#99 నాపై ప్రేమలేని nApai prEmalEni

Titleనాపై ప్రేమలేనిnApai prEmalEni
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్తాని కాపిhindustAni kApi
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
నాపై ప్రేమలేని జాడ
నాడే తెలిసెను పోపోపోరా
nApai prEmalEni jADa
nADE telisenu pOpOpOrA
పాపి సవతి మాయలలో జిక్కి
గోపాలుని కొనగోరంతైనా
pApi savati mAyalalO jikki
gOpAluni konagOramtainA
చరణం
charaNam 1
ఎందాక జూచిన నీ మగజాతి యింతుల నేలేదాక ప్రీతి
సందేహమా మాటప్రఖ్యాతి సరసుల లక్షణమా యీ నీతి
emdAka jUchina nI magajAti yimtula nElEdAka prIti
samdEhamA mATaprakhyAti sarasula lakshaNamA yI nIti
చరణం
charaNam 2
మోహమందు మోసమందు యేవేళ బుధ్ధులు నీ యందు
యేలకలిగెనొ యికనేమందు స్నేహము జేసినదే బలుపొందు
mOhamamdu mOsamamdu yEvELa budhdhulu nI yamdu
yElakaligeno yikanEmamdu snEhamu jEsinadE balupomdu
చరణం
charaNam 3
యెప్పటివలెనే యెదపైజేరి తప్పులనెంచకు తాలిమి మీరి
గొప్పగు సురపురి రాజగోపాలా కాముని కేళికి మనసాయెలేరా
yeppaTivalenE yedapaijEri tappulanemchaku tAlimi mIri
goppagu surapuri rAjagOpAlA kAmuni kELiki manasAyelErA

98 మంగళం mangaLam

Again, this is NOT a JavaLi! Looks like a book-end of an old publication – a mangaLam for sure!

శ్రీవైకుంఠ నికేతనరామ
శ్రీభూనీళా శోభితరామ
కలశపయోనధి నిద్రితరామ
కమలానహర ప్రార్థితరామ
వాణీనుత సంబోధితరామ
వల్మీకజముని వర్ణితరామ
దినమణికుల సందీపకరామ
దితిసుతదానవ దారకరామ
కోసలదేశా ధిష్టితరామ
కామభోగసంతోషితరామ
పితృవచన పరిపాలకరామ
భారద్వాజ సుమోదకరామ
దండకాటవీ వర్తనరామ
చండవిరాధ విదారకరామ
కలశజదత్తశరాసనరామ
సాధుత్రాణ పరాయణరామ
ఖరదూషణ విధ్వంసకరామ
కాంచనమృగ సంహారకరామ
గృధ్రరాజపరితోషితరామ
శబరీఫల సంతోషితరామ
కౌసల్యావర నందనరామ
దశరధహృదయా నందనరామ
తాటకాది విధ్వంసకరామ
గాధిసవాన దక్షకరామ
గౌతమసత్యుధ్ధారకరామ
ఖండితధూర్జటి కార్ముకరామ
జనకనందినీ మోదకరామ
జామదగ్న్యమద భేదకరామ
ఋషిగనఘోషణ తోషితరామ
చిత్రకూటగిరి వాసకరామ
గుహహృత్ సౌహృదరంజిరామ
భరతఘటినిజ పాదుకరామా
అనిలాత్మ జనంరాధితరామ
అర్కతనూజామోదితరామ
మాయామానుష విగ్రహరామ
వాలిప్రమధన నిగ్రహరామ
హర్షితహనుమద్విక్రమరామ
నిర్మూలితలంకాపురరామ
శోణాకభొరుహకరయుగరామ
క్షోణితనయా లాలసరామ
SrIvaikumTha nikEtanarAma
SrIbhUnILA SObhitarAma
kalaSapayOnadhi nidritarAma
kamalAnahara prArthitarAma
vANInuta sambOdhitarAma
valmIkajamuni varNitarAma
dinamaNikula samdIpakarAma
ditisutadAnava dArakarAma
kOsaladESA dhishTitarAma
kAmabhOgasamtOshitarAma
pitRvachana paripAlakarAma
bhAradwAja sumOdakarAma
damDakATavI vartanarAma
chamDavirAdha vidArakarAma
kalaSajadattaSarAsanarAma
sAdhutrANa parAyaNarAma
kharadUshaNa vidhvamsakarAma
kAmchanamRga saMhArakarAma
gRdhrarAjaparitOshitarAma
SabarIphala samtOshitarAma
kausalyAvara namdanarAma
daSaradhahRdayA namdanarAma
tATakAdi vidhvamsakarAma
gAdhisavAna dakshakarAma
gautamasatyudhdhArakarAma
khanDitadhUrjaTi kArmukarAma
janakanamdinI mOdakarAma
jAmadagnyamada bhEdakarAma
RshiganaghOshaNa tOshitarAma
chitrakUTagiri vAsakarAma
guhahRt sauhRdaramjirAma
bharataghaTinija pAdukarAmA
anilAtma janaMrAdhitarAma
arkatanUjAmOditarAma
mAyAmAnusha vigraharAma
vAlipramadhana nigraharAma
harshitahanumadwikramarAma
nirmUlitalamkApurarAma
SONAkabhoruhakarayugarAma
kshONitanayA lAlasarAma
జావళీలు సంపూర్ణము jAvaLIlu sampUrNamu

