#405 మోసబోతినే mOsabOtinE

TitleమోసబోతినేmOsabOtinE
Written By
Book
రాగం rAgaకానడkAnaDa
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviమోసబోతినే చెలి
మోహనాంగుని చేరి నే
mOsabOtinE cheli
mOhanAnguni chEri nE
ఆసలు పెట్టి నాపై
దోసమెంచెనే ఓ చెలియ
Asalu peTTi nApai
dOsamenchenE O cheliya
వద్దంటే నన్ను గూడి
ముద్దు ముద్దుగ మాటలాడి
నిద్దుర పోయె వేళ
సద్దులేక పోయినాడే
vaddanTE nannu gUDi
muddu mudduga mATalADi
niddura pOye vELa
saddulEka pOyinADE

#404 దారి జూచుచున్నది dAri jUchuchunnadi

Titleదారి జూచుచున్నదిdAri jUchuchunnadi
Written Byతచ్చూరు సింగరాచార్యtachcUru singarAchArya
Book
రాగం rAgaశంకరాభరణంSankarAbharaNam
తాళం tALa????
పల్లవి pallaviదారి జూచుచున్నది నీదు ప్రియ
తరళాక్షియో చిన్నది నీదు ప్రియా
dAri jUchuchunnadi nIdu priya
taraLAkshiyO chinnadi nIdu priyA
వారిజముఖి నీవు వచ్చే వేళానుకొని
కోరికతో రాజగోపాల సామి
దారి వెన్నెల గాయెగా
vArijamukhi nIvu vachchE vELAnukoni
kOrikatO rAjagOpAla sAmi
dAri vennela gAyegA
వేడ్క మీర మంచి యీ సన్న జాజి
విరుల సరులు సుగంధము పన్నీరు
చెంబులు పడకింటిలో నుంచి
వన్నెలాడి తలవాకిట నిలచి నీ
vEDka mIra manchi yI sanna jAji
virula sarulu sugandhamu pannIru
chembulu paDakinTilO nunchi
vannelADi talavAkiTa nilachi nI
పచ్చిపచ్చిగాను పదములు పాడుచు
వచ్చి రాజగోపాల సామి నీవు
ముచ్చట లాడుచు ముద్దులు పెట్టుచు
గ్రుచ్చి కౌగలిచ్చి కూడుటం దలచి నీ
pachchipachchigAnu padamulu pADuchu
vachchi rAjagOpAla sAmi nIvu
muchchaTa lADuchu muddulu peTTuchu
gruchchi kaugalichchi kUDuTam dalachi nI

#403 నిను నమ్మినారా ninu namminArA

Titleనిను నమ్మినారాninu namminArA
Written Byధర్మపురిdharmapuri
Bookగానేందు శేఖరంgAnEndu SEkharam
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviనిను నమ్మినారా నీరజ నయన
నను విడనాడ న్యాయమా నా సామి
ninu namminArA nIraja nayana
nanu viDanADa nyAyamA nA sAmi
కమ్మని మోవిచ్చి కౌగిలియ్యవేరా
నమ్మిన దానరా నా సామి
kammani mOvichchi kaugiliyyavErA
nammina dAnarA nA sAmi
ఎంత వేడినను పంతమా నా పైని
పంతతంబు నిన్నే చింతించు చున్నార
enta vEDinanu pantamA nA paini
pantatambu ninnE chintinchu chunnAra
మరుని బారికి ఓర్వ జాలనని
మర్మమెల్ల తెలిసె శ్రీ ధరపుర నివాస
maruni bAriki Orva jAlanani
marmamella telise SrI dharapura nivAsa

#402 ఎందుకు రాడాయె enduku rADAye

Titleఎందుకు రాడాయెenduku rADAye
Written ByవెంకటరమణvenkaTaramaNa
Book
రాగం rAgaకానడkAnaDa
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఎందుకు రాడాయె ఎవరేమన్నారోenduku rADAye evarEmannArO
సరసుని ప్రేమ సతమని యుంటినే
కరుణ మరచెనే కలికిరో నేడు
sarasuni prEma satamani yunTinE
karuNa marachenE kalikirO nEDu
చందన పరిమళ ఆనందముగ నుంటినే
సుందరాంగుడు రాడాయె మందయాన ఈవేళ
chandana parimaLa Anandamuga nunTinE
sundarAnguDu rADAye mandayAna IvELa
కోరిన వేళలో కోపము ఏలనే
మంగళపురీశుని వేగమె పిలుపవె
kOrina vELalO kOpamu ElanE
mangaLapurISuni vEgame pilupave

