| Title | పలుకరించిన | palukarinchina |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ముఖారి | mukhAri |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | పలుకరించిన గాని పలుకక పొయ్యేవు పడతి నీ గర్వమేమే | palukarinchina gAni palukaka poyyEvu paDati nI garvamEmE |
| అనుపల్లవి anupallavi | తలచిన వేయారు తరుణుల చేకొన్న కలిగి గోపాలు చనవలె నటీ నా పేరు | talachina vEyAru taruNula chEkonna kaligi gOpAlu chanavale naTI nA pEru |
| చరణం charaNam 1 | తియ్యని కెమ్మైని తేనెలానగను సయ్యాటల ప్రొద్దు జరుప నోపవా పయ్యదను తొలగించి పాలిండ్లపై నొక్క చెయ్యి నేనటు వెయ్య నిచ్చెదనా | tiyyani kemmaini tEnelAnaganu sayyATala proddu jarupa nOpavA payyadanu tolaginchi pAlinDlapai nokka cheyyi nEnaTu veyya nicchedanA |
| చరణం charaNam 2 | మోము మోమున జేర్చి ముద్దు పెట్టుచు నీవు వేమారు నన్ను నవ్వించ నోపుదువా భామరో యొకసారి పలుకులు పలుకుచు ప్రేమతో రామన్న పిలుప పంపెదవా | mOmu mOmuna jErchi muddu peTTuchu nIvu vEmAru nannu navvincha nOpuduvA bhAmarO yokasAri palukulu palukuchu prEmatO rAmanna pilupa pampedavA |
| చరణం charaNam 3 | ఎక్కువగా నన్నేలుకొమ్మన్న గ్రక్కున గళబంట కౌగలించెదవా మక్కువ తోడుత మువ్వ గోపాల రమ్మని యొక్కసారైన నను నుండనిచ్చెదవా | ekkuvagA nannElukommanna grakkuna gaLabanTa kougalinchedavA makkuva tODuta muvva gOpAla rammani yokkasAraina nanu nunDanicchedavA |
Tag: Telugu
1290 రమ్మనవే rammanavE
| Title | రమ్మనవే | rammanavE |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | కేదార | kEdAra |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | రమ్మనవే సుముఖాన రాయబారము లేవే | rammanavE sumukhAna rAyabAramu lEvE |
| అనుపల్లవి anupallavi | కమ్మువిల్తుని గన్న చక్కని మువ్వ గోపాలుని | kammuviltuni ganna chakkani muvva gOpAluni |
| చరణం charaNam 1 | సొగసు జేసుక వచ్చి సుదతు లందరు జూడ వగలు చేసి పతల వాకిట నిలిచి తెగనాడే విధమేమో దినదినము క్రొత్తలాయ చిగురు బోణిరో వచ్చి యెంత సేపాయెనో | sogasu jEsuka vacchi sudatu landaru jUDa vagalu chEsi patala vAkiTa nilichi teganADE vidhamEmO dinadinamu krottalAya chiguru bONirO vacchi yenta sEpAyenO |
| చరణం charaNam 2 | ఇరవంద నిన్న మా యింటి వరకు వచ్చి తిరుగ వేంచేసెనట సరి ప్రొద్దు వేళ విరిబోణి యెవ్వరో వేళ గాదనిరట తరుణిరో మేమంత దొరలమా బాగాదు | iravanda ninna mA yinTi varaku vacchi tiruga vEnchEsenaTa sari proddu vELa viribONi yevvarO vELa gAdaniraTa taruNirO mEmanta doralamA bAgAdu |
| చరణం charaNam 3 | రానురో తానెన్నడు రాలేదో పోలేదో కాముకేళిని నన్ను గలయలేదో ఏమే నేనందాక యెదురుగా రావలెనో మా మువ్వ గోపాలుడు మనసు శోధించెనేమో | rAnurO tAnennaDu rAlEdO pOlEdO kAmukELini nannu galayalEdO EmE nEnandAka yedurugA rAvalenO mA muvva gOpAluDu manasu SOdhinchenEmO |
