| Title | సామి యిందు | sAmi yindu |
| Written By | వెంకటరమణ | venkaTaramaNa |
| Book | ||
| రాగం rAga | సురభి | surabhi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సామి యిందు రాడాయె సఖియరో తోడి త్యావే | sAmi yindu rADAye sakhiyarO tODi tyAvE |
| మోహమెటు దాచునే ముదితరో ఈవ్యేళ మోహనాంగుడు రాడే మరచునేమో చెలియా | mOhameTu dAchunE muditarO IvyELa mOhanAnguDu rADE marachunEmO cheliyA | |
| వలచిన వేళలో వెలదిరో నన్ను తలచక యున్నడు తరుణిరో నేడు మగువరో నేడు మంగళ పురీశునికి తగునే ఈ నడత రాకయున్నాడు | valachina vELalO veladirO nannu talachaka yunnaDu taruNirO nEDu maguvarO nEDu mangaLa purISuniki tagunE I naData rAkayunnADu | |
Category: Javali
#399 యెడబాయరాని yeDabAyarAni
| Title | యెడబాయరాని | yeDabAyarAni |
| Written By | మైసూరు సదాశివరావు | maisUru sadASivarAvu |
| Book | ||
| రాగం rAga | సావేరి | sAvEri |
| తాళం tALa | చౌ | chau |
| పల్లవి pallavi | యెడబాయరాని అడియాసలెల్ల చెడిబోయెటుల సేయరా దొరా నే | yeDabAyarAni aDiyAsalella cheDibOyeTula sEyarA dorA nE |
| చరణం charaNam 1 | తడవు జేసితె నేనుండనని అడుగడుకు నే వేడితే నడుచురా నీ మాట తెలివికి తేట పొడచురా నీదనుచురా శ్రీకృష్ణ రాజేంద్ర | taDavu jEsite nEnunDanani aDugaDuku nE vEDitE naDuchurA nI mATa teliviki tETa poDachurA nIdanuchurA SrIkRshNa rAjEndra |
| చరణం charaNam 2 | సాధించకురా మాట్లాడరా బాధ తీర్చి నన్నేల నిదానమేల లోల భూధర సుందర ఏదిరా మోవీయరా సదాసివార్తి భంజనా నీ సన్నిధి పెన్నిధిరా ముదాస్పద హృదంబుజంబుల భావము తెలుపక | sAdhinchakurA mATlADarA bAdha tIrchi nannEla nidAnamEla lOla bhUdhara sundara EdirA mOvIyarA sadAsivArti bhanjanA nI sannidhi pennidhirA mudAspada hRdambujambula bhAvamu telupaka |
#398 రాగముతో rAgamuto
| Title | రాగముతో | rAgamutO |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | రాగమాలిక | rAgamAlika |
| తాళం tALa | త్రిశ్ర ఆది | triSra Adi |
| పల్లవి pallavi | రాగముతో మాలిక వేయవే బాలా అనురాగముతో | rAgamutO mAlika vEyavE bAlA anurAgamutO |
| సాగర సువిశాల హృదయ చామరాజునికి విసరి చామర రాగముతో సామజవరదుని సమాన సారసాక్షుడే సామిని నమ్మినవారికి భయములేలనే కోమల సమీర తరంగ వైభోగ రంగుడై | sAgara suviSAla hRdaya chAmarAjuniki visari chAmara rAgamutO sAmajavaraduni samAna sArasAkshuDE sAmini namminavAriki bhayamulElanE kOmala samIra taranga vaibhOga ranguDai | |
| శాంత కల్యాణ గుణాధారుడైన మా దొర కింత ఆనందమీయ వలచి వచ్చితిరా కుంతలములను దూపి నిలచియుంటి | SAnta kalyANa guNAdhAruDaina mA dora kinta AnandamIya valachi vachchitirA kuntalamulanu dUpi nilachiyunTi | |
| కామము వర్ధిల్లిన మనములగు చుండరని శ్శీమ సుమసౌరభము ముదమీయగ ఏమివ్వరాళి మనసు నీదు కాదుగా | kAmamu vardhillina manamulagu chunDarani SSIma sumasaurabhamu mudamIyaga EmivvarALi manasu nIdu kAdugA | |
| ఆనాటి నుండె భక్తితో ఆనాటి పూర్వికుల మాట యెపుడు తప్పక ఎవ్వరి మాట లేటి కాంబోది జనరంజకుని విరాట దర్బారులో మధ్యమావృతజనుల | AnATi nunDe bhaktitO AnATi pUrvikula mATa yepuDu tappaka evvari mATa lETi kAmbOdi janaranjakuni virATa darbArulO madhyamAvRtajanula | |
#397 పోరా దానింటికి pOrA dAninTiki
| Title | పోరా దానింటికి | pOrA dAninTiki |
| Written By | ||
