| Title | మాట నమ్మి | mATa nammi |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | మాట నమ్మి మోసమాయెనే వాని | mATa nammi mOsamAyenE vAni |
| నాటకమయ మయినదని నేటికి తెలిసినదే | nATakamaya mayinadani nETiki telisinadE | |
| గొప్పవాడని మాట తప్పలేడని నన్ను కను రెప్పవలె గాచేవాడని ముప్పటికే నేను వాని మాట నమ్మి | goppavADani mATa tappalEDani nannu kanu reppavale gAchEvADani muppaTikE nEnu vAni mATa nammi | |
Category: Javali
#409 ఇంత చిన్న బాలుడు inta chinna bAluDu
| Title | ఇంత చిన్న బాలుడు | inta chinna bAluDu |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ / సుబ్బారావు | dharmapuri subbarAyar / subbArAvu |
| Book | ||
| రాగం rAga | ఆనంద భైరవి | Ananda bhairavi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఇంత చిన్న బాలుడు నీవు నన్ను వింత లెంతని అడుగేవేమి | inta chinna bAluDu nIvu nannu vinta lentani aDugEvEmi |
| ఇంతిరో రమ్ము ఇటువంటి బాలుని కొంతయైన విడువరాదు | intirO rammu iTuvanTi bAluni kontayaina viDuvarAdu | |
| తరుణులకెల్ల తరము గాదె ధరపురీశుని చేరుటకు | taruNulakella taramu gAde dharapurISuni chEruTaku | |
#408 నీకిది మరియాద nIkidi mariyAda
| Title | నీకిది మరియాద | nIkidi mariyAda |
| Written By | చింతలపల్లి వేంకటరావు | chintalapalli vEnkaTarAvu |
| Book | ||
| రాగం rAga | సారంగ | sAranga |
| తాళం tALa | ఆది విళంబి | Adi viLambi |
| పల్లవి pallavi | నీకిది మరియాద గాదుర నాకింత బాధలీయ | nIkidi mariyAda gAdura nAkinta bAdhalIya |
| తరమా ఓయనరాదా మాట్లాడరాదా | taramA OyanarAdA mATlADarAdA | |
| రాకా చంద్రవదన నీకింత పరాకా రాక నా విరహము దీర్చ చేతగాక ఏ కరుణయొ జూపించి చెంత వచ్చి నన్ను గూడి యుండుట | rAkA chandravadana nIkinta parAkA rAka nA virahamu dIrcha chEtagAka E karuNayo jUpinchi chenta vachchi nannu gUDi yunDuTa | |
#407 తెలియక జేసిన teliyaka jEsina
పురుష జావళి purusha jAvaLi
| Title | తెలియక జేసిన | teliyaka jEsina |
| Written By | చింతలపల్లి వేంకటరావు | chintalapalli vEnkaTarAvu |
| Book | ||
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | తెలియక జేసిన అపరాధములన్నియు చెలియా మన్నించవే | teliyaka jEsina aparAdhamulanniyu cheliyA manninchavE |
| వలపు జూచి నా సతియని మంచి గిలిగింతలిచ్చి మతి హీనుడైతి | valapu jUchi nA satiyani manchi giligintalichchi mati hInuDaiti | |
| నా వారి తెలియక ఏమారు వచ్చితె కోపము శాయక కౌగలించవలె | nA vAri teliyaka EmAru vachchite kOpamu SAyaka kaugalinchavale | |
#406 ఏమని దెల్పుదురా Emani delpudurA
| Title | ఏమని దెల్పుదురా | Emani delpudurA |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | విళంబ రూపక | viLamba rUpaka |
| పల్లవి pallavi | ఏమని దెల్పుదురా కమ్ కమ్ కమ్మని | Emani delpudurA kam kam kammani (come come come-ani) |
| అనుపల్లవి anupallavi | కమ్మ విల్తుని మాయమురా | kamma viltuni mAyamurA |
| చరణం charaNam 1 | కామిని పిలిచేవేమని వెడలితె గో గో గోయనె గారవమందదేనని దెల్పుదురా | kAmini pilichEvEmani veDalite gO gO gOyane gAravamandadEnani delpudurA |
#405 మోసబోతినే mOsabOtinE
| Title | మోసబోతినే | mOsabOtinE |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | కానడ | kAnaDa |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | మోసబోతినే చెలి మోహనాంగుని చేరి నే | mOsabOtinE cheli mOhanAnguni chEri nE |
| ఆసలు పెట్టి నాపై దోసమెంచెనే ఓ చెలియ | Asalu peTTi nApai dOsamenchenE O cheliya | |
| వద్దంటే నన్ను గూడి ముద్దు ముద్దుగ మాటలాడి నిద్దుర పోయె వేళ సద్దులేక పోయినాడే | vaddanTE nannu gUDi muddu mudduga mATalADi niddura pOye vELa saddulEka pOyinADE | |
#404 దారి జూచుచున్నది dAri jUchuchunnadi
