#692 ఏమి మేము Emi mEmu

Titleఏమి మేముEmi mEmu
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaఆనందభైరవిAnandabhairavi
తాళం tALaఆది (తిశ్రగతి)Adi (tiSragati)
పల్లవి pallaviఏమి మేము సానివారము
కుంభిని పూర్ణ సోమలింగ తమకు న్యాయమా
Emi mEmu sAnivAramu
kumbhini pUrNa sOmalinga tamaku nyAyamA
అనుపల్లవి anupallaviనా మనోహరుండు నేను కాముకేళి నుండువేళ
కావరమున వచ్చి నన్ను కామినీ రమ్మని యెదవు
nA manOharunDu nEnu kAmukELi nunDuvELa
kAvaramuna vachchi nannu kAminI rammani yedavu
చరణం
charaNam 1
ఇంటి మగను వలెను వెంటను భయము లేక
జంట బాయవేమి సేతురా కాని వాడు నా మగండు
కత్తి చేతను మరువడిపుడు
నీవు నేను పట్టుబడిన పూని హాని పరచునోయి
inTi maganu valenu venTanu bhayamu lEka
janTa bAyavEmi sEturA kAni vADu nA maganDu
katti chEtanu maruvaDipuDu
nIvu nEnu paTTubaDina pUni hAni parachunOyi
చరణం
charaNam 2
వెరువకా మా పెరటి లోపలా సన్నజాజుల విరుల తోట
మరుగు నీడల మరుగు నుండి నన్ను బిలచి మరుని కేళి గూడినావు
యిరుగు పొరుగు వారు జూచిన పరువు మరువు బోవు నోయి
veruvakA mA peraTi lOpalA sannajAjula virula tOTa
marugu nIDala marugu nunDi nannu bilachi maruni kELi gUDinAvu
yirugu porugu vAru jUchina paruvu maruvu bOvu nOyi

#691 ఇద్దరి పొందేల iddari pondEla

Titleఇద్దరి పొందేలiddari pondEla
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఆదిAdi
Previously Posted At331, 207
పల్లవి pallaviఇద్దరి పొందేలరా స్వామి ఇక
దానింటికే పోరా అల దానింటికే పోరా
iddari pondElarA svAmi ika
dAninTikE pOrA ala dAninTikE pOrA
అనుపల్లవి anupallaviసద్దేల చేసేవు స్వామిక నేనోర్వ
వద్దిక నీవు రావద్దురా వద్దురా
saddEla chEsEvu svAmika nEnOrva
vaddika nIvu rAvaddurA vaddurA
చరణం
charaNam 1
కన్నులు ఎరుపేమిరా చెక్కులు కాటుక నలుపేమిరా
కన్నుల విలుకాని కయ్యాన మెలిగిన చిన్నెవై తోచెర చెప్పుర చెప్పుర
kannulu erupEmirA chekkulu kATuka nalupEmirA
kannula vilukAni kayyAna meligina chinnevai tOchera cheppura cheppura
చరణం
charaNam 2
నాజోలి నీకేలరా ఆ బ్రహ్మ నిన్నెట్టు పుట్టించెరా
ఏ జాము దానింట నీ జాడ నే జూడ బేజారి బేజారి నేజెల్ల నేజెల్ల
nAjOli nIkElarA A brahma ninneTTu puTTincherA
E jAmu dAninTa nI jADa nE jUDa bEjAri bEjAri nEjella nEjella
This is a jAvaLi by dAsu SrIrAmulu, as per previous posts. ఇంతకు ముందు ప్రచురించబడిన జావళీల ఆధారంగా ఇది దాసు శ్రీరాములు గారి జావళి.