| Title | వారి వీరి జోలి | vAri vIri jOli |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | దాసు1893 | dAsu1893 |
| రాగం rAga | ద్విజావంతి | dvijAvanti |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | వారి వీరి జోలి నాకేలర సామి వద్దు వద్దు చాలురా నోరు మూసుకొని యూరకున్న గాని తీరదాయెర దాని పోరు నేనేమి సేతు ॥వారి వీరి॥ | vAri vIri jOli nAkElara sAmi vaddu vaddu chAlurA nOru mUsukoni yUrakunna gAni tIradAyera dAni pOru nEnEmi sEtu ~||vAri vIri~|| |
| చరణం charaNam 1 | అలదానితో నీవు కలిసి కులుకు చున్ననదే నాకు పదివేలురా వలపు నాపై నీకు కలుగకున్న నేమి తొలు నోము ఫలమని తలచితినే గాని ॥వారి వీరి॥ | aladAnitO nIvu kalisi kuluku chunnanadE nAku padivElurA valapu nApai nIku kalugakunna nEmi tolu nOmu phalamani talachitinE gAni ~||vAri vIri~|| |
| చరణం charaNam 2 | వల వల కన్నీరు వరదలై పారగా తల వ్రాసగా దైవము నిలిచితో నింక పలుకు లేటికిరా అలరు తేనియ విసమైన గ్రోలెద గాని ॥వారి వీరి॥ | vala vala kannIru varadalai pAragA tala vrAsagA daivamu nilichitO ninka paluku lETikirA alaru tEniya visamaina grOleda gAni ~||vAri vIri~|| |
| చరణం charaNam 3 | వారక శ్రీ తోట్ల వల్లూరి వేణు గోపాలా మ్రొక్కెద మ్రొక్కెద ధీరుడనైన దాసు శ్రీరామ కవి కృతి సారమైన విని సామి నన్నేలరా ॥వారి వీరి॥ | vAraka SrI tOTla vallUri vENu gOpAlA mrokkeda mrokkeda dhIruDanaina dAsu SrIrAma kavi kRti sAramaina vini sAmi nannElarA ~||vAri vIri~|| |
Tag: Telugu
1253 మనసు దీరెనా manasu dIrenA
| Title | మనసు దీరెనా | manasu dIrenA |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 | dAsu1893 |
| రాగం rAga | దర్బారు | darbAru |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | మనసు దీరెనా సామి మనసు దీరెనా సామి వనజక్ష దాని పొందు వైకుంఠ మాయెనా ॥మనసు॥ | manasu dIrenA sAmi manasu dIrenA sAmi vanajaksha dAni pondu vaikunTha mAyenA ~||manasu~|| |
| చరణం charaNam 1 | మరగు పరచ నేటికిరా మంచిది లేరా ఆ మెరుగు బోణి వగలు నీకు తిరు మంత్రము లాయెనా ॥మనసు॥ | maragu paracha nETikirA manchidi lErA A merugu bONi vagalu nIku tiru mantramu lAyenA ~||manasu~|| |
| చరణం charaNam 2 | సొక్కి యున్న జాడలు చూచిన చాలుర దాని పక్క బండి యుండుటే బ్రహ్మానంద మాయెనా ॥మనసు॥ | sokki yunna jADalu chUchina chAlura dAni pakka banDi yunDuTE brahmAnanda mAyenA ~||manasu~|| |
| చరణం charaNam 3 | వినుము తోట్ల వల్లూరి వేణు గోపాల శౌరి ఘనుడ దాసు శ్రీరామ కవి సన్నుతి జేసెనా ॥మనసు॥ | vinumu tOTla vallUri vENu gOpAla Sauri ghanuDa dAsu SrIrAma kavi sannuti jEsenA ~||manasu~|| |
1252 తత్తర పడనేల tattara paDanEla
| Title | తత్తర పడనేల | tattara paDanEla |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 | dAsu1893 |
| రాగం rAga | కల్యాణి | kalyANi |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | తత్తర పడనేల తాళు తాళుర సామి అత్తింటి కోడాలరా | tattara paDanEla tALu tALura sAmi attinTi kODAlarA |
