#350 వద్దు వద్దుర vaddu vaddura

Titleవద్దు వద్దురvaddu vaddura
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaఫరజుfaraju
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviవద్దు వద్దుర యిక వదలరా సామి
ప్రొద్దు బోయెర నీ పుణ్యము పోపోర
vaddu vaddura yika vadalarA sAmi
proddu bOyera nI puNyamu pOpOra
చరణం
charaNam 1
కోపగించు మగని కోత కోర్వను సామి
రేపు వచ్చెద చాలసేపాయె పోపోర
kOpaginchu magani kOta kOrvanu sAmi
rEpu vachcheda chAlasEpAye pOpOra
చరణం
charaNam 2
కంటిగించకు నేగానా నీదానా సామీ
యింటికి పోవలె యిప్పుడే పోపోర
kanTiginchaku nEgAnA nIdAnA sAmI
yimTiki pOvale yippuDE pOpOra
చరణం
charaNam 3
వినుము నా మనవి వేణుగోపాలా
ఘనదాసు శ్రీరామ కవిపాల పోపోర
vinumu nA manavi vENugOpAlA
ghanadAsu SrIrAma kavipAla pOpOra

#349 వగకాడ vagakADa

TitleవగకాడvagakADa
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaఖమాచి (1893)
ఖమాస్ (1991)
khamAchi (1893)
khamAs (1991)
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviవగకాడా తగదిక రారా
మగువలె నేచుట మంచిది నటరా
vagakADA tagadika rArA
maguvale nEchuTa manchidi naTarA
చరణం
charaNam 1
కృపలేదా సామి నామీద
ఉపరతి సుఖమున నోలలాడించెద ఓ
kRpalEdA sAmi nAmIda
uparati sukhamuna nOlalADimcheda O
చరణం
charaNam 2
వినవేరా వేణుగోపాల మనసున
నీకుగల మర్మము దెలుపర ఓ
vinavErA vENugOpAla manasuna
nIkugala marmamu delupara O
చరణం
charaNam 3
పసిబాలా తాళగజాలర
రసక దాసు శ్రీరామునేలుకోరా ఓ
pasibAlA tALagajAlara
rasaka dAsu SrIrAmunElukOrA O

#348 దయలేక dayalEka

TitleదయలేకdayalEka
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaహిందుస్థాని కాఫీ (1893)
కాఫి (1991)
hindusthAni kAfI (1893)
kAfi (1991)
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviదయలేక నీవు రాకయున్న తాళజాలరాdayalEka nIvu rAkayunna tALajAlarA
చరణం
charaNam 1
నిన్న రేయి కన్నులారా నిదుర లేదురా
వన్నెకాడ నిదురాక కాచి యుంటిరా
ninna rEyi kannulArA nidura lEdurA
vannekADa nidurAka kAchi yunTirA
చరణం
charaNam 2
ఉత్త మాట గాదు నిన్నె గుత్తగుంటిరా
చిత్తగించు నాదు మనవి చిన్నదానరా
utta mATa gAdu ninne guttagunTirA
chittaginchu nAdu manavi chinnadAnarA
చరణం
charaNam 3
శ్రీ సఖా నే జేసుకొన్న దోసమేమిరా
వాసి మీర దాసురామ దాసునేలరా
SrI sakhA nE jEsukonna dOsamEmirA
vAsi mIra dAsurAma dAsunElarA

#347 భామినిరొ రాగదె bhAminiro rAgade

Titleభామినిరొ రాగదెbhAminiro rAgade
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaహిందుస్థాని కాఫీ (1893)
కాఫి (1991)
hindusthAni kAfI (1893)
kAfi (1991)
తాళం tALaచాపు (1893)
ఆది (1991)
chApu (1893)
Adi (1991)
పల్లవి pallaviభామినిరొ రాగదె సామినీ తేవే
కాముని బారికి తాళుదునే
తాళుదునె నేనెటు తాళుదునే ఆ కామునీ బారికి తాళుదునే
bhAminiro rAgade sAminI tEvE
kAmuni bAriki tALudunE
tALudune nEneTu tALudunE A kAmunI bAriki tALudunE
చరణం
charaNam 1
మొన్నా నిన్నా కూడిన చెలిపై
మోహము నిండారగను
నన్ను మరచెద గదవే మదవతీ
వెన్నెల కాకకు తాళుదునే
తాళుదునె నేనెటు తాళుదునె ఆ
వెన్నెల కాకకు తాళుదునె
monnA ninnA kUDina chelipai
mOhamu ninDAraganu
nannu maracheda gadavE madavatI
vennela kAkaku tALudunE
tALudune nEneTu tALudune A
vennela kAkaku tALudune
చరణం
charaNam 2
చెల్లంబో నా సాటి చెలులలో
చిన్నతనం బాయెనుగా
మొల్ల విరుల మీది మెల్లని యీ
చల్లగాలికి తాళుదునే
తాళుదునె నేనెటు తాళుదునే యీ చల్లగాలికి తాళుదునే
chellambO nA sATi chelulalO
chinnatanam bAyenugA
molla virula mIdi mellani yI
challagAliki tALudunE
tALudune nEneTu tALudunE yI challagAliki tALudunE
చరణం
charaNam 3
ప్రేమమీర దాసు కులజుడౌ
రామకవిం బ్రోచుచును
సామజవర వరదుండలిగెనే
ఆమని ఢాకకు తాళుదునే
prEmamIra dAsu kulajuDau
rAmakavim brOchuchunu
sAmajavara varadumDaligenE
Amani DhAkaku tALudunE

