#322 మహరాజును maharAjunu

TitleమహరాజునుmaharAjunu
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaఅఠాణాaThANA
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమహరాజును జూచితివా సఖీ యీ ||maharAjunu jUchitivA sakhI yI ||
అనుపల్లవి anupallaviమహిళా సరసీరుహ బాణుడే యీ ||mahiLA sarasIruha bANuDE yI ||
చరణం
charaNam 1
సఖి కబ్బెనెకో మహిమలకు మదనుడు గదే
సుఖ రహి గదే యహహ యీతని సరి సరసులీ
మహిని లేరనుటె నిజము
sakhi kabbenekO mahimalaku madanuDu gadE
sukha rahi gadE yahaha yItani sari sarasulI
mahini lEranuTe nijamu
చరణం
charaNam 2
నవనీతము కన్నను మార్గవ మీ
నవ మోహనుడెందము నెంచినచో
యివిద వానిని గంటివే వినియుంటివే
నవరసాయుత పల్లవీ మన నయన
జలరుహ చంద్రుడే
navanItamu kannanu mArgava mI
nava mOhanuDendamu nenchinachO
yivida vAnini ganTivE viniyunTivE
navarasAyuta pallavI mana nayana
jalaruha chandruDE
చరణం
charaNam 3
రమణీయ మనోరమణీగన చిత్తము
తత్తరమె తను కించుగదే
కమల శరసౌందర్యుడే గుణధుర్యుడే
రమణులను దనియింప నింతటి
రసికుడీ యిల గలడటే
ramaNIya manOramaNIgana chittamu
tattarame tanu kinchugadE
kamala SarasaundaryuDE guNadhuryuDE
ramaNulanu daniyimpa nimtaTi
rasikuDI yila galaDaTE
చరణం
charaNam 4
గడు సుందరము గడు సుందరమున్గములే
ప్రియుడు న్గమలాత్మజుడే
తొడవు లీతని గుణములు రిపురణములు
కుడి యెడమ లేదడుగు నర్ధులకిడు
నెడల తడవుడిగి యిడు
gaDu sundaramu gaDu sundaramun&gamulE
priyuDu n&gamalAtmajuDE
toDavu lItani guNamulu ripuraNamulu
kuDi yeDama lEdaDugu nardhulakiDu
neDala taDavuDigi yiDu
చరణం
charaNam 5
సుకరమ్ముగ కీర్తికలా లాస
ద్విభాషి కులీనుడు
పుల్లకవి వినుతుడే సకల సుకళాలోలుడే గోపాలుడే మకుట మానిత రావు వంశకుమార
సూర్య రాయవరుడౌ
sukarammuga kIrtikalA lAsa
dvibhAshi kulInuDu
pullakavi vinutuDE sakala sukaLAlOluDE gOpAluDE makuTa mAnita rAvu vamSakumAra
sUrya rAyavaruDau

#321 వగలాడి హొయల్ vagalADi hoyal

Titleవగలాడి హొయల్vagalADi hoyal
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaదర్బారుdarbAru
తాళం tALaఅటaTa
పల్లవి pallaviవగలాడి హొయల్ జూడరాvagalADi hoyal jUDarA
చరణం
charaNam 1
తొగలరాయు గేరుమోము
మిగుల మించు మీరు గోము
సుగుణ గుణవంతారాలు యిది
నిగురు గమ్మిన నిప్పురా
togalarAyu gErumOmu
migula minchu mIru gOmu
suguNa guNavantArAlu yidi
niguru gammina nippurA
చరణం
charaNam 2
సుందరి నిను కోరి భువి
నందరి లోపల చాల
అందగాడవందిరా యది
బందరు హొయలాడిరా
sundari ninu kOri bhuvi
nandari lOpala chAla
andagADavandirA yadi
bandaru hoyalADirA
చరణం
charaNam 3
చిలకల కొలికిరా ముద్దు
గులుకు పలుకులెల్ల తేనె
లొలుకు వలపుల కలకిర యది
తళుకు మన్మధ ములికిర
chilakala kolikirA muddu
guluku palukulella tEne
loluku valapula kalakira yadi
taLuku manmadha mulikira
చరణం
charaNam 4
సల్లలిత శ్రీ ద్విభాషి
పుల్లకవి పల్లవుని
యొల్ల సన్మానించి యేలు
నల్లని శ్రీకృష్ణ
sallalita SrI dvibhAshi
pullakavi pallavuni
yolla sanmAninchi yElu
nallani SrIkRshNa

