#15 చిన్నదానరా chinnadAnarA

Titleచిన్నదానరాchinnadAnarA
Written By
రాగం rAgaహిందుస్తానిhindustAni
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
చిన్నదానరా నే కన్నుదోయి కింపుదోచె
కన్నెలు వేరేమి రా నే
chinnadAnarA nE kannudOyi kimpudOche
kannelu vErEmi rA nE
చరణం
charaNam 1
మగని మోము జూచి చాల
దిగులు జెందియున్న నాపై
పొగరు మాటలాడి నన్ను
అగడు సేతురేమిరా
magani mOmu jUchi chAla
digulu jendiyunna nApai
pogaru mATalADi nannu
agaDu sEturEmirA
చరణం
charaNam 2
చెక్కు నొక్కి ముదమున చను
ముక్కు నులిమి కావరమున
గ్రక్కున నను కౌగలిడిచి
పక్క జేర్తురేమిరా నె
chekku nokki mudamuna chanu
mukku nulimi kAvaramuna
grakkuna nanu kougaliDichi
pakka jErturEmirA ne
చరణం
charaNam 3
రత్నపురి నిలయుడు ప్రయత్నముతో నన్ను గూడి
రత్నసరాలిచ్చెనని
రవ్వ సేర్తురేమిరా నె
ratnapuri nilayuDu prayatnamutO nannu gUDi
ratnasarAlichchenani
ravva sErturEmirA ne

#14 మానిని మనసు యేల mAnini manasu yEla

Titleమానిని మనసు యేలmAnini manasu yEla
Written By
రాగం rAgaకాపిkApi
తాళం tALaచాపుchApu
పల్లవి
pallavi
మానిని మనసు యాల గరుగదే
మనసు నిమిషమైన తాళదె
mAnini manasu yAla garugadE
manasu nimishamaina tALade
చరణం
charaNam 1
సుదతి రో నీకెదురు చూచి
నిదురల్యాక యుంటినె
sudati rO nIkeduru chUchi
niduralyAka yunTine
చరణం
charaNam 2
సరసకు రమ్మని వేడితె
తిరిగి చూడన్యాలనె
sarasaku rammani vEDite
tirigi chUDanyAlane
చరణం
charaNam 3
ధర్మపురీశుని గూడిన
మర్మము మరుపాయనె
dharmapurISuni gUDina
marmamu marupAyane

#13 నా పయి ప్రేమలేని nA payi prEmalEni

Titleనా పయి ప్రేమలేనిnA payi prEmalEni
Written By
రాగం rAgaఇందుస్తానిindustAni
తాళం tALaచాపుchApu
పల్లవి
pallavi
నా పయి ప్రేమలేని జాడ
నాడే తెలిసెను పో పోరా
nA payi prEmalEni jADa
nADE telisenu pO pOrA
చరణం
charaNam 1
పాపి సవతి మాయలలో జిక్కి
గోపాలుని కొన గోరంతయిన
pApi savati mAyalalO jikki
gOpAluni kona gOrantayina
చరణం
charaNam 2
యెందాక జూచిన యీ మొగజాతి
యింతుల నేలేదాకా యీ ప్రీతి సందేహమా
yendAka jUchina yI mogajAti
yintula nElEdAkA yI prIti sandEhamA
చరణం
charaNam 3
మాట ప్రఖ్యాత సరసుల లక్షణ మాయీనీతి
మోహమందు గనుసమిందు యే వేళ్ళ బుధ్ధులు
mATa prakhyAta sarasula lakshaNa mAyInIti
mOhamandu ganusamindu yE vELLa budhdhulu
చరణం
charaNam 4
నీ యందు యెలగలిగెనో
యిక యేమలరు స్నేహము చేసినదే బలు పొందు
nI yandu yelagaligenO
yika yEmalaru snEhamu chEsinadE balu pondu

#12 తలచిన తాళగ talachina tALaga

Titleతలచిన తాళగtalachina tALaga
Written By
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaచాపుchApu
పల్లవి
pallavi
తలచిన తాళగలేనే వోచెలియtalachina tALagalEnE vOcheliya
చరణం
charaNam 1
కస్తూరి విడమిచ్చి కనికర గతి జూపి
కుస్తరించి నన్ను కొసవేడిన
kastUri viDamichchi kanikara gati jUpi
kustarinchi nannu kosavEDina
చరణం
charaNam 2
కనుర చెక్కుల మోవి చనుల కంఠము చల
మున ముక్కు నాభి చుంబనము జేసినవాని
kanura chekkula mOvi chanula kanThamu chala
muna mukku nAbhi chumbanamu jEsinavAni

#11 చాలే చాలే chAlE chAlE

Titleచాలే చాలేchAlE chAlE
Written By
రాగం rAgaకన్నడkannaDa
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
చాలే చాలే అలవానితొ పొందిక
చాలె చాలె యీ లాభము యిక
chAlE chAlE alavAnito pondika
chAle chAle yI lAbhamu yika
చరణం
charaNam 1
కలకంఠిరో భూతలమందునయె
కల్లలు బల్కెడి వారితొ చెలిమి యిక
kalakanThirO bhUtalamandunaye
kallalu balkeDi vArito chelimi yika
చరణం
charaNam 2
విరిబోణిరో పోకిరి కుక్కలకేమె
మారుని సరియని కోరి చేరుటయిక
viribONirO pOkiri kukkalakEme
mAruni sariyani kOri chEruTayika
చరణం
charaNam 3
అలివేణిరొ ఆ నలినాక్షికి యెమో
కాళ్ళకు మ్రొక్కేటి వారితో స్నేహము యిక
alivENiro A nalinAkshiki yemO
kALLaku mrokkETi vAritO snEhamu yika
చరణం
charaNam 4
ధర యందున శ్రీ పరవాసుని యేమొ సరి
సరి జెప్పను యెవ్వరి తరమే యిక
dhara yanduna SrI paravAsuni yEmo sari
sari jeppanu yevvari taramE yika

