| Title | సరసకు బిగువేల | sarasaku biguvEla |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | రసరాజ వైభవ | rasarAja vaibhava |
| రాగం rAga | పూర్వి కల్యాణి | pUrvi kalyANi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సరసకు బిగువేలనే చెలి సరసకు బిగువేలనే ఓ చెలి | sarasaku biguvElanE cheli sarasaku biguvElanE O cheli |
| అనుపల్లవి anupallavi | సరసుడైన చామ రాజేంద్రుడు వంటి పురుషుడు కరుణించి పిలచితే రాక | sarasuDaina chAma rAjEndruDu vanTi purushuDu karuNinchi pilachitE rAka |
| చరణం charaNam 1 | విరి శరములు నీ యురముతో చిక్కిన మరియాద లింకేలనే సరగున నన్నేలు కొమ్మని వేడక తిరుతిరుగి యూరక జూచేవేల చెలి | viri Saramulu nI yuramutO chikkina mariyAda linkElanE saraguna nannElu kommani vEDaka tirutirugi yUraka jUchEvEla cheli |
| Audio Link | https://www.youtube.com/watch?v=4VQEMmt_Dso |
#424 ఇటు రారా iTu rArA
| Title | ఇటు రారా | iTu rArA |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | రసరాజ వైభవ | rasarAja vaibhava |
| రాగం rAga | బిళహరి | biLahari |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఇటురారా ఇటురారా ఇటురారా సామిగా | iTurArA iTurArA iTurArA sAmigA |
| అనుపల్లవి anupallavi | కటకట కౌగిట మును సేయుటకు నీ(విటురారా) | kaTakaTa kaugiTa munu sEyuTaku nI(viTurArA) |
| చరణం charaNam 1 | నలుగురిలో నను చౌక సేయకురా చెలుల బోధనలెల్ల తల కెక్కెనేమిరా చెలువుడైన చామ రాజేంద్రు నన్నేల చలమేల నే పసిబాల ఓర్వను చాల వాదేల గుణశీల నా చెంత(కిటురారా) | nalugurilO nanu chauka sEyakurA chelula bOdhanalella tala kekkenEmirA cheluvuDaina chAma rAjEndru nannEla chalamEla nE pasibAla Orvanu chAla vAdEla guNaSIla nA chenta(kiTurArA) |
| Audio Link | https://www.youtube.com/watch?v=2eyD3ScCCu4 |
#423 చాలు నీ వయ్యారము chAlu nI vayyAramu
| Title | చాలు నీ వయ్యారము | chAlu nI vayyAramu |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | రసరాజ వైభవ | rasarAja vaibhava |
| రాగం rAga | ధన్యాసి | dhanyAsi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | చాలు నీ వయ్యారము చాలు చాలు నీ వయ్యారము చాలు చాలు నీ వయ్యారము లీల లేల కన్ను సైగ జేసేవేల | chAlu nI vayyAramu chAlu chAlu nI vayyAramu chAlu chAlu nI vayyAramu lIla lEla kannu saiga jEsEvEla |
| అనుపల్లవి anupallavi | బాలా నీవు చాల కులుకుచు పలుకుచు మాలిక వేసితివేలా పూ మాలిక వేసితివేలా యనిన | bAlA nIvu chAla kulukuchu palukuchu mAlika vEsitivElA pU mAlika vEsitivElA yanina |
| చరణం charaNam 1 | కాల హరణ మేలనే తరుణి పాలుమాలిక లేలనే నాలో విరహ భావంబుల తెప్పించి లోలాక్షి నను జూచి ముసి ముసి నవ్వుట | kAla haraNa mElanE taruNi pAlumAlika lElanE nAlO viraha bhAvambula teppinchi lOlAkshi nanu jUchi musi musi navvuTa |
| చరణం charaNam 2 | మరుకేళి గూడుమని నాతో మరుమాట లాడకుమని చెప్పితె సరసుడైన ఈ తాళవనేశుని మెరుగు సొమ్ములు కాసులడుగేవుట | marukELi gUDumani nAtO marumATa lADakumani cheppite sarasuDaina I tALavanESuni merugu sommulu kAsulaDugEvuTa |
#422 సైరిస లారెనో sairisa lArenO
| Title | సైరిస లారెనో | sairisa lArenO |
| Written By | వీణ పద్మనాభయ్య | vINa padmanAbhayya |
| Book | రసరాజ వైభవ | rasarAja vaibhava |
| రాగం rAga | కల్యాణి | kalyANi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సైరిస లారెనో మదన నీరజ దళ నయన నిన్న కదన | sairisa lArenO madana nIraja daLa nayana ninna kadana |
