#29 కాముని విరిశముల kAmuni viriSamula

Titleకాముని విరిశములkAmuni viriSamula
Written By
రాగం rAgaకాపిkApi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
కాముని విరిశముల బారికి నేమని సహింతునెkAmuni viriSamula bAriki nEmani sahimtune
చరణం
charaNam 1
సామి రాడాయనే నిమిషమెడాయనే
నా మనవి తెలియబలికె ప్రేమసఖి లేదాయనె
sAmi rADAyanE nimishameDAyanE
nA manavi teliyabalike prEmasakhi lEdAyane
చరణం
charaNam 2
బాలరో యీ చలమేలనె వానికి
యే లలనామణి బోధించెనేమో నను మరచేనె
bAlarO yI chalamElane vAniki
yE lalanAmaNi bOdhinchenEmO nanu marachEne
చరణం
charaNam 3
భామరొ కామునికేళి నన్నేలిన
సామి దరగిరి నిలయుని పయి ప్రేమ యెటుమఱతునె
bhAmaro kAmunikELi nannElina
sAmi daragiri nilayuni payi prEma yeTuma~ratune

#28 వింటి వేమిరా vimTi vEmirA

Titleవింటి వేమిరాvimTi vEmirA
Written By
రాగం rAgaబ్యాగ్byAg
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
వింటి వేమిరా సామి వింటి వేమిరాvimTi vEmirA sAmi vimTi vEmirA
చరణం
charaNam 1
తుంటవిల్తుడెయు పదను తూపులెల్ల దాని యెదను
జంటకత్తె వోర్వ దనుకొంటి వేమిరా సామి
tumTaviltuDeyu padanu tUpulella dAni yedanu
janTakatte vOrva danukomTi vEmirA sAmi
చరణం
charaNam 2
నిదురలే నీదు దారి యెదురు చూచి వేసారి
సదయుడ హాయనుచు తేరి సైపలేదురా సామి
niduralE nIdu dAri yeduru chUchi vEsAri
sadayuDa hAyanuchu tEri saipalEdurA sAmi
చరణం
charaNam 3
రవల సొమ్ములిచ్చినటుల రాతిరెలగూడి నటుల
కువలయాక్షి పలికినటుల గోపబాలకా సామి
ravala sommulichchinaTula rAtirelagUDi naTula
kuvalayAkshi palikinaTula gOpabAlakA sAmi

#27 యేలా మనకు వాని జోలి yElA manaku vAni jOli

Titleయేలా మనకు వాని జోలిyElA manaku vAni jOli
Written By
రాగం rAgaహిందుస్తానిhindustAni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
యేలా మనకు వాని జోలి చెలియలాyElA manaku vAni jOli cheliyalA
చరణం
charaNam 1
మాటీమాటికి యీ రాపైతే యేటి మాట పోపోవే
నాటి బాస యెమాయ చెలి
mATImATiki yI rApaitE yETi mATa pOpOvE
nATi bAsa yemAya cheli
చరణం
charaNam 2
మారుబారి మీరి దనుచేర బిలచెటందుకు పై
నేరమెంచుట గాదె వో చెలి
mArubAri mIri danuchEra bilacheTanduku pai
nEramemchuTa gAde vO cheli
చరణం
charaNam 3
యేమొగాని శ్రీగోపాలుడె మరసినాడె మరచెనమ్మ
ప్రేమ యెంచుట మేరగాదె చెలి
yEmogAni SrIgOpAluDe marasinADe marachenamma
prEma yemchuTa mEragAde cheli