This is the last lyric from the book published in 1911.

#97 కోపము శాయాకురా kOpamu SAyAkurA

Titleకోపము శాయాకురాkOpamu SAyAkurA
Written By
Book#Book1911
రాగం rAgaరం. సురటిraM. suraTi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
కోపము శాయాకురా యేరా నా సామీkOpamu SAyAkurA yErA nA sAmI
రాపేల జేసెవు రేపు మాపటి కట్లానే రారాrApEla jEsevu rEpu mApaTi kaTlAnE rArA
చరణం
charaNam 1
ప్రేమతోడా నొకనిమిషమైనా నిల్తామునంటె
యేమిసేతు సామి లక్ష్మీనోమాయె నా మాట విని
prEmatODA nokanimishamainA niltAmunamTe
yEmisEtu sAmi lakshmInOmAye nA mATa vini
చరణం
charaNam 2
నిన్న రేయి మనామనుకున్న మాటాలన్న మది
నున్నవి మాయన్న తోడ నన్ను తప్పులెన్నకిక
ninna rEyi manAmanukunna mATAlanna madi
nunnavi mAyanna tODa nannu tappulennakika
చరణం
charaNam 3
హరిహరి జక్కమె నొరుల నేరుగాను
సరసీజా జయనా సలనుడౌ నరశింగరాయా
వొరునీ కరుణించిన సామి
harihari jakkame norula nErugAnu
sarasIjA jayanA salanuDou naraSimgarAyA
vorunI karuNimchina sAmi
చరణం
charaNam 4
భాసురామా చెర్లపురివాసా చెన్నకేశవాయ
శేషాద్రి వంశశ్రీ రంగదాసు నీ హృదయేశ నాపై
bhAsurAmA cherlapurivAsA chennakESavAya
SEshAdri vamSaSrI ramgadAsu nI hRdayESa nApai

#96 సొగసుకాడని sogasukADani

TitleసొగసుకాడనిsogasukADani
Written By
Book#Book1911
రాగం rAgaరం. కమాసుraM. kamAsu
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
సొగసుకాడని వగలుమాని రారాsogasukADani vagalumAni rArA
తగదురా ఇటుసేయా పగతిజాణా రాయాtagadurA iTusEyA pagatijANA rAyA
చరణం
charaNam 1
తుమ్మెద లొక్కాసారి ఝుమ్మఝుమ్మని మ్రోయా
సమ్మదుడై మరుడమూలునేయతాళా
tummeda lokkAsAri jhummajhummani mrOyA
sammaduDai maruDamUlunEyatALA
చరణం
charaNam 2
చక్కగ కౌగాలించి చెక్కిలీ ముద్దూలీడీ
చక్కెరా కెమ్మోవి నొక్కనివారా నేడు
chakkaga kaugAlimchi chekkilI muddUlIDI
chakkerA kemmOvi nokkanivArA nEDu
చరణం
charaNam 3
సామీ మనా చెలిమీవేమరచితి వేమొ
మోము మోమునా జేర్చి మోహము దీర్చరా
sAmI manA chelimIvEmarachiti vEmo
mOmu mOmunA jErchi mOhamu dIrcharA
చరణం
charaNam 4
ధరను కంచనావల్లి నరసింగరాయుని
కరుణతో బ్రోచిన వరచెన్న కేశవా
dharanu kamchanAvalli narasimgarAyuni
karuNatO brOchina varachenna kESavA
చరణం
charaNam 5
ప్పొంగుచూ శేషాద్రి శ్రీరంగదాసుని వినా
అంగజ జనకా నీ సంగతి తెలసెరా
ppomguchU SEshAdri SrIramgadAsuni vinA
amgaja janakA nI samgati telaserA

