#659 వేగ నీవు vEga nIvu

Titleవేగ నీవుvEga nIvu
Written Byరామనాధపురం శ్రీనివాసయ్యంగార్rAmanAdhapuram SrInivAsayyamgAr
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviవేగ నీవు వాని రమ్మనవే ఓ చెలియvEga nIvu vAni rammanavE O cheliya
అనుపల్లవి anupallaviనాగరికముగ దెలిపి నా వెతలను దీర్చుటకిటుnAgarikamuga delipi nA vetalanu dIrchuTakiTu
చరణం
charaNam 1
దీన దయాకరుడు నాతో దినే దినే మాటలాడి
వీనుల కింపుగ పాడి వినిపించినది ఎటు మరతునే
dIna dayAkaruDu nAtO dinE dinE mATalADi
vInula kimpuga pADi vinipinchinadi eTu maratunE
చరణం
charaNam 2
అందమైన రతి కేళిలో అమితముగా సుఖ పరచిన
మందహాస వదను వినా మరి ఎవరిని దలచలేనే
andamaina rati kELilO amitamugA sukha parachina
mandahAsa vadanu vinA mari evarini dalachalEnE
చరణం
charaNam 3
గాన రసిక శిఖామణిని గానక అర నిమిష ముండను
వానర రక్షకుడౌ శ్రీనివాసునితో వగల దెలిపి
gAna rasika SikhAmaNini gAnaka ara nimisha munDanu
vAnara rakshakuDau SrInivAsunitO vagala delipi
AV Linkhttps://www.youtube.com/watch?v=DQq33AtOVz4

#658 నీ మాట nI mATa

Titleనీ మాటnI mATa
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaపూరి కల్యాణిpUri kalyANi
తాళం tALaమిశ్ర లఘుmiSra laghu
పల్లవి pallaviనీ మాటా లేమాయెనుర! సామి బల్కరnI mATA lEmAyenura! sAmi balkara
అనుపల్లవి anupallaviఏమేమో బోధించి నన్నేమార జేసేవలEmEmO bOdhinchi nannEmAra jEsEvala
చరణం
charaNam 1
చక్కని సామివలె చెక్కిలి నొక్కి రవ మొక్కెర
నీ కిచ్చేనని టక్కులచే సొక్కించిన
chakkani sAmivale chekkili nokki rava mokkera
nI kichchEnani TakkulachE sokkinchina
చరణం
charaNam 2
మాటిమాటికి మరునాటలాడ బిల్చుచు
పాటీలు నే పంపేనని తాటోటముతో నీటిన
mATimATiki marunATalADa bilchuchu
pATIlu nE pampEnani tATOTamutO nITina
చరణం
charaNam 3
జాలము జేసి కలసేలి రతనాల జువికీల జత
పంపేనన్న తాలవన లోల అల
jAlamu jEsi kalasEli ratanAla juvikIla jata
pampEnanna tAlavana lOla ala
AV Linkhttps://www.youtube.com/watch?v=CCvZqFrlaVs
https://www.youtube.com/watch?v=qziLbVQqEes

#657 మోహమెల్ల mOhamella

Titleమోహమెల్లmOhamella
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaమోహనmOhana
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviమోహమెల్ల దెలిసెను గదరా! మోహనాంగ! వినరmOhamella delisenu gadarA! mOhanAnga! vinara
అనుపల్లవి anupallaviదాహవంతుని సాటి నా గేహమున కేతెంచిన నీdAhavantuni sATi nA gEhamuna kEtenchina nI
చరణం
charaNam 1
మదిలో వంచనలనే యెంచి వదనమున మాధుర్య ముంచి
సుదతిపై నీ నెనరు నుంచి సదయుని తీరు నటించే నీ
madilO vanchanalanE yenchi vadanamuna mAdhurya munchi
sudatipai nI nenaru nunchi sadayuni tIru naTinchE nI
చరణం
charaNam 2
పరుపుపై నా కరము బట్టి మరువనని నా శిరము గొట్టి
సరసమాడి పూలుబట్టి తరుణి నెంచి తత్తరించే నీ
parupupai nA karamu baTTi maruvanani nA Siramu goTTi
sarasamADi pUlubaTTi taruNi nenchi tattarinchE nI
చరణం
charaNam 3
తాలవలోల నన్ను లాలనతో నేలు వేళ
చాల ప్రేమ తోను లేచి యా బాల నేల బోయిన నీ
tAlavalOla nannu lAlanatO nElu vELa
chAla prEma tOnu lEchi yA bAla nEla bOyina nI
AV Linkhttps://www.youtube.com/watch?v=sYR09dYazGA
https://www.youtube.com/watch?v=BKMGn0SFPBc