#26 పోయిరమ్మ పొలతిరొ pOyiramma polatiro

Titleపోయిరమ్మ పొలతిరొpOyiramma polatiro
Written By
రాగం rAgaజంఝూటిjamjhUTi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
పోయిరమ్మ పొలతిరొ సామిని పొగడె చెలి యింటికిpOyiramma polatiro sAmini pogaDe cheli yimTiki
చరణం
charaNam 1
వొంటిగానున్న దాని నింటిలో జూచి నా
వంటి చెలి దెల్పె నె కంటివని నాతో
vomTigAnunna dAni nimTilO jUchi nA
vamTi cheli delpe ne kamTivani nAtO
చరణం
charaNam 2
వెలదిరొమును వనజాసనుడేమి
వ్రాసనోయే పెనుగొనుటేలను
veladiromunu vanajAsanuDEmi
vrAsanOyE penugonuTElanu
చరణం
charaNam 3
వెలదిరొ చక్కని సురపురి సూనుతో
మదనుని కేళిలో మనసీయనంటె
veladiro chakkani surapuri sUnutO
madanuni kELilO manasIyanamTe

#25 మనసేమో సైచదే manasEmO saichadE

Titleమనసేమో సైచదేmanasEmO saichadE
Written By
రాగం
rAga
జంఝూటిjamjhUTi
తాళం
tALa
ఆదిAdi
పల్లవి
pallavi
మనసేమో సైచదే మానినీమణి నా వారిజముఖి సరి
వారిలో నన్నిటుదూరి దాని యిలు చేరగనా
manasEmO saichadE mAninImaNi nA vArijamukhi sari
vArilO nanniTudUri dAni yilu chEraganA
చరణం
charaNam 1
మరు శరములు అతి దురుసుగ నిరతము
గురు కుచముల పై గురియగ నా
maru Saramulu ati durusuga niratamu
guru kuchamula pai guriyaga nA
చరణం
charaNam 2
గోపాలుడు నను రాపుచేసి పరి
తాపములకు నెనెటు లోపుదునె నా
gOpAluDu nanu rApuchEsi pari
tApamulaku neneTu lOpudune nA

#24 అంతలోనె తెల్లవారె amtalOne tellavAre

Titleఅంతలోనె తెల్లవారెamtalOne tellavAre
Written By
రాగం rAgaబ్యాగ్byAg
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
అంతలోనె తెల్లవారె అయ్యో యేమిసేతునే
కాంతుని మనసెంత నొచ్చెనొ
ఇంతి యెటుసైతునే




||అంత||
amtalOne tellavAre ayyO yEmisEtunE
kAmtuni manasemta nochcheno
imti yeTusaitunE



||amta||
చరణం
charaNam 1
కొదమ గుబ్బలెదను గదియ నదుముకొదుచు చాలా
పెదవి తేనె లాననా మదిని దోచువేళ





||అంత||
kodama gubbaledanu gadiya nadumukoduchu chAlA
pedavi tEne lAnanA madini dOchuvELa



||amta||
చరణం
charaNam 2
పంతమున తటాల లేచి పైటకొంగు జారగా
కాంత దొంతర విడె మొసంగి కౌగలింపుచుండగా



||అంత||
pamtamuna taTAla lEchi paiTakomgu jAragA
kAmta domtara viDe mosamgi kougalimpuchumDagA



||amta||
చరణం
charaNam 3
సోమభూపాల రమ్మని భామ ప్రేమమీరగా
కామకేళిలోన మిగుల కలసిమెలసి యుండగా




||అంత||
sOmabhUpAla rammani bhAma prEmamIragA
kAmakELilOna migula kalasimelasi yumDagA


||amta||

#23 వలచితె యింత valachite yimta

Titleవలచితె యింతvalachite yimta
Written By
రాగం rAgaఫరజుfaraju
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
వలచితె యింత చలమ్యాల రార సామి
||వల||
valachite yinta chalamyAla rAra sAmi
||vala||
చెలువుడనుచు మతి దలచి దలచినను

||వల||
cheluvuDanuchu mati dalachi dalachinanu

||vala||
చరణం
charaNam 1
మక్కువతో నా మనసెటు నిల్పక
మిక్కిలి వేడితి
తామస మ్యాలర
యెక్కువ మమతతొ పిలిచిన బలుకవె




||వల||
makkuvatO nA manaseTu nilpaka
mikkili vEDiti
tAmasa myAlara yekkuva mamatato
pilichina balukave




