| Title | ఎన్నాళ్ళు సైరింతునే | ennALLu sairintunE |
| Written By | తచ్చూరు | tachchUru |
| Book | ||
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | ఎన్నాళ్ళు సైరింతునే ఓ చెలియనే సామిని తోడి తేవే | ennALLu sairintunE O cheliyanE sAmini tODi tEvE |
| క్రొన్నన విల్తుడు కోపముతోను తిన్నగ నాపై శరము లేసెనే సామి | kronnana viltuDu kOpamutOnu tinnaga nApai Saramu lEsenE sAmi | |
| కనుల పండువై కాచెడు వెన్నెల మనసు కెంతో గాసిని బుట్టించెనే సామి | kanula panDuvai kAcheDu vennela manasu kentO gAsini buTTinchenE sAmi | |
| కోకిలలెల్ల గుంపులు గూడి ఓ కమలాక్షి రవములు గావించెనే సామి | kOkilalella gumpulu gUDi O kamalAkshi ravamulu gAvinchenE sAmi | |
| సింగర సుతుడు చెంగట బాసి అంగన గూడి ఇందు రాకున్నాడె సామి | singara sutuDu chengaTa bAsi angana gUDi indu rAkunnADe sAmi | |
#394 ఏమే మాయలాడి EmE mAyalADi
వైరాగ్య జావళి vairAgya jAvaLi
| Title | ఏమే మాయలాడి | EmE mAyalADi |
| Written By | ?? | |
| Book | ||
| రాగం rAga | కాంభోజి | kAmbhOji |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏమే మాయలాడి చాలు నీ ప్రమాదమైన మోడి | EmE mAyalADi chAlu nI pramAdamaina mODi |
| సామి దాచుకున్న ధామము తెలిసినదే కామప్రలోభము జేసి కట్టేసినావేమి మాయలాడి | sAmi dAchukunna dhAmamu telisinadE kAmapralObhamu jEsi kaTTEsinAvEmi mAyalADi | |
| ధాతుడు లేనింటిలో సేవకుడే రేతిరి పడకెక్కినట్లు ఏ తరగున నీవు నమ్మించి వారి బంధించి గురి తప్పించి నొప్పించేవేమే | dhAtuDu lEninTilO sEvakuDE rEtiri paDakekkinaTlu E taraguna nIvu namminchi vAri bandhinchi guri tappinchi noppinchEvEmE | |
#393 శృంగార శేఖర SRngAra SEkhara
| Title | శృంగార శేఖర | SRngAra SEkhara |
| Written By | యోగ నరసింహ | yOga narasim^ha |
| Book | ||
| రాగం rAga | నీలాంబరి | nIlAmbari |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | శృంగార శేఖర బంగారు సామి సంగీత రాజ భంగపాటాయెరా | SRngAra SEkhara bangAru sAmi sangIta rAja bhangapATAyerA |
| అంగజ వర్థన అంగ సంగము పొంది పొంగుమా పదవి భంగమాయె గదరా | angaja varthana anga sangamu pondi pongumA padavi bhangamAye gadarA | |
| ముందటివలె గాదు యిప్పటి విరహము మరుబారి మితిమీరి మరి పొందు లేదాయె | mundaTivale gAdu yippaTi virahamu marubAri mitimIri mari pondu lEdAye | |
| ఏ పాపుల శాపమో మా పాప ఫలమో ఆపడీ వెతల మాపాలి దేవుడు | E pApula SApamO mA pApa phalamO ApaDI vetala mApAli dEvuDu | |
#392 పిలచితె నేను pilachite nEnu
| Title | పిలచితె నేను | pilachite nEnu |
| Written By | వెంకటరమణ | venkaTaramaNa |
| Book | ||
| రాగం rAga | పూర్వి కల్యాణి | pUrvi kalyANi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | పిలచితె నేను పలుక వమదేమిరా కాని దాని మాట విని కరుణ మరచేవేమిరా | pilachite nEnu paluka vamadEmirA kAni dAni mATa vini karuNa marachEvEmirA |
