| Title | ప్రొద్దాయె యిక | proddAye yika |
| Written By | ||
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | ప్రొద్దాయె యిక చాలురా నా సామి | proddAye yika chAlurA nA sAmi |
| చరణం charaNam 1 | అత్తరు మెడబూసి అంట వచ్చేవు అత్తింటి కోడలురా నిజముగ సత్యముగ | attaru meDabUsi amTa vachchEvu attinTi kODalurA nijamuga satyamuga |
| చరణం charaNam 2 | పావడ నీ చేతితొ బట్టవచ్చేవు పోవలె మొక్కెనురా నిజముగ సత్యముగ | pAvaDa nI chEtito baTTavachchEvu pOvale mokkenurA nijamuga satyamuga |
| చరణం charaNam 3 | కోపగించకు నాపై బాలచంద్రా సామి రేపు వస్తానులేరా నిజముగ సత్యముగ | kOpagimchaku nApai bAlachandrA sAmi rEpu vastAnulErA nijamuga satyamuga |
Tag: Telugu
#34 చెలియాకాంతుడు cheliyAkAmtuDu
| Title | చెలియాకాంతుడు | cheliyAkAmtuDu |
| Written By | ||
| రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | చెలియా కాంతుడు నన్నెడబాసి చాలనన్నిటు చేసెనెగాని | cheliyA kAmtuDu nanneDabAsi chAlananniTu chEsenegAni |
| చరణం charaNam 1 | మారుడు నా యురమునను శరము వేయ మందమగు మారుతము డాయ విరహము నేనెటు సైతునే సఖియ ఒంటిగా నె నుండనాయె | mAruDu nA yuramunanu Saramu vEya mamdamagu mArutamu DAya virahamu nEneTu saitunE sakhiya omTigA ne numDanAye |
| చరణం charaNam 2 | వెన్నెలగాయగ మిగుల తాపమాయనే అన్నమని సైచదాయనే కన్నులకు నిదురరాదే వో మగువ కామిని బోధన లాయెనే | vennelagAyaga migula tApamAyanE annamani saichadAyanE kannulaku nidurarAdE vO maguva kAmini bOdhana lAyenE |
| చరణం charaNam 3 | మరుని కేళిలో నన్ను గూడెనే మానినిరో దానితో గూడెనే ధరగిరి స్వామికి న్యాయమటవే తాళను వానికి రమ్మనవేవో | maruni kELilO nannu gUDenE mAninirO dAnitO gUDenE dharagiri swAmiki nyAyamaTavE tALanu vAniki rammanavEvO |
#33 ఇన్నాళ్ళ వలెగాదె innALLa valegAde
| Title | ఇన్నాళ్ళ వలెగాదె | innALLa valegAde |
| Written By | ||
| రాగం rAga | పరజు* | paraju* |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | ఇన్నాళ్ళ వలెగాదె వాని గుణమెంతని నె విన్నవిన్తునె ఓ చెలి | innALLa valegAde vAni guNamentani ne vinnavin&tune O cheli |
| చరణం charaNam 1 | నన్నెడ బాయడు అన్యుల జూడడు మన్నన వీడు మానినిమణి రో వన్నెకాడె యెందున్నడె వాడన్నిట నెరజానుడె | nanneDa bAyaDu anyula jUDaDu mannana vIDu mAninimaNi rO vannekADe yendunnaDe vADanniTa nerajAnuDe |
| చరణం charaNam 2 | తామస మ్యాలనె తాళగ జాలనె కొమలి నీ మదికోరిన సొమ్ములు చేకొనవె వేగరావే తోడిత్యావేనా సామీటు రమ్మనవె | tAmasa myAlane tALaga jAlane komali nI madikOrina sommulu chEkonave vEgarAvE tODityAvEnA sAmITu rammanave |
| చరణం charaNam 3 | అందముగా రతి పొందుగ నేలిన అబిర గులాలవుడావతరథా భరచకారి రంగ్ గిరిధర లాలబహి బృందావనజ ** మునాఖేచర సుభవ రంగ్ గిరిధర ** మీరాకే ప్రభు గిరిధర నాగర చరణ ** కమల భోరింగ్ గిరిధర ** | amdamugA rati pomduga nElina abira gulAlavuDAvatarathA bharachakAri rang giridhara lAlabahi bRmdAvanaja ** munAkhEchara subhava rang giridhara ** mIrAkE prabhu giridhara nAgara charaNa ** kamala bhOring giridhara ** |
Edit: 4 Jan 2021: We found this jAvaLi in a different book too, and that had better lyrics for the 3rd charaNam. Please see post 189.