| అనుపల్లవి anupallavi | కొత్తగా నే వచ్చి కొన్ని నాళ్ళాయెరా పొత్తు గడియ మరిచి పోరు మావారు చిత్తమున నేరమెంచకురా చీకటి వేళ గాదురా అత్త గారింట లేకున్నపుడైన రావైతిరివిర సామి ॥తత్తర॥ | kottagA nE vachchi konni nALLAyerA pottu gaDiya marichi pOru mAvAru chittamuna nEramenchakurA chIkaTi vELa gAdurA atta gArinTa lEkunnapuDaina rAvaitirivira sAmi ~||tattara~|| |
| చరణం charaNam 1 | మక్కువ చెక్కిలి నొక్కకురా సామి నొక్కులెక్కడ దాతురా అక్కడ నున్నది యదిగో యాడబిడ్డ యిక్కథ లెరిగిన నెగిరి పయిబడు సామి నిక్కముగ నీకె దక్కితిరా నేటి మాపటికి రాపోరా పక్కనీ పంచాది గది వెలుపల తలుపు మూయకుంచెదరా ॥తత్తర॥ | makkuva chekkili nokkakurA sAmi nokkulekkaDa dAturA akkaDa nunnadi yadigO yADabiDDa yikkatha lerigina negiri payibaDu sAmi nikkamuga nIke dakkitirA nETi mApaTiki rApOrA pakkanI panchAdi gadi velupala talupu mUyakunchedarA ~||tattara~|| |
| చరణం charaNam 2 | కౌగిటికిది వేళ గాదుర నీకింత కక్కూర్తి పని యేమిరా బాగు బాగు రవిక బట్టి నీ గోల్లతో లాగిన పికిలె నేలాగు బొంకెదురా కాగలదురా నీవు కోరిన కార్య మది యొక జాము లోపల రాగదర మాపటికి మా లోగిటికి పడమట కిటికి దారిని ॥తత్తర॥ | kaugiTikidi vELa gAdura nIkinta kakkUrti pani yEmirA bAgu bAgu ravika baTTi nI gOllatO lAgina pikile nElAgu bonkedurA kAgaladurA nIvu kOrina kArya madi yoka jAmu lOpala rAgadara mApaTiki mA lOgiTiki paDamaTa kiTiki dArini ~||tattara~|| |
| చరణం charaNam 3 | వల్ల గాదుర తోట్ల వల్లూరి వేణు గోపాల తగదు తగదురా చల్లని పన్నీరు చల్లి యత్తరు దేహ వల్లి బూసెదు మూయ వశమా వాసనలు సల్లలిత దాసు శ్రీరాముని కృతి నిల్ల సిల్లితివిరా మది మనమెల్ల్ల గుంతలెవ్వారు జూచిన నల్లరికి మూలమగు సామి ॥తత్తర॥ | valla gAdura tOTla vallUri vENu gOpAla tagadu tagadurA challani pannIru challi yattaru dEha valli bUsedu mUya vaSamA vAsanalu sallalita dAsu SrIrAmuni kRti nilla sillitivirA madi manamellla guntalevvAru jUchina nallariki mUlamagu sAmi ~||tattara~|| |
Somehow, chose not to post this earlier! Book refers to this as “SRngAra padyamu”
1194 న్యాయము గాదురా nyAyamu gAdurA
| Title | న్యాయము గాదురా | nyAyamu gAdurA |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | ||
| రాగం rAga | రీతిగౌళ | rItigouLa |
| తాళం tALa | మిశ్ర చాపు (?) | miSra chApu (?) |
| పల్లవి pallavi | న్యాయము గాదురా తోయజాక్ష | nyAyamu gAdurA tOyajAksha |
| అనుపల్లవి anupallavi | మాయలాడి మాటచే నంబాయుట నీకు (నీదు) | mAyalADi mATachE nanbAyuTa nIku (nIdu) |
| చరణం charaNam 1 | కానుక నా చానచే పంపి నిను వేడుకొని నే రానని నాతో నీవు పోపోవే యనుట | kAnuka nA chAnachE pampi ninu vEDukoni nE rAnani nAtO nIvu pOpOvE yanuTa |
| చరణం charaNam 2 | తాళలేరా శ్రీ లలనా పాలుని బారికిక నన్నేలుకోరా పాలక రా తాళవాధీప | tALalErA SrI lalanA pAluni bArikika nannElukOrA pAlaka rA tALavAdhIpa |
| AV Links | https://www.youtube.com/watch?v=i59ps0TlVjI |
Audio link found at https://www.sangeethamshare.org/vijayagopal/UPLOADS-001-200/121-Rama_Ravi-Vocal/ (Track URL is https://www.sangeethamshare.org/vijayagopal/UPLOADS-001-200/121-Rama_Ravi-Vocal/?track=Track%3A%2004%20-%20Nyayamugadura%20-%20Reetigaula_Javali%20-%20Sangeethapriya , and one needs to login with Google to listen to this!)