#346 ఏమని తెల్పుదునే Emani telpudunE

Titleఏమని తెల్పుదునేEmani telpudunE
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaఫరజుfaraju
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviయేమని దెల్పుదునే కోమలి నా భాగ్య
మేమని తెల్పుదునే నా ముద్దుసామికి
నా మీది ప్రేమనే
yEmani delpudunE kOmali nA bhAgya
mEmani telpudunE nA muddusAmiki
nA mIdi prEmanE
చరణం
charaNam 1
చెక్కిలి ముద్దాడెనె చక్కని నా సామి చెక్కిలి ముద్దాడెనె
నిక్కముగ నిన్న రేయి పక్కనే పవ్వళించి
చక్కని కెమ్మోవి నొక్కెనే అక్కనే
chekkili muddADene chakkani nA sAmi chekkili muddADene
nikkamuga ninna rEyi pakkanE pavvaLimchi
chakkani kemmOvi nokkenE akkanE
చరణం
charaNam 2
బాళిచే నన్నేలనే కేళిలో నా సామి బాళిచే నన్నేలెనే
వేళగదే రారమ్మని విలువగల సొమ్ములిచ్చి
చాలగా లాలించి సోలెనే బాలెనే
bALichE nannElanE kELilO nA sAmi bALichE nannElenE
vELagadE rArammani viluvagala sommulichchi
chAlagA lAlimchi sOlenE bAlenE
చరణం
charaNam 3
నా సాటి లేరనెనే వేణుగోపాలుడు నా సాటి లేరనెనే
ఆసదీర్చి దాసు రామదాస చిత్త వాసుడాయె
పూసెనే గంధము చేసెనే బాసనే
nA sATi lEranenE vENugOpAluDu nA sATi lEranenE
AsadIrchi dAsu rAmadAsa chitta vAsuDAye
pUsenE gandhamu chEsenE bAsanE

#345 నా నొసటనే nA nosaTanE

Titleనా నొసటనేnA nosaTanE
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaఖమాచి (1893)
ఖమాస్ (1991)
khamAchi (1893)
khamAs (1991)
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviనా నొసటనే పొడిచెనా యేమిరా
నానావర వర్ణినులకు నావలె కామము లేదా
nA nosaTanE poDichenA yEmirA
nAnAvara varNinulaku nAvale kAmamu lEdA
చరణం
charaNam 1
పరశివు నౌదల గంగా భామలేదా
పరమేష్ఠి ముఖమున సరస్వతి నివసించగ లేదా
paraSivu naudala gangA bhAmalEdA
paramEshThi mukhamuna sarasvati nivasimchaga lEdA
చరణం
charaNam 2
దామోదరు రొమ్మున లేదా యిందిర
కామాక్షీ హరునర్ధాంగమున బెనంగనలేదా
dAmOdaru rommuna lEdA yindira
kAmAkshI harunardhAngamuna benamganalEdA
చరణం
charaNam 3
నా వేణుగోపాల నన్నేలరా
శ్రీ విలసిత శ్రీదాసు శ్రీరామకవి వరదా
nA vENugOpAla nannElarA
SrI vilasita SrIdAsu SrIrAmakavi varadA

