (1883-1949)
Bookసెంటినరీ మ్యాగజైన్ (1983)Centenary Magazine 1983
రాగం rAgaతోడిtODi
తాళం tALaరూపకrUpaka
Previously Published At302
పల్లవి pallaviఏమి బల్కెనో శ్రీ సఖుడేమి బల్కెనో అలవాEmi balkenO SrI sakhuDEmi balkenO alavA
అనుపల్లవి anupallaviమోమాటమేమీ లేక దేల్పగదె చెలిmOmATamEmI lEka dElpagade cheli
చరణం
charaNam 1
నే వ్రాయు చీటీ జూచెనా
నిరసించి పారవైచెనా
ఏమైన నుల్లసమ్ము లాడెనా చెలి
nE vrAyu chITI jUchenA
nirasimchi pAravaichenA
Emaina nullasammu lADenA cheli
చరణం
charaNam 2
నను బాయనంచు జెప్పెనా
నిను జూచి వేరె దాగెనా
నీకేమైన భూషలిచ్చెనా చెలి
nanu bAyananchu jeppenA
ninu jUchi vEre dAgenA
nIkEmaina bhUshalichchenA cheli
చరణం
charaNam 3
ఆ కాంత యింటనుండెనా
అన్యాలయమున నుండెనా
మనసిచ్చి మారు జాబు వ్రాసెనా చెలి
A kAnta yinTanunDenA
anyAlayamuna nunDenA
manasichchi mAru jAbu vrAsenA cheli
చరణం
charaNam 4
ఇటు తాను వత్తుననియనా
అటు నన్ను రమ్మనియెనా
ఎటు బల్కె సీతరామ శాస్త్రి కవినుతు
iTu tAnu vattunaniyanA
aTu nannu rammaniyenA
eTu balke sItarAma SAstri kavinutu

Strangely, the lyrics of 302 and this, are almost identical – but, with a different mudra.

#562 కంటి సైగ kanTi saiga

Titleకంటి సైగkanTi saiga
Written Byవింజమూరి వరదరాజయ్యంగారు*viMjamUri varadarAjayyangAru*
Book
రాగం rAgaమణిరంగుmaNirangu
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviకంటి సైగ జేసెనే
తుంటరికాడు
ఒంటిగ నున్న
నన్నింటి లోకి రమ్మని
kanTi saiga jEsenE
tunTarikADu
onTiga nunna
nanninTi lOki rammani
అనుపల్లవి anupallaviజంట పావురముల క్రీ
గంటి జూపి వాడు
కొంటె మాటలాడి
తుంటరి పనులు సేయ
janTa pAvuramula krI
ganTi jUpi vADu
konTe mATalADi
tunTari panulu sEya
చరణం
charaNam 1
నవ మోహనాంగుడే వాడు
నాద వినోదుడే
ధరను వెలయు శ్రీ
వరకాంచి పురమున
స్థిరముగ నెలకొన్న
వరద రాజ విభుడు
nava mOhanAnguDE vADu
nAda vinOduDE
dharanu velayu SrI
varakAnchi puramuna
sthiramuga nelakonna
varada rAja vibhuDu

#561 అగపడదే agapaDadE

TitleఅగపడదేagapaDadE
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaఖమాచిkhamAchi
తాళం tALaత్రస్య గతిtrasya gati
పల్లవి pallaviఅగపడదే చోటనైన యట్టి వన్నెలాడిagapaDadE chOTanaina yaTTi vannelADi
అనుపల్లవి anupallaviసుగపడు మా పూవుబోడి జోడు కూడి యాదిsugapaDu mA pUvubODi jODu kUDi yAdi
చరణం
charaNam 1
ముగుర కాలి గోరినైన బోలునె నీ నాతి
యగును దాని చెంత రంజయైన నాకు కోతి
mugura kAli gOrinaina bOlune nI nAti
yagunu dAni chenta ramjayaina nAku kOti
చరణం
charaNam 2
దెబ్బున నద్దాని జిదిమి దివ్వె పెట్టినచ్చు
అబ్బోటిన్జూడ నతివ కైన వలపు హెచ్చు
debbuna naddAni jidimi divve peTTinachchu
abbOTin&jUDa nativa kaina valapu hechchu