1288 అలగితి వెందుకు alagiti venduku
| Title | అలగితి వెందుకు | alagiti venduku |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | భైరవి | bhairavi |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | అలగితి వెందుకు అల మువ్వ గోపాలునితో ఆయాయపోవే | alagiti venduku ala muvva gOpAlunitO AyAyapOvE |
| అనుపల్లవి anupallavi | నెలతరో నీవంటి నిర్దయురాలను యిలనెందు గాన యిది యేమి వానిపై | nelatarO nIvanTi nirdayurAlanu yilanendu gAna yidi yEmi vAnipai |
| చరణం charaNam 1 | భామరో! నీ మది కేమి దెలుపుదు కోమలాంగుడు నిన్నె కోరి యుండగను వేమారు నీవేమొ వేడి నావనినాడు నోము ఫలమని నొచ్చు కొన్నాడట | bhAmarO! nI madi kEmi delupudu kOmalAnguDu ninne kOri yunDaganu vEmAru nIvEmo vEDi nAvaninADu nOmu phalamani nocchu konnADaTa |
| చరణం charaNam 2 | వలువ చక్కెర పురి నిలయుని మదిలో వల వేసి నను వలపించ లేద కళలూర రతి కేళి కలసిన పిమ్మట చెలువుడ నీ పొందు చాలు పొమ్మని | valuva chakkera puri nilayuni madilO vala vEsi nanu valapincha lEda kaLalUra rati kELi kalasina pimmaTa cheluvuDa nI pondu chAlu pommani |
| చరణం charaNam 3 | ఎనసిన వానిపై కినుక సేయుట నీకు మనసి యెటువలె వచ్చెనె మానవతిరో నెనరు గల దానవని నీ విభుడు యిందు రాగానే వనజాక్షిరో వాని వలపు లారడి జేసి | enasina vAnipai kinuka sEyuTa nIku manasi yeTuvale vacchene mAnavatirO nenaru gala dAnavani nI vibhuDu yindu rAgAnE vanajAkshirO vAni valapu lAraDi jEsi |
1287 ఏమనెనె సుద్దు Emanene suddu
| Title | ఏమనెనె సుద్దు | Emanene suddu |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | నాదనామక్రియ | nAdanAmakriya |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏమనెనె సుద్దు లేమనెనే! బంగారు బొమ్మ | Emanene suddu lEmanenE! bangAru bomma |
| అనుపల్లవి anupallavi | ఏమనెనే మరుగేల దాచకే రామ తుపాకుల రాయడు నీతో | EmanenE marugEla dAchakE rAma tupAkula rAyaDu nItO |
| చరణం charaNam 1 | మానిని! ముందుగా నా మాట నీవెత్తితివో తానె పలుకరించెనో దయ నాపయి గలిగి కానుక తన చేత బూనెనో యందిమ్మని యానతీవే నా మీదాన యో చెలియ | mAnini! mundugA nA mATa nIvettitivO tAne palukarinchenO daya nApayi galigi kAnuka tana chEta bUnenO yamdimmani yAnatIvE nA mIdAna yO cheliya |
| చరణం charaNam 2 | వనితరో! వాడీడకు వచ్చెననెనో లేక నను తోడి తెమ్మనెనో నా ప్రాణ విభుడు నెనరుతో మాటాడనో నేరమించెనో లేక వినుపింపు వాని మాట విన ముచ్చటయ్యేని | vanitarO! vADIDaku vacchenanenO lEka nanu tODi temmanenO nA prANa vibhuDu nenarutO mATADanO nEraminchenO lEka vinupimpu vAni mATa vina mucchaTayyEni |
