#79 మగువల నమ్మరాదు maguvala nammarAdu

Titleమగువల నమ్మరాదుmaguvala nammarAdu
Written By
Book#Book1911
రాగం rAgaఛత్రపురీ కల్యాణిChatrapurI kalyANi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
మగువల నమ్మరాదు
మంచికి మంచిలేదూ
maguvala nammarAdu
mamchiki mamchilEdU
మొగమాట ముంచరాదు
మోహము సుంత లేదూ
mogamATa mumcharAdu
mOhamu sumta lEdU
చరణం
charaNam 1
అందని మానిపండ్లు తిందురు జవరాండ్రు
ఎందరో కోడెకాండ్రు ఎంచిన మేడిపండ్లు
amdani mAnipamDlu timduru javarAmDru
emdarO kODekAmDru emchina mEDipamDlu
చరణం
charaNam 2
చేతిలో చెయ్యి వేసి చెంతకు చేరదీసి
బోదురు యెడబాసీ బుర్రకు మసిబూసి
chEtilO cheyyi vEsi chemtaku chEradIsi
bOduru yeDabAsI burraku masibUsi
చరణం
charaNam 3
వరలెడు శ్రీఛత్ర వర సూత్రధారీ గోరీ
సరసకు చేరి మీరి సరగున బ్రోచెవారి
varaleDu SrIChatra vara sUtradhArI gOrI
sarasaku chEri mIri saraguna brOchevAri

#78 చెరగూ మాశీయున్నాదా cheragU mASIyunnAdA

Titleచెరగూ మాశీయున్నాదాcheragU mASIyunnAdA
Written By
Book#Book1911
రాగం rAgaఛత్రపురీ తోడిChatrapurI tODi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
చెరగూ మాశీయున్నాదా నారసామిcheragU mASIyunnAdA nArasAmi
అనుపల్లవి
anupallavi
వెలలేని సౌఖ్యామబ్బేరా ఏ ప్రియాvelalEni soukhyAmabbErA E priyA
చరణం
charaNam 1
చలువంపు తోటలో సరసుడు నేనుండగ
సరగున చెయ్యి బట్టెరా ఏ ప్రియా
chaluvampu tOTalO sarasuDu nEnumDaga
saraguna cheyyi baTTerA E priyA
చరణం
charaNam 2
కలువాల దొర పగ నాపై సాధించెరా
కనికరముంచడాయెనే ఏరా ప్రియా
kaluvAla dora paga nApai sAdhimcherA
kanikaramumchaDAyenE ErA priyA
చరణం
charaNam 3
ధర వెలయు శ్రీ ఛత్రపుర జగన్మోహనా
వరనాటక ధీశుడే ఏరా ప్రియా
dhara velayu SrI Chatrapura jaganmOhanA
varanATaka dhISuDE ErA priyA

#77 లేచి రారా lEchi rArA

Titleలేచి రారాlEchi rArA
Written By
Book#Book1911
రాగం rAgaఛత్రపురీ బేహాగ్ChatrapurI bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
లేచి రారా మా చెలి నేలుకోరాlEchi rArA mA cheli nElukOrA
చరణం
charaNam 1
పెంచూ రతికేళి ముప్పించు
చాలగా వలపించూ సరసము దేలించూ
మెప్పించు మేలించు లాలించు
pemchU ratikELi muppimchu
chAlagA valapimchU sarasamu dElimchU
meppimchu mElimchu lAlimchu
చరణం
charaNam 2
నారీ మారునిచే కఠారి వాలుచూపుల దారి
నడతల వయ్యారి చిన్నారి పొన్నారీ కన్నారీ
nArI mArunichE kaThAri vAluchUpula dAri
naDatala vayyAri chinnAri ponnArI kannArI
చరణం
charaNam 3
నాతీ సంపూర్ణ చంద్రవతీ నిడతతొ గుణవతి
జాతిలొ కాళవతి మదవతి నాదాతి సుదాతి
nAtI sampoorNa chamdravatI niDatato guNavati
jAtilo kALavati madavati nAdAti sudAti
చరణం
charaNam 4
ఈశా శ్రీఛత్రపురీశ శ్రీజగన్మోహన సంకాశ
సరస నాటక విధీశ వద్దేశ ప్రాణేశ లోకేశ
ISA SrIChatrapurISa SrIjaganmOhana samkASa
sarasa nATaka vidhISa vaddESa prANESa lOkESa