#10 చానరో వాని బాసి chAnarO vAni bAsi

Titleచానరో వాని బాసిchAnarO vAni bAsi
Written By
రాగం rAgaజంజూటిjanjUTi
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
చానరో వాని బాసి నే నెటువలె సయితునే
దాని బోధనలను వినుట మానేడేమిసేతునే
chAnarO vAni bAsi nE neTuvale sayitunE
dAni bOdhanalanu vinuTa mAnEDEmisEtunE
చరణం
charaNam 1
సన్నుతాంగి సరసుడని చాలనమ్మి యుంటినే
నిన్న దాని యింటజేరి యున్న వగలు వింటినే
sannutAngi sarasuDani chAlanammi yunTinE
ninna dAni yinTajEri yunna vagalu vinTinE
చరణం
charaNam 2
సదయుడు మదనుని బారికి ముదముతోనను బ్రోచెనే
వదలక తన ప్రాయమెల్ల సుదతి బాలు చేసెనే
sadayuDu madanuni bAriki mudamutOnanu brOchenE
vadalaka tana prAyamella sudati bAlu chEsenE
చరణం
charaNam 3
వాసవసుతుడైన శ్రీనివాసుడు ననుగూడెనె
బాసలెల్ల మరచి యా దోసకారి గూడెను
vAsavasutuDaina SrInivAsuDu nanugUDene
bAsalella marachi yA dOsakAri gUDenu

#9 రమ్మనవే సామిని rammanavE sAmini

Titleరమ్మనవే సామినిrammanavE sAmini
Written By
రాగం rAgaఇందుస్తానిindustAni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
రమ్మనవే సామిని
రమణీమణిరో తను వలచి దెయిటు
rammanavE sAmini
ramaNImaNirO tanu valachi deyiTu
చరణం
charaNam 1
ఆదరమునపరాధము నెంచుట
వాదుచేయుట మరియాద గాదు
AdaramunaparAdhamu nenchuTa
vAduchEyuTa mariyAda gAdu
చరణం
charaNam 2
సారెకు నా సరివారిలొ నన్నిటు
దూరుటలతనికి మేరగాదు
sAreku nA sarivArilo nanniTu
dUruTalataniki mEragAdu

#8 నీ మోహ మిదేన nI mOha midEna

Titleనీ మోహ మిదేనnI mOha midEna
Written By
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
నీ మోహ మిదేన
నెలకొక సారిందువచ్చి నిలుచుట గాన
nI mOha midEna
nelakoka sArinduvachchi niluchuTa gAna
చరణం
charaNam 1
తీర తీర మమత మదికి దెలిసెను నాడె
తీరున నే నడుచుకొందు యెప్పటి జాడా
tIra tIra mamata madiki delisenu nADe
tIruna nE naDuchukondu yeppaTi jADA
చరణం
charaNam 2
బాళితీర మమత మదిని దానేనింక
యెల బొంకితివి నాతొ ఇంత పరాక
bALitIra mamata madini dAnEninka
yela bonkitivi nAto inta parAka

#7 పో పొమ్మనే pO pommanE

Titleపో పొమ్మనేpO pommanE
Written By
రాగం rAgaసురటsuraTa
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
పో పొమ్మనే పొమ్మనె భామరొవానిpO pommanE pommane bhAmarovAni
చరణం
charaNam 1
పొలతిరో చెలువున పోగడు దానింటికి
కలకాలమునను కలసిన మోహ
తలచనవాని పొందు తగదు తగదుయిక
polatirO cheluvuna pOgaDu dAninTiki
kalakAlamunanu kalasina mOha
talachanavAni pondu tagadu tagaduyika
చరణం
charaNam 2
పగదానిని నా యెదురుగ బొగదుచు
జగడము చేయు వాని చెలిమి వలదుయిక
pagadAnini nA yeduruga bogaduchu
jagaDamu chEyu vAni chelimi valaduyika
చరణం
charaNam 3
వరభీమేశుని వంచన దెలిసెను
మరి మరి నాపయి మమత చాలునిక
varabhImESuni vanchana delisenu
mari mari nApayi mamata chAlunika

#6 యేమిసేతు yEmisEtu

TitleయేమిసేతుyEmisEtu
Written By
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
యేమి సేతు యెటుల సైతు మరులు తాళలేనురా
స్వామి ధర్మపురనివాస సమయము నన్నేలుకోర
yEmi sEtu yeTula saitu marulu tALalEnurA
swAmi dharmapuranivAsa samayamu nannElukOra
చరణం
charaNam 1
పిలువ పిలువ బిగువులాయె ప్రీతిమేరగాదురా
అలుక నాటి సుజము మాని చెలువుడరయ జేయమిపుడ
piluva piluva biguvulAye prItimEragAdurA
aluka nATi sujamu mAni cheluvuDaraya jEyamipuDa