| Title | వాని జోలి | vAni jOli |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | బ్యాగు | byAgu |
| తాళం tALa | చాపు | chApu |
| Posted before | 378 | |
| పల్లవి pallavi | వాని జోలి నాకేలే ఇందుముఖిరో ఆ వనిత బోధనచే మైమఱచె | vAni jOli nAkElE indumukhirO A vanita bOdhanachE maima~rache |
| చరణం charaNam 1 | మానినిరో వాని మమత లెందు బోయె పూని దాని యిలు విడిచి రాక యున్నాడిక | mAninirO vAni mamata lendu bOye pUni dAni yilu viDichi rAka yunnADika |
| చరణం charaNam 2 | ఇంతిరో నిను బాయనని నాతో ఎన్నో బూటకములు పలికెనే సంతసమెల్ల నా చాన కొసగి నన్ను పంతముతో మరుని పాలు చేసెనిక | intirO ninu bAyanani nAtO ennO bUTakamulu palikenE santasamella nA chAna kosagi nannu pantamutO maruni pAlu chEsenika |
| చరణం charaNam 3 | మాట తప్పని వాడని నేను మనసున నెంచితి గదనే బోటిరో అలవాని మోము జూడనగునా సాటి వారలు నవ్వ జాలరేమె యిక | mATa tappani vADani nEnu manasuna nenchiti gadanE bOTirO alavAni mOmu jUDanagunA sATi vAralu navva jAlarEme yika |
| చరణం charaNam 4 | శింగర నుతుడు నాతో మును చేసిన చెలిమిని మఱచెనే బంగారము వంటి వాని గుణము లెల్ల అంగనా మణి మోహాబ్ధి జేరెనిక | Singara nutuDu nAtO munu chEsina chelimini ma~rachenE bangAramu vanTi vAni guNamu lella anganA maNi mOhAbdhi jErenika |
#461 సామి నెడబాసి sAmi neDabAsi
| Title | సామి నెడబాసి | sAmi neDabAsi |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | దేవమనోహరి | dEvamanOhari |
| తాళం tALa | చాపు | chApu |
| Previously posted | 377 | |
| పల్లవి pallavi | సామి నెడబాసి నేనెట్టు సైరింతునే కోమలి శ్రీ రాజ గోపాల | sAmi neDabAsi nEneTTu sairintunE kOmali SrI rAja gOpAla |
| చరణం charaNam 1 | మరుడురమున విరి శరముల నేసెనే సరసిజాక్షి ఇదే సమయము రమ్మనవే | maruDuramuna viri Saramula nEsenE sarasijAkshi idE samayamu rammanavE |
| చరణం charaNam 2 | కలువల దొర పగ నాపై గావించెనే కలికిరో తమి నిలుప నా తరమటే | kaluvala dora paga nApai gAvinchenE kalikirO tami nilupa nA taramaTE |
| చరణం charaNam 3 | శింగర నుతుడు మోసము జేసెగదే అంగనా మణి ఇపుడైనను బిలువవే | Singara nutuDu mOsamu jEsegadE anganA maNi ipuDainanu biluvavE |
#460 కాసా నీ చెలి నే kAsA nI cheli nE
| Title | కాసా నీ చెలి నే | kAsA nI cheli nE |
| Written By | ధర్మపురి? | dharmapuri? |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Published At | 47 | |
| పల్లవి pallavi | కాసా నీ చెలి నే గాదటర నీ బాసలెల్ల ఏమాయెనురా | kAsA nI cheli nE gAdaTara nI bAsalella EmAyenurA |
| చరణం charaNam 1 | సారుకు నా సరిపారి యెదుట నిన్ను రారా రారా రారా యని పిలిచిన | sAruku nA saripAri yeduTa ninnu rArA rArA rArA yani pilichina |
| చరణం charaNam 2 | ఆ సతులతో పరిహాసము సలుపగ రోసముతో ఒరోరని పిలిచిన | A satulatO parihAsamu salupaga rOsamutO orOrani pilichina |
| చరణం charaNam 3 | రేపగలని భేదము లెంచక నే నీపైకొని యుపరతులను సలిపిన | rEpagalani bhEdamu lenchaka nE nIpaikoni yuparatulanu salipina |