#76 సరివారిలో sarivArilO

TitleసరివారిలోsarivArilO
Written By
Book#Book1911
రాగం rAgaఛత్రపురీ హిందుస్తాని కాఫీChatrapurI hindustAni kAfI
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
సరవారిలో సరసము లాడకురాsaravArilO sarasamu lADakurA
చరణం
charaNam 1
సరసము లాడకు సైగలు శాయకు
తరచుగ బిల్వబోకు తప్పించకూ
సరసము లాడకురా
sarasamu lADaku saigalu SAyaku
tarachuga bilvabOku tappimchakU
sarasamu lADakurA
చరణం
charaNam 2
కొత్తగా నే వచ్చి కొన్ని నాళ్ళాయెరా
సద్దు శాయక పోరా చాల్ చాలురా
సరసము లాడకురా
kottagA nE vachchi konni nALLAyerA
saddu SAyaka pOrA chAl chAlurA
sarasamulADakurA
చరణం
charaNam 3
వరలెడు శ్రీఛత్రపుర జగన్మోహనా
వరనాటక ధీశ వద్దు ప్రాణేశా
సరసము లాడకురా
varaleDu SrIChatrapura jaganmOhanA
varanATaka dhISa vaddu prANESA
sarasamulADakurA

#75 సరసకు వేలరా sarasaku vElarA

Titleసరసకు వేలరా sarasaku vElarA
Written By
Book#Book1911
రాగం rAgaఛత్రపురీ బేహాగ్ChatrapurI bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
సరసకు వేలరా
సమి ఏర మేర గాదురా
sarasaku vElarA
sami Era mEra gAdurA
చరణం
charaNam 1
మరులుకున్న నాపై ఇంత మర్మమేల దెలుపరా
తరుణి బెట్టినట్టి మందు తలకెక్కెనటరా
marulukunna nApai imta marmamEla deluparA
taruNi beTTinaTTi mamdu talakekkenaTarA
చరణం
charaNam 2
నిరతము నీవనుచును నెరనమ్మి యుంటిరా
సరగున నన్నేలుకోరా సమి నీకు మ్రొక్కెరా
niratamu nIvanuchunu neranammi yumTirA
saraguna nannElukOrA sami nIku mrokkerA
చరణం
charaNam 3
పరుల వలెనె నా వలపు భరియింపజాలరా
మారు నిల్లు చమ్మగిల్లి మైమరువసాగెరా
parula valene nA valapu bhariyimpajAlarA
mAru nillu chammagilli maimaruvasAgerA
చరణం
charaNam 4
ధరను శ్రీ ఛత్రపుర వరజగన్మోహనా
సరస నాటకానిలయ సమయమాయె గూడరా
dharanu SrI Chatrapura varajaganmOhanA
sarasa nATakAnilaya samayamAye gUDarA

#74 వేగా మన సరసకు vEgA mana sarasaku

Titleవేగా మన సరసకుvEgA mana sarasaku
Written By
Book#Book1911
రాగం rAgaఛత్రపురీ బేహాగ్ChatrapurI bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
వేగా మన సరసకు రాడేమే చెలిvEgA mana sarasaku rADEmE cheli
రాగము తోడుత మంచి బాగాయనిపించువాడుrAgamu tODuta mamchi bAgAyanipimchuvADu
చరణం
charaNam 1
హెచ్చైన వెన్నెల కారు చిచ్చుకాక కోర్వరా
మత్సకంటి కోమరులు కొన్న మర్మమెరుగడే చెలి
hechchaina vennela kAru chichchukAka kOrvarA
matsakamTi kOmarulu konna marmamerugaDE cheli
చరణం
charaNam 2
కన్యలో ఈ నా వలపు ఎంతగా విన్నవింతునే
కన్ను మిన్ను ఎరుగుదునా అన్నము సహింపదే చెలి
kanyalO I nA valapu emtagA vinnavimtunE
kannu minnu erugudunA annamu sahimpadE cheli
చరణం
charaNam 3
ధరను శ్రీచత్రపుర వర జగన్మోహనా
సరస నాటకా నిలయ సమయమాయె రాడాయె చెలి
dharanu SrIchatrapura vara jaganmOhanA
sarasa nATakA nilaya samayamAye rADAye cheli

#73 చిన్నదాన chinnadAna

Titleచిన్నదానchinnadAna
Written By
Book#Book1911
రాగం rAgaఛత్రపురీ బేహాగ్ChatrapurI bEhAg
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
చిన్నదాన నేనేమెరుగ సిగ్గు దియ్యబోకురా
వన్నెకాడ ఇంక తాళవశముగాదు చాలురా
chinnadAna nEnEmeruga siggu diyyabOkurA
vannekADa imka tALavaSamugAdu chAlurA
చరణం
charaNam 1
చిగురుమోవి తేనెలొల్కు చెలగి గ్రోలుటింతరా
దొగరు పంట మెలసీ నొక్కి అగడు సాయబోకురా
chigurumOvi tEnelolku chelagi grOluTimtarA
dogaru pamTa melasI nokki agaDu sAyabOkurA
చరణం
charaNam 2
తళుకు ముద్దు చెక్కులపై వలపు ముద్దు నుంచరా
తళుకు దీర జిలుకూ కెంపుల లతదీల బోకురా
taLuku muddu chekkulapai valapu muddu numcharA
taLuku dIra jilukU kempula latadIla bOkurA
చరణం
charaNam 3
అరసి చందనారి తేనె సరిసమానుడెంతరా
మెరమిగల్గి దురుసు నీవు మేరనాడబోకురా
arasi chamdanAri tEne sarisamAnuDemtarA
meramigalgi durusu nIvu mEranADabOkurA
చరణం
charaNam 4
ధరను శ్రీఛత్రపుర వరజగన్మోహనా
సరస నాటకానిలయ సమయమరసీ గానరా
dharanu SrIChatrapura varajaganmOhanA
sarasa nATakAnilaya samayamarasI gAnarA

