| Title | వన్నెలాడి | vannelADi |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | బేగడ | bEgaDa |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | వన్నెలాడి విన్నవించవే | vannelADi vinnavinchavE |
| అనుపల్లవి anupallavi | మొన్నటి పున్నమ రేయి కన్నులార నిన్నే జూచి యెన్నరాని మోహముచే నున్నదనుచును | monnaTi punnama rEyi kannulAra ninnE jUchi yennarAni mOhamuchE nunnadanuchunu |
| చరణం charaNam 1 | శారి కాకేరాళి రవ దారుణము కోర్వక నీదారి జూచుచుండె దయోదార యనుచును | SAri kAkErALi rava dAruNamu kOrvaka nIdAri jUchuchunDe dayOdAra yanuchunu |
| చరణం charaNam 2 | సుందరా నీయందు తమిజంది యాసజెంది గాసియుందిర తొందర రతులందు దన్పుమని | sundarA nIyandu tamijandi yAsajendi gAsiyundira tondara ratulandu dan&pumani |
| చరణం charaNam 3 | జోడుగూడ వీడని పూబోడి వానితోడ మాటలాడి తెమ్మనెగవ కూడు మనుచును | jODugUDa vIDani pUbODi vAnitODa mATalADi temmanegava kUDu manuchunu |
| చరణం charaNam 4 | భాసురమగు దుర్గాడ వాసుడు ద్విభాషి పుల్లకవీశ పోష దోషనాశ శ్రీయనుచు | bhAsuramagu durgADa vAsuDu dvibhAshi pullakavISa pOsha dOshanASa SrIyanuchu |
Category: Lyrics
#318 రారా మనవి rArA manavi
| Title | రారా మనవి | rArA manavi |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | నాటకురంజి | nATakuranji |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | రారా మనవి చేకోరా లేచి రారా రారా మనవి చేకోరా మానినీ చిత్తచోరా రాజకుమార వీరా నిన్నే కోరినదిరా మేలౌరా లేలేరా రారా రాజాగేర | rArA manavi chEkOrA lEchi rArA rArA manavi chEkOrA mAninI chittachOrA rAjakumAra vIrA ninnE kOrinadirA mElaurA lElErA rArA rAjAgEra |
| చరణం charaNam 1 | మోము చంద్రునితో సమము సంపెంగ నాసికము కెమ్మోవి పగడము శంఖము కంధరము ప్రేమము కామము దీర్పుము క్షేమము | mOmu chandrunitO samamu sampenga nAsikamu kemmOvi pagaDamu Sankhamu kandharamu prEmamu kAmamu dIrpumu kshEmamu |
| చరణం charaNam 2 | ఆరు పున్నాగమును గేరు దంతముంచి డారు మల్లె మొగ్గలు మీరు, కన్యకామణి డయరు కన్నుల కర్వుదీరు మై తీరు రంగారు బంగారు నుంగేరు | Aru punnAgamunu gEru damtamunchi DAru malle moggalu mIru, kanyakAmaNi Dayaru kannula karvudIru mai tIru ramgAru bangAru nungEru |
| చరణం charaNam 3 | విళ్ళు కన్బొమ్మలు పాలిళ్ళు మల్లెపువ్వుల చెళ్ళు రిక్కలగమి గోళ్ళు బాహువుల్ తిమ్మి తూళ్ళు మీగాళ్ళు తాబేళ్ళు చెవ్రేళ్ళు చిగుళ్ళు | viLLu kan&bommalu pAliLLu mallepuvvula cheLLu rikkalagami gOLLu bAhuvul timmi tULLu mIgALLu tAbELLu chevrELLu chiguLLu |
| చరణం charaNam 4 | ఈశా ద్విభాషి పుల్లకవీశా మానినీ మనోల్లాసా భాస్కరసుప్రకాశా భవనాశా జగధీశా దరహాసా లక్ష్మీశా | ISA dvibhAshi pullakavISA mAninI manOllAsA bhAskarasuprakASA bhavanASA jagadhISA darahAsA lakshmISA |
