#801 వగల వయ్యారి vagala vayyAri

Titleవగల వయ్యారిvagala vayyAri
Written Byపట్రాయని సీతారామశాస్త్రిpaTrAyani sItArAmaSAstri
BookBunch of jAvaLis
రాగం rAgaకాపిkApi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviవగల వయ్యారి అదిరా ఆ చిన్నారి
వగల వయ్యారి అదిరా
vagala vayyAri adirA A chinnAri
vagala vayyAri adirA
అనుపల్లవి anupallaviసొగసరి జవరాలు తగినింటి మగనాలు
మురిపాల హొయల మైమరపించు ప్రియురాలు
sogasari javarAlu tagininTi maganAlu
muripAla hoyala maimarapinchu priyurAlu
చరణం
charaNam 1
అత్తా మామల వదిన బావా మరదుల
మగని చిత్త మెరిగిన నెరజాణ యదిరా
సరస సరాగాల చనవైన నయగారాల
హితులు సన్నిహితు లోహోయని మెచ్చే
attA mAmala vadina bAvA maradula
magani chitta merigina nerajANa yadirA
sarasa sarAgAla chanavaina nayagArAla
hitulu sannihitu lOhOyani mechchE
చరణం
charaNam 2
ఇంపైన మాటల సొంపైన పాటల
తీరైన నడతల తీయని వలపుల
నెనరైన పెనిమిటి మనసు దోచి
తనువు నెమ్మనము తనివోవజేసే
impaina mATala sompaina pATala
tIraina naDatala tIyani valapula
nenaraina penimiTi manasu dOchi
tanuvu nemmanamu tanivOvajEsE

#800 మోసపోతినే mOsapOtinE

TitleమోసపోతినేmOsapOtinE
Written Byకవి రంగదాసkavi rangadAsa
Book
రాగం rAgaకానడkAnaDa
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviమోసపోతినే చెలియా మోసపోతినే
మోహనాంగుని చేరి నే
వాని మాట నమ్మి నే
mOsapOtinE cheliyA mOsapOtinE
mOhanAnguni chEri nE
vAni mATa nammi nE
అనుపల్లవి anupallaviఆశలు పెట్టి నాపై దోసమెంచెనేASalu peTTi nApai dOsamenchenE
చరణం
charaNam 1
వద్దంటే నాతో కూడి ముద్దు ముద్దుగా మాటలాడి
నిద్దుర పోయే వేళ సద్దు లేక పోయినాడె
vaddanTE nAtO kUDi muddu muddugA mATalADi
niddura pOyE vELa saddu lEka pOyinADe
Audio Linkhttps://www.youtube.com/watch?v=46jNyT4utHU