#198 కోపము జేసేవేలర kOpamu jEsEvElara

Titleకోపము జేసేవేలర (ప్రతి)kOpamu jEsEvElara (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
కోపము జేసేవేలర సామిగా యింతkOpamu jEsEvElara sAmigA yimta
ప్రాపుగోరి నే యుంటిరprApugOri nE yumTira
చరణం
charaNam 1
చిన్ననాటనుండి నిన్ను
నమ్మి యున్న కన్నెను గానటర
chinnanATanumDi ninnu
nammi yunna kannenu gAnaTara
చరణం
charaNam 2
వన్నెకాడ వలచియున్న
చిన్నదియని కన్నడ శాయకుర
vannekADa valachiyunna
chinnadiyani kannaDa SAyakura
చరణం
charaNam 3
యెన్నడు నిన్ను బాసియున్న
దానగాను సన్నుతి గైకొనరా
yennaDu ninnu bAsiyunna
dAnagAnu sannuti gaikonarA
చరణం
charaNam 4
ధరణిశ్రీ సూర్యరాయ దానరాధేయ
సరసుడనయ విధేయా
dharaNiSrI sUryarAya dAnarAdhEya
sarasuDanaya vidhEyA

#197 మాట్లాడవెందుకురా mATlADavendukurA

Titleమాట్లాడవెందుకురాmATlADavendukurA
Written By
BookprAchIna-navIna
రాగం rAgaకమాసు kamAsu
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
మాట్లాడవెందుకురా సామిగ నాతోmATlADavendukurA sAmiga nAtO
అరమర యిక యేలర సామిaramara yika yElara sAmi
చరణం
charaNam 1
చిరుత ప్రాయమునాడు చేసిన చెలిమిని
మరచుట తగునటరా సామి
chiruta prAyamunADu chEsina chelimini
marachuTa tagunaTarA sAmi
చరణం
charaNam 2
సొగసుగ నిను జూచి సోలి వచ్చినదాని
అగడేల జేసేవుర సామి
sogasuga ninu jUchi sOli vachchinadAni
agaDEla jEsEvura sAmi
చరణం
charaNam 3
వరభీమేశుని వలచిన దానర
సరసతో నన్నేలరా సామి
varabhImESuni valachina dAnara
sarasatO nannElarA sAmi

#196 జాలమిదేర jAlamidEra

Titleజాలమిదేర (ప్రతి)jAlamidEra (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
జాలమిదేర సరసకు రార
బాలామణి నిను బ్రార్థించెనుర
jAlamidEra sarasaku rAra
bAlAmaNi ninu brArthinchenura
చరణం
charaNam 1
యెమ్మెకాడ నిను రమ్మని ముద్దుల
గుమ్మ రమ్మ నీకిమ్మని బంపెను
yemmekADa ninu rammani muddula
gumma ramma nIkimmani bampenu
చరణం
charaNam 2
కమ్మవిల్తుడు శరమ్ము వేయు
మది నమ్మి నిన్ను పొమ్మనరమ్మనే
kammaviltuDu Sarammu vEyu
madi nammi ninnu pommanarammanE
చరణం
charaNam 3
యింతి రావిరుల బంతి రామరుని
దంతి రాడగు పొలంతిరా వినర
yimti rAvirula banti rAmaruni
damti rADagu polamtirA vinara
చరణం
charaNam 4
రావుకులజ మహరాజ కుమార
పావన సూర్యనృపాలక యేరా
rAvukulaja maharAja kumAra
pAvana sUryanRpAlaka yErA

#195 మోహన రశియా mOhana raSiyA

Titleమోహన రశియాmOhana raSiyA
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
మోహన రశియా హై బగియా మే
పూల రహిసరి కాలకల రెజా
mOhana raSiyA hai bagiyA mE
pUla rahisari kAlakala rejA
చరణం
charaNam 1
యేక కలియహర నామజపతు హై
కాయపు కారె అల అల రెజా
yEka kaliyahara nAmajapatu hai
kAyapu kAre ala ala rejA
చరణం
charaNam 2
రాజదళీశా సోథరంగేశా
పూలరహి నెరి కాలకల రెజా
rAjadaLISA sOtharamgESA
pUlarahi neri kAlakala rejA

Here’s our first attempt to improve the lyrics

మోహన్ రసియా హై బగియా మే
ఫూల్ రహీ సారి కల్ కల్ రేజా
mOhan rasiyA hai bagiyA mE
phUl rahI sAri kal kal rEjA
ఏక్ కలియా హర్ నాం జపత్ హై
కాయ్ (కాహె) పుకారే అల్ అల్ రేజా
Ek kaliyA har nAm japat hai
kAy (kAhe) pukArE al al rEjA
రాజ్ దలీశా శత్ రంగేశా
ఫూల్ రహీనే రీ కల్ కల్ రేజా
rAj dalISA Sat ramgESA
phUl rahInE rI kal kal rEjA