| చరణం charaNam 3 | వేడుక దుపాకుల వేంకట కృష్ణుడు గూడే వేళలో నే వోడితినని నేడా సుద్దు లేమైనా నీతో మందలించెనో మోదిగా నున్నాడో ముదితరో యేమె | vEDuka dupAkula vEnkaTa kRshNuDu gUDE vELalO nE vODitinani nEDA suddu lEmainA nItO mandalinchenO mOdigA nunnADO muditarO yEme |
1286 సామికి సరి sAmiki sari
| Title | సామికి సరి | sAmiki sari |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ముఖారి | mukhAri |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సామికి సరి ఎవ్వరి నా చక్కని | sAmiki sari evvari nA chakkani |
| అనుపల్లవి anupallavi | భామరో తిరువళ్ళూరి వీర రాఘవ | bhAmarO tiruvaLLUri vIra rAghava |
| చరణం charaNam 1 | నెలతరో యెప్పుడైన నేనె చెక్కిలి జీరి కలగి యెరుల లేకయే చెలియ జీరెనంట తెలుగు కొమ్మను గాని యలగి మారు బలుకక చలి యించని నిండు కుండ వలె నుండునమ్మ | nelatarO yeppuDaina nEne chekkili jIri kalagi yerula lEkayE cheliya jIrenanTa telugu kommanu gAni yalagi mAru balukaka chali yinchani ninDu kunDa vale nunDunamma |
| చరణం charaNam 2 | కదసి నేనే వాని గంటి చేసి మరపున వదరి యీ లాగుననే పడతి యుంచెనందునె ఆదరిన కోపగించిన అలసిన సొలసిన మదిరాక్షి రాచిత్తము సమ్మతి బరుచు నమ్మ | kadasi nEnE vAni ganTi chEsi marapuna vadari yI lAgunanE paDati yunchenandune Adarina kOpaginchina alasina solasina madirAkshi rAchittamu sammati baruchu namma |
| చరణం charaNam 3 | భామరో మా మువ్వ గోపాలుడే వీర రాఘవుడు కాముకేళి హొయలుగ గలసి యుండగ ఏ మగువ వద్దనైన యీలాగుందునో యంటి ఈ మాటలెట్లంటినని యెంతో యుస్సురనెనమ్మ | bhAmarO mA muvva gOpAluDE vIra rAghavuDu kAmukELi hoyaluga galasi yunDaga E maguva vaddanaina yIlAgundunO yanTi I mATaleTlanTinani yentO yussuranenamma |
1285 ఏమి సేతురా ప్రాణేశ Emi sEturA prANESa
| Title | ఏమి సేతురా ప్రాణేశ | Emi sEturA prANESa |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | కేదార గౌళ | kEdAra gouLa |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | ఏమి సేతురా ప్రాణేశ నేనెటువలె తాళుదురా | Emi sEturA prANESa nEneTuvale tALudurA |
| అనుపల్లవి anupallavi | ఏమో కాని నిన్నెడ బాసినపుడె ఈ మేన ప్రానము లేమిటికని తోచీ | EmO kAni ninneDa bAsinapuDe I mEna prAnamu lEmiTikani tOchI |
| చరణం charaNam 1 | ఒక మాటు నీ మోవానక ఒక పుస్తవు జిహ్వకు జవిగాడు చేదయ్యీరా మకురు మనసి నీతో మచ్చికై యున్నట్లు వేనొక చోటను మోద మొంద నీయదెందు | oka mATu nI mOvAnaka oka pustavu jihvaku javigADu chEdayyIrA makuru manasi nItO macchikai yunnaTlu vEnoka chOTanu mOda monda nIyadendu |
| చరణం charaNam 2 | నీ మాటలు వినవే కాని వేరేమియు వీనుల కితవుగాదు నీ ముద్దు మోము చూడనె కాని యితరము కామింప నొల్లవు కన్ను లయ్యయ్యో | nI mATalu vinavE kAni vErEmiyu vInula kitavugAdu nI muddu mOmu chUDane kAni yitaramu kAmimpa nollavu kannu layyayyO |