| అనుపల్లవి anupallavi | తోటకె పోదరు బిడద బందు కణ్ బేటదోళి ఎన్న మాటమాడి నోటవొందరలె ఎన్న కొందెయల్లో నిన్న కూటవె ఎనగె కాటవాగిదె యక్కటా | tOTake pOdaru biDada bandu kaN bETadOLi enna mATamADi nOTavondarale enna kondeyallO ninna kUTave enage kATavAgide yakkaTA |
| చరణం charaNam 1 | వసుధయోళు నిన్నోల్ ధనిక రిల్లెందునా నసునగుత వశ వాడె దిటవరియదె పశుపాల నీనెందు నిజవరిదె నానిందు బిసుజ పూక్కుళ వసర బసనిగ నెందరిదు నిన్న | vasudhayOLu ninnOl dhanika rillendunA nasunaguta vaSa vADe diTavariyade paSupAla nInendu nijavaride nAnindu bisuja pUkkuLa vasara basaniga nendaridu ninna |
#421 వద్దంటె కోపమా vaddanTe kOpamA
| Title | వద్దంటె కోపమా | vaddanTe kOpamA |
| Written By | వీణ పద్మనాభయ్య | vINa padmanAbhayya |
| Book | రసరాజ వైభవ | rasarAja vaibhava |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వద్దంటె కోపమా ముట్ట వద్దంటె కోపమా ముద్దు పెట్ట వద్దంటె కోపమా నా సామి కోపమా | vaddanTe kOpamA muTTa vaddanTe kOpamA muddu peTTa vaddanTe kOpamA nA sAmi kOpamA |
| అనుపల్లవి anupallavi | ప్రొద్దు పుట్టగ వచ్చి నను కౌగలించి అద్దంపు చెక్కిళ్ళపై ముద్దు పెట్ట | proddu puTTaga vachchi nanu kaugalinchi addampu chekkiLLapai muddu peTTa |
| చరణం charaNam 1 | ఎవరైన జూచితే నాదు నీదు మరియాద లేమౌనురా వినరా అవనిలో పతివ్రత నేనని నమ్మిన నావారి నమ్మక చెడిబోయ తులజేయ | evaraina jUchitE nAdu nIdu mariyAda lEmaunurA vinarA avanilO pativrata nEnani nammina nAvAri nammaka cheDibOya tulajEya |
#420 సామి నిన్నే sAmi ninnE
| Title | సామి నిన్నే | sAmi ninnE |
| Written By | వీణ పద్మనాభయ్య | vINa padmanAbhayya |
| Book | రసరాజ వైభవ | rasarAja vaibhava |
| రాగం rAga | కమాచి | kamAchi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | సామి నిన్నే నమ్మినానురా సామగాన లోల చామ భూమి పాల జాలమేల | sAmi ninnE namminAnurA sAmagAna lOla chAma bhUmi pAla jAlamEla |
| అనుపల్లవి anupallavi | నన్ను కౌగలించుటకు తామసంబు వలదురా అన్ని నీవైన నాదు విన్నపంబు వినుమురా తిరిగి జూడరా నన్ను గూడరా సరసమాడరా కృష్ణరాజ తనయ వినయ దయా హృదయ | nannu kaugalinchuTaku tAmasambu valadurA anni nIvaina nAdu vinnapambu vinumurA tirigi jUDarA nannu gUDarA sarasamADarA kRshNarAja tanaya vinaya dayA hRdaya |
| చరణం charaNam 1 | జలజ నయన జలజ నాభ సమానమై వెలయు నీవె నాకు దైవము నీదే ధ్యానము ఓర్వ వశమా తమకము సార్వభౌమ సకలములకు | jalaja nayana jalaja nAbha samAnamai velayu nIve nAku daivamu nIdE dhyAnamu Orva vaSamA tamakamu sArvabhauma sakalamulaku |
#419 పంచ బాణుడు pancha bANuDu
| Title | పంచ బాణుడు | pancha bANuDu |
| Written By | మైసూరు సదాశివరావు | maisUru sadASivarAvu |
| Book | రసరాజ వైభవ | rasarAja vaibhava |
| రాగం rAga | పంచ బాణ రాగమాలిక | pancha bANa rAgamAlika |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ** తోడి ** పంచ బాణుడు నాపై వెడలినాడు ఇంక కొంచమైన సైరించుట వశమా | ** tODi ** pancha bANuDu nApai veDalinADu inka konchamaina sairinchuTa vaSamA |
| అనుపల్లవి anupallavi | నన్ను తోడికొని సరసమాడుటకు కన్నడ సేయుట నీకు తగునా | nannu tODikoni sarasamADuTaku kannaDa sEyuTa nIku tagunA |
| చరణం charaNam 1 | తుమ్మెదలు మ్రోయగ కోకిలలు అమ్మరో కూయగ చిలుకలు కలకలమని పలుకగ చెంత చేరి నను చెలిమి జేసి గారవించి కౌగలించి వెతల దీర్చర సరిగాదు మౌనము సారసాక్ష | tummedalu mrOyaga kOkilalu ammarO kUyaga chilukalu kalakalamani palukaga chenta chEri nanu chelimi jEsi gAravinchi kaugalinchi vetala dIrchara sarigAdu maunamu sArasAksha |