| Book | గాయక లోచనము | gAyaka lOchanamu |
| రాగం rAga | హిందుస్థాని కాఫి | hindusthAni kAfi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | పోరా దానింటికి సామి చాల ప్రొద్దాయెరా ఆ వారిజాక్షి విన్నను మోసము | pOrA dAninTiki sAmi chAla proddAyerA A vArijAkshi vinnanu mOsamu |
| నక్క వినయములు నిజమని యెంతో నమ్మియుంటి గదరా పక్క జేర రావద్దుర యిక | nakka vinayamulu nijamani yentO nammiyunTi gadarA pakka jEra rAvaddura yika | |
| తేనెలూర నాతో పలుకుచు ఆ చాన కడకు పోనేలా కాని వారికిది వేడుక గద | tEnelUra nAtO palukuchu A chAna kaDaku pOnElA kAni vArikidi vEDuka gada | |
| సరసమైన మాటలు వేరాయె చనువు దూరమాయె మరుని కేళికి ఇక సున్నే గద | sarasamaina mATalu vErAye chanuvu dUramAye maruni kELiki ika sunnE gada | |
| జాజి సరము లంపిన వెగటాయె చాల కోపమాయె రాజగోపాల చాలునిక | jAji saramu lampina vegaTAye chAla kOpamAye rAjagOpAla chAlunika |
#396 చలమేలర నాపై chalamElara nApai
| Title | చలమేలర నాపై | chalamElara nApai |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | ||
| రాగం rAga | నాటకురంజి | nATakuranji |
| తాళం tALa | ?? | ?? |
| పల్లవి pallavi | చలమేలర నాపై జలజ నేత్రుడ పిలిచిన పలుకవు | chalamElara nApai jalaja nEtruDa pilichina palukavu |
| కలకాలము నీ చెలిమి సేయనే తలచి పిలచి వచ్చి యుండగ | kalakAlamu nI chelimi sEyanE talachi pilachi vachchi yunDaga | |
| నీ సరసముల నీటులు నీ సొగసు నీ చతురత నీ హొయలు నీ గుణములు నీ సరిసమ రసికులు నే నరసి జూడ దొరకలేక మరులు మించి మొరలిడ | nI sarasamula nITulu nI sogasu nI chaturata nI hoyalu nI guNamulu nI sarisama rasikulu nE narasi jUDa dorakalEka marulu minchi moraliDa | |
| సారసరిపుని కోరు చకోరక దీనుల నమ్మరు సారెకు నీ మరుగున చేరదలచి చెలులతో మన సార విచారమెల్ల చెలియార దెలిపియు బ్రోవక | sArasaripuni kOru chakOraka dInula nammaru sAreku nI maruguna chEradalachi chelulatO mana sAra vichAramella cheliyAra delipiyu brOvaka | |
| తాళని మారుబారుని బాలిక చెలిమితో పూమాలికలు వేయు వేల నేడు సమయమిదే యని తాళవన లోలయని పలుతరగున పిలిచితె | tALani mArubAruni bAlika chelimitO pUmAlikalu vEyu vEla nEDu samayamidE yani tALavana lOlayani palutaraguna pilichite |
#395 ఎన్నాళ్ళు సైరింతునే ennALLu sairintunE
| Title | ఎన్నాళ్ళు సైరింతునే | ennALLu sairintunE |
| Written By | తచ్చూరు | tachchUru |
| Book | ||
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | ఎన్నాళ్ళు సైరింతునే ఓ చెలియనే సామిని తోడి తేవే | ennALLu sairintunE O cheliyanE sAmini tODi tEvE |
| క్రొన్నన విల్తుడు కోపముతోను తిన్నగ నాపై శరము లేసెనే సామి | kronnana viltuDu kOpamutOnu tinnaga nApai Saramu lEsenE sAmi | |
| కనుల పండువై కాచెడు వెన్నెల మనసు కెంతో గాసిని బుట్టించెనే సామి | kanula panDuvai kAcheDu vennela manasu kentO gAsini buTTinchenE sAmi | |
| కోకిలలెల్ల గుంపులు గూడి ఓ కమలాక్షి రవములు గావించెనే సామి | kOkilalella gumpulu gUDi O kamalAkshi ravamulu gAvinchenE sAmi | |
| సింగర సుతుడు చెంగట బాసి అంగన గూడి ఇందు రాకున్నాడె సామి | singara sutuDu chengaTa bAsi angana gUDi indu rAkunnADe sAmi | |
#394 ఏమే మాయలాడి EmE mAyalADi
వైరాగ్య జావళి vairAgya jAvaLi
| Title | ఏమే మాయలాడి | EmE mAyalADi |
