#340 చల్లకు వచ్చి challaku vachchi

ఇది పాత పుస్తకంలో జావళి గానూ, కొత్త పుస్తకంలో పదం గానూ చెప్పబడినది. This was mentioned as a jAvaLi in the old book, and as a Padam in the new book.

Titleచల్లకు వచ్చిchallaku vachchi
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaబేగడాbEgaDA
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviచల్లకు వచ్చి ముంత దాచ నేలనే ఓ మధురవాణీchallaku vachchi munta dAcha nElanE O madhuravANI
అనుపల్లవి anupallaviముల్లెకు మోసము లేదు ముద్దుబెట్టి పొమ్మనేmulleku mOsamu lEdu muddubeTTi pommanE
చరణం
charaNam 1
వల్లభ నీ వంటి వాని వలచి వచ్చిన వనితనే
చెల్లదురా తగదు తగదని చెయ్యి బట్టి రమ్మనె
vallabha nI vanTi vAni valachi vachchina vanitanE
chelladurA tagadu tagadani cheyyi baTTi rammane
చరణం
charaNam 2
వానికెదురెదురె చూచుచు వాకిట నే నిలచితినే
చాన యేమొకాని యన్నపానమునే మానితినే
vAnikeduredure chUchuchu vAkiTa nE nilachitinE
chAna yEmokAni yannapAnamunE mAnitinE
చరణం
charaNam 3
వెసట జెందితి గదవె వేణుగోపాలుని దేవె
దాసు రామకవి హృదయ నివాసుని దయ చేయమనే
vesaTa jenditi gadave vENugOpAluni dEve
dAsu rAmakavi hRdaya nivAsuni daya chEyamanE

#339 ముంజేతి కంకణ mumjEti kamkaNa

ఇది పాత పుస్తకంలో జావళి గానూ, కొత్త పుస్తకంలో పదం గానూ చెప్పబడినది. This was mentioned as a jAvaLi in the old book, and as a Padam in the new book.

Titleముంజేతి కంకణmunjEti kamkaNa
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaసావేరిsAvEri
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviముంజేతి కంకణమ్మున కద్దమేలనే
రంజిల్లు వాని గుణము రమణి మనమెరుగమే
munjEti kamkaNammuna kaddamElanE
ramjillu vAni guNamu ramaNi manamerugamE
చరణం
charaNam 1
కమ్మదనము మాటలనె కడుపులో నొక విధమె
కొమ్మవాని వలపు నిక్కము గాదే నమ్మరాదె
kammadanamu mATalane kaDupulO noka vidhame
kommavAni valapu nikkamu gAdE nammarAde
చరణం
charaNam 2
మాటలను తేటలను మనవద్దనే చెలియ
మాపటిపకలా మగువతోడ తగవదేడ
mATalanu tETalanu manavaddanE cheliya
mApaTipakalA maguvatODa tagavadEDa
చరణం
charaNam 3
భాసురాంగి నిన్ను మాయ జేసె నేనేమి సేతు
దాసురామ కవి మనో నివాసుడాయే మోసమాయె
bhAsurAmgi ninnu mAya jEse nEnEmi sEtu
dAsurAma kavi manO nivAsuDAyE mOsamAye

#338 నిలునిలు nilunilu

Titleనిలునిలుnilunilu
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaఖమాసుkhamAsu
తాళం tALaచాపు (1893)
ఆది (1991)
chApu (1893)
Adi (1991)
పల్లవి pallaviనిలునిలు మటుండుమీ నాసామీ
నీవు నా దరి రాకుమీ నాసామీ
nilunilu maTunDumI nAsAmI
nIvu nA dari rAkumI nAsAmI
చరణం
charaNam 1
ఆ మాయలాడి యేమి బోధించెర
సామి నాకు దెల్పర సంశయమేలర
A mAyalADi yEmi bOdhinchera
sAmi nAku delpara samSayamElara
చరణం
charaNam 2
సన్నుతాంగిని గూడి నా సాటి వారిలో
నన్ను రద్ది జేయుట న్యాయము గాదుర
sannutAmgini gUDi nA sATi vArilO
nannu raddi jEyuTa nyAyamu gAdura
చరణం
charaNam 3
వెసగాడవుగద వేణుగోపాల సామి
దాసు శ్రీరామకవి ధన్యుని జేయర
vesagADavugada vENugOpAla sAmi
dAsu SrIrAmakavi dhanyuni jEyara

#337 రమణిరో ramaNirO

TitleరమణిరోramaNirO
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaకానడాkAnaDA
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviరమణిరో సముఖాన రాయబార మేటికే
నిమిషమైన తాళలేనె నేనే వాని రమ్మందునె
ramaNirO samukhAna rAyabAra mETikE
nimishamaina tALalEne nEnE vAni rammandune
చరణం
charaNam 1
కడువేడుక వాని మేన గంధమును బూసి యాకు
మడుపిచ్చి తడవేటికి మాపటికి రమ్మందునె
kaDuvEDuka vAni mEna gandhamunu bUsi yAku
maDupichchi taDavETiki mApaTiki rammandune
చరణం
charaNam 2
కోరివాని జేరి పంనీరు పైజల్లి నను
వేరుసేయ మేరగాదు వేవేగ రమ్మందునె
kOrivAni jEri pam^nIru paijalli nanu
vErusEya mEragAdu vEvEga rammandune
చరణం
charaNam 3
భాసురాంగ వేణుగోపాల యింత పంతమేల
దాసురామకవి సంనుతి జేసె నికరమ్మందునే
bhAsurAnga vENugOpAla yinta pantamEla
dAsurAmakavi sam^nuti jEse nikarammandunE