| చరణం charaNam 2 | ** అభోగి ** మదన బాధల దీర్చర రారా కమల వదన సుందరా భోగసదన మధురమైన నీ పలుకుల అమృతము సుదతీ మణి కిచ్చి దయ యుంచరా | ** abhOgi ** madana bAdhala dIrchara rArA kamala vadana sundarA bhOgasadana madhuramaina nI palukula amRtamu sudatI maNi kichchi daya yuncharA |
| చరణం charaNam 3 | ** శంకరాభరణం ** అని శంకరాభరణముతో వెలగె ఘనమైన నీ కర పరిఘములో పట్టి నన్ను విడువరాదని వేడిన వట్టి పంతము జేసేవేలరా | ** SankarAbharaNam ** ani SankarAbharaNamutO velage ghanamaina nI kara parighamulO paTTi nannu viDuvarAdani vEDina vaTTi pantamu jEsEvElarA |
| చరణం charaNam 4 | ** కాంభోజి ** సరసిజాస్త్రుని బాధ ఇక తాళజాల రారా కృష్ణ భూపాల విరహ దాయ కాంభోజ వైరిని పరిహాసము చాల నరవర తామసమేల | ** kAmbhOji ** sarasijAstruni bAdha ika tALajAla rArA kRshNa bhUpAla viraha dAya kAmbhOja vairini parihAsamu chAla naravara tAmasamEla |
| చరణం charaNam 5 | ** సహన ** శాన వయ్యారము జేసిన అతి మౌనముతో శ్రీ సదాశివుని ధ్యానములో నుండె నిను కదలించుట కామునికూ ఇంక సాధ్యమా | ** sahana ** SAna vayyAramu jEsina ati maunamutO SrI sadASivuni dhyAnamulO nunDe ninu kadalinchuTa kAmunikU inka sAdhyamA |
| Audio Link | https://www.youtube.com/watch?v=M3-eTbf_kkw |
#418 నా మది nA madi
| Title | నా మది | nA madi |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | నా మది కలయా కోరిక దాపజాలునికేలా సుందరుడా | nA madi kalayA kOrika dApajAlunikElA sundaruDA |
| చరణం charaNam 1 | నా ప్రాణ సఖుడా నా ప్రాణ నాధుడ నన్నెడబాయుట న్యాయము కాదురా | nA prANa sakhuDA nA prANa nAdhuDa nanneDabAyuTa nyAyamu kAdurA |
| చరణం charaNam 2 | కన్నెరికము నాడు నిన్ను నే కోరితి జాలమింకేల సుందరుడా | kannerikamu nADu ninnu nE kOriti jAlaminkEla sundaruDA |
| చరణం charaNam 3 | చిన్ననాట నుండి నిన్ను నే నమ్మితి నన్నెడబాయుట న్యాయము కాదురా | chinnanATa nunDi ninnu nE nammiti nanneDabAyuTa nyAyamu kAdurA |
| చరణం charaNam 4 | రాజరాజశ్రీ ఆనంద గజపతి అనందీ వర్మ రావేరా | rAjarAjaSrI Ananda gajapati anandI varma rAvErA |
#417 మరుబారికి marubAriki
| Title | మరుబారికి | marubAriki |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | మరుబారికి తాళలేనురా ఏరా ఏరా ఏరా నాసామీ | marubAriki tALalEnurA ErA ErA ErA nAsAmI |
| అనుపల్లవి anupallavi | తాళలేనురా తాళలేనురా ఏరా నాసామి | tALalEnurA tALalEnurA ErA nAsAmi |
| చరణం charaNam 1 | ఎంత వేడినా నా చెంతకు రారమ్మని సుంతయిన దయరాద పంతము జేసెదవేరా | enta vEDinA nA chentaku rArammani suntayina dayarAda pantamu jEsedavErA |
| చరణం charaNam 2 | సుందరాంగ నాపై కోపమేలరా పాపమాయెరా పరితాపము పాలాయి | sundarAnga nApai kOpamElarA pApamAyerA paritApamu pAlAyi |
| చరణం charaNam 3 | మందుల దాని పొందు గూడద పోయిన వేళను మాబోటి నంపితే పిలచిన పలుచనయితే రా సామి | mandula dAni pondu gUDada pOyina vELanu mAbOTi nampitE pilachina paluchanayitE rA sAmi |
#416 కలికి మణీరో kaliki maNIrO
| Title | కలికి మణీరో | kaliki maNIrO |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | కలికి మణీరో కాంత మణీరో కమలకరుడు కానరాడే వాని యీ నీ మనసి యొక్క నిముషమయిన నిలువ గలదే | kaliki maNIrO kAnta maNIrO kamalakaruDu kAnarADE vAni yI nI manasi yokka nimushamayina niluva galadE |
| అనుపల్లవి anupallavi | తరుణి రామ తలపు మాని తొలగిన మొతోడి తేవగదే | taruNi rAma talapu mAni tolagina motODi tEvagadE |
| చరణం charaNam 1 | వాసిగ గుంటూరి పురమున వెలసిన దాసుని బ్రోచెడు వాసుదేవుడి వాడె గోపాలుడు వాసిగ బ్రోచిన | vAsiga gunTUri puramuna velasina dAsuni brOcheDu vAsudEvuDi vADe gOpAluDu vAsiga brOchina |