1184 చాలు చాలు చాలు పోరా chAlu chAlu chAlu pOrA
| Title | చాలు చాలు చాలు పోరా | chAlu chAlu chAlu pOrA |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Found At | https://www.youtube.com/live/0deEKFe6VAg?si=Jp0_VtaW2uwVeBn7&t=6382 | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | చాలు చాలు చాలు పోరా (సరసము) | chAlu chAlu chAlu pOrA (sarasamu) |
| వాలుకంటి యైన నన్ను తాళ లేక చూచి వచ్చి వాలుకంటి యైన నన్ను తాళ లేక చూచివి చాల మాటలాడి కన్ను సైగ చేసి చేసినంత | vAlukanTi yaina nannu tALa lEka chUchi vachchi vAlukanTi yaina nannu tALa lEka chUchivi chAla mATalADi kannu saiga chEsi chEsinanta | |
| నేను ధర్మపురీశుడని మానమెరుగ వర్ణించి కానుకలే ఇవ్వకుండ కాన్పు సేయ వటుల చేయ | nEnu dharmapurISuDani mAnameruga varNinchi kAnukalE ivvakunDa kAn&pu sEya vaTula chEya | |
1183 రా రమ్మని rA rammani
| Title | రా రమ్మని | rA rammani |
| Written By | పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ | paTnam subrahmaNya ayyar |
| Found At | https://www.youtube.com/watch?v=-YAKY0w_pR4 | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రా రమ్మని పిలచితినీ బిగువాడరా (ఇటు) | rA rammani pilachitinI biguvADarA (iTu) |
| అనుపల్లవి anupallavi | మారుని శరమున బారి పడి (ఇటు) | mAruni Saramuna bAri paDi (iTu) |
| చరణం charaNam 1 | శ్రీకరుణకు ప్రతివాది భయంకర శ్రీ వేంకటేశా ఆశ్రిత జన పోషా (ఇటు) | SrIkaruNaku prativAdi bhayankara SrI vEnkaTESA ASrita jana pOshA (iTu) |
1182 ఎంతనే entanE
| Title | ఎంతనే | entanE |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Found At | https://www.rasikas.org/forums/viewtopic.php?p=286094#p286094 | |
| రాగం rAga | కేదార | kEdAra |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | ఎంతనే వర్ణింతునె సఖి ఆ కాంతు కేళిని | entanE varNintune sakhi A kAntu kELini |
| అనుపల్లవి anupallavi | కాంతుడు ఏకాంతమందు గిలిగింత జేసిన వింతలెల్లను | kAntuDu EkAntamandu giliginta jEsina vintalellanu |
| చరణం charaNam 1 | ప్రీతి మీర నా లేత చన్నుల నాతురంబున తా ఇరు చేత నుంచి సాతిషయము గాక దొబ్బిన రీతినెల్లను | prIti mIra nA lEta channula nAturambuna tA iru chEta nunci sAtishayamu gAka dobbina rItinellanu |
| చరణం charaNam 2 | జీవరత్నము దేవి నీవంటు బాయరాదని నా తను- నీవి నీవి దిచ్చి నా మోవి ఆనిన భావమెల్లను | jIvaratnamu dEvi nIvanTu bAyarAdani nA tanu- nIvi nIvi dicci nA mOvi Anina bhAvamellanu |
| చరణం charaNam 3 | చాలు మన్న నాలకించక తాలవనేషుడు మన- సేల నుండి రాదుడై రతికేలి సల్పిన లీలలెల్లను | cAlu manna nAlakincaka tAlavanEshuDu mana- sEla nunDi rAduDai ratikEli salpina lIlalellanu |
| AV Link | https://www.youtube.com/watch?v=1Oav7Mn5bNU https://www.youtube.com/watch?v=ZJ6gGgwg_EU |
1178 ఓ చెలీ O chelI
| Title | ఓ చెలీ | O chelI |
| Written By | డా. వసంత్ కిరణ్ | Dr. vasant kiraN |