| చరణం charaNam 3 | ఎలమితో మువ్వ గోపాల యిపుడు నిన్ను నా యెదపై నలము కొన మన సయ్యీరా చెలరేగి రతుల సెంతసేపు కూడి యలసిన తనివి తేరదెందు | elamitO muvva gOpAla yipuDu ninnu nA yedapai nalamu kona mana sayyIrA chelarEgi ratula sentasEpu kUDi yalasina tanivi tEradendu |
1284 ఏలా దయ ElA daya
| Title | ఏలా దయ | ElA daya |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | కల్యాణి | kalyANi |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | ఏలా దయ నేల రానే నీకు పగదాన నటరా | ElA daya nEla rAnE nIku pagadAna naTarA |
| అనుపల్లవి anupallavi | చాలా వలచినాను రాజగోపాలా | chAlA valachinAnu rAjagOpAlA |
| చరణం charaNam 1 | చనువియ్యవు నాకింత చలమేలర నీకింత ననువంటిది నీకు వింత గోపాలా | chanuviyyavu nAkinta chalamElara nIkinta nanuvanTidi nIku vinta gOpAlA |
| చరణం charaNam 2 | తరితీవేల చేసేవు తగవా యింటికి రావు కరుణతో నను జూడవు గోపాలా | taritIvEla chEsEvu tagavA yinTiki rAvu karuNatO nanu jUDavu gOpAlA |
| చరణం charaNam 3 | శ్రీనిధి మువ్వ గోపాల చెలుల తనను చాల లాలించి యేలితి నీ లీల గోపాలా | SrInidhi muvva gOpAla chelula tananu chAla lAlinchi yEliti nI lIla gOpAlA |
1283 వలపు నిలువ valapu niluva
| Title | వలపు నిలువ | valapu niluva |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | భైరవి | bhairavi |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | వలపు నిలువ నాదు వశము గాదేమి సేతు వనితరో ఈ వేళ | valapu niluva nAdu vaSamu gAdEmi sEtu vanitarO I vELa |
| అనుపల్లవి anupallavi | పొలతిరో మా మువ్వ గోపాల రాయడు చలము చేసినాడు | polatirO mA muvva gOpAla rAyaDu chalamu chEsinADu |
| చరణం charaNam 1 | చలువ గంధము నిరుల సరము లేలేపొమ్ము లేలే సాలపైన మీ సొగసు జూచే వారెవ్వరే చెలియరో సేడది చెప్ప సక్కెము గాదు వలపైన యీ పాపము వద్దే పగ వారికైన | chaluva gandhamu nirula saramu lElEpommu lElE sAlapaina mI sogasu jUchE vArevvarE cheliyarO sEDadi cheppa sakkemu gAdu valapaina yI pApamu vaddE paga vArikaina |
| చరణం charaNam 2 | చిలుక తేజీ పైనెక్కి చెలరేగి యెదురెక్కి విలు గుణ ధ్వని చేసి విరి శరము బూని కులుకు గుబ్బల నడుమ గురి జూచు చున్నాడే అలరు విల్తుని బారి నార్చే వారెవ్వరిక | chiluka tEjI painekki chelarEgi yedurekki vilu guNa dhvani chEsi viri Saramu bUni kuluku gubbala naDuma guri jUchu chunnADE alaru viltuni bAri nArchE vArevvarika |
| చరణం charaNam 3 | సరసకు రాడాయె సరి ప్రొద్దు వేళాయె విరహము మెండాయే వెన్నెల కాకాయె మరుని కేళిలో నన్ను మువ్వ గోపాలుడు సరసముతో పెనగి చౌక చేసినాడిక | sarasaku rADAye sari proddu vELAye virahamu menDAyE vennela kAkAye maruni kELilO nannu muvva gOpAluDu sarasamutO penagi chouka chEsinADika |
1282 ఇంత రావు inta rAvu