#194 మాటలేల mATalEla

Titleమాటలేల (ప్రతి)mATalEla (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaసురటsuraTa
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
మాటలేల చాలుచాలుర నా సామిmATalEla chAluchAlura nA sAmi
బోటి తోడను పొందుగాను భోగించినావేమిరbOTi tODanu pomdugAnu bhOgimchinAvEmira
చరణం
charaNam 1
మాటికి కుంకుమ మైజారెనురా
కాటుక రెప్పల కంటినదేరా
యేటికి భ్రమ మదియేరా జాడ దెల్పర
mATiki kumkuma maijArenurA
kATuka reppala kamTinadErA
yETiki bhrama madiyErA jAda delpara
చరణం
charaNam 2
చిందిన గంధపు పూతలవేరా
చెక్కిట చెమటలు బుట్టునదేరా
సుందర నీ యధరమందు పలునొక్కులుర
chimdina gamdhapu pUtalavErA
chekkiTa chemaTalu buTTunadErA
sumdara nI yadharamamdu palunokkulura
చరణం
charaNam 3
కన్నుల నిద్దుర మబ్బులవేరా
కరుణాకర సూర్యప్రభువౌర
చిన్నెలు జూచి సంతసించితినేర పోపోరా
kannula niddura mabbulavErA
karuNAkara sUryaprabhuvaura
chinnelu jUchi samtasimchitinEra pOpOrA

#193 మాయలాడి mAyalADi

TitleమాయలాడిmAyalADi
Written By
BookprAchIna-navIna
రాగం rAgaసురటsuraTa
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
మాయలాడి బోధనచే మయిమరచితి వేమొ
మాటలాడ రావదేమిరా నా సామి
mAyalADi bOdhanachE mayimarachiti vEmo
mATalADa rAvadEmirA nA sAmi
చరణం
charaNam 1
కాయజు బారికి తాళగలేరా
కౌగిట జేర్చి నన్ను గారవించరా
న్యాయమటరా నీకిది తగదుర సరగున
kAyaju bAriki tALagalErA
kaugiTa jErchi nannu gAravimcharA
nyAyamaTarA nIkidi tagadura saraguna
చరణం
charaNam 2
కలకాలము నన్ను గాసిబెట్టకురా
కాంతల నేచుట కార్యము గాదుర
చెలువుడవని నిను నెరనమ్మినందుకిక
kalakAlamu nannu gAsibeTTakurA
kAmtala nEchuTa kAryamu gAdura
cheluvuDavani ninu neranamminandukika
చరణం
charaNam 3
సరివారిలో నన్ను చౌక సేయకురా
చాల నమ్మితి రతికేళి గూడర
వరదుడ మువ్వపురి నిలయుడ చనువున
sarivArilO nannu chouka sEyakurA
chAla nammiti ratikELi gUDara
varaduDa muvvapuri nilayuDa chanuvuna

#192 కాంతుడేమొ kAmtuDEmo

Titleకాంతుడేమొ (ప్రతి)kAmtuDEmo (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
కాంతుడేమొ రాకపోయె
కాంత నేనెటు సైతునే
kAmtuDEmo rAkapOye
kAmta nEneTu saitunE
పంతమేల మర్త్యలోక భూపాల వరుని రమ్మనేpamtamEla martyalOka bhUpAla varuni rammanE
చరణం
charaNam 1
మరుడు క్రూరుడై
సారెకు విరిశరముల నేసెనే
సురుచిర మధుకరములగమి
జుమ్మని రొదజేసెనే
maruDu krUruDai
sAreku viriSaramula nEsenE
suruchira madhukaramulagami
jummani rodajEsenE
చరణం
charaNam 2
శుకపికములు కలకలమని సుదతి మిగుల గూశెనే
మకరాంకుని మామయు సెగ మైసోకగ గాశెనే
Sukapikamulu kalakalamani sudati migula gUSenE
makarAmkuni mAmayu sega maisOkaga gASenE
చరణం
charaNam 3
ధరణి పీఠపుర నిలయుని తరుణి
సూర్యనృపవరుని మరుని
దురమొనరసేయుట
కరమరేల దోడితేవే
dharaNi pIThapura nilayuni taruNi
sUryanRpavaruni maruni
duramonarasEyuTa
karamarEla dODitEvE