#401 తెలిసెను యిపుడు telisenu yipuDu

Titleతెలిసెను యిపుడుtelisenu yipuDu
Written ByవెంకటరమణvenkaTaramaNa
Book
రాగం rAgaకరహరప్రియ karaharapriya
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviతెలిసెను యిపుడు లేరా కులుకులాడి
పొద్దు తెలిసెనిపుడు లేరా
telisenu yipuDu lErA kulukulADi
poddu telisenipuDu lErA
మాట చూడపోతే మధురము
మనసులోని మత్సరము
ఇదేటి ప్రేమ సామి నీకు
ఇది మగవారికి తగునో
mATa chUDapOtE madhuramu
manasulOni matsaramu
idETi prEma sAmi nIku
idi magavAriki tagunO
ప్రీతి యందె ఉంచి దాని ప్రేమతో నేలిన
ప్రీతి తెలిసి వచ్చెను ఖ్యాతి పొగిడేరు సఖులు
సరస మంగళపురివాస సురత సుఖమెందుబోయె
మరచి ఇందు వచ్చితివిరా మగువ దండించును పోరా
prIti yande unchi dAni prEmatO nElina
prIti telisi vachchenu khyAti pogiDEru sakhulu
sarasa mangaLapurivAsa surata sukhamendubOye
marachi indu vachchitivirA maguva danDinchunu pOrA

#400 సామి యిందు sAmi yindu

Titleసామి యిందుsAmi yindu
Written ByవెంకటరమణvenkaTaramaNa
Book
రాగం rAgaసురభిsurabhi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviసామి యిందు రాడాయె
సఖియరో తోడి త్యావే
sAmi yindu rADAye
sakhiyarO tODi tyAvE
మోహమెటు దాచునే ముదితరో ఈవ్యేళ
మోహనాంగుడు రాడే మరచునేమో చెలియా
mOhameTu dAchunE muditarO IvyELa
mOhanAnguDu rADE marachunEmO cheliyA
వలచిన వేళలో వెలదిరో నన్ను తలచక యున్నడు
తరుణిరో నేడు మగువరో నేడు
మంగళ పురీశునికి తగునే ఈ నడత రాకయున్నాడు
valachina vELalO veladirO nannu talachaka yunnaDu
taruNirO nEDu maguvarO nEDu
mangaLa purISuniki tagunE I naData rAkayunnADu

#399 యెడబాయరాని yeDabAyarAni

TitleయెడబాయరానిyeDabAyarAni
Written Byమైసూరు సదాశివరావుmaisUru sadASivarAvu
Book
రాగం rAgaసావేరిsAvEri
తాళం tALaచౌchau
పల్లవి pallaviయెడబాయరాని అడియాసలెల్ల
చెడిబోయెటుల సేయరా దొరా నే
yeDabAyarAni aDiyAsalella
cheDibOyeTula sEyarA dorA nE
చరణం
charaNam 1
తడవు జేసితె నేనుండనని
అడుగడుకు నే వేడితే
నడుచురా నీ మాట తెలివికి తేట
పొడచురా నీదనుచురా శ్రీకృష్ణ రాజేంద్ర
taDavu jEsite nEnunDanani
aDugaDuku nE vEDitE
naDuchurA nI mATa teliviki tETa
poDachurA nIdanuchurA SrIkRshNa rAjEndra
చరణం
charaNam 2
సాధించకురా మాట్లాడరా
బాధ తీర్చి నన్నేల నిదానమేల లోల
భూధర సుందర ఏదిరా మోవీయరా
సదాసివార్తి భంజనా నీ సన్నిధి పెన్నిధిరా
ముదాస్పద హృదంబుజంబుల భావము తెలుపక
sAdhinchakurA mATlADarA
bAdha tIrchi nannEla nidAnamEla lOla
bhUdhara sundara EdirA mOvIyarA
sadAsivArti bhanjanA nI sannidhi pennidhirA
mudAspada hRdambujambula bhAvamu telupaka