| Written By | ?? | |
| Book | ||
| రాగం rAga | కాంభోజి | kAmbhOji |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏమే మాయలాడి చాలు నీ ప్రమాదమైన మోడి | EmE mAyalADi chAlu nI pramAdamaina mODi |
| సామి దాచుకున్న ధామము తెలిసినదే కామప్రలోభము జేసి కట్టేసినావేమి మాయలాడి | sAmi dAchukunna dhAmamu telisinadE kAmapralObhamu jEsi kaTTEsinAvEmi mAyalADi | |
| ధాతుడు లేనింటిలో సేవకుడే రేతిరి పడకెక్కినట్లు ఏ తరగున నీవు నమ్మించి వారి బంధించి గురి తప్పించి నొప్పించేవేమే | dhAtuDu lEninTilO sEvakuDE rEtiri paDakekkinaTlu E taraguna nIvu namminchi vAri bandhinchi guri tappinchi noppinchEvEmE | |
#393 శృంగార శేఖర SRngAra SEkhara
| Title | శృంగార శేఖర | SRngAra SEkhara |
| Written By | యోగ నరసింహ | yOga narasim^ha |
| Book | ||
| రాగం rAga | నీలాంబరి | nIlAmbari |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | శృంగార శేఖర బంగారు సామి సంగీత రాజ భంగపాటాయెరా | SRngAra SEkhara bangAru sAmi sangIta rAja bhangapATAyerA |
| అంగజ వర్థన అంగ సంగము పొంది పొంగుమా పదవి భంగమాయె గదరా | angaja varthana anga sangamu pondi pongumA padavi bhangamAye gadarA | |
| ముందటివలె గాదు యిప్పటి విరహము మరుబారి మితిమీరి మరి పొందు లేదాయె | mundaTivale gAdu yippaTi virahamu marubAri mitimIri mari pondu lEdAye | |
| ఏ పాపుల శాపమో మా పాప ఫలమో ఆపడీ వెతల మాపాలి దేవుడు | E pApula SApamO mA pApa phalamO ApaDI vetala mApAli dEvuDu | |
#392 పిలచితె నేను pilachite nEnu
| Title | పిలచితె నేను | pilachite nEnu |
| Written By | వెంకటరమణ | venkaTaramaNa |
| Book | ||
| రాగం rAga | పూర్వి కల్యాణి | pUrvi kalyANi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | పిలచితె నేను పలుక వమదేమిరా కాని దాని మాట విని కరుణ మరచేవేమిరా | pilachite nEnu paluka vamadEmirA kAni dAni mATa vini karuNa marachEvEmirA |
| మంచివాడవని నేను మరులైతిని గదరా చందకాడ లేరా కోర్కె దీర దాయ | manchivADavani nEnu marulaitini gadarA chandakADa lErA kOrke dIra dAya | |
| మనసు తెలియకను మగువ పొందు జేరితివి కనికర మింతైన లేక కలసినట్లు జేసితివి | manasu teliyakanu maguva pondu jEritivi kanikara mintaina lEka kalasinaTlu jEsitivi | |
| మారుని బారికి మనసు సైరించదాయె మరచేది న్యాయమా మంగళ పురి నివాసా | mAruni bAriki manasu sairinchadAye marachEdi nyAyamA mangaLa puri nivAsA | |
#391 విరహ మగ్గళమాయెరా viraha maggaLamAyerA
| Title | విరహ మగ్గళమాయెరా | viraha maggaLamAyerA |
| Written By | చంద్రశేఖర శాస్త్రి | chandraSEkhara SAstri |
| Book | ||
| రాగం rAga | కాంభోజి | kAmbhOji |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | విరహ మగ్గళ మాయెరా ఓరి నా సామి | viraha maggaLa mAyerA Ori nA sAmi |
| అనుపల్లవి anupallavi | స్మరుడురమున కేసిన విరిశరములు కరుణ లేక నన్ను కొరుకుచుండగ నా | smaruDuramuna kEsina viriSaramulu karuNa lEka nannu korukuchunDaga nA |
| చరణం charaNam 1 | పాల నీళ్ళంటిని నీడ వెలుగంటిని పూల నలుగించ తరమా ధర్మమా బాలచంద్ర ధరునిచే దగ్ధుడైన ఏలాగో వచ్చి నరులకింత బాధ లిచ్చితె | pAla nILLanTini nIDa veluganTini pUla nalugincha taramA dharmamA bAlachandra dharunichE dagdhuDaina ElAgO vachchi narulakinta bAdha lichchite |