| Title | సరి యేమి | sari yEmi |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | అఠాణా | aThANA |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | సరియేమి సారసాక్షి నీకిది కరమిచ్చి చేర పిలచిన కరుణా రసంబే లేకుండుట | sariyEmi sArasAkshi nIkidi karamichchi chEra pilachina karuNA rasambE lEkunDuTa |
| చరణం charaNam 1 | మదిరాక్షి నీదు మోని హృదయంబు గానలేకనే ముదమంది మోవియాన రాగ పెదవివ్వకనే బిగువుల్ జేయుట | madirAkshi nIdu mOni hRdayambu gAnalEkanE mudamandi mOviyAna rAga pedavivvakanE biguvul jEyuTa |
Author: Javali Lyrics
My mother collected hundreds of jAvaLi lyrics as part of her research on the literary values in jAvaLi. Instead of publishing them as a book, which would have had limited reach, we chose to post them as a blog. Then we found many more lyrics and kept posting...
Lot more can be done - finding notation, links to audio/video, any further corrections, offer a meaning for each word / line,...
Contact us at javaliwebsite@gmail.com
#586 మరులు కొన్నదిరా marulu konnadirA
| Title | మరులు కొన్నదిరా | marulu konnadirA |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మరులు కొన్నదిరా మానినీ మణి నీపై పరిపరి విధముల పరితపించుచు నీపై | marulu konnadirA mAninI maNi nIpai paripari vidhamula paritapinchuchu nIpai |
| చరణం charaNam 1 | ధరను లోనీకు తగిన వల్లభుడని తరుణి మిక్కిలి నిన్ను తలచి తలచి చాలా వనజ నేత్రుడౌ శ్రీనివాస నాయక నిన్ను వల్లగ నీ మాటలు ఎల్లపుడును ఎద | dharanu lOnIku tagina vallabhuDani taruNi mikkili ninnu talachi talachi chAlA vanaja nEtruDau SrInivAsa nAyaka ninnu vallaga nI mATalu ellapuDunu eda |
| చరణం charaNam 2 | మరచితివా నన్ను మగువా గురుతెరుగా మువ్వ గోపాలుడగు గాన | marachitivA nannu maguvA guruterugA muvva gOpAluDagu gAna |
| చరణం charaNam 3 | పాటల ధారీ మువ్వ గోపాల మంచి తేట ముత్యము లేరలు తీసుకో గొనిన నాటి వరకింత నేటికి దీరదు | pATala dhArI muvva gOpAla manchi tETa mutyamu lEralu tIsukO gonina nATi varakinta nETiki dIradu |
#585 పోవే పోపోవే చెలియా pOvE pOpOvE cheliyA
| Title | పోవే పోపోవే చెలియా | pOvE pOpOvE cheliyA |
| Written By | ధర్మపురి? | dharmapuri? |
| Book | ||
| రాగం rAga | యమునా కల్యాణి | yamunA kalyANi |
| తాళం tALa | చాపు | chApu |
| Previously Posted At | 473 | |
| పల్లవి pallavi | పోవే పోపోవే చెలియా వేగ పోవే పోపోవే చెలియా పోవే వానిటు వేగలేవ చెలియా | pOvE pOpOvE cheliyA vEga pOvE pOpOvE cheliyA pOvE vAniTu vEgalEva cheliyA |
| చరణం charaNam 1 | మదనుడు పదను శరము లెద నేయ మదన సదన మింక పదనించె గదవె | madanuDu padanu Saramu leda nEya madana sadana minka padaninche gadave |
| చరణం charaNam 2 | ననబోణి వినవే వనజ వైరి యిపుడు నను బాధించెది న్యాయమౌనటవే | nanabONi vinavE vanaja vairi yipuDu nanu bAdhinchedi nyAyamaunaTavE |
| చరణం charaNam 3 | సరసుడైన ధర్మ పురమున నెలకొన్న పర వాసుదేవుని తేవే చెలియా | sarasuDaina dharma puramuna nelakonna para vAsudEvuni tEvE cheliyA |
#584 అరమరికగా aramarikagA
| Title | అరమరికగా | aramarikagA |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | అరమరికగా నా మాట ఆదరించ వదేమిరా | aramarikagA nA mATa Adarincha vadEmirA |
| చరణం charaNam 1 | సమయమిదే కాదుర నా సామి నాతో మాటలాడ | samayamidE kAdura nA sAmi nAtO mATalADa |
| చరణం charaNam 2 | పట్ట పగలు వెన్నెలలో విత్తముగ గాయుచున్నవి | paTTa pagalu vennelalO vittamuga gAyuchunnavi |
| చరణం charaNam 3 | బొట్టుగట్టిన వాడింట అడ్డన యున్నానురా | boTTugaTTina vADinTa aDDana yunnAnurA |
#583 స్మర సుందరాంగుని smara sundarAnguni
| Title | స్మర సుందరాంగుని | smara sundarAnguni |
| Written By | ధర్మపురి? | dharmapuri? |
| Book | ||
| Also Posted At | 640 | |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | స్మర సుందరాంగుని సరి ఎవ్వరే సరస కోటి లోన వజీరుహమీరే | smara sundarAnguni sari evvarE sarasa kOTi lOna vajIruhamIrE |