#398 రాగముతో rAgamuto

TitleరాగముతోrAgamutO
Written By
Book
రాగం rAgaరాగమాలికrAgamAlika
తాళం tALaత్రిశ్ర ఆదిtriSra Adi
పల్లవి pallaviరాగముతో మాలిక వేయవే బాలా
అనురాగముతో
rAgamutO mAlika vEyavE bAlA
anurAgamutO
సాగర సువిశాల హృదయ చామరాజునికి
విసరి చామర రాగముతో
సామజవరదుని సమాన సారసాక్షుడే
సామిని నమ్మినవారికి భయములేలనే
కోమల సమీర తరంగ వైభోగ రంగుడై
sAgara suviSAla hRdaya chAmarAjuniki
visari chAmara rAgamutO
sAmajavaraduni samAna sArasAkshuDE
sAmini namminavAriki bhayamulElanE
kOmala samIra taranga vaibhOga ranguDai
శాంత కల్యాణ గుణాధారుడైన మా దొర
కింత ఆనందమీయ వలచి వచ్చితిరా
కుంతలములను దూపి నిలచియుంటి
SAnta kalyANa guNAdhAruDaina mA dora
kinta AnandamIya valachi vachchitirA
kuntalamulanu dUpi nilachiyunTi
కామము వర్ధిల్లిన మనములగు చుండరని
శ్శీమ సుమసౌరభము ముదమీయగ
ఏమివ్వరాళి మనసు నీదు కాదుగా
kAmamu vardhillina manamulagu chunDarani
SSIma sumasaurabhamu mudamIyaga
EmivvarALi manasu nIdu kAdugA
ఆనాటి నుండె భక్తితో ఆనాటి పూర్వికుల
మాట యెపుడు తప్పక ఎవ్వరి మాట లేటి
కాంబోది జనరంజకుని విరాట దర్బారులో
మధ్యమావృతజనుల
AnATi nunDe bhaktitO AnATi pUrvikula
mATa yepuDu tappaka evvari mATa lETi
kAmbOdi janaranjakuni virATa darbArulO
madhyamAvRtajanula

#397 పోరా దానింటికి pOrA dAninTiki

Titleపోరా దానింటికిpOrA dAninTiki
Written By
Bookగాయక లోచనముgAyaka lOchanamu
రాగం rAgaహిందుస్థాని కాఫిhindusthAni kAfi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviపోరా దానింటికి సామి
చాల ప్రొద్దాయెరా ఆ
వారిజాక్షి విన్నను మోసము
pOrA dAninTiki sAmi
chAla proddAyerA A
vArijAkshi vinnanu mOsamu
నక్క వినయములు నిజమని
యెంతో నమ్మియుంటి గదరా
పక్క జేర రావద్దుర యిక
nakka vinayamulu nijamani
yentO nammiyunTi gadarA
pakka jEra rAvaddura yika
తేనెలూర నాతో పలుకుచు ఆ
చాన కడకు పోనేలా
కాని వారికిది వేడుక గద
tEnelUra nAtO palukuchu A
chAna kaDaku pOnElA
kAni vArikidi vEDuka gada
సరసమైన మాటలు వేరాయె
చనువు దూరమాయె
మరుని కేళికి ఇక సున్నే గద
sarasamaina mATalu vErAye
chanuvu dUramAye
maruni kELiki ika sunnE gada
జాజి సరము లంపిన వెగటాయె
చాల కోపమాయె రాజగోపాల చాలునిక
jAji saramu lampina vegaTAye
chAla kOpamAye rAjagOpAla chAlunika

#396 చలమేలర నాపై chalamElara nApai

Titleచలమేలర నాపైchalamElara nApai
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Book
రాగం rAgaనాటకురంజిnATakuranji
తాళం tALa????
పల్లవి pallaviచలమేలర నాపై జలజ నేత్రుడ
పిలిచిన పలుకవు
chalamElara nApai jalaja nEtruDa
pilichina palukavu
కలకాలము నీ చెలిమి సేయనే
తలచి పిలచి వచ్చి యుండగ
kalakAlamu nI chelimi sEyanE
talachi pilachi vachchi yunDaga
నీ సరసముల నీటులు నీ సొగసు నీ చతురత
నీ హొయలు నీ గుణములు నీ సరిసమ రసికులు
నే నరసి జూడ దొరకలేక మరులు మించి మొరలిడ
nI sarasamula nITulu nI sogasu nI chaturata
nI hoyalu nI guNamulu nI sarisama rasikulu
nE narasi jUDa dorakalEka marulu minchi moraliDa
సారసరిపుని కోరు చకోరక దీనుల నమ్మరు
సారెకు నీ మరుగున చేరదలచి చెలులతో మన
సార విచారమెల్ల చెలియార దెలిపియు బ్రోవక
sArasaripuni kOru chakOraka dInula nammaru
sAreku nI maruguna chEradalachi chelulatO mana
sAra vichAramella cheliyAra delipiyu brOvaka
తాళని మారుబారుని బాలిక చెలిమితో
పూమాలికలు వేయు వేల నేడు సమయమిదే
యని తాళవన లోలయని పలుతరగున పిలిచితె
tALani mArubAruni bAlika chelimitO
pUmAlikalu vEyu vEla nEDu samayamidE
yani tALavana lOlayani palutaraguna pilichite