| మంచివాడవని నేను మరులైతిని గదరా చందకాడ లేరా కోర్కె దీర దాయ | manchivADavani nEnu marulaitini gadarA chandakADa lErA kOrke dIra dAya | |
| మనసు తెలియకను మగువ పొందు జేరితివి కనికర మింతైన లేక కలసినట్లు జేసితివి | manasu teliyakanu maguva pondu jEritivi kanikara mintaina lEka kalasinaTlu jEsitivi | |
| మారుని బారికి మనసు సైరించదాయె మరచేది న్యాయమా మంగళ పురి నివాసా | mAruni bAriki manasu sairinchadAye marachEdi nyAyamA mangaLa puri nivAsA | |
#391 విరహ మగ్గళమాయెరా viraha maggaLamAyerA
| Title | విరహ మగ్గళమాయెరా | viraha maggaLamAyerA |
| Written By | చంద్రశేఖర శాస్త్రి | chandraSEkhara SAstri |
| Book | ||
| రాగం rAga | కాంభోజి | kAmbhOji |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | విరహ మగ్గళ మాయెరా ఓరి నా సామి | viraha maggaLa mAyerA Ori nA sAmi |
| అనుపల్లవి anupallavi | స్మరుడురమున కేసిన విరిశరములు కరుణ లేక నన్ను కొరుకుచుండగ నా | smaruDuramuna kEsina viriSaramulu karuNa lEka nannu korukuchunDaga nA |
| చరణం charaNam 1 | పాల నీళ్ళంటిని నీడ వెలుగంటిని పూల నలుగించ తరమా ధర్మమా బాలచంద్ర ధరునిచే దగ్ధుడైన ఏలాగో వచ్చి నరులకింత బాధ లిచ్చితె | pAla nILLanTini nIDa veluganTini pUla nalugincha taramA dharmamA bAlachandra dharunichE dagdhuDaina ElAgO vachchi narulakinta bAdha lichchite |
#390 సామి నీపై sAmi nIpai
| Title | సామి నీపై | sAmi nIpai |
| Written By | రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ | rAmanAthapuram SrInivAsa ayyangAr |
| Book | ||
| రాగం rAga | నవరత్న జావళి | navaratna jAvaLi |
| తాళం tALa | రూపక | rUpaka |
| ** సరసాంగి ** సామి నీపై ఆ సరసాంగియు చాల మరులు గొన్నదిరా ఆరడము మనసున గల ఆతురత తెలియవలసిన సారశాస్త్రారుడ మదన శాస్త్రములను నెర చదివెను | ** sarasAngi ** sAmi nIpai A sarasAngiyu chAla marulu gonnadirA AraDamu manasuna gala Aturata teliyavalasina sAraSAstrAruDa madana SAstramulanu nera chadivenu | |
| ** సావేరి ** ఏమి జేయుదునని మనసా వేడితి సావేడి ఎల్లప్పుడును చింతించుచున్నదిరా మంచి వితరణ గలది యని యెంచి సరగున నాపై నెనరుంచి సదనము కొరకు జని బిగి కౌగలించగ యుంటి | ** sAvEri ** Emi jEyudunani manasA vEDiti sAvEDi ellappuDunu chintinchuchunnadirA manchi vitaraNa galadi yani yenchi saraguna nApai nenarunchi sadanamu koraku jani bigi kaugalinchaga yunTi | |
| ** నవరోజు ** నా మనవిని విని నీ వచ్చితివని నవరోజు నిన్ను కొనియాడునురా తామసమికను సలుపుట నీకు తగదురా అలవాని దాతలకు సరియైన ప్రమాప్తుడని నిను మొరలిడ | ** navarOju ** nA manavini vini nI vachchitivani navarOju ninnu koniyADunurA tAmasamikanu salupuTa nIku tagadurA alavAni dAtalaku sariyaina pramAptuDani ninu moraliDa | |