#656 అపదూరుకు apadUruku

TitleఅపదూరుకుapadUruku
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviఅపదూరుకు లోనైతినే చపల చిత్తము చేతనేapadUruku lOnaitinE chapala chittamu chEtanE
అనుపల్లవి anupallaviఏ పాపి నాపై దూరెనోగా ఏ పాపము లేకE pApi nApai dUrenOgA E pApamu lEka
చరణం
charaNam 1
వేడుకలు జూడనే ఈడు చెలుల తోడనే
కూడి అతని మేడ కేగితే వాడు నా చెలికాడనే
vEDukalu jUDanE IDu chelula tODanE
kUDi atani mEDa kEgitE vADu nA chelikADanE
చరణం
charaNam 2
సారెకు నా సామిని దారిని కని నవ్వితే
జారిణి యని ఊరి వారలు వేరె పేరిడి నన్ను పిల్చుట
sAreku nA sAmini dArini kani navvitE
jAriNi yani Uri vAralu vEre pEriDi nannu pilchuTa
చరణం
charaNam 3
చిరుత నాటి యుండిన గురుతుచే గుణవంతుడౌ
వరద తాళవనేశుని తోడు సరసమాడుచు కూడితినని
chiruta nATi yunDina gurutuchE guNavantuDau
varada tALavanESuni tODu sarasamADuchu kUDitinani

#655 బలిమి ఏల balimi Ela

Titleబలిమి ఏలbalimi Ela
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviబలిమి ఏల బాళామణి
అలవానితో పలుమారు నీకు
balimi Ela bALAmaNi
alavAnitO palumAru nIku
చరణం
charaNam 1
వాని పిలిచి బల్కేటి హీనత లెల్లను
అలివేణు లెరిగిన మన మానములు పోనే
vAni pilichi balkETi hInata lellanu
alivENu lerigina mana mAnamulu pOnE
చరణం
charaNam 2
ఏమోయని వేమరు నిన్నే నే మానితే నీవు మన
నేమ మెరుగక అతి ప్రేమగా మా దొర వినుచు
EmOyani vEmaru ninnE nE mAnitE nIvu mana
nEma merugaka ati prEmagA mA dora vinuchu
చరణం
charaNam 3
తాళవన లోలుని ఏ వేళ తలచుచు
వ్యాకుల పడనేల పలు వాలాయము గాను
tALavana lOluni E vELa talachuchu
vyAkula paDanEla palu vAlAyamu gAnu

#654 తారుమారు tArumAru

TitleతారుమారుtArumAru
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaనాటకురంజిnATakuranji
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviతారుమారు లాడేవేమే బజారిtArumAru lADEvEmE bajAri
అనుపల్లవి anupallaviనేరమెంచకనే కౌగలించ మంటేnEramenchakanE kaugalincha manTE
చరణం
charaNam 1
అంబుజాక్షిరో నే సంబ్రముగ
నీదు బింబాధర చుంబనంబు లివ్వమంటే
anbujAkshirO nE sambramuga
nIdu bimbAdhara chumbanambu livvamanTE
చరణం
charaNam 2
మోడి సేయక నాతోడ బల్కి కడు వేడుకన్
కర్పూర విడెమివ్వమంటే
mODi sEyaka nAtODa balki kaDu vEDukan
karpUra viDemivvamanTE
చరణం
charaNam 3
ప్రీతి మీరగనే సాదరంబుతో నీదు
లేత గుబ్బల నాచేతి కివ్వమంటే
prIti mIraganE sAdarambutO nIdu
lEta gubbala nAchEti kivvamanTE
చరణం
charaNam 4
తాళలేనే బాలికామణి నీ
తాళవనేశుని యేలుకోమంటే
tALalEnE bAlikAmaNi nI
tALavanESuni yElukOmanTE