#317 వగలాడి vagalADi
| Title | వగలాడి | vagalADi |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | కల్యాణి | kalyANi |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | వగలాడి దిగులిడ నోర్వగదే వో | vagalADi diguliDa nOrvagadE vO |
| అనుపల్లవి anupallavi | చిగురుబోడిరో జాలమా యిది శీలమా తగు తగునే యిది తగువగునె తమి దగిలి రతులను దిగియ జేయవె ఓ | chigurubODirO jAlamA yidi SIlamA tagu tagunE yidi taguvagune tami dagili ratulanu digiya jEyave O |
| చరణం charaNam 1 | కలిగి మిటారీ లలిత బింబాధరీ వలపుల దేర్పవే వల రాచకేళిలో నీ వలపు నిలుపగ రాదటే మర్యాదటే కలకలమ్ముగ నలగి మన్మధ కళల దేరగ గలయ రాగదే | kaligi miTArI lalita bimbAdharI valapula dErpavE vala rAchakELilO nI valapu nilupaga rAdaTE maryAdaTE kalakalammuga nalagi manmadha kaLala dEraga galaya rAgadE |
| చరణం charaNam 2 | కోపము దేలే ఆపలేనే మోహము నే పగవాడన నీకు దెలియదటే నీ రూపురేఖలు నిక్కమా తమి దక్కుమా పాపరాధుడగామ మోహోద్దీప తాపము బాపివేయవే | kOpamu dElE ApalEnE mOhamu nE pagavADana nIku deliyadaTE nI rUpurEkhalu nikkamA tami dakkumA pAparAdhuDagAma mOhOddIpa tApamu bApivEyavE |
| చరణం charaNam 3 | పల్లవ పాణీ పుల్లాబ్జలోచనీ యుల్లము నీపయి నల్లన నిల్పెగదే ఓ మల్లెపువ్వుల బంతిరొ మరుదంతిరో సల్లలిత ద్విభాషి కులభవ పుల్లకవి నుత పల్లవీమణి | pallava pANI pullAbjalOchanI yullamu nIpayi nallana nilpegadE O mallepuvvula bantiro marudantirO sallalita dvibhAshi kulabhava pullakavi nuta pallavImaNi |
#316 ఎడబాసి eDabAsi
| Title | ఎడబాసి | eDabAsi |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | చక్రవాకం | chakravAkam |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | ఎడబాసి గడియోర్వజాలనురా జోడెడబాసి | eDabAsi gaDiyOrvajAlanurA jODeDabAsi |
| చరణం charaNam 1 | గొడవలింతకు హెచ్చినన్ మదినొచ్చినన్ పడకకును రాకున్న నిన్నొక గడియైనను విడువజాలనురా ||జోడెడ|| | goDavalimtaku hechchinan madinochchinan paDakakunu rAkunna ninnoka gaDiyainanu viDuvajAlanurA ||jODeDa|| |
| చరణం charaNam 2 | ఇటులారడి సేయుట ముచ్చటగా దెతులైనను చెంగట నుంచుట మేలు తటపటాయించుట సదా మరలుటగురా గుటుకు గుటుకున గ్రుక్కలూరించుటలు తగవగు నటరా నీ ||జోడెడ|| | iTulAraDi sEyuTa muchchaTagA detulainanu chengaTa numchuTa mElu taTapaTAyimchuTa sadA maraluTagurA guTuku guTukuna grukkalUrinchuTalu tagavagu naTarA nI ||jODeDa|| |
| చరణం charaNam 3 | సరివారలు మెచ్చనీ మెచ్చకపోనీ గురివెలి జేసిన నిరసన గాదటరా నీ సరసమెరిగిన దాన నీ దానరా సరిసరిరా నీ మురిపెమునల గురుతెరుగుదుర నా దొరవునీ ||జోడెడ|| | sarivAralu mechchanI mechchakapOnI guriveli jEsina nirasana gAdaTarA nI sarasamerigina dAna nI dAnarA sarisarirA nI muripemunala guruterugudura nA doravunI ||jODeDa|| |