#95 మారుని బారికి mAruni bAriki

Titleమారుని బారికిmAruni bAriki
Written By
Book#Book1911
రాగం rAgaరం. హనుమతోడిraM. hanumatODi
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
మారుని బారికి నేనీ కోరువజాలనే
కోరువ జాలనే వోరువజాలనే
mAruni bAriki nEnI kOruvajAlanE
kOruva jAlanE vOruvajAlanE
చరణం
charaNam 1
నగుచు నగుచు తన యిరుగు కఠారిని
ధగధగమెరీ సింబాబుగులు దగిలే చెలి
naguchu naguchu tana yirugu kaThArini
dhagadhagamerI simbAbugulu dagilE cheli
చరణం
charaNam 2
తుంట విలుకాడు తనూ జంట శరముల వెనువెంటనె
కుచములానంటగ నేసెగదా
tumTa vilukADu tanU jamTa Saramula venuvemTane
kuchamulAnamTaga nEsegadA
చరణం
charaNam 3
రంగెమీర శేషాద్రి శ్రీరంగదాసు నేలు సామీ
అంగజు కేళికీ కలయంగ రాడాయె సఖినిక
ramgemIra SEshAdri SrIramgadAsu nElu sAmI
amgaju kELikI kalayamga rADAye sakhinika

#94 పరవశమవు paravaSamavu

TitleపరవశమవుparavaSamavu
Written By
Book#Book1911
రాగం rAgaశింహపురి శింహేద (?) మధ్యముSiMhapuri SiMhEda (?) madhyamu
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
పరవశమవుచున్నదిరా పట్టువదలబోకరాparavaSamavuchunnadirA paTTuvadalabOkarA
అర నిముసములో పరిపూర్ణానందము బొందెదరాara nimusamulO paripUrNAnandamu bomdedarA
చరణం
charaNam 1
పశిగోలనుగాను మంచి పసకలిగిన దానరా
కసిగందెదనని నాపై కనికరమిక మానరా
paSigOlanugAnu mamchi pasakaligina dAnarA
kasigamdedanani nApai kanikaramika mAnarA
చరణం
charaNam 2
నీకు సరియగలయుదాన నేనని భావించరా
నీ కాళ్ళకు మ్రొక్కెదరా నీ నేరుపు జూపరా
nIku sariyagalayudAna nEnani bhAvimcharA
nI kALLaku mrokkedarA nI nErupu jUparA
చరణం
charaNam 3
తలపు వేరె యుంచురా తత్తరబడపోకుమురా
కలవర మొందక నిలుపుము గలయర నీ దానరా
talapu vEre yumchurA tattarabaDapOkumurA
kalavara momdaka nilupumu galayara nI dAnarA
చరణం
charaNam 4
నిరతము శ్రీ సింహాపురి నిలయ రంగేశ్వరా
సరసులలో మేటివంచు చాల సన్నుతింతురా
niratamu SrI siMhApuri nilaya ramgESwarA
sarasulalO mETi vamchu chAla sannutimturA

#93 చిన్నవయసు chinnavayasu

Titleచిన్నవయసుchinnavayasu
Written By
Book#Book1911
రాగం rAgaసింహపురి బేహాగ్siMhapuri bEhAg
తాళం tALaచాపుchApu
పల్లవి
pallavi
చిన్న వయసు దానరా నే చెలిమి కోరినానురాchinna vayasu dAnarA nE chelimi kOrinAnurA
వన్నెకాడ నిన్నుజూచీ వలచి వచ్చినానురాvannekADa ninnujUchI valachi vachchinAnurA
చరణం
charaNam 1
కమ్మనీ కొత్తాపుతేనె లిమ్మనీ చవిజూడగా
తుమ్మెద వాసనజూడని తమ్మిజాడనుండరా
kammanI kottAputEne limmanI chavijUDagA
tummeda vAsanajUDani tammijADanumDarA
చరణం
charaNam 2
దొంటి మావిమంజిరికతి దోచునేమొ నెంచరా
అంటిన యా సుఖమనుభవమగు నెమ్మదించరా
donTi mAvimamjirikati dOchunEmo nemcharA
amTina yA sukhamanubhavamagu nemmadimcharA
చరణం
charaNam 3
ఈ ధర శింహాపురి రంగనాథ మా మనోహరా
సాధ నీ ముఖేందు జూచి నాకందొగలారెరా
I dhara SiMhApuri ramganAtha mA manOharA
sAdha nI mukhEmdu jUchi nAkamdogalArerA