#336 మాటాడి పొమ్మనవె mATADi pommanave

Titleమాటాడి పొమ్మనవెmATADi pommanave
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
రాగం rAgaహిందుస్థానీ కాఫీhindusthAnI kAfI
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviమాటాడి పొమ్మనవె మంజులవాణి వానినొకmATADi pommanave manjulavANi vAninoka
అనుపల్లవి anupallaviనీటి మూట తోటి సాటి బూటకము లేటికి మంచిnITi mUTa tOTi sATi bUTakamu lETiki manchi
చరణం
charaNam 1
రద్ది యేల వద్దనుచు కొద్దిగాను బుధ్ధి చెప్పి ముద్దియ
మోమున మోముడి ముద్దులు గుల్కు యొద్ద జేరియొక
raddi yEla vaddanuchu koddigAnu budhdhi cheppi muddiya
mOmuna mOmuDi muddulu gulku yodda jEriyoka
చరణం
charaNam 2
చిన్నవాడే నన్ను గూడె వన్నెకాడే వాడనుచు
కన్నె మిన్న నిన్నే కోరి యున్నదిర యిక వన్నె మీర నొక
chinnavADE nannu gUDe vannekADE vADanuchu
kanne minna ninnE kOri yunnadira yika vanne mIra noka
చరణం
charaNam 3
భాసురాంగ గోపాలుని బాసలచే మోసపోతి
దోసమేమి చేసితినో దాసురామ కవితా సుధా సురుచి
bhAsurAm^ga gOpAluni bAsalachE mOsapOti
dOsamEmi chEsitinO dAsurAma kavitA sudhA suruchi

#335 సరిసరిలే sarisarilE

రెండు పుస్తకాలలో రాగం, తాళం తేడాలు గమనించగలరు. Notice the change in rAga and tALa between the two books.

TitleసరిసరిలేsarisarilE
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaహిందుస్థానీ కాఫీ (1893)
కాఫి (1893)
hindusthAnI kAfI (1893)
kAfi (1991)
తాళం tALaఅట (1893)
ఆది (1991)
aTa (1893)
Adi (1991)
పల్లవి pallaviసరిసరిలే మంచిది
సరిసరిలే మంచిది
మరు శరములకు బెదరి దరి జేరిన
అరమరిక లేమిరా అరమరిక లేమిరా
sarisarilE manchidi
sarisarilE manchidi
maru Saramulaku bedari dari jErina
aramarika lEmirA aramarika lEmirA
చరణం
charaNam 1
పలుమరు నే నిను బతిమాలితినని
పాటింపురా వేణుగోపాలా
కలకాలంబును ఘనమా నీకిది
palumaru nE ninu batimAlitinani
pATimpurA vENugOpAlA
kalakAlambunu ghanamA nIkidi
చరణం
charaNam 2
మ్రొక్కగ వచ్చిన మోడిసేతురా
మోహనరూపా వేణుగోపాలా
దక్కితి దాసు శ్రీరామపాలకా
mrokkaga vachchina mODisEturA
mOhanarUpA vENugOpAlA
dakkiti dAsu SrIrAmapAlakA

#334 నేను నీదానా nEnu nIdAnA

ఇది తొలి పుస్తకములో జావళిగానూ, తదుపరి పుస్తకములో పదముగానూ చెప్పబడినది. This was mentioned as a jAvaLi in the first publication, but as a padamu in the second.

Titleనేను నీదానాnEnu nIdAnA
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaశంకరాభరణంSankarAbharaNam
తాళం tALaఏకEka
పల్లవి pallaviనేను నీదానా నా మేను నీదేనురా
నీనా సందున వేరేవాడు గానరా
nEnu nIdAnA nA mEnu nIdEnurA
nInA sanduna vErEvADu gAnarA
చరణం
charaNam 1
ఎన్నడు నీ మాట కెదురాడులేదుర
మన్నించి తిన్నగ మాటాడవేమిర
ennaDu nI mATa kedurADulEdura
manninchi tinnaga mATADavEmira
చరణం
charaNam 2
ఓరీ నా సామి నే కోరితిరా నిన్నే
తీరైన గుబ్బల గోరులుంచరార
OrI nA sAmi nE kOritirA ninnE
tIraina gubbala gOruluncharAra
చరణం
charaNam 3
భాసుర వేణుగోపాల దయావాల
దాసు శ్రీరాముని దయ నేలవదేల
bhAsura vENugOpAla dayAvAla
dAsu SrIrAmuni daya nElavadEla