#32 బన్సీవాలే bansIwAlE
| Title | బన్సీవాలే | bansIwAlE |
| Written By | ||
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | బన్సీవాలేనే మేరా మన మోహలియ్యోరే | bansIwAlEnE mErA mana mOhaliyyOrE |
| చరణం charaNam 1 | సుందర శ్యామల వేంకటరమణుడు నెనరున నె కలసేన ఓదానగాన ఓ మత్తగజగమనరో | sundara SyAmala vEnkaTaramaNuDu nenaruna ne kalasEna OdAnagAna O mattagajagamanarO |
#31 సామి వెళగాదురా sAmi veLagAdurA
| Title | సామి వెళగాదురా | sAmi veLagAdurA |
| Written By | ||
| రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | సామి వెళగాదురా నా సామి వెళగాదురా | sAmi veLagAdurA nA sAmi veLagAdurA |
| చరణం charaNam 1 | ముద్దు పెట్టి వద్దు చాలురా సద్దు చేయరాదు తాళురా | muddu peTTi vaddu chAlurA saddu chEyarAdu tALurA |
| చరణం charaNam 2 | సన్న సైగ చేసె వేలరా వెన్నుడానె మగని నాలరా | sanna saiga chEse vElarA vennuDAne magani nAlarA |
| చరణం charaNam 3 | సామి ధరగిరి నిలయా సమయముగని కలయ | sAmi dharagiri nilayA samayamugani kalaya |
#30 వేగరమ్మనవె vEgarammanave
| Title | వేగరమ్మనవె | vEgarammanave |
| Written By | ||
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | వేగరమ్మనవె వేగమె నా సామి నిందుసఖీ | vEgarammanave vEgame nA sAmi nimdusakhI |
| చరణం charaNam 1 | మదనునీ బారికి మది నోర్వజాలనే సదయుని కింత దయలేదె | madanunI bAriki madi nOrvajAlanE sadayuni kimta dayalEde |
| చరణం charaNam 2 | అలదాని మాయకె వలచిన సామికి తలపనె మందు తలకెక్కె | aladAni mAyake valachina sAmiki talapane mamdu talakekke |
| చరణం charaNam 3 | అతివ యెవతొ విభునెడ సాపెనె నిదుర కంటికి రాదు గదవె | ativa yevato vibhuneDa sApene nidura kamTiki rAdu gadave |
| చరణం charaNam 4 | వన్నెలాడిరో మైసూరి కృష్ణుని క్రొన్న విల్తుని కేళికి | vannelADirO maisUri kRshNuni kronna viltuni kELiki |
#29 కాముని విరిశముల kAmuni viriSamula
| Title | కాముని విరిశముల | kAmuni viriSamula |
| Written By | ||
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | కాముని విరిశముల బారికి నేమని సహింతునె | kAmuni viriSamula bAriki nEmani sahimtune |
| చరణం charaNam 1 | సామి రాడాయనే నిమిషమెడాయనే నా మనవి తెలియబలికె ప్రేమసఖి లేదాయనె | sAmi rADAyanE nimishameDAyanE nA manavi teliyabalike prEmasakhi lEdAyane |
| చరణం charaNam 2 | బాలరో యీ చలమేలనె వానికి యే లలనామణి బోధించెనేమో నను మరచేనె | bAlarO yI chalamElane vAniki yE lalanAmaNi bOdhinchenEmO nanu marachEne |
| చరణం charaNam 3 | భామరొ కామునికేళి నన్నేలిన సామి దరగిరి నిలయుని పయి ప్రేమ యెటుమఱతునె | bhAmaro kAmunikELi nannElina sAmi daragiri nilayuni payi prEma yeTuma~ratune |