| చరణం charaNam 1 | ఆడిన మాటకు అడ్డము పల్కడె చేడియలను కన్నుల చూడడె | ADina mATaku aDDamu palkaDe chEDiyalanu kannula chUDaDe |
| చరణం charaNam 2 | వీనుల కింపుగ వీణ వాయించితె యలి వేణి నే పాడ సెభాషిచ్చుటే | vInula kimpuga vINa vAyinchite yali vENi nE pADa sebhAshichchuTE |
| చరణం charaNam 3 | ధరణిలో అది దెల్పవు దారశ్రీ ధర్మపురీపుడైన | dharaNilO adi delpavu dAraSrI dharmapurIpuDaina |
#582 మరుబారి marubAri
| Title | మరుబారి | marubAri |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | మరుబారి కోర్వలేనే నారీమణి తేవే | marubAri kOrvalEnE nArImaNi tEvE |
| చరణం charaNam 1 | నీరజాక్షుడే తీరున నేరమేమికోవే నారీమణి లేవే | nIrajAkshuDE tIruna nEramEmikOvE nArImaNi lEvE |
| చరణం charaNam 2 | సదయుడు నాయందు సదా పంతమె సాధించెనే అంతరంగు డేయునందు వింత వేరే యుండునే నారీమణి లేవే | sadayuDu nAyandu sadA pantame sAdhinchenE antarangu DEyunandu vinta vErE yunDunE nArImaNi lEvE |
#581 ముట్టవద్దురా muTTavaddurA
| Title | ముట్టవద్దురా | muTTavaddurA |
| Written By | శ్రీ చిన్నయ్య? | SrI chinnayya? |
| Book | ||
| రాగం rAga | సావేరి | sAvEri |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 266 | |
| పల్లవి pallavi | ముట్టవద్దురా మోహనాంగ నన్నిపుడు కట్టు జేసి యుండగ వట్టి వాదు లాడుచు | muTTavaddurA mOhanAnga nannipuDu kaTTu jEsi yunDaga vaTTi vAdu lADuchu |
| చరణం charaNam 1 | ఆ సవతి పైట తీసి జూచుచు సంతోష మాటలాడుచు బాసలిచ్చి నాచేత | A savati paiTa tIsi jUchuchu samtOsha mATalADuchu bAsalicchi nAchEta |
| చరణం charaNam 2 | కాముకేళిలోన కామి నిన్నే చాల ప్రేమతో గూడేలిన చామభూపాలుని చేత | kAmukELilOna kAmi ninnE chAla prEmatO gUDElina chAmabhUpAluni chEta |
#580 మరుబారికకి marubArikaki
| Title | మరుబారికకి | marubArikaki |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | మరుబారికని తాళలేనురా ఏరా ఏరా ఏరా నా సామి తాళలేనురా తాళలేనురా ఏరా నా సామి | marubArikani tALalEnurA ErA ErA ErA nA sAmi tALalEnurA tALalEnurA ErA nA sAmi |
| చరణం charaNam 1 | ఎంత వేడినా నా చెంతకు రారమ్మని సుంతయు దయరాదా పంతము జేసెదవేరా | enta vEDinA nA chentaku rArammani suntayu dayarAdA pantamu jEsedavErA |
| చరణం charaNam 2 | సుందరాంగ నాపై కోపమేలరా తాపమాయెరా పరితాప మాపజాలర | sundarAnga nApai kOpamElarA tApamAyerA paritApa mApajAlara |
| చరణం charaNam 3 | పోయిన వేళను మా బోటి నంపితే పిలచిన పలుక వైతివేర సామి | pOyina vELanu mA bOTi nampitE pilachina paluka vaitivEra sAmi |
#579 సుందరుడా sundaruDA
| Title | సుందరుడా | sundaruDA |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | సుందరుడా నా ప్రాణ సఖుడా నా ప్రాణ నాథుడ నన్నెడబాయుట న్యాయము కాదురా | sundaruDA nA prANa sakhuDA nA prANa nAthuDa nanneDabAyuTa nyAyamu kAdurA |
| చరణం charaNam 1 | కన్నెరికము నాడు నిన్ను నే కోరితి జాలమింకేల సుందరుడా | kannerikamu nADu ninnu nE kOriti jAlaminkEla sundaruDA |
| చరణం charaNam 2 | చిన్ననాట నుండి నిన్ను నే నమ్మితి నన్నెడబాయుట న్యాయము కాదురా రాజ రాజ శ్రీ ఆనంద గజపతి ఆనంద వర్మ రా ఏరా | chinnanATa nunDi ninnu nE nammiti nanneDabAyuTa nyAyamu kAdurA rAja rAja SrI Ananda gajapati Ananda varma rA ErA |
#578 అతని నొక్కపరి atani nokkapari
| Title | అతని నొక్కపరి | atani nokkapari |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | అతని నొక్కపరి యిటు రమ్మనే చెలి పిలచిన పలుకడ యే అలుక యేల గలిగి నాపా | atani nokkapari yiTu rammanE cheli pilachina palukaDa yE aluka yEla galigi nApA |
| చరణం charaNam 1 | చక్కని మోము జూచి చాలనే వలచితి చుక్కల రాయుని ధిక్కరించిన వాని చక్కని మోము జూచి చాలనే వలచితి | chakkani mOmu jUchi chAlanE valachiti chukkala rAyuni dhikkarinchina vAni chakkani mOmu jUchi chAlanE valachiti |
| చరణం charaNam 2 | బంతులాడ బోయి పనిచిరి నా షోకు మాని ఎంత వేడిన గాని చెంతకు రాడు వాడు నా మది కలయి కోరిక దాపు జాలా నీకేలా | bantulADa bOyi panichiri nA shOku mAni enta vEDina gAni chentaku rADu vADu nA madi kalayi kOrika dApu jAlA nIkElA |