| Title | రారా సామిగా | rArA sAmigA |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | రారా సామిగా వేగమే ప్రియ సఖినేల సమయమిదేర రమణి తాళలేదురా మనవి చేకోరా | rArA sAmigA vEgamE priya sakhinEla samayamidEra ramaNi tALalEdurA manavi chEkOrA |
| చరణం charaNam 1 | మారుబారి కోర్వక మమత జెంది నీదారి జూచు చున్నదిరా దయ యుంచి | mArubAri kOrvaka mamata jendi nIdAri jUchu chunnadirA daya yunchi |
| చరణం charaNam 2 | చెలులు మాటాడిన చెవి యిచ్చి వినదురా తలపంత నీపైనిరా దయ యుంచి | chelulu mATADina chevi yichchi vinadurA talapanta nIpainirA daya yunchi |
| చరణం charaNam 3 | విడెమని అస్నమని వేడుకని నిదురని పడతికి లేదురా దయ యుంచి | viDemani asnamani vEDukani nidurani paDatiki lEdurA daya yunchi |
| చరణం charaNam 4 | రమణి నీ యాసచే రాజగోపాల ప్రాణము నిలుపు కొన్నదిరా దయ యుంచి | ramaNi nI yAsachE rAjagOpAla prANamu nilupu konnadirA daya yunchi |
#434 సామి రాడాయెనే sAmi rADAyenE
| Title | సామి రాడాయెనే | sAmi rADAyenE |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | బ్యాగు | byAgu |
| తాళం tALa | తిశ్ర లఘువు | tiSra laghuvu |
| పల్లవి pallavi | సామి రాడాయెనే సరగున రమ్మనవే నా మనోహరుని కేభామ బోధించెనో | sAmi rADAyenE saraguna rammanavE nA manOharuni kEbhAma bOdhinchenO |
| చరణం charaNam 1 | ఇంతి వాని దలచితే మది ఎంతయు రంజిల్లునే కంతు బారి కోర్వలేక కరగు చుండుటే కాని | inti vAni dalachitE madi entayu ranjillunE kantu bAri kOrvalEka karagu chunDuTE kAni |
| చరణం charaNam 2 | నిమిషమైన నను జూడక నిలిచి యుండ జాలడే రమణు డిపుడు చలము జేసి రట్టు చేయ బూనెనే | nimishamaina nanu jUDaka nilichi yunDa jAlaDE ramaNu DipuDu chalamu jEsi raTTu chEya bUnenE |
| చరణం charaNam 3 | రామరో నన్నేలిన రాజగోపాలుడే ప్రేమ సుంతైన లేక మోహము జూప కున్నాడే | rAmarO nannElina rAjagOpAluDE prEma suntaina lEka mOhamu jUpa kunnADE |
#433 చలము చేసేవదేలరా chalamu chEsEvadElarA
| Title | చలము చేసేవదేలరా | chalamu chEsEvadElarA |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | చలము చేసేవదేలరా సామి నీకిది మేరా సామి వినురా నీకిది మేరా సరగున నను నేలుకోర నీదానరా సామి | chalamu chEsEvadElarA sAmi nIkidi mErA sAmi vinurA nIkidi mErA saraguna nanu nElukOra nIdAnarA sAmi |
| చరణం charaNam 1 | కలకాలము నీ కౌగిలి బాయక చెలిమిని గోరుచున్న నాతో | kalakAlamu nI kaugili bAyaka chelimini gOruchunna nAtO |
| చరణం charaNam 2 | పగదాననా పంతగించకురా తగదుర పలు మఱు నీవిట్లు | pagadAnanA pantaginchakurA tagadura palu ma~ru nIviTlu |
| చరణం charaNam 3 | రాజసమేలరా రట్టు సేయకురా రాజగోపాల సామి నాతో | rAjasamElarA raTTu sEyakurA rAjagOpAla sAmi nAtO |
#432 ఓ చెలియా O cheliyA
| Title | ఓ చెలియా | O cheliyA |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | తిశ్ర లఘువు | tiSra laghuvu |
| పల్లవి pallavi | ఓ చెలియా యీ విరహమెట్లు సైరింతునే చెలువుడు దయలేక నాతో పలుక రాడాయనే | O cheliyA yI virahameTlu sairintunE cheluvuDu dayalEka nAtO paluka rADAyanE |