#28 వింటి వేమిరా vimTi vEmirA
| Title | వింటి వేమిరా | vimTi vEmirA |
| Written By | ||
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | వింటి వేమిరా సామి వింటి వేమిరా | vimTi vEmirA sAmi vimTi vEmirA |
| చరణం charaNam 1 | తుంటవిల్తుడెయు పదను తూపులెల్ల దాని యెదను జంటకత్తె వోర్వ దనుకొంటి వేమిరా సామి | tumTaviltuDeyu padanu tUpulella dAni yedanu janTakatte vOrva danukomTi vEmirA sAmi |
| చరణం charaNam 2 | నిదురలే నీదు దారి యెదురు చూచి వేసారి సదయుడ హాయనుచు తేరి సైపలేదురా సామి | niduralE nIdu dAri yeduru chUchi vEsAri sadayuDa hAyanuchu tEri saipalEdurA sAmi |
| చరణం charaNam 3 | రవల సొమ్ములిచ్చినటుల రాతిరెలగూడి నటుల కువలయాక్షి పలికినటుల గోపబాలకా సామి | ravala sommulichchinaTula rAtirelagUDi naTula kuvalayAkshi palikinaTula gOpabAlakA sAmi |
#27 యేలా మనకు వాని జోలి yElA manaku vAni jOli
| Title | యేలా మనకు వాని జోలి | yElA manaku vAni jOli | ||
| Written By | ||||
| రాగం rAga | హిందుస్తాని | hindustAni | ||
| తాళం tALa | ఆది | Adi | ||
| పల్లవి pallavi | యేలా మనకు వాని జోలి చెలియలా | yElA manaku vAni jOli cheliyalA | ||
| చరణం charaNam 1 | మాటీమాటికి యీ రాపైతే యేటి మాట పోపోవే నాటి బాస యెమాయ చెలి | mATImATiki yI rApaitE yETi mATa pOpOvE nATi bAsa yemAya cheli | ||
| చరణం charaNam 2 | మారుబారి మీరి దనుచేర బిలచెటందుకు పై నేరమెంచుట గాదె వో చెలి | mArubAri mIri danuchEra bilacheTanduku pai nEramemchuTa gAde vO cheli | ||
| చరణం charaNam 3 | యేమొగాని శ్రీగోపాలుడె మరసినాడె మరచెనమ్మ ప్రేమ యెంచుట మేరగాదె చెలి | yEmogAni SrIgOpAluDe marasinADe marachenamma prEma yemchuTa mEragAde cheli | ||
#26 పోయిరమ్మ పొలతిరొ pOyiramma polatiro
| Title | పోయిరమ్మ పొలతిరొ | pOyiramma polatiro | ||
| Written By | ||||
| రాగం rAga | జంఝూటి | jamjhUTi | ||
| తాళం tALa | మధ్యాది | madhyAdi | ||
| పల్లవి pallavi | పోయిరమ్మ పొలతిరొ సామిని పొగడె చెలి యింటికి | pOyiramma polatiro sAmini pogaDe cheli yimTiki | ||
| చరణం charaNam 1 | వొంటిగానున్న దాని నింటిలో జూచి నా వంటి చెలి దెల్పె నె కంటివని నాతో | vomTigAnunna dAni nimTilO jUchi nA vamTi cheli delpe ne kamTivani nAtO | ||
| చరణం charaNam 2 | వెలదిరొమును వనజాసనుడేమి వ్రాసనోయే పెనుగొనుటేలను | veladiromunu vanajAsanuDEmi vrAsanOyE penugonuTElanu | ||
| చరణం charaNam 3 | వెలదిరొ చక్కని సురపురి సూనుతో మదనుని కేళిలో మనసీయనంటె | veladiro chakkani surapuri sUnutO madanuni kELilO manasIyanamTe | ||