| చరణం charaNam 4 | కలకాలము రవ్వల పాలయినన్ చలమెల్లను నిష్ఫలములయ్యెనురా నా వలపు తెలిసిన పాడవు వగకాడవు పలు విధమ్ముల నలరువిలుతుని పనులలోపల మెలగునీ ||జోడెడ|| | kalakAlamu ravvala pAlayinan chalamellanu nishphalamulayyenurA nA valapu telisina pADavu vagakADavu palu vidhammula nalaruvilutuni panulalOpala melagunI ||jODeDa|| |
| చరణం charaNam 5 | మకరధ్వజ జనక నాకిక ప్రాపకమైతివి తేలిక సేయకురా చంపక ముకుళ సమవాసికా శోభన ముఖా ప్రకటమైన ద్విభాషికుల పుల్లకవి సన్నుతి నికర నీ ||జోడెడ|| | makaradhvaja janaka nAkika prApakamaitivi tElika sEyakurA champaka mukuLa samavAsikA SObhana mukhA prakaTamaina dvibhAshikula pullakavi sannuti nikara nI ||jODeDa|| |
#315 నాణెమైన వలపుల nANemaina valapula
| Title | నాణెమైన వలపుల | nANemaina valapula |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | నాణెమైన వలపుల చెలిరా నిను జాణవనుచు పిలువమనెరా ఆణిముత్తియంబులు పలుతీరు అందమైన నూగారు పాణులు పల్లవ మది రుచులూరు వాణిని తేనెలుగారు | nANemaina valapula chelirA ninu jANavanuchu piluvamanerA ANimuttiyambulu palutIru amdamaina nUgAru pANulu pallava madi ruchulUru vANini tEnelugAru |
| 2 | కాముక హృత్కల్పము తనువల్లి మోము పండుజాబిల్లి శ్రీమించిన సుగుణ గణముతల్లి హేమగదర యిదితొల్లి | kAmuka hRtkalpamu tanuvalli mOmu panDujAbilli SrIminchina suguNa gaNamutalli hEmagadara yiditolli |
| 3 | గోరులు తారలచాలగ నేలు గోలు పల్కులవరాలు బారు కురులు నిగ నిషనీలాలు బాలవయసు నీపాలు | gOrulu tAralachAlaga nElu gOlu palkulavarAlu bAru kurulu niga nishanIlAlu bAlavayasu nIpAlu |
| 4 | తావి చనురబరిణెల బిరడాలు మోవికెంపు పగడాలు నీవు గవదయగు సఖి మెయిడాలు లేవు గదర తేడాలు | tAvi chanurabariNela biraDAlu mOvikempu pagaDAlu nIvu gavadayagu sakhi meyiDAlu lEvu gadara tEDAlu |
| 5 | కాంచిన మును నిరసించుర యొడలు అంచనేరు దానడలు మించు రంభల హసించుర తొడలు యెంచితి విరనలడలు | kAmchina munu nirasimchura yoDalu anchanEru dAnaDalu minchu rambhala hasimchura toDalu yemchiti viranalaDalu |
| 6 | మున్ను నుంచి కాపురమీయూరు ముద్దుగుమ్మరా పేరు కన్నెను జూడ తయారగు తేరు కన్నులకు కరువులేదు | munnu numchi kApuramIyUru muddugummarA pEru kannenu jUDa tayAragu tEru kannulaku karuvulEdu |
| 7 | భామా హృత్పంకజ హర్షా ద్విభాషి పుల్లకవి పోషా కామిత ఫలదాయక గత రోషా భూమిజా మనోల్లాసా | bhAmA hRtpankaja harshA dvibhAshi pullakavi pOshA kAmita phaladAyaka gata rOshA bhUmijA manOllAsA |
#314 చెలువుని తోడితేవె cheluvuni tODitEve