#72 కోపము రాదా kOpamu rAdA

Titleకోపము రాదాkOpamu rAdA
Written By
Book#Book1911
రాగం rAgaఛత్రపురీ కాపిChatrapurI kApi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
కోపము రాదా యవ్వరికైనా
ఆపణతింటిలో ఆడిన మాటకు
kOpamu rAdA yavvarikainA
ApaNatimTilO ADina mATaku
వాపోవగ మును వచ్చిన త్రోవను
పోపోపొమ్మనీ సాపుగ దెలపె
vApOvaga munu vachchina trOvanu
pOpOpommanI sApuga delape
చరణం
charaNam 1
యంతపచారము జేసితి వచటా
అంతరంగుడవని ఆదరించుచుంటి
సుంతైన యంచక ఇంతి పాలాయెరా
ఇంత హీనుడవనీ యెరుగకపోతీ
yamtapachAramu jEsiti vachaTA
amtaramguDavani AdarimchuchumTi
sumtaina yamchaka imti pAlAyerA
imta hInuDavanI yerugakapOtI
చరణం
charaNam 2
ఈ విధి భ్రమయక అతనితో నేస్తము
గావించినందుకు కలిగిన లాభము
ఏ వగలాడి నీకేమి బోధించెరా
నావలె దానికి గావలెగాదా
I vidhi bhramayaka atanitO nEstamu
gAvimchinamduku kaligina lAbhamu
E vagalADi nIkEmi bOdhimcherA
nAvale dAniki gAvalegAdA
చరణం
charaNam 3
వరలెడు శ్రీఛత్రపుర జగన్మోహనా వర నాటక
సూత్రధారుడవనుచుంటి నిరతము నీవని
నెరనమ్మి యుంటిరా
పర సతులను గూడి పలచనజేసితె
varaleDu SrIChatrapura jaganmOhanA vara nATaka
sUtradhAruDavanuchunTi niratamu nIvani
neranammi yumTirA
para satulanu gUDi palachanajEsite

#71 నీ నామరూపములకు nI nAmarUpamulaku

Titleనీ నామరూపములకుnI nAmarUpamulaku
Written By
Book#Book1900
రాగం rAgaసౌరాష్ట్రsaurAshTra
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
నీ నామరూపములకు నిత్య జయమంగళంnI nAmarUpamulaku nitya jayamamgaLam
పవమాన సుతుడు పట్టు పాదారవిందములకుpavamAna sutuDu paTTu pAdAravimdamulaku
నవముక్తాహారములు నటియించు నురమునకుnavamuktAhAramulu naTiyimchu nuramunaku
నళినారి తీరుగేరు నవ్వు మోమునకుnaLinAri tIrugEru navvu mOmunaku
పంకజాక్షి నెలకొన్న అంకయురమునకుpamkajAkshi nelakonna amkayuramunaku
ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుచుండేprahlAda nAradAdi bhaktulu pogaDuchumDE
రాజీవ నయన త్యాగరాజ వినుతమైనrAjIva nayana tyAgarAja vinutamaina

Again, this is NOT a Javali. And, this Mangalam is the last (71st) lyric from the oldest book in our collection.

#70 మా కులమున mA kulamuna

Titleమా కులమునmA kulamuna
Written By
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaచాపుchApu
పల్లవి
pallavi
మా కులమున కిహపర మొసగిన నీకు మంగళం
శుభమంగళం మమ్ముల బ్రోచిన మదన జనక నీకు
mA kulamuna kihapara mosagina nIku mangaLam
SubhamangaLam mammula brOchina madana janaka nIku
మదగజ గమన మానిత సద్గుణ నీకుmadagaja gamana mAnita sadguNa nIku
మదమోహ రహిత మంజుల రూపధర నీకుmadamOha rahita mamjula rUpadhara nIku
మనసిజవైరి మానససదల నీకుmanasijavairi mAnasasadala nIku
మనవి విని మంమేలుకొన్న నీకుmanavi vini maMmElukonna nIku
మానమున నెలకొన్న కృష్ణా నీకుmAnamuna nelakonna kRshNA nIku
మాననోహర పాలిత త్యాగరాజmAnanOhara pAlita tyAgarAja

This is also not a Javali. Again, we think publisher may have chosen to end the book with Mangalam lyrics