#344 పాటబాడెద pATabADeda

TitleపాటబాడెదpATabADeda
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaఆది (1893)
రూపక (1991)
Adi (1893)
rUpaka (1991)
పల్లవి pallaviపాటబాడెద రార సామి
పరమానందమురా నాసామి
బ్రహ్మానందమురా
pATabADeda rAra sAmi
paramAnandamurA nA sAmi
brahmAnandamurA
చరణం
charaNam 1
మదనజనక నీ దయ
మదినిగోరి యున్నదాన
ముదము మీర ముచ్చటాడి
ముద్దుబెట్టరా నా సామి
ముద్దుబెట్టరా నా సామి
madanajanaka nI daya
madinigOri yunnadAna
mudamu mIra muchchaTADi
muddubeTTarA nA sAmi
muddubeTTarA nA sAmi
చరణం
charaNam 2
వలపు నిలుపలేనురా
వగలుమాని యేలుకోరా
కళలు దేర నొక్కసారి
కౌగలించరా నా సామి
కౌగలించరా నా సామి
valapu nilupalEnurA
vagalumAni yElukOrA
kaLalu dEra nokkasAri
kaugalimcharA nA sAmi
kaugalimcharA nA sAmi
చరణం
charaNam 3
వనజ నయన నిశ్చలా
వరద వేణుగోపబాలా
ఘనుడ దాసు రామపాలా
కాంక్ష దీర్చరా నా సామి
కాంక్ష దీర్చరా నా సామి
vanaja nayana niSchalA
varada vENugOpabAlA
ghanuDa dAsu rAmapAlA
kAmksha dIrcharA nA sAmi
kAmksha dIrcharA nA sAmi

#343 ఏమనెనే కోమలీ EmanenE kOmalI

Titleఏమనెనే కోమలీEmanenE kOmalI
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaఫరుజుfaruju
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviయేమనేనే కోమలి తెలుపవే నీతో
యేమనెనే కోమలి
yEmanEnE kOmali telupavE nItO
yEmanenE kOmali
చరణం
charaNam 1
అంగజుబారికి నిలువదరమటే
మంగళవార్తలు మరియేమే నీతో
angajubAriki niluvadaramaTE
mangaLavArtalu mariyEmE nItO
చరణం
charaNam 2
మోహపయోధిలో మునిగితి నికనే
యూహలు సేయుదు నొకసారి నీతో
mOhapayOdhilO munigiti nikanE
yUhalu sEyudu nokasAri nItO
చరణం
charaNam 3
దాసు శ్రీరామ కవిగీతసుధా
ధారుడైన హరి దయచేసి నీతో
dAsu SrIrAma kavigItasudhA
dhAruDaina hari dayachEsi nItO

#342 ఆ నలినముఖి A nalinamukhi

Titleఆ నలినముఖిA nalinamukhi
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaజంఝూటిjamjhUTi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఆ నలినముఖీ అందమదేమీ
దానికే నీకును తగు తగు సామీ
A nalinamukhI andamadEmI
dAnikE nIkunu tagu tagu sAmI
చరణం
charaNam 1
మందుల మారుల మాట పసగడి
బందములాయె భళీభళీ సామీ
mandula mArula mATa pasagaDi
bandamulAye bhaLIbhaLI sAmI
చరణం
charaNam 2
తంతరగత్తెల తక్కులు మిగుల
సంతసమాయె సరీసరీ సామీ
tantaragattela takkulu migula
santasamAye sarIsarI sAmI
చరణం
charaNam 3
దాసు కులాంచిత రామకవి సదా ధ్యానము జేసె హరీహరీ సామీdAsu kulAmchita rAmakavi sadA dhyAnamu jEse harIharI sAmI

#341 తగుతగులేర tagutagulEra

TitleతగుతగులేరtagutagulEra
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaహిందుస్థానీ కాఫీhindusthAnI kAfI
తాళం tALaరూపక (1893)
రూపక / త్ర్యస్యగతి (1991)
rUpaka (1893)
rUpaka/ tryasyagati (1991)
పల్లవి pallaviతగుతగులేర చిన్నదాన తాళజాలరా నాతో పసంతమేలరా యింతైన నిల్వలేనురాtagutagulEra chinnadAna tALajAlarA nAtO pasantamElarA yimtaina nilvalEnurA
చరణం
charaNam 1
నను గరుణింపవేర న్యాయమరసి చూడరా నా
మీద కోపమేలరా నీకేల రవ్వమానరా
nanu garuNimpavEra nyAyamarasi chUDarA nA
mIda kOpamElarA nIkEla ravvamAnarA
చరణం
charaNam 2
కోమలమగు నాదు వయసు కొనవెన్నెలాయెరా నా
గుట్టు బయలు బట్టేరా నా కోరికె లీడేర్చరా
kOmalamagu nAdu vayasu konavennelAyerA nA
guTTu bayalu baTTErA nA kOrike lIDErcharA
చరణం
charaNam 3
వేసకాడ ముద్దుసామి వేణుగోపబాలకా శ్రీ
దాసురామపాలకా నా పాలిపంచ సాయకా
vEsakADa muddusAmi vENugOpabAlakA SrI
dAsurAmapAlakA nA pAlipamcha sAyakA