| Title | చెలువుని తోడితేవె | cheluvuni tODitEve |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | కేదారగౌళ | kEdAragauLa |
| తాళం tALa | అట | aTa |
| 1 | చెలువుని తోడి తేవె కలహంస గమనరొ వల రాచకేళికి వలపించి పూశయ్యకు | cheluvuni tODi tEve kalahamsa gamanaro vala rAchakELiki valapimchi pUSayyaku |
| 2 | దవ్వుల జూచినానే నవ్వు మొగము వాడే జవ్వనమయిన వాడే వహ్వరి తగిన జోడే | davvula jUchinAnE navvu mogamu vADE javvanamayina vADE vahvari tagina jODE |
| 3 | కామిని వాని మోము శోమునితో సమము కాముని సుందరము కనగల్గెనే మోహము | kAmini vAni mOmu SOmunitO samamu kAmuni sumdaramu kanagalgenE mOhamu |
| 4 | తారక వేగోరులు హారాణి పల్తీరులు చేరావె కన్బారులు నీరదముల్ కురులు | tAraka vEgOrulu hArANi paltIrulu chErAve kan&bArulu nIradamul kurulu |
| 5 | తీరైన పలుకులు తేనియ లొలుకులు తోరంపు చూడ్కులు మారుని పూముల్కులు | tIraina palukulu tEniya lolukulu tOrampu chUDkulu mAruni pUmulkulu |
| 6 | కాపాడుమా దేహము కాకున్న చేద్రోహము చూపగదే స్నేహము ఆపలేనే మోహము | kApADumA dEhamu kAkunna chEdrOhamu chUpagadE snEhamu ApalEnE mOhamu |
| 7 | ద్విభాషి పుల్లకవి ప్రాభవుడౌ భారవి శోభిత గుణ పద్మనాభునీ శ్రీవిభుని | dvibhAshi pullakavi prAbhavuDau bhAravi SObhita guNa padmanAbhunI SrIvibhuni |
#313 పంతమా నాపై pamtamA nApai
| Title | పంతమా నాపై | pamtamA nApai |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | బిళహరి | biLahari |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | పంతమా నాపై వన్నెకాడా కాంతుడెంతో గాసిజేసె | pamtamA nApai vannekADA kAmtuDemtO gAsijEse |
| చరణం charaNam 1 | వలచి నిను కోరి వచ్చినందుకా పలుచ జేసి పలుకకున్నావు | valachi ninu kOri vachchinamdukA palucha jEsi palukakunnAvu |
| చరణం charaNam 2 | అల్లదాని యిల్లు చేరిన నీ యెల్ల రెరుగు నీ యుల్లాసిల్లేవు | alladAni yillu chErina nI yella rerugu nI yullAsillEvu |
| చరణం charaNam 3 | కమ్మ కెమ్మోవి కందిన గురుతులు కమ్మ దలచి యిట్లు గారడి చేసేవు | kamma kemmOvi kamdina gurutulu kamma dalachi yiTlu gAraDi chEsEvu |
| చరణం charaNam 4 | శేషశయన ద్విభాషి పుల్లకవిపోషా గోపాల పోరాటమేరా | SEshaSayana dvibhAshi pullakavipOshA gOpAla pOrATamErA |
#312 కోపమేలరా kOpamElarA
| Title | కోపమేలరా | kOpamElarA |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | కోపమేలరా నాపైని నా మనోహరా ఆపరాని మోహ విరహ తాప మందుచుంటిరా ఇంత కోపమేలరా | kOpamElarA nApaini nA manOharA AparAni mOha viraha tApa manduchunTirA inta kOpamElarA |
| చరణం charaNam 1 | సంతతంబు నిన్నె కోరి చెంత చేరి యుంటిరా వింత కౌగిలింతతో మరింత వలపుమించెరా యింత | samtatambu ninne kOri chemta chEri yunTirA vimta kaugilimtatO marinta valapumincherA yimta |