#333 తెలియదే teliyadE

TitleతెలియదేteliyadE
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaహిందుస్థానీ కాఫీ (1893)
కాఫి (1991)
hindusthAnI kAfI (1893)
kAfI (1991)
తాళం tALaఅట (1893)
ఆది (1991)
aTa (1893)
Adi (1991)
పల్లవి pallaviతెలియ దెలియదె తెలియదె మాయ
వలపులొ సొలపులొ వాని గుణమేమొ కాని
teliya deliyade teliyade mAya
valapulo solapulo vAni guNamEmo kAni
చరణం
charaNam 1
వలపించుటే కాని వలచుట లేడే దాని
కలనైన మరువడే కానీ పని చేసినాడే
valapinchuTE kAni valachuTa lEDE dAni
kalanaina maruvaDE kAnI pani chEsinADE
చరణం
charaNam 2
చెలియరో నేనేమందు బలమగు దానిమందు
తలకెక్కెనేమో నందువలన రాడే యిందు
cheliyarO nEnEmandu balamagu dAnimandu
talakekkenEmO nanduvalana rADE yindu
చరణం
charaNam 3
వేమరు ననుగూడి వాడు నింత మాటలాడినాడు
భామా దాసు శ్రీరామ పాలుడె గోపాలుడె
vEmaru nanugUDi vADu ninta mATalADinADu
bhAmA dAsu SrIrAma pAluDe gOpAluDe

#332 నే గాననా సామీ nE gAnanA sAmI

Both books note this as a jAvaLi, but rAga is different

Titleనే గాననా సామీnE gAnanA sAmI
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaహిందుస్థానీ కాఫీ (1893)
కాఫి (1991)
hindusthAnI kAfI (1893)
kAfi (1991)
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviనే గాననా సామీ నే గాన
శ్రీ గల వాడవు నీవని చిన్నతనము సుందరుండవని
కౌగిట నెనబది నాలుగు విధముల గరడీలు గరపినది
nE gananA sAmI nE gAna
SrI gala vADavu nIvani chinnatanamu sundarunDavani
kaugiTa nenabadi nAlugu vidhamula garaDIlu garapinadi
చరణం
charaNam 1
వేడుక కాడవు నీవని వీధిలొ నినుగని పోకుమని
కోడెకాడ రారారా రమ్మని కోడిగము లాడినది
vEDuka kADavu nIvani vIdhilo ninugani pOkumani
kODekADa rArArA rammani kODigamu lADinadi
చరణం
charaNam 2
చక్కనివాడవు నీవని చనువుగలదు వెరపేమియని
చెక్కిలిగింతలు గొలుపుచు మోవి చురుక్కు నను నొక్కినది
chakkanivADavu nIvani chanuvugaladu verapEmiyani
chekkiligintalu golupuchu mOvi churukku nanu nokkinadi
చరణం
charaNam 3
వాసిగ వల్లూరి వాసుడని భాసుర వేణుగోపాలుడని
దాసు రామకవిపాలుడని దరహాసమును జేసినది
vAsiga vallUri vAsuDani bhAsura vENugOpAluDani
dAsu rAmakavipAluDani darahAsamunu jEsinadi

#331 ఇద్దరి పొందేలరా iddari pondElarA

Titleఇద్దరి పొందేలరాiddari pondElarA
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaజంఝూటిjanjhUTi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఇద్దరి పొందేలరా సామి దానింటికే పోపోపోరా
సద్దేల జేసెదవు సామి నే నోర్వ నా
వద్దికి నీవు రావద్దుర వద్దుర
iddari pondElarA sAmi dAninTikE pOpOpOrA
saddEla jEsedavu sAmi nE nOrva nA
vaddiki nIvu rAvaddura vaddura
చరణం
charaNam 1
నా జోలి నీకేలరా ఆ బ్రహ్మ నిన్నిట్లు పుట్టించెరా
యే జాము దానింట నీ జాడ నే జూడ
చేజారుగా జాల నే జెల్ల నే జెల్ల
nA jOli nIkElarA A brahma ninniTlu puTTincherA
yE jAmu dAninTa nI jADa nE jUDa
chEjArugA jAla nE jella nE jella
చరణం
charaNam 2
కన్నుల యెరుపేమిరా చెక్కుల కాటుక నలుపేమిరా
కన్నుల విలుకాని కయ్యాల మెలగిన
చిన్నెలతో చేరా చెప్పరా చెప్పరా
kannula yerupEmirA chekkula kATuka nalupEmirA
kannula vilukAni kayyAla melagina
chinnelatO chErA chepparA chepparA
చరణం
charaNam 3
శ్రీ పావల్లూరి పుర శ్రీ వేణుగోపాల బాగాయెరా
రాపేల దాసు శ్రీరామకవిపాల
యీ పటనీ పనులింతాయె వింతాయె
SrI pAvallUri pura SrI vENugOpAla bAgAyerA
rApEla dAsu SrIrAmakavipAla
yI paTanI panulimtAye vintAye