#92 హా ప్రియా hA priyA

Titleహా ప్రియాhA priyA
Written By
Book#Book1911
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
హా ప్రియా నినుబాసి నేనే ప్రకారము సైతురాhA priyA ninubAsi nEnE prakAramu saiturA
చరణం
charaNam 1
పాపిమారుడు క్రూరుడై పరితాపమొందగ జేసెరా
పాపి బోధనలేమొ బల్ విని రాపు సేయుట న్యాయమా
pApimAruDu krUruDai paritApamomdaga jEserA
pApi bOdhanalEmo bal vini rApu sEyuTa nyAyamA
చరణం
charaNam 2
సుందరాంగుడు నన్ను గూడిన వన్నెకాడెటు బోయెరా
కన్నెరొవాడెన్నొ విధముల చిన్నబుచ్చెనె నా మది
sumdarAmguDu nannu gUDina vannekADeTu bOyerA
kannerovADenno vidhamula chinnabuchchene nA madi
చరణం
charaNam 3
నారులెల్లను గూడి నా మది నేర మేమొనరించెరా
నారసింహున పాటబాడి ఉల్లాసమొందెరా నా మది
nArulellanu gUDi nA madi nEra mEmonarimcherA
nArasiMhuna pATabADi ullAsamomderA nA madi

#91 మారసుందరా mArasumdarA

TitleమారసుందరాmArasumdarA
Written By
Book#Book1911
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
మారసుందరా నా నేరమేమిరా
క్రూర మనూబారిచే వేసారితి నిను కోరితి ప్రియా
mArasumdarA nA nEramEmirA
krUra manUbArichE vEsAriti ninu kOriti priyA
చరణం
charaNam 1
ఏలార బిగువులు ఈ మోహజాలమునకూ
తాళాగజాలరా ప్రియ తాపంబు తీర్చవేరా ప్రియా
ElAra biguvulu I mOhajAlamunakU
tALAgajAlarA priya tApambu tIrchavErA priyA
చరణం
charaNam 2
కోకిలాలుగూడి కోకోయని యనూచు
కూయాగ మనసు చెదరె
మరుకేళి గూడినాడో ప్రియ
kOkilAlugUDi kOkOyani yanUchu
kUyAga manasu chedare
marukELi gUDinADO priya
చరణం
charaNam 3
పూలసెజ్జపైనీ నే నిదురబోవగాను
నన్నేల విడచిపోయె ఏ సఖిని గూడినాడో ప్రియ
pUlasejjapainI nE nidurabOvagAnu
nannEla viDachipOye E sakhini gUDinADO priya
చరణం
charaNam 4
ధరణి మోహినీ పురవరద విశ్వనాధ
పరాకు వలదు రారా సరసాకు రావదేరా ప్రియ
dharaNi mOhinI puravarada viSwanAdha
parAku valadu rArA sarasAku rAvadErA priya

#90 కరుణించవేరా karuNimchavErA

TitleకరుణించవేరాkaruNimchavErA
Written By
Book#Book1911
రాగం rAgaఅఠాణాaTHANA
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
కరుణించవేరా సామీ ననుkaruNimchavErA sAmI nanu
విరసంబు సేయుటెమి సరసంబురా
సహించవేరా తమి
virasambu sEyuTemi sarasamburA
sahimchavErA tami
చరణం
charaNam 1
పానాత్ముడై నమారూచాపంబు గలసిపోరు
నాపాటి కృత్యము మేలు రూపైన జూపు రేపుమాపనకను
pAnAtmuDai namArUchApambu galasipOru
nApATi kRtyamu mElu rUpaina jUpu rEpumApanakanu
చరణం
charaNam 2
పగదాని యిల్లు రేయిపడకాయె నీకు హాయి
పగలైన బల్కవోయి పరువేన యీ బడాయి సేయకను
pagadAni yillu rEyipaDakAye nIku hAyi
pagalaina balkavOyi paruvEna yI baDAyi sEyakanu
చరణం
charaNam 3
మైనాముపేటలోను మగధీరవైతిగాన
నేనైనా గానరాన నానాటికిట్లవునని నరహరనుత
mainAmupETalOnu magadhIravaitigAna
nEnainA gAnarAna nAnATikiTlavunani naraharanuta