| చరణం charaNam 4 | మాటలోన పొరపాటు లేని నీ మాటలెల్ల బల్ సూటిగ నేర్చిన | mATalOna porapATu lEni nI mATalella bal sUTiga nErchina |
| చరణం charaNam 5 | ధర్మపురిని నెలకొన్న సామి శ్రీ నిర్మలమగు మకుటేశుని సాక్షిగ | dharmapurini nelakonna sAmi SrI nirmalamagu makuTESuni sAkshiga |
#459 చాలే చాలే chAlE chAlE
| Title | చాలే చాలే | chAlE chAlE |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | చాపు | chApu |
| See Also | previous posts 159 and 11 | |
| పల్లవి pallavi | చాలే చాలే అలవానితో పొందు చాలే చాలే ఈ లాభము ఇక | chAlE chAlE alavAnitO pondu chAlE chAlE I lAbhamu ika |
| చరణం charaNam 1 | అలివేణిరొ ఆ నలినాక్షి కాళ్ళకు మ్రొక్కెడి వానితో స్నేహము ఇక | alivENiro A nalinAkshi kALLaku mrokkeDi vAnitO snEhamu ika |
| చరణం charaNam 2 | కలకంఠిరొ భూతల మందున కల్లలు పలికెడి వానితో స్నేహము ఇక | kalakanThiro bhUtala manduna kallalu palikeDi vAnitO snEhamu ika |
#458 చెలి మనకేల cheli manakEla
| Title | చెలి మనకేల | cheli manakEla |
| Written By | ధర్మపురి? | dharmapuri? |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| Also look at | 2 | |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | త్రిశ్ర లఘువు | triSra laghuvu |
| పల్లవి pallavi | చెలి మనకేల వానితోను పొందు చాలునే వాని పొందు చాలునే వానితో పొందు చాలునే | cheli manakEla vAnitOnu pondu chAlunE vAni pondu chAlunE vAnitO pondu chAlunE |
| చరణం charaNam 1 | కనికర మెంచని కౌగలింత లేలనే వానితో కౌగిలేలనే | kanikara menchani kaugalinta lElanE vAnitO kaugilElanE |
| ఎంగిలని ఎంచు వాని రంగు విడెమేలనే వానెంగిలి మనకేలనే | engilani enchu vAni rangu viDemElanE vAnengili manakElanE | |
| మర్మము నెఱింగిన శ్రీ ధర్మపురి నిలయుడే ఆ కన్నెల కేకాంతుడే | marmamu ne~ringina SrI dharmapuri nilayuDE A kannela kEkAntuDE | |
#457 దూరులకు నే dUrulaku nE
| Title | దూఱులకు నే | dU~rulaku nE |
| Written By | ధర్మపురి? | dharmapuri? |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | బ్యాగు | byAgu |
| తాళం tALa | మిశ్ర లఘువు | miSra laghuvu |
| పల్లవి pallavi | దూఱులకు నే లోనైతి గదవే వట్టి | dU~rulaku nE lOnaiti gadavE vaTTi |
| సారసాక్షుడు నాతో కద్దని మఱి వట్టి | sArasAkshuDu nAtO kaddani ma~ri vaTTi | |
| ఆట పాటలకు నే మాటిమాటికి వాని చోటికి నే బోవగా వట్టి | ATa pATalaku nE mATimATiki vAni chOTiki nE bOvagA vaTTi | |
| బోటుల కెదుట నే జూచి నవ్వే అలవాటు చేసినందుకా వట్టి | bOTula keduTa nE jUchi navvE alavATu chEsinandukA vaTTi | |
| ధర్మపురిని నెలకొన్న శ్రీపరవాసుదేవు డెఱుగు గదవే వట్టి | dharmapurini nelakonna SrIparavAsudEvu De~rugu gadavE vaTTi |
“dUrulaku nE” – added to facilitate search without ~
#456 ఏలా మా రమణిపై ElA mA ramaNipai