| Found At | https://www.youtube.com/watch?v=hoSvEy-mQs0 | |
| రాగం rAga | శుధ్ధ సావేరి | Suddhha sAvEri |
| తాళం tALa | ?? | ?? |
| పల్లవి pallavi | ఓ చెలీ నా మాట వినవే ఈ కోపము ఇంకేలనే (ఈ కోపమింకేలనే) | O chelI nA mATa vinavE I kOpamu inkElanE (I kOpaminkElanE) |
| చరణం charaNam 1 | ముగ్ధవై ఆటలాడి మధ్యవై మనసునిచ్చి ప్రగల్భవై సరసము లాడినా నాపై (ఈ కోపము) | mugdhavai ATalADi madhyavai manasunichchi pragalbhavai sarasamu lADinA nApai (I kOpamu) |
| చరణం charaNam 2 | అలక నీకు సౌందర్యము కోపము అతి అందము నీ వలలో నేనైక్యము వసంత గోపాలుడు నీ సొంతము | alaka nIku soundaryamu kOpamu ati andamu nI valalO nEnaikyamu vasanta gOpAluDu nI sontamu |
1177 బాలెంతరాలను bAlentarAlanu
| Title | బాలెంతరాలను | bAlentarAlanu |
| Written By | పువ్వాడ శ్రీ రామదాసు | puvvADa SrI rAmadAsu |
| Book | మువ్వ వేణుగోపాల స్వామి కీర్తనలు | muvva vENugOpAla swAmi kIrtanalu |
| రాగం rAga | కమాచ్ | kamAch |
| తాళం tALa | ఆది | Adi |
| బాలింత రాలనురా కృష్ణ – అల్ల పని కోర్వ జాలనురా వల్లగాదు పోపోర కృష్ణ – మళ్ళి నెల వెళ్ళితె చూతమురా | bAlinta rAlanurA kRshNa – alla pani kOrva jAlanurA vallagAdu pOpOra kRshNa – maLLi nela veLLite chUtamurA | |
| కల్లగాదు పోరా కృష్ణ – మూడు నెల లిటు రాబోకు పదరా వల్లగాదు పురిటిల్లు దేహము చాల వెల్లుల్లి వాసన వేయుచున్నదిరా | kallagAdu pOrA kRshNa – mUDu nela liTu rAbOku padarA vallagAdu puriTillu dEhamu chAla vellulli vAsana vEyuchunnadirA | |
| మగనాలి కాదటరా కృష్ణ – పట్ట పగలిటు రాబోకు పదరా ఖగరాజ గమన! కృష్ణ! మా మగవారు వింటేను నగుబాటు లగురా | maganAli kAdaTarA kRshNa – paTTa pagaliTu rAbOku padarA khagarAja gamana! kRshNa! mA magavAru vinTEnu nagubATu lagurA | |
| మకురు తనమేలరా కృష్ణ! నాపయి మక్కువ నీకేలరా యింత – అక్కున చేర్చి నన్నల్లట నొక్కిన చాలా ముక్కులు మిగిలి పాలెక్కువగునురా స్వామి | makuru tanamElarA kRshNa! nApayi makkuva nIkElarA yinta – akkuna chErchi nannallaTa nokkina chAlA mukkulu migili pAlekkuvagunurA swAmi | |
| — (అసంపూర్ణం) — | –incomplete — | |
| AV Link | https://www.youtube.com/watch?v=K6_uTgdD_1A |
1172 నేర మోర nEra mOra
| Title | నేర మోర | nEra mOra |
| Written By | ||
| Found At | https://www.youtube.com/watch?v=OOj0eujG14M | |
| రాగం rAga | హంసధ్వని | hamsadhwani |
| తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
| పల్లవి pallavi | నేర మోర జార చోర మారుబల్కరా | nEra mOra jAra chOra mArubalkarA |
| అనుపల్లవి anupallavi | సారె సారెకు సారసాక్షుని దారిని జూచిన అందము వినరా | sAre sAreku sArasAkshuni dArini jUchina andamu vinarA |
| చరణం charaNam 1 | చెంత రా రా అని ఎంత నే వేడిన పంతము-లాడితివీ? చెంత జేరి బలవంతముగా గిలిగింతలు జేసిన అందము వినరా | chenta rA rA ani enta nE vEDina pantamu-lADitivI ? chenta jEri balavantamugA giligintalu jEsina andamu vinarA |