||vala||
చరణం
charaNam 2
వెన్నెల రెయిని వేడిని తాళను నిన్నటి మాటలు
శాయకురా సామి నిన్నెడబాసి నె నిమిషము తాళను




||వల||
vennela reyini vEDini tALanu ninnaTi mATalu
SAyakurA sAmi ninneDabAsi ne nimishamu tALanu




||vala||
చరణం
charaNam 3
వరభీమేశుడు నేరము లెంచకు
సారసమిత్రుడ సమ్మత మా సామి
యేర సుందరా నిన్ను నేమముతో




||వల||
varabhImESuDu nEramu lemchaku
sArasamitruDa sammata mA sAmi
yEra sumdarA ninnu nEmamutO




||vala||

#22 పోపోవే చెలియా pOpOvE cheliyA

Titleపోపోవే చెలియాpOpOvE cheliyA
Written By
రాగం rAgaజంఝూటిjamjhUTi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
పోపోవే చెలియా రాప్యాలే
పోపోవే చెలియా
pOpOvE cheliyA rApyAlE
pOpOvE cheliyA
చరణం
charaNam 1
అక్కఱ వేళలో దక్కిన విటుల
కెక్కడి మమత
akka~ra vELalO dakkina viTula
kekkaDi mamata
చరణం
charaNam 2
జారుల సమరతి తీరిన వెనుక
దూరేదీ మరియాద
jArula samarati tIrina venuka
dUrEdI mariyAda
చరణం
charaNam 3
వాసిగ నను శ్రీనివాసుడు గూడి
మోసము చేసెనే
vAsiga nanu SrInivAsuDu gUDi
mOsamu chEsenE

#21 మానినీ వాని జోలి mAninI vAni jOli

Titleమానినీ వాని జోలిmAninI vAni jOli
Written By
రాగం rAgaజంఝూటిjanjhUTi
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
మానినీ వాని జోలి దానను గాదే వో
కానిదాని మాటవిని కాంత మరచి యుంటినే
mAninI vAni jOli dAnanu gAdE vO
kAnidAni mATavini kAmta marachi yumTinE
చరణం
charaNam 1
కలికిరొ నను బాయవని పలికిన దేమాయనె
అల చెలితో కలసిరాక అయిదారు నెలలాయెనె
kalikiro nanu bAyavani palikina dEmAyane
ala chelitO kalasirAka ayidAru nelalAyene
చరణం
charaNam 2
సన్నుతాంగి చాలవేచి యిన్ని దినములుంటినే
నన్ను గూడి వెంకటేశుడన్న మాట వింటినే
sannutAmgi chAlavEchi yinni dinamulumTinE
nannu gUDi venkaTESuDanna mATa vimTinE

#20 నిన్నెడబాసిన ninneDabAsina

Titleనిన్నెడబాసినninneDabAsina
Written By
రాగం rAgaహిందుస్తానిhindustAni
తాళం tALaధృవdhRva
పల్లవి
pallavi
నిన్నెడబాసిన మొదలు కనులకు
నిదుర రాదె చెలి
ninneDabAsina modalu kanulaku
nidura rAde cheli
చరణం
charaNam 1
రేయి పగలు రెప్పపాటు లేక పలుమారు
నీ పేరు బిలుచుచును కనులనీరు
కడవలై పారెనయ్యో
అన్నము కూడ సహించలేదె
rEyi pagalu reppapATu lEka palumAru
nI pEru biluchuchunu kanulanIru
kaDavalai pArenayyO
annamu kUDa sahinchalEde
చరణం
charaNam 2
సుదతిరొ యిప్పుడు యీ సుందరాంగుడె
నను నిక్కముగాను వీక్షించుచును
గాఢాలింగనముతో నను గూడుచును
అయ్యో సంతోష సముద్రమున నీదుచును
sudatiro yippuDu yI sundarAmguDe
nanu nikkamugAnu vIkshinchuchunu
gADhAlinganamutO nanu gUDuchunu
ayyO santOsha samudramuna nIduchunu