| చరణం charaNam 2 | హెవెన్ మన్యు నుండి నీకు లెటర్స్ బంపగా నెవర్ మైండ్ లవర్ ఫ్రెండ్‌ని యువర్ విల్‌గాగ వయు రావైతివి | heven manyu numDi nIku leTars bampagA nevar mainD lavar frenD^ni yuvar vil^gAga vayu rAvaitivi |
| చరణం charaNam 3 | పొదన్ పొదన్ గదల్చి తుమ్మెదల్ రొదల్ మొదల్పగా మొదల్ మరుండెదన్ శరాల్ గుదుల్ గుదుల్ గుదుల్ గదున్చెరా | podan podan gadalchi tummedal rodal modalpagA modal marunDedan SarAl gudul gudul gudul gadun&cherA |
| చరణం charaNam 4 | ఆస బాస జేసి యీని రాస నీ విలాసమా కేశవా ద్విభాషి పుల్లకవీశ మద్వికాసమా | Asa bAsa jEsi yIni rAsa nI vilAsamA kESavA dvibhAshi pullakavISa madvikAsamA |
#311 మందయాన mandayAna
| Title | మందయాన | mandayAna |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | అఠాణ | aThANa |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | మందయాన నీ పొందుగోరి నను బంపింది రార సామీ | mandayAna nI pondugOri nanu bampimdi rAra sAmI |
| చరణం charaNam 1 | మందయాన నీ పొందుగోరినది పసందు మీరిన అందగత్తెర సందడించి రతులందమంద నందరసము పొలుపొందజేయ విను గొందువనుచు నీయందు చాల భ్రమ జెంది నాతొ దెల్పింది నన్ను బంపింది వహ్వ పూసింది నిన్ను రమ్మంది సుందరరాచెందొవ విందుచే కందియుందిరా నీయందు ప్రేమచే చిందర వందర చెందం పొందర | mandayAna nI pondugOrinadi pasandu mIrina andagattera samdaDimchi ratulamdamamda namdarasamu polupomdajEya vinu gomduvanuchu nIyamdu chAla bhrama jemdi nAto delpindi nannu bampindi vahva pUsindi ninnu rammandi sundararAchendova vinduchE kandiyundirA nIyandu prEmachE chindara vandara chendam pondara |
| చరణం charaNam 2 | బాలకురులు నీలాలు కనులు మీవాలు పలువరుస జాలు మంచి ముత్యాలు మోవి పగడాలు జురిడీలు గావు మురిడీలు చేతుల పిడేలు బాడగలశీల చెవులు చెక్రాలు మాటలు వరాలు చెక్కగద వీలు నెలయు కపురాలు కవకుదగు పాలు వయసు నీపాలు తనువు జిగి జాళువా సుమీ బాల నీవు రతినేల గాదగు లీలలమరిన గోలర మేలుగ నేలర కేళిని | bAlakurulu nIlAlu kanulu mIvAlu paluvarusa jAlu manchi mutyAlu mOvi pagaDAlu juriDIlu gAvu muriDIlu chEtula piDElu bADagalaSIla chevulu chekrAlu mATalu varAlu chekkagada vIlu nelayu kapurAlu kavakudagu pAlu vayasu nIpAlu tanuvu jigi jALuvA sumI bAla nIvu ratinEla gAdagu lIlalamarina gOlara mEluga nElara kELini |
