| Title | ఏర సామి | Era sAmi |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | ఏర సామి సరసకు మరి మరి పిలిచిన పలుక వేమిరా | Era sAmi sarasaku mari mari pilichina paluka vEmirA |
| చరణం charaNam 1 | చిన్న నాడే చెలిమి కోరి యున్న దానరా నాతో పంతమేల జేసెదవురా నీ చెంత జేరి యున్నదానరా యేర మరుబారి కోర్వజాల మరి మరి వేడితిరా | chinna nADE chelimi kOri yunna dAnarA nAtO pantamEla jEsedavurA nI chenta jEri yunnadAnarA yEra marubAri kOrvajAla mari mari vEDitirA |
| చరణం charaNam 2 | కామ శాస్త్ర విభుడవని కలసినానురా నాతో కయ్యమేల జేసెదవురా యేర మార్కాపుర వాస నను కరుణించి బ్రోవరా | kAma SAstra vibhuDavani kalasinAnurA nAtO kayyamEla jEsedavurA yEra mArkApura vAsa nanu karuNinchi brOvarA |
Tag: Telugu
#780 తెలిసెనురా నీ telisenurA nI
| Title | తెలిసెనురా నీ | telisenurA nI |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | సావేరి | sAvEri |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | తెలిసెనురా నీ తెరగెల్లను నేడు చక్క తెలిసెనురా | telisenurA nI teragellanu nEDu chakka telisenurA |
| అనుపల్లవి anupallavi | ఎలిమిని నన్నేలి ప్రాణేశ శ్రీ వెంకటేశ తలపున నన్నెంచ లేదా తప్పు తంట లెల్ల నేడు | elimini nannEli prANESa SrI venkaTESa talapuna nannencha lEdA tappu tanTa lella nEDu |
| చరణం charaNam 1 | మాటల పస దానింట మౌనంబు నా యింట | mATala pasa dAninTa maunambu nA yinTa |
| చరణం charaNam 2 | ఆట పాట దానింట అలుకలు నా యింట | ATa pATa dAninTa alukalu nA yinTa |
| చరణం charaNam 3 | జూటు వగలు నా యింట సొగసెల్లను దానింట | jUTu vagalu nA yinTa sogasellanu dAninTa |
| చరణం charaNam 4 | నాటకములు నా యింట నమ్మికెల్ల దానింట | nATakamulu nA yinTa nammikella dAninTa |
#779 ఇది మరియాద idi mariyAda
| Title | ఇది మరియాద | idi mariyAda |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | ధన్యాసి | dhanyAsi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఇది మరియాద గాదటే సరోజ ముఖిరో దూరేటి వారికి | idi mariyAda gAdaTE sarOja mukhirO dUrETi vAriki |
| అనుపల్లవి anupallavi | సదయుడు నాతో సదా సరసము లాడినది మరియాద గాదటే | sadayuDu nAtO sadA sarasamu lADinadi mariyAda gAdaTE |
| చరణం charaNam 1 | కాంత మదమంత మిదే వింత మాట లాడుచును ఇంతులెల్ల గూడి నాపై పూబంతులు వేసినది | kAnta madamanta midE vinta mATa lADuchunu intulella gUDi nApai pUbantulu vEsinadi |
#778 కరుణ జూడ karuNa jUDa
| Title | కరుణ జూడ | karuNa jUDa |
| Written By | భూసురపల్లి వేంకటేశ్వర్లు | bhUsurapalli vEnkaTESvarlu |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | కాపీ | kApI |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | కరుణ జూడ డేలనో కాంచనాంగి చెప్పి రావె | karuNa jUDa DElanO kAnchanAngi cheppi rAve |
| అనుపల్లవి anupallavi | కలలో నైనా స్వామిని గాంచక నే నుండ లేను | kalalO nainA svAmini gAnchaka nE nunDa lEnu |
| చరణం charaNam 1 | మనసంతా అతడె నిండి మగువకు దాగుట తగవా అతనికి చేతనైనచొ నా మనసు నుంచి పొమ్మనవే | manasantA ataDe ninDi maguvaku dAguTa tagavA ataniki chEtanainacho nA manasu nunchi pommanavE |
