#94 పరవశమవు paravaSamavu

TitleపరవశమవుparavaSamavu
Written By
Book#Book1911
రాగం rAgaశింహపురి శింహేద (?) మధ్యముSiMhapuri SiMhEda (?) madhyamu
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
పరవశమవుచున్నదిరా పట్టువదలబోకరాparavaSamavuchunnadirA paTTuvadalabOkarA
అర నిముసములో పరిపూర్ణానందము బొందెదరాara nimusamulO paripUrNAnandamu bomdedarA
చరణం
charaNam 1
పశిగోలనుగాను మంచి పసకలిగిన దానరా
కసిగందెదనని నాపై కనికరమిక మానరా
paSigOlanugAnu mamchi pasakaligina dAnarA
kasigamdedanani nApai kanikaramika mAnarA
చరణం
charaNam 2
నీకు సరియగలయుదాన నేనని భావించరా
నీ కాళ్ళకు మ్రొక్కెదరా నీ నేరుపు జూపరా
nIku sariyagalayudAna nEnani bhAvimcharA
nI kALLaku mrokkedarA nI nErupu jUparA
చరణం
charaNam 3
తలపు వేరె యుంచురా తత్తరబడపోకుమురా
కలవర మొందక నిలుపుము గలయర నీ దానరా
talapu vEre yumchurA tattarabaDapOkumurA
kalavara momdaka nilupumu galayara nI dAnarA
చరణం
charaNam 4
నిరతము శ్రీ సింహాపురి నిలయ రంగేశ్వరా
సరసులలో మేటివంచు చాల సన్నుతింతురా
niratamu SrI siMhApuri nilaya ramgESwarA
sarasulalO mETi vamchu chAla sannutimturA

Leave a comment