| Title | ఏలా మా రమణిపై | ElA mA ramaNipai |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | కేదార గౌళ | kEdAra gauLa |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏలా మా రమణిపై చలము నీకిది మేర గాదుర సామి వినరా | ElA mA ramaNipai chalamu nIkidi mEra gAdura sAmi vinarA |
| చరణం charaNam 1 | చాలా మరుని సుమ శరావళికి నది పాలాయె దయ గనుగొనరా ఈ లీల జాగొనరించుట నీకిది | chAlA maruni suma SarAvaLiki nadi pAlAye daya ganugonarA I lIla jAgonarinchuTa nIkidi |
| చరణం charaNam 2 | పరాకు సలుపకు సరోజ ముఖిపై విరాళి కోర్వదు గదరా నిరాదరణ చేయుటే బిరుద ఇది | parAku salupaku sarOja mukhipai virALi kOrvadu gadarA nirAdaraNa chEyuTE biruda idi |
| చరణం charaNam 3 | ఎన్నో విధములను హితవు దెలిపినను అన్నాదులను వదలెనురా మన్నింపవేర రాజగోపాల ఇది నీకు | ennO vidhamulanu hitavu delipinanu annAdulanu vadalenurA mannimpavEra rAjagOpAla idi nIku |
#455 పలుకవు నాతో palukavu nAtO
| Title | పలుకవు నాతో | palukavu nAtO |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | పలుకవు నాతో మఱి ఇదేటి మోడిరా | palukavu nAtO ma~ri idETi mODirA |
| చరణం charaNam 1 | చెలుల బోధన లెల్ల తలకెక్కె నేమో కాని చెలిమిని దలచవు మేరా | chelula bOdhana lella talakekke nEmO kAni chelimini dalachavu mErA |
| చరణం charaNam 2 | విడెమొసగుచు ముద్దు లిడగబోతే నను విదలించుట మరియాదా | viDemosaguchu muddu liDagabOtE nanu vidalinchuTa mariyAdA |
| చరణం charaNam 3 | సరివారిలో నను చౌక చేయకుర సరసుడ రాజ గోపాలా | sarivArilO nanu chauka chEyakura sarasuDa rAja gOpAlA |
#454 సామి నాపై sAmi nApai
| Title | సామి నాపై | sAmi nApai |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | ముఖారి | mukhAri |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | సామి నాపై చలమేలా సరగ నేలుకొనరా | sAmi nApai chalamElA saraga nElukonarA |
| కాము బారి కోర్వ జాల కరుణ నేలుకొనరా | kAmu bAri kOrva jAla karuNa nElukonarA | |
| నిమిషమైన బాయనట్టి నెనరు మఱవ నగునా | nimishamaina bAyanaTTi nenaru ma~rava nagunA | |
| మరులు కొంటి నిన్నె చాల మనవి చేకొనరా | marulu konTi ninne chAla manavi chEkonarA | |
| పంతమేల రాజ గోపాల సామి వినురా | pantamEla rAja gOpAla sAmi vinurA |
#453 మగువరో వానిపైని maguvarO vAnipaini
| Title | మగువరో వానిపైని | maguvarO vAnipaini |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | త్రిశ్ర లఘువు | triSra laghuvu |
| పల్లవి pallavi | మగువరో వానిపైని మమత యెటుల తీఱునే | maguvarO vAnipaini mamata yeTula tI~runE |
| చరణం charaNam 1 | పొగరున సుమ శరుడు పొంచి విలు వంచెనే అంతంతకు తమి మించెనే | pogaruna suma SaruDu ponchi vilu vanchenE antantaku tami minchenE |
| చరణం charaNam 2 | వానితో సుఖింపని ప్రాయమది యేటికే ఈ కాయమది యేటికే | vAnitO sukhimpani prAyamadi yETikE I kAyamadi yETikE |
| చరణం charaNam 3 | రతి పతి గన్న శ్రీ రాజ గోపాలుడే ఉదార గుణ శీలుడే | rati pati ganna SrI rAja gOpAluDE udAra guNa SIluDE |