| ** లలిత ** తామర సాక్షి నీ లలితాకారమును తగ జూచుటకు ప్రీతియు గలదిరా గారాబముతో పదముల తిరుగ గొలుచుటకు దురాగ్రహము నిరాకరించి బిరాన జూప వరాలొసగు | ** lalita ** tAmara sAkshi nI lalitAkAramunu taga jUchuTaku prItiyu galadirA gArAbamutO padamula tiruga goluchuTaku durAgrahamu nirAkarinchi birAna jUpa varAlosagu | |
| ** వరాళి ** ప్రేమతో వరాళియని నిన్ను పిలచి నీ వద్ద బొమ్మ నేనురా కౄరమగు విరి శరముల సారెకును యెదపై కురియగ వారిజముఖి వలపు మిగుల మీరి నిను కలయుటకు అది | ** varALi ** prEmatO varALiyani ninnu pilachi nI vadda bomma nEnurA kRUramagu viri Saramula sArekunu yedapai kuriyaga vArijamukhi valapu migula mIri ninu kalayuTaku adi | |
| ** ఆరభి ** భామకు నీ భ్రమచే మనసార బిలువలేదని చెప్పుచున్నదిరా గానరసిక శిఖామణి యును యశముగల నీకు సరిసమాన మెవరు లేదనుచును ఆననము గానవలె నను | ** Arabhi ** bhAmaku nI bhramachE manasAra biluvalEdani cheppuchunnadirA gAnarasika SikhAmaNi yunu yaSamugala nIku sarisamAna mevaru lEdanuchunu Ananamu gAnavale nanu | |
| ** ఖమాసు ** వేమరు దాట చేయక మా సుందరి యొక్క వెత దీర్చుట కిదే సమయమురా దాని గుణము తెలుప వశమా పరమ పురుష వరస దానిను మదిలోన దలచు దానిపై నరమర విని | ** khamAsu ** vEmaru dATa chEyaka mA sundari yokka veta dIrchuTa kidE samayamurA dAni guNamu telupa vaSamA parama purusha varasa dAninu madilOna dalachu dAnipai naramara vini | |
| ** భూపాల ** భువిలో వెలయు భూపాలుడని పొగడి నీ రాక కోరి యున్నదిరా మార జనక యల మలయ మారుతము బహు విసరగ వెరచి కరగి విరహాబ్ధిలో మునిగి చిరకాలమున నిను | ** bhUpAla ** bhuvilO velayu bhUpAluDani pogaDi nI rAka kOri yunnadirA mAra janaka yala malaya mArutamu bahu visaraga verachi karagi virahAbdhilO munigi chirakAlamuna ninu | |
| ** శ్రీ ** కామించి దక్కిన శ్రీనివాస నిన్ను కరుణతో అచ్చటకు రమ్మనెనురా ఆదరువుగ సకల సుర సేవిత పద యుగళ మృదు అధర మధుర సరస లీల వినుత వాహుని సొగసుని కాలమెరిగి జరుపు నెలత ఏల పడ దగినదిరా యని కులవర సుసమయమంచు తూలపరచక నెలవిమ్ము నెలమెరయు సదయుడ తమిప్రేమ తాళదురా విబుధజన పరిపాల నిను విడచి యున్నది మేలిమి గల నవరత్న మాలికా భరణుడైన సామి | ** SrI ** kAminchi dakkina SrInivAsa ninnu karuNatO achchaTaku rammanenurA Adaruvuga sakala sura sEvita pada yugaLa mRdu adhara madhura sarasa lIla vinuta vAhuni sogasuni kAlamerigi jarupu nelata Ela paDa daginadirA yani kulavara susamayamanchu tUlaparachaka nelavimmu nelamerayu sadayuDa tamiprEma tALadurA vibudhajana paripAla ninu viDachi yunnadi mElimi gala navaratna mAlikA bharaNuDaina sAmi |
#389 మోము జూప mOmu jUpa
| Title | మోము జూప | mOmu jUpa |