| Title | దారి జూచుచున్నది | dAri jUchuchunnadi |
| Written By | తచ్చూరు సింగరాచార్య | tachcUru singarAchArya |
| Book | ||
| రాగం rAga | శంకరాభరణం | SankarAbharaNam |
| తాళం tALa | ?? | ?? |
| పల్లవి pallavi | దారి జూచుచున్నది నీదు ప్రియ తరళాక్షియో చిన్నది నీదు ప్రియా | dAri jUchuchunnadi nIdu priya taraLAkshiyO chinnadi nIdu priyA |
| వారిజముఖి నీవు వచ్చే వేళానుకొని కోరికతో రాజగోపాల సామి దారి వెన్నెల గాయెగా | vArijamukhi nIvu vachchE vELAnukoni kOrikatO rAjagOpAla sAmi dAri vennela gAyegA | |
| వేడ్క మీర మంచి యీ సన్న జాజి విరుల సరులు సుగంధము పన్నీరు చెంబులు పడకింటిలో నుంచి వన్నెలాడి తలవాకిట నిలచి నీ | vEDka mIra manchi yI sanna jAji virula sarulu sugandhamu pannIru chembulu paDakinTilO nunchi vannelADi talavAkiTa nilachi nI | |
| పచ్చిపచ్చిగాను పదములు పాడుచు వచ్చి రాజగోపాల సామి నీవు ముచ్చట లాడుచు ముద్దులు పెట్టుచు గ్రుచ్చి కౌగలిచ్చి కూడుటం దలచి నీ | pachchipachchigAnu padamulu pADuchu vachchi rAjagOpAla sAmi nIvu muchchaTa lADuchu muddulu peTTuchu gruchchi kaugalichchi kUDuTam dalachi nI | |
#403 నిను నమ్మినారా ninu namminArA
| Title | నిను నమ్మినారా | ninu namminArA |
| Written By | ధర్మపురి | dharmapuri |
| Book | గానేందు శేఖరం | gAnEndu SEkharam |
| రాగం rAga | కాంభోజి | kAmbhOji |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | నిను నమ్మినారా నీరజ నయన నను విడనాడ న్యాయమా నా సామి | ninu namminArA nIraja nayana nanu viDanADa nyAyamA nA sAmi |
| కమ్మని మోవిచ్చి కౌగిలియ్యవేరా నమ్మిన దానరా నా సామి | kammani mOvichchi kaugiliyyavErA nammina dAnarA nA sAmi | |
| ఎంత వేడినను పంతమా నా పైని పంతతంబు నిన్నే చింతించు చున్నార | enta vEDinanu pantamA nA paini pantatambu ninnE chintinchu chunnAra | |
| మరుని బారికి ఓర్వ జాలనని మర్మమెల్ల తెలిసె శ్రీ ధరపుర నివాస | maruni bAriki Orva jAlanani marmamella telise SrI dharapura nivAsa |
#402 ఎందుకు రాడాయె enduku rADAye
| Title | ఎందుకు రాడాయె | enduku rADAye |
| Written By | వెంకటరమణ | venkaTaramaNa |
| Book | ||
| రాగం rAga | కానడ | kAnaDa |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఎందుకు రాడాయె ఎవరేమన్నారో | enduku rADAye evarEmannArO |
| సరసుని ప్రేమ సతమని యుంటినే కరుణ మరచెనే కలికిరో నేడు | sarasuni prEma satamani yunTinE karuNa marachenE kalikirO nEDu | |
| చందన పరిమళ ఆనందముగ నుంటినే సుందరాంగుడు రాడాయె మందయాన ఈవేళ | chandana parimaLa Anandamuga nunTinE sundarAnguDu rADAye mandayAna IvELa | |
| కోరిన వేళలో కోపము ఏలనే మంగళపురీశుని వేగమె పిలుపవె | kOrina vELalO kOpamu ElanE mangaLapurISuni vEgame pilupave |
#401 తెలిసెను యిపుడు telisenu yipuDu
| Title | తెలిసెను యిపుడు | telisenu yipuDu |
| Written By | వెంకటరమణ | venkaTaramaNa |
| Book | ||
| రాగం rAga | కరహరప్రియ | karaharapriya |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | తెలిసెను యిపుడు లేరా కులుకులాడి పొద్దు తెలిసెనిపుడు లేరా | telisenu yipuDu lErA kulukulADi poddu telisenipuDu lErA |
| మాట చూడపోతే మధురము మనసులోని మత్సరము ఇదేటి ప్రేమ సామి నీకు ఇది మగవారికి తగునో | mATa chUDapOtE madhuramu manasulOni matsaramu idETi prEma sAmi nIku idi magavAriki tagunO | |
| ప్రీతి యందె ఉంచి దాని ప్రేమతో నేలిన ప్రీతి తెలిసి వచ్చెను ఖ్యాతి పొగిడేరు సఖులు సరస మంగళపురివాస సురత సుఖమెందుబోయె మరచి ఇందు వచ్చితివిరా మగువ దండించును పోరా | prIti yande unchi dAni prEmatO nElina prIti telisi vachchenu khyAti pogiDEru sakhulu sarasa mangaLapurivAsa surata sukhamendubOye marachi indu vachchitivirA maguva danDinchunu pOrA | |