| చరణం charaNam 3 | సుళ్ళు సిరులొసంకళ్ళు బొరులు దిళ్ళు దాని పాలిళ్ళు మొల్ల పూచెళ్ళు చెలువమగు వళ్ళు కెరటముల జాళ్ళు బాహువుల నీళ్ళు తామరల తూళ్ళు కిసలములు వేళ్ళు తారకలు గోళ్ళు పిక్కలు మొసళ్ళు కలికి మీగాళ్ళ సౌరు తాబేళ్ళ సరి పదారేళ్ళ వయసురా యేళ్ళ కొలది వేయి నోళ్ళ నుతించి న వల్ల గాదు పెరుమాళ్ళ కృపనయిన | suLLu sirulosamkaLLu borulu diLLu dAni pAliLLu molla pUcheLLu cheluvamagu vaLLu keraTamula jALLu bAhuvula nILLu tAmarala tULLu kisalamulu vELLu tArakalu gOLLu pikkalu mosaLLu kaliki mIgALLa sauru tAbELLa sari padArELLa vayasurA yELLa koladi vEyi nOLLa nutimchi na valla gAdu perumALLa kRpanayina |
| చరణం charaNam 4 | బోటి చక్కెరల పేటి యెల్ల రతితోవి కూటమికి సాటియై తగు వధూటి సుందరా బోటి గుబ్బలు కొనగోట మీట నెంతొ పాటమౌర నీవాటల పాటల కూటమి గూడర | bOTi chakkerala pETi yella ratitOvi kUTamiki sATiyai tagu vadhUTi sundarA bOTi gubbalu konagOTa mITa nemto pATamaura nIvATala pATala kUTami gUDara |
| చరణం charaNam 5 | కంబుకౌను సుముఖంబు చందురుని సఖంబు గళము శంఖంబు కన్నుల సుఖంబు దానియందంబు మోవి బింబంబు పలుకు మధురంబు మేని నా సంబు సుతల పుష్పంబు నుదుట తిలకంబు హొయల్ గల కంబుకంఠిరా డింబుమీర సురతంబు లందు సారంబు గలది పూనంబగు చుంబునలంబ విజృంభిత | kambukaunu sumukhambu chamduruni sakhambu gaLamu Samkhambu kannula sukhambu dAniyamdambu mOvi bimbambu paluku madhurambu mEni nA sambu sutala pushpambu nuduTa tilakambu hoyal gala kambukamThirA DimbumIra suratambu lamdu sArambu galadi pUnambagu chumbunalamba vijRmbhita |
| చరణం charaNam 6 | శేష శయన ద్విభాషి పుల్లకవి పోష సుందరీ భూషితాంగ సంతోష హృదయ మృదుభాషకు ప్రియా వాసి మీద దానితో సురతములను జేసి మెలగుము వికాస ముఖాసర నాదయారస | SEsha Sayana dvibhAshi pullakavi pOsha sundarI bhUshitAmga samtOsha hRdaya mRdubhAshaku priyA vAsi mIda dAnitO suratamulanu jEsi melagumu vikAsa mukhAsara nAdayArasa |
#310 చంచలాక్షి chamchalAkshi
| Title | చంచలాక్షి | chamchalAkshi |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | చంచలాక్షి నిన్వరించి నన్ను బంచెర | chamchalAkshi nin&varimchi nannu banchera |
| 2 | యెంచగ గ్రొమ్మించు మించు జెలి మంచి మేను | yemchaga gromminchu minchu jeli manchi mEnu |
| 3 | అంచలు భ్రమించు నడలంచు వచియించవచ్చు కాంచనాంబర దాని గాంచిన మోహించె ఔర | anchalu bhraminchu naDalanchu vachiyinchavachchu kAnchanAmbara dAni gAmchina mOhinche aura |
| 4 | పంచశర రూపశర పంచకముల బల్మరు పంచబాణుదించు బోడి బొంచి యేసి ముంచెనుర | panchaSara rUpaSara panchakamula balmaru panchabANudimchu bODi bonchi yEsi munchenura |
| 5 | చంచరీక వేణి దొడ్డి పంచాది గదిలో పట్టి మంచమున శయనించి తపించెను రకింతచేత | chancharIka vENi doDDi panchAdi gadilO paTTi manchamuna Sayanimchi tapinchenu rakintachEta |
| 6 | అంచితముగ నిన్ను బూజించు యజ్ఞన్నకవి గాంచి పోషించు కృష్ణ వేంచేసి కరంచుమిక | anchitamuga ninnu bUjinchu yajnannakavi gAmchi pOshinchu kRshNa vEmchEsi karamchumika |