| చరణం charaNam 2 | వాంఛ కాదు వనితా యిది వలపు పెంచు కొంటి విభుని కిది తగదని చెప్పవేమె తడవు లేక రమ్మనవే | vAnCha kAdu vanitA yidi valapu penchu konTi vibhuni kidi tagadani cheppavEme taDavu lEka rammanavE |
#777 ఎరుక లేని eruka lEni
| Title | ఎరుక లేని | eruka lEni |
| Written By | భూసురపల్లి వేంకటేశ్వర్లు | bhUsurapalli vEnkaTESvarlu |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఎరుక లేని వారు నాపై ఏమి చెప్పిరో గాని | eruka lEni vAru nApai Emi cheppirO gAni |
| అనుపల్లవి anupallavi | ఎంత ఎదురు చూచిననూ ఏలా దయ రాకపోయె | enta eduru chUchinanU ElA daya rAkapOye |
| చరణం charaNam 1 | అతని చేరి మనసంతా ఆనంద చేతన మయె అతని కోరి జీవితమ్ము అడవి గాచు వెన్నెలాయె | atani chEri manasantA Ananda chEtana maye atani kOri jIvitammu aDavi gAchu vennelAye |
| చరణం charaNam 2 | ఎవరి యింట చేరెనో ఎవరి ఎడద దాగెనో అతనికి అందరు గానీ నాకు మాత్ర మతడొకడే | evari yinTa chErenO evari eDada dAgenO ataniki andaru gAnI nAku mAtra mataDokaDE |
#776 రారా మా యింటికి rArA mA yinTiki
| Title | రారా మా యింటికి | rArA mA yinTiki |
| Written By | తెల్లాకుల వెంకటేశ్వర గుప్త | tellAkula VenkaTESvara gupta |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | శహన | Sahana |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | రారా మా యింటికి రయమున గోపాలా బాలుడవని నిన్ను చాలగా నమ్మితీ | rArA mA yinTiki rayamuna gOpAlA bAluDavani ninnu chAlagA nammitI |
| అనుపల్లవి anupallavi | ఎంతని వేడినా పంతమేలరా నాపై దంతీ రక్షక నాదు చెంతకు జేరగా | entani vEDinA pantamElarA nApai dantI rakshaka nAdu chentaku jEragA |
| చరణం charaNam 1 | మల్లె పువ్వులు ఇవిగో కొల్లగ యీ రేయి చల్లని మారుత మెల్ల వీచుచు నుండే వల్ల జేసుక రారా పల్లవాధరి గోరి సలలితముగా మురళీ సరళీ జూపుదు గాని | malle puvvulu ivigO kollaga yI rEyi challani mAruta mella vIchuchu nunDE valla jEsuka rArA pallavAdhari gOri salalitamugA muraLI saraLI jUpudu gAni |
| చరణం charaNam 2 | అత్తా గారున్నారు కత్తీ వంటిది నా అత్తా గారున్నారు కత్తీ వంటిదిరా చిత్తాము నిల్వాదు చెల్వుడా నిను జూడ పంకజ ముఖులతో పంకాలు బలికేవు బింక మేలర వేంకటేశ వరద నేడే | attA gArunnAru kattI vanTidi nA attA gArunnAru kattI vanTidirA chittAmu nilvAdu chelvuDA ninu jUDa pankaja mukhulatO pankAlu balikEvu binka mElara vEnkaTESa varada nEDE |
#775 మరులు మించేనే marulu minchEnE
| Title | మరులు మించేనే | marulu minchEnE |
| Written By | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | mangaLampalli bAlamuraLIkRshNa |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | చెంచురుటి | chenchuruTi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మరులు కొన్నానే సఖీ నిను విడనాడగ లేనే సఖీ | marulu konnAnE sakhI ninu viDanADaga lEnE sakhI |
| అనుపల్లవి anupallavi | విరసిన సుమమా కురిసినా వెన్నెలా మరల వచ్చెదనని తరలి పోబోకే సఖీ | virasina sumamA kurisinA vennelA marala vachchedanani tarali pObOkE sakhI |