#653 పారిపోవలెరా pAripOvalerA

TitleపారిపోవలెరాpAripOvalerA
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaబిలహరిbilahari
తాళం tALaరూపకrUpaka
Previously Posted At89
పల్లవి pallaviపారిపోవలెరా నీరజాప్తుడు వెడలెరాpAripOvalerA nIrajAptuDu veDalerA
అనుపల్లవి anupallaviనారీమణులు దారిని గని దూరేరు గనుకnArImaNulu dArini gani dUrEru ganuka
చరణం
charaNam 1
దూరిపోయిన క్రూరుడౌ మగడూరు జేరి యేమారడించెనే
ఆ రీతుల విచారించు కొర కేరా నేనిపుడే
dUripOyina krUruDau magaDUru jEri yEmAraDinchenE
A rItula vichArinchu kora kE rA nEnipuDE
చరణం
charaNam 2
భావమా గుణ భావముల్ తెలిసే విధమనే పాలిడించును
కేళితో నీకే దయనుచు కేరా నేనిపుడే
bhAvamA guNa bhAvamul telisE vidhamanE pAliDinchunu
kELitO nIkE dayanuchu kErA nEnipuDE

#652 తెలిసె వగలెల్ల telise vagalella

Titleతెలిసె వగలెల్లtelise vagalella
Written Byపట్టాభిరామయ్య??paTTAbhirAmayya??
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaబిలహరిbilahari
తాళం tALaఆదిAdi
Previously Posted At267
పల్లవి pallaviతెలిసె వగలెల్ల బాగాయెరా
బల్కేవు ఏలాగు సహింతురా
telise vagalella bAgAyerA
balkEvu ElAgu sahinturA
చరణం
charaNam 1
నన్నే నిరాకరించి ఏవేళ సవతితో
ఉల్లాస సల్లాప మోహమాట పాట చాలు
nannE nirAkarinchi EvELa savatitO
ullAsa sallApa mOhamATa pATa chAlu
చరణం
charaNam 2
శుకముల రవముల పికముల కలకల
రవములనే తాళ శ్యామరాజ ఈ పలుకు
Sukamula ravamula pikamula kalakala
ravamulanE tALa SyAmarAja I paluku
?? Identical lyrics were published as a jAvaLi by SrI chinnayya earlier. ఇంతకు ముందు ఇదే సాహిత్యము శ్రీ చిన్నయ్య గారి జావళిగా ప్రచురించడ మైనది.

#651 ఏమి మాయము Emi mAyamu

Titleఏమి మాయముEmi mAyamu
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఏమి మాయము జేసి పోతివి శ్యామ సుందరాంగ నాతోEmi mAyamu jEsi pOtivi SyAma sundarAnga nAtO
అనుపల్లవి anupallaviనా మనో భావంబులెల్ల వేమారు నే వెరిగియు నాయెడnA manO bhAvambulella vEmAru nE verigiyu nAyeDa
చరణం
charaNam 1
నీరు దాగిపుడే పారి వచ్చేనని తీరుగ తీరున జోరుగ బల్కేవే
సారి నోరూరగ దారి జూచెటటు క్రూర వేరె మీరిపోయె కొన
nIru dAgipuDE pAri vachchEnani tIruga tIruna jOruga balkEvE
sAri nOrUraga dAri jUcheTaTu krUra vEre mIripOye kona
చరణం
charaNam 2
మంగళ స్నానము రంగుగ జేసే ఉప్పొంగుచు
నీ మృదు అంగ సంగముతో కౌగలించేనని
వంగి వంగి శ్రీ మంగళాంగుడౌ తాళవనేశుని
mangaLa snAnamu ranguga jEsE upponguchu
nI mRdu anga sangamamutO kaugalinchEnani
vangi vangi SrI mangaLAnguDau tALavanESuni

#650 ఏమి సేయుదు Emi sEyudu

Titleఏమి సేయుదుEmi sEyudu
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaఫరజుfaraju
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఏమి సేయుదునటే ఏణాక్షిEmi sEyudunaTE ENAkshi
అనుపల్లవి anupallaviనోము ఫలమేమొ నాసామి కేసతి
నానామ మంటే కాకనే మేమన్నదో గాన
nOmu phalamEmo nAsAmi kEsati
nAnAma manTE kAkanE mEmannadO gAna
చరణం
charaNam 1
సరసుడు నన్నే సదా సరసమాడే సైకల
సారసాక్షి విని దూరనేమో గాన
sarasuDu nannE sadA sarasamADE saikala
sArasAkshi vini dUranEmO gAna
చరణం
charaNam 2
మేడపై మేమిర్వురు జోడు గూడే కడు
వేడుకెల్ల నాచేడె చెరిచెనే
mEDapai mEmirvuru jODu gUDE kaDu
vEDukella nAchEDe cherichenE
చరణం
charaNam 3
మొలక నవ్వుతోను మై పులకరించేలిన
తాళవనీశుని చాలించెనే సవతి
molaka navvutOnu mai pulakarinchElina
tALavanISuni chAlinchenE savati

15 May 2021: Minor correction