| చరణం charaNam 1 | మగువ యెవతో నా విభుని మరులు కొలిపెనే ఎంతో మాయ చేసెనే సఖీ పగలు రేయి నిదుర లేక పలవించుటాయెనే | maguva yevatO nA vibhuni marulu kolipenE entO mAya chEsenE sakhI pagalu rEyi nidura lEka palavinchuTAyenE |
| చరణం charaNam 2 | కమల వైరి కాకలకే కంది యుండగ నే దిగులొంది యుండగా సఖీ సమయమిదే యని మరుడు శరము లేయసాగెనే | kamala vairi kAkalakE kandi yunDaga nE digulondi yunDagA sakhI samayamidE yani maruDu Saramu lEyasAgenE |
| చరణం charaNam 3 | రాజగోపాలు డెపుడు రమణ నేలునే నన్నెపుడు రమణ నేలునె ఈ వగపెపుడు మానునే సఖీ ఈ జగాన వాని సాటి ఎందు జూడ గాననే | rAjagOpAlu DepuDu ramaNa nElunE nannepuDu ramaNa nElune I vagapepuDu mAnunE sakhI I jagAna vAni sATi endu jUDa gAnanE |
#431 చాలు చాలు పోరా chAlu chAlu pOrA
| Title | చాలు చాలు పోరా | chAlu chAlu pOrA |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | చాలు చాలు పోరా ఓరి సామి | chAlu chAlu pOrA Ori sAmi |
| చరణం charaNam 1 | బాలనురా నన్ను బలిమిని బట్టేవు లాలించుట కిది వేళగాదుర సామి | bAlanurA nannu balimini baTTEvu lAlinchuTa kidi vELagAdura sAmi |
| చరణం charaNam 2 | కుదురు పడని నాదు కుచముల నంటేవు పదరుట నీకిది బాడి గాదుర సామి | kuduru paDani nAdu kuchamula nanTEvu padaruTa nIkidi bADi gAdura sAmi |
| చరణం charaNam 3 | ప్రజలు విన్నను నగుబాటు కల్గును నీకు నిజముగ నైదాఱు నెలలు తాళుకోర | prajalu vinnanu nagubATu kalgunu nIku nijamuga naidA~ru nelalu tALukOra |
| చరణం charaNam 4 | రచ్చ సేయకిపుడు రాజగోపాల పచ్చవిల్తు కేళి పరగ కూడుదు గాని | rachcha sEyakipuDu rAjagOpAla pachchaviltu kELi paraga kUDudu gAni |
#430 చేర రావదేమిర chEra rAvadEmira
| Title | చేర రావదేమిర | chEra rAvamadEmira |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | మిశ్ర లఘువు | miSra laghuvu |
| పల్లవి pallavi | చేర రావదేమిర చెప్పవదేమిర మారకోటి సుందర మరులైతి గదర | chEra rAvadEmira cheppavadEmira mArakOTi sundara marulaiti gadara |
| చరణం charaNam 1 | నిను జూడని యొక నిమిషమే యుగముగా మనమున నెంచుచు మమత జెందితిర | ninu jUDani yoka nimishamE yugamugA manamuna nenchuchu mamata jenditira |
| చరణం charaNam 2 | పిలిపించిన రావు పిలిచిన పలుకవు తలపులు వేఱై తల్లడ పెట్టేవు | pilipinchina rAvu pilichina palukavu talapulu vE~rai tallaDa peTTEvu |
| చరణం charaNam 3 | రసికుడైన శ్రీరాజ గోపాల కొసరి వేడినను కసటుగా జూచుచు | rasikuDaina SrIrAja gOpAla kosari vEDinanu kasaTugA jUchuchu |
#429 చెలి మనకేలే cheli manakElE
| Title | చెలి మనకేలే | cheli manakElE |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | హమీర్ కల్యాణి | hamIr kalyANi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | చెలి మనకేలే చెలువునితో మాటలు | cheli manakElE cheluvunitO mATalu |
| చరణం charaNam 1 | కలకాలము నాతో సలిపిన స్నేహము తలచక నలుగురిలో చులుకన చేసెనిక | kalakAlamu nAtO salipina snEhamu talachaka nalugurilO chulukana chEsenika |
| చరణం charaNam 2 | వనితరో వాని నే వలచి నందుకు కనికర మెంచక కఠినము లాడెనిక | vanitarO vAni nE valachi nanduku kanikara menchaka kaThinamu lADenika |
| చరణం charaNam 3 | వాసిగ రాజగోపాలుడు చేసిన బాసలు మఱచి యా దోసకారిని గూడెనిక | vAsiga rAjagOpAluDu chEsina bAsalu ma~rachi yA dOsakArini gUDenika |