| చరణం charaNam 1 | కన్నుల కరవు తీరెను కనినంత నీరూపు మిన్నుల విహరించేను మది ఆనందము సఖీ | kannula karavu tIrenu kaninanta nIrUpu minnula viharinchEnu madi Anandamu sakhI |
| AV Link | https://www.youtube.com/watch?v=tx6b9S4oPCg |
#774 స్వామిని రమ్మనవే svAmini rammanavE
| Title | స్వామిని రమ్మనవే | svAmini rammanavE |
| Written By | వింజమూరి వరదరాజయ్యంగారు | viMjamUri varadarAjayyangAru |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | భవప్రియ | bhavapriya |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | స్వామిని రమ్మనవే సఖిరో కృష్ణ ఏమో మాటలాడి పర భామను చేరబోయిన | svAmini rammanavE sakhirO kRshNa EmO mATalADi para bhAmanu chErabOyina |
| చరణం charaNam 1 | నా సరసకు వచ్చిన సౌఖ్యము నే మరువజాలనే సతతము నే నతనినే స్మరింతు నిరతము నా వరదరాజ స్వామిని ఇతరుల గూడ వద్దని | nA sarasaku vachchina saukhyamu nE maruvajAlanE satatamu nE nataninE smarintu niratamu nA varadarAja svAmini itarula gUDa vaddani |
#773 సామి రాడె sAmi rADe
| Title | సామి రాడె | sAmi rADe |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | గౌరీ మనోహరి | gaurI manOhari |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సామి రాడె యేమి సేతూ | sAmi rADe yEmi sEtU |
| అనుపల్లవి anupallavi | సరసుని ప్రేమ సతమని యుంటినె | sarasuni prEma satamani yunTine |
| చరణం charaNam 1 | వలచిన వారికీ వైభవ మేడదె నీలవేణి పొందు నేస్తము సతమాయె | valachina vArikI vaibhava mEDade nIlavENi pondu nEstamu satamAye |
| చరణం charaNam 2 | మదనుని బారికి మనసు సైరిసదాయ సదయుడు రాడాయ సఖియరో నేడు | madanuni bAriki manasu sairisadAya sadayuDu rADAya sakhiyarO nEDu |
| చరణం charaNam 3 | మంగళ పురి వాసుడు మరచిన మొదలు మంగళాంగి వినవె మోహము నిలుప లేను | mangaLa puri vAsuDu marachina modalu mangaLAngi vinave mOhamu nilupa lEnu |
#772 సరోజాక్షిరొ sarOjAkshiro
| Title | సరోజాక్షిరొ | sarOjAkshiro |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | పూర్వీ కల్యాణి | pUrvI kalyANi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | సరోజాక్షిరొ నా మాట సైసదాయ సామీ రాడాయ యింకేమి నే జేతూనే | sarOjAkshiro nA mATa saisadAya sAmI rADAya yinkEmi nE jEtUnE |
| చరణం charaNam 1 | సదా యుడవని చాలా నమ్మియుంటి మదావతిరో నేడేల రాడాయనె | sadA yuDavani chAlA nammiyunTi madAvatirO nEDEla rADAyane |
| చరణం charaNam 2 | చేరా వచ్చీ మును జేసిన చెలిమి కోరితిని గాని కోర్కె దీరదాయ | chErA vachchI munu jEsina chelimi kOritini gAni kOrke dIradAya |
| చరణం charaNam 3 | కరుణెందు బోయెనో మరువలేనే నేడు కారణ మేమి కలికిరో యీవేళ | karuNendu bOyenO maruvalEnE nEDu kAraNa mEmi kalikirO yIvELa |
| చరణం charaNam 4 | వెలదీరొ అలనాడు వుపరతి వేళలో కలసిన రీతెల్ల కలికి నే మరువాను | veladIro alanADu vuparati vELalO kalasina rItella kaliki nE maruvAnu |
| చరణం charaNam 5 | ప్రేమ మరచానే యేమి సేతు నేను మోము జూడడె మంగాళ పురీశుడు | prEma marachAnE yEmi sEtu nEnu mOmu jUDaDe mangALa purISuDu |