| Title | ఇంత రావు | inta rAvu |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | వసంత భైరవి | vasanta bhairavi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఇంత రావు జేసితె నేనెటులోర్తునె | inta rAvu jEsite nEneTulOrtune |
| అనుపల్లవి anupallavi | ఇంతి మువ్వ గోపాలుడు వింత దాని వలె నన్ను | inti muvva gOpAluDu vinta dAni vale nannu |
| చరణం charaNam 1 | మొదల వాడీడకు వచ్చి మ్రొక్కి పొంద వలనెన్న సదయుడ వద్దు నేస్తమే చాలునంటినె కదసి నా మాట వినక కాళ్ళ వేళ్ళ బెనగుచు పది వేల బాసలు చేసి బాయ జాలననే వాడు | modala vADIDaku vacchi mrokki ponda valanenna sadayuDa vaddu nEstamE chAlunanTine kadasi nA mATa vinaka kALLa vELLa benaguchu padi vEla bAsalu chEsi bAya jAlananE vADu |
| చరణం charaNam 2 | మనసు దెలియ వలసి మా యింటికి రావద్దన్న కనుగొన దిటవు లేక కన్నీరు నించెనె నీ ఎనకొన్న తమకాన పెదవులే దడవుచు నిను బాయలేనని వెలత బ్రతిమాలినవా | manasu deliya valasi mA yinTiki rAvaddanna kanugona diTavu lEka kannIru ninchene nI enakonna tamakAna pedavulE daDavuchu ninu bAyalEnani velata bratimAlinavA |
| చరణం charaNam 3 | నీ మాట నమ్మరాదోయి నే చాల గోప గత్తెను ఏమన్న నేమి వచ్చునో ఎందుకుంటినె మోము జూచి వాడు తన మోహమె పూటకావని కోమలిరో మువ్వ గోపాలుడు నను గూడి | nI mATa nammarAdOyi nE chAla gOpa gattenu Emanna nEmi vacchunO endukunTine mOmu jUchi vADu tana mOhame pUTakAvani kOmalirO muvva gOpAluDu nanu gUDi |
1281 ఇంతే మోహము intE mOhamu
| Title | ఇంతే మోహము | intE mOhamu |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | మధ్యమావతి | madhyamAvati |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | ఇంతే మోహము లేని దిపుడు తెలిసె గదరా | intE mOhamu lEni dipuDu telise gadarA |
| అనుపల్లవి anupallavi | పంతగించి మువ్వ గోపాల రావైతివి | pantaginchi muvva gOpAla rAvaitivi |
| చరణం charaNam 1 | నీవు వచ్చిన మొదలు నిమిషమే యుగముగా మా వనిత యొంటిగా మదిగుందుచు భావమున దనుదానె పలుమారు నొచ్చుచు ఈ వేళ దాక భుజియించకనె యున్నది | nIvu vacchina modalu nimishamE yugamugA mA vanita yonTigA madigunduchu bhAvamuna danudAne palumAru nocchuchu I vELa dAka bhujiyinchakane yunnadi |
| చరణం charaNam 2 | నెనరైన మమువంటి నెలతలతో చలుకక కను మూసి తానొక గడియ నిద్రింపక గొనబు సొమ్ము బెట్టక కొప్పు చుక్కమునక మనసిజుని కాకచే గనలుచు నున్నది | nenaraina mamuvanTi nelatalatO chalukaka kanu mUsi tAnoka gaDiya nidrimpaka gonabu sommu beTTaka koppu chukkamunaka manasijuni kAkachE ganaluchu nunnadi |
| చరణం charaNam 3 | వలచిన చెలి నెడబాసి యీరీతిగా జలము జేసెదవు నవ్వుల కైన దొలుత గలసిన వాడ విట్ల అలగిన దెల్ల మా నెలత చేసిన పాప ఫలమేమో అకట | valachina cheli neDabAsi yIrItigA jalamu jEsedavu navvula kaina doluta galasina vADa viTla alagina della mA nelata chEsina pApa phalamEmO akaTa |