#428 సమయము గాదురా samayamu gAdurA
| Title | సమయము గాదురా | samayamu gAdurA |
| Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | యమన్ | yaman |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | సమయము గాదురా సామి లేచిపోరా సామి లేచిపోరా జాగు చేసేవేరా | samayamu gAdurA sAmi lEchipOrA sAmi lEchipOrA jAgu chEsEvErA |
| చరణం charaNam 1 | చేయి పట్టి నా సిగ్గు చెఱచకురా సామి వేయి విధముల నే వేడుకొన్న వినవు | chEyi paTTi nA siggu che~rachakurA sAmi vEyi vidhamula nE vEDukonna vinavu |
| చరణం charaNam 2 | అత్తింటి కోడలని ఆలోచింపక చిత్తజు కేళికాయత్తమై యున్నావు | attinTi kODalani AlOchimpaka chittaju kELikAyattamai yunnAvu |
| చరణం charaNam 3 | ఇంటి వారందఱు నిట్టట్టు తిరిగేరు కంటికి తెలియక కదలి పోరా ఇది | inTi vAranda~ru niTTaTTu tirigEru kanTiki teliyaka kadali pOrA idi |
| చరణం charaNam 4 | రాజగోపాల రట్టు సేయుటేల సాజముగా మఱొక సారి వత్తువు గాని | rAjagOpAla raTTu sEyuTEla sAjamugA ma~roka sAri vattuvu gAni |
#427 ఓ మై లవ్లీ లలనా O mai lavlI lalanA
| Title | ఓ మై లవ్లీ లలనా | O mai lavlI lalanA |
| Written By | కరూర్ శివరామయ్య | karUr SivarAmayya |
| Book | రసరాజ వైభవ | rasarAja vaibhava |
| రాగం rAga | ఖరహరప్రియ | kharaharapriya |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఓ మై లవ్లీ లలనా ఏలనే పొమ్మంటి | O my lovely lalanA ElanE pommanTi |
| అనుపల్లవి anupallavi | ఏమోయని యుంటి కామిని నిన్ను | EmOyani yunTi kAmini ninnu |
| చరణం charaNam 1 | ఇటువంటి స్టెప్ ఈస్ ఇట్ ఫిట్ టు టేక్ సిట్ ఎ వైల్ హియర్, లెట్ మి కన్విన్స్ యూ | iTuvanTi step, is it fit to take sit a while here, let me convince you |
| చరణం charaNam 2 | కౌగలింపు వేళ కాంత నీ వాడినది కపట మాటలని కనుగొంటిని | kaugalimpu vELa kAnta nI vADinadi kapaTa mATalani kanugonTini |
| చరణం charaNam 3 | ఎవరి వద్దను డోన్ట్ బి ఏంగ్రీ శివరాముని పదముల పాడు | evari vaddanu dont be angry SivarAmuni padamula pADu |
| AV Link | https://youtu.be/5VKdzICjE88?si=XQYGwaO1FJ6uEnEU |
#426 రావే నా చెలి rAvE nA cheli
| Title | రావే నా చెలి | rAvE nA cheli |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | రసరాజ వైభవ | rasarAja vaibhava |
| రాగం rAga | ఆనంద భైరవి | Ananda bhairavi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రావే నా చెలి నను జేరుటకిది శుభవేళ ఇది శుభవేళ | rAvE nA cheli nanu jEruTakidi SubhavELa idi SubhavELa |
| చరణం charaNam 1 | నారీమణి నీ వయ్యారముతో వచ్చి నను జేరుటకిది శుభవేళ | nArImaNi nI vayyAramutO vachchi nanu jEruTakidi SubhavELa |
| చరణం charaNam 2 | అంగనామణి నీదు భృంగ కుంతలముల రంగు జూపించుటకు శుభవేళ | anganAmaNi nIdu bhRnga kuntalamula rangu jUpinchuTaku SubhavELa |
| చరణం charaNam 3 | నిన్నటి రేయి నిను కలలో జూచితినే చిన్ననాటి నేస్తమెన్నో స్మరించుటకు | ninnaTi rEyi ninu kalalO jUchitinE chinnanATi nEstamennO smarinchuTaku |
| చరణం charaNam 4 | కామకేళికి చామ రాజేంద్రుడు వంటి సామి నే పిలచితె పలుక రాడేలనే | kAmakELiki chAma rAjEndruDu vanTi sAmi nE pilachite paluka rADElanE |