#191 అంతలోనె amtalOne

TitleఅంతలోనెamtalOne
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
అంతలోనె తెల్లవారె
అయ్యో నేనేమి సేతునే
amtalOne tellavAre
ayyO nEnEmi sEtunE
కాంతుని మనసెంత నొచ్చెనో
ఇంతి యెట్లు సైతునే
kAmtuni manasemta nochchenO
imti yeTlu saitunE
చరణం
charaNam 1
కొమ్మ గుబ్బ వెదను గదియ నదుముకొనుచు
చాలా పెదవి తేనె వాన నా మదిని తోచు వేళ
komma gubba vedanu gadiya nadumukonuchu
chAlA pedavi tEne vAna nA madini tOchu vELa
చరణం
charaNam 2
పంతమున తటాన లేచి పైట కొంగు జారగా
కాంత దొంతర విడమొసంగి కౌగిలింపుచుండగా
pamtamuna taTAna lEchi paiTa kongu jAragA
kAmta domtara viDamosamgi kaugilimpuchunDagA
సోమభూపాల రమ్మని
భామ ప్రేమమీరగా
కాముకేళి లోన మిగుల
కలసి మెలసి యుండగా
sOmabhUpAla rammani
bhAma prEmamIragA
kAmukELi lOna migula
kalasi melasi yumDagA
This appeared in a Telugu movie “muddu biDDa” (1956) and can be seen here

#190 చాలు చాలిక chAlu chAlika

Titleచాలు చాలిక (ప్రతి)chAlu chAlika (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaఫరజుfaraju
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
చాలు చాలిక పోరా నా సామి నీ జాడలు
జక్కగ గానవచ్చెరా
chAlu chAlika pOrA nA sAmi nI jADalu
jakkaga gAnavachcherA
చరణం
charaNam 1
కేళిజేసేదందు కేరడమిందు
బాళి చూపేదందు బాసలిందు చాలులేరా సరసుడౌర
యిది మేలవుర యెంతో వింతలాయర
kELijEsEdamdu kEraDamimdu
bALi chUpEdamdu bAsalimdu chAlulErA sarasuDaura
yidi mElavura yemtO vimtalAyara
చరణం
charaNam 2
దయనేలెదందు తామసమిందు
బయలు నాటలందు భయమిందు
దయలేదా నా తోడ వాదా
చలమిడరాదా ఓ నయగుణ విశారదా
dayanEledamdu tAmasamimdu
bayalu nATalamdu bhayamimdu
dayalEdA nA tODa vAdA
chalamiDarAdA O nayaguNa viSAradA
చరణం
charaNam 3
ఘన పాటలందు కయ్యము నిందు
మనవి జేసే దందు మాదీవిందు
వినుము సూర్యభూపతివర్య
సురగిరి ధైర్య శ్రీ
ఘన సమౌదార్య చాలు చాలిక పోరా
ghana pATalamdu kayyamu nimdu
manavi jEsE damdu mAdIvimdu
vinumu sUryabhUpativarya
suragiri dhairya SrI
ghana samoudArya chAlu chAlika pOrA

#189 యిన్నాళ్ళవలె yinnALLavale

Titleయిన్నాళ్ళవలెyinnALLavale
Written By
BookprAchIna-navIna
రాగం rAgaఫరజుfaraju
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
యిన్నాళ్ళ వలెగాదె వాని గుణమెంతని నే
విన్నవింతునే ఓ చెలియ
yinnALLa valegAde vAni guNamentani nE
vinnavimtunE O cheliya
చరణం
charaNam 1
నన్నెడబాయడు అన్యుల జూడడు మన్నన వీడడు
మానిని మణిరో
వన్నెకాడే వాడెందున్నాడే వాడన్నిట నెరజాణుడే
nanneDabAyaDu anyula jUDaDu mannana vIDaDu
mAnini maNirO
vannekADE vADemdunnADE vADanniTa nerajANuDE
చరణం
charaNam 2
తామస మేలనె తాళగజాలనె
కోమలి నీ మది కోరిన సొమ్ములు
చేకొనవే వేగరావే
వేగ తోడి తేవే నా సామినిటు రమ్మనవే
tAmasa mElane tALagajAlane
kOmali nI madi kOrina sommulu
chEkonavE vEgarAvE
vEga tODi tEvE nA sAminiTu rammanavE
చరణం
charaNam 3
ఆందముగా రతి ముందుగ నేలిన
సుందర శ్యామల వేంకటరమణుడు
నెనరున కలిశిన నేదానగాన
ఓ మదగజగమనరో
AmdamugA rati mumduga nElina
sumdara SyAmala vEmkaTaramaNuDu
nenaruna kaliSina nEdAnagAna
O madagajagamanarO