| Written By | మైసూరు సదాశివరావు | maisUru sadASivarAvu |
| Book | ||
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | మోము జూపవేమి ముద్దు మాటలాడవేమి నాతో | mOmu jUpavEmi muddu mATalADavEmi nAtO |
| కామిత ఫలదాయక నీవని చక్కగ మ్రొక్కిన యిటునా | kAmita phaladAyaka nIvani chakkaga mrokkina yiTunA | |
| తామసము సేయరాదు సదాశివ హృదాబ్జధామ | tAmasamu sEyarAdu sadASiva hRdAbjadhAma |
#388 మనవిని వినుమా manavini vinumA
| Title | మనవిని వినుమా | manavini vinumA |
| Written By | యోగ నరసింహ | yOga narasim^ha |
| Book | ||
| రాగం rAga | వలచి | valachi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | మనవిని వినుమా నా మనసుకు సుఖమొసగుము నిను బాసి సగమాయను మేను మనసు తల్లడిల్లెను | manavini vinumA nA manasuku sukhamosagumu ninu bAsi sagamAyanu mEnu manasu tallaDillenu |
| పగవారు మమ్ము కలయలేక జేసి వేగించిరి గాని అనురాగము స్థిరముగ నుంచుము నా రాజ | pagavAru mammu kalayalEka jEsi vEginchiri gAni anurAgamu sthiramuga nunchumu nA rAja | |
| ప్రేమమె నా ప్రాణాధారము ప్రియతమ దేవా నేమమె నా దినచర్య నీ యతి కొలది కలయగలము | prEmame nA prANAdhAramu priyatama dEvA nEmame nA dinacharya nI yati koladi kalayagalamu | |
#387 చిత్తము రాదే chittamu rAdE
| Title | చిత్తము రాదే | chittamu rAdE |
| Written By | వెంకటరమణ | venkaTaramaNa |
| Book | ||
| రాగం rAga | కమాచి | kamAchi |
| తాళం tALa | మిశ్ర ఏక | miSra Eka |
| పల్లవి pallavi | చిత్తము రాదే ఏలనే నాపైన అంతరంగము తోను కాంతుడు నను గూడి పంతము ఏలనే చెంత రాడాయనే | chittamu rAdE ElanE nApaina antarangamu tOnu kAntuDu nanu gUDi pantamu ElanE chenta rADAyanE |
| సరసుడు రాడాయ సఖియరో ఏమిసేతు మరచినాడే నన్ను మగువరో ఈవేళ | sarasuDu rADAya sakhiyarO EmisEtu marachinADE nannu maguvarO IvELa | |
| కామునిబారికి కలికి నేనోర్వనే మమతెందు బోయెనో మంగళపురివాసుడె | kAmunibAriki kaliki nEnOrvanE mamatendu bOyenO mangaLapurivAsuDe | |
#386 వింతలెంతని vintalentani
| Title | వింతలెంతని | vintalentani |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | ||
| రాగం rAga | ఖరహరప్రియ | kharaharapriya |
| తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
| పల్లవి pallavi | వింతలెంతని అడుగుట న్యాయమా సు కాంతలంతటి మేముండగా మా వింతలెంతని | vintalentani aDuguTa nyAyamA su kAntalantaTi mEmunDagA mA vintalentani |
| ఇంతి సంతతంబున మనసు నుంచి ప్రేమించి కామించి భావించితె | inti santatambuna manasu nunchi prEminchi kAminchi bhAvinchite | |
| మానాభిమానములకు మానినీమణులు తమ ప్రాణముల నిచ్చెదరు గాని మనకేలయని తాళవనేశుని సురేషుని స్మరించే మాట | mAnAbhimAnamulaku mAninImaNulu tama prANamula nichchedaru gAni manakElayani tALavanESuni surEshuni smarinchE mATa | |