| Title | సామిరాడే | sAmirADE |
| Written By | ||
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | సామిరాడే మందునే చానరోతోడి త్యావే నిమిషము తామసింపనే | sAmirADE mandunE chAnarOtODi tyAvE nimishamu tAmasimpanE |
| కోమలాంగి వాని బాసి యెట్లు సైతునె ఈ వలపెట్లు సయితునే | kOmalAngi vAni bAsi yeTlu saitune I valapeTlu sayitunE | |
| చరణం charaNam 1 | యిందుముఖి వాని కెంతటి మందుబెట్టెనె యెంతటి మాయజేసెనె | yindumukhi vAni kentaTi mandubeTTene yentaTi mAyajEsene |
| చరణం charaNam 2 | ముందునను గూడిన బాలచంద్రకాంతుడె వాడతి సుందరాంగుడె | mundunanu gUDina bAlachandrakAntuDe vADati sundarAnguDe |
Tag: Telugu
#4 ఈ విరహమెటులోర్తునె I virahameTulOrtune
| Title | ఈ విరహమెటులోర్తునె | I virahameTulOrtune |
| Written By | ||
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | ఈ విరహ మెటులోర్తునె చెలియా | I viraha meTulOrtune cheliyA |
| చరణం charaNam 1 | నేమిసేతు నా మనోహరుండు రాడటే సామికేమిటారిదూరు విప్పెనె చెలియా | nEmisEtu nA manOharunDu rADaTE sAmikEmiTAridUru vippene cheliyA |
| చరణం charaNam 2 | యెందాక సైతు వానిబాసి యీ సుమశరుని చిగురాకు బాకుచే కుచంబుదాకెనె చెలియ | yendAka saitu vAnibAsi yI sumaSaruni chigurAku bAkuchE kuchambudAkene cheliya |
| చరణం charaNam 3 | రతికేళి వేళ నేలనో మరాళి గామిని నే తాళజాల బాలచంద్ర సామిని బాసి | ratikELi vELa nElanO marALi gAmini nE tALajAla bAlachandra sAmini bAsi |
#3 ఇందుముఖి indumukhi
| Title | ఇందుముఖి | indumukhi |
| Written By | ||
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | ఇందుముఖి వానికీ మన సిందులేదాయ ఏమందునె మాయవాడిందు రాడాయ | indumukhi vAnikI mana simdulEdAya Emamdune mAyavADimdu rADAya |
| చరణం charaNam 1 | చక్కెర విలుకాని పోరు యెక్కువలాయ చక్కనగాదని దెలిసే చానలేదాయ ఏమందునె మాయ | chakkera vilukAni pOru yekkuvalAya chakkanagAdani delisE chAnalEdAya Emamdune mAya |
| చరణం charaNam 2 | ఆశతో మును పాటినట్టి బాసలేమాయ దోసకారి బోధన విని మోసములాయ యేమందునెమాయ | ASatO munu pATinaTTi bAsalEmAya dOsakAri bOdhana vini mOsamulAya yEmandunemAya |
| చరణం charaNam 3 | వెంకటరమణునికి నాపై బింకములాయ పొంకముతో నన్ను గూడ వా డింకరుదాయ యేమందు నెమాయ | venkaTaramaNuniki nApai binkamulAya ponkamutO nannu gUDa vA DinkarudAya yEmandu nemAya |
#2 చెలి మనక్యాల cheli manakyAla
| Title | చెలి మనక్యాల | cheli manakyAla |
| పుస్తకం Book | #Book1900 | |
| Written By | ||
| రాగం rAga | ఇందుస్తాని కాపి | imdustAni kApi |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | చెలి మనక్యాల వానితోను పొందు చాలునే వాని పొందు చాలునే వానితోను పొందు చాలునే | cheli manakyAla vAnitOnu pomdu chAlunE vAni pomdu chAlunE vAnitOnu pomdu chAlunE |
| చరణం charaNam 1 | అక్కర మరి తీరిన పక్కకు రానివ్వడే పక్కకు రానివ్వడలవాని పక్కకు మరిజేర్చడే | akkara mari tIrina pakkaku rAnivvaDE pakkaku rAnivvaDalavAni pakkaku marijErchaDE |
| చరణం charaNam 2 | ఎంగిలి కొనియాడువాని రంగు విడమ్యాలనే రంగువీడమ్యాలనే వాని యెంగిలి మనక్యాలనే | engili koniyADuvAni ramgu viDamyAlanE ramguvIDamyAlanE vAni yemgili manakyAlanE |
| చరణం charaNam 3 | కనికర మెంచిన కౌగలింపు యాలనే ఉగ్గలింపు యాలనే వానికవుగిట మనక్యాలనే | kanikara menchina kaugalimpu yAlanE uggalimpu yAlanE vAnikavugiTa manakyAlanE |
| చరణం charaNam 4 | మర్మమెల్ల యెరిగిన శ్రీధర్మపురీవాసుడే ధర్మపురివాసుడె ఆ కన్యల కేకాంతుడే | marmamella yerigina SrIdharmapurIvAsuDE dharmapurivAsuDe A kanyala kEkAmtuDE |
#1 ఓ రమణీ మణీ O ramaNI maNI
| Title | ఓ రమణీ మణీ | O ramaNI maNi |
| పుస్తకం Book | #Book1900 | |
| Written By | ||
| రాగం rAga | హరి కాంభోజి | hari kAmbhOji |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | ఓ రమణీ మణీ సామిని త్యావే | O ramaNI maNI sAmini tyAvE |
| అనుపల్లవి anupallavi | సామిని త్యావే కామిని పోవే | sAmini tyAvE kAmini pOvE |
| చరణం charaNam 1 | చక్కనివాడే అక్కరో వీడే మక్కువ తోడనే పక్కకు త్యావే | chakkanivADE akkarO vIDE makkuva tODanE pakkaku tyaavE |
| చరణం charaNam 2 | చల్లని సోముడు పల్లవి పాణుల ఉల్లము రంజిల్ల వెన్నెల కాసెనే | challani sOmuDu pallavi pANula ullamu ramjilla vennela kAsenE |
| చరణం charaNam 3 | భామామణి కాముని పోరున వేమరు బాణము వేయగ తాళనె | bhAmAmaNi kAmuni pOruna vEmaru bANamu vEyaga tALane |
| చరణం charaNam 4 | ధయరధ ధర్మ దురయందు నా దొరయౌ పరవాసుని వేగమే | dhayaradha dharma durayamdu nA dorayou paravAsuni vEgamE |