#320 నేరమా సామీ nEramA sAmI

Titleనేరమా సామీnEramA sAmI
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAga??????
తాళం tALa??????
పల్లవి pallaviనేరమా సామీ నాపై నేరమా
కోరితిర నిను పాడిగ పర
సారసాక్షులు గూడగ
nEramA sAmI nApai nEramA
kOritira ninu pADiga para
sArasAkshulu gUDaga
చరణం
charaNam 1
దారిగాదని నుడివి నిను నాయాధారమని కడు వేడగా నా
వాదమా సామీ నాతో వాదమా
చేదుయయ్యెనే బెల్లము మర్యాద
వాయునే యుల్లము
యేది యున్నను తెల్లము నీ
మీది తమితో నుండి గదనా
dArigAdani nuDivi ninu nAyAdhAramani kaDu vEDagA nA
vAdamA sAmI nAtO vAdamA
chEduyayyenE bellamu maryAda
vAyunE yullamu
yEdi yunnanu tellamu nI
mIdi tamitO nunDi gadanA
చరణం
charaNam 2
యొల్లవా సౌందర్య గణిగా పల్లవా
చెల్లునే సరసునకిది నా
వల్లభుడ నీవని మది
నుల్లసింపుచు నుంటి వేగమె
పల్లవాగ్రణి రమ్ముకేళికి
yollavA saundarya gaNigA pallavA
chellunE sarasunakidi nA
vallabhuDa nIvani madi
nullasimpuchu nunTi vEgame
pallavAgraNi rammukELiki
చరణం
charaNam 3
రోషమా విటరాయ నీకిది వేషమా
నా దోషమేమియు లేదురా మృదు
భాషణ ప్రియ శ్రీధరా
భూషితాగమవాసి యగు ద్వి
భాషి పుల్లకవీశనుత నా
rOshamA viTarAya nIkidi vEshamA
nA dOshamEmiyu lEdurA mRdu
bhAshaNa priya SrIdharA
bhUshitAgamavAsi yagu dvi
bhAshi pullakavISanuta nA

#319 వన్నెలాడి vannelADi

Titleవన్నెలాడిvannelADi
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaబేగడbEgaDa
తాళం tALaఅటaTa
పల్లవి pallaviవన్నెలాడి విన్నవించవేvannelADi vinnavinchavE
అనుపల్లవి anupallaviమొన్నటి పున్నమ రేయి కన్నులార నిన్నే జూచి
యెన్నరాని మోహముచే నున్నదనుచును
monnaTi punnama rEyi kannulAra ninnE jUchi
yennarAni mOhamuchE nunnadanuchunu
చరణం
charaNam 1
శారి కాకేరాళి రవ దారుణము కోర్వక
నీదారి జూచుచుండె దయోదార యనుచును
SAri kAkErALi rava dAruNamu kOrvaka
nIdAri jUchuchunDe dayOdAra yanuchunu
చరణం
charaNam 2
సుందరా నీయందు తమిజంది యాసజెంది
గాసియుందిర తొందర రతులందు దన్పుమని
sundarA nIyandu tamijandi yAsajendi
gAsiyundira tondara ratulandu dan&pumani
చరణం
charaNam 3
జోడుగూడ వీడని పూబోడి వానితోడ
మాటలాడి తెమ్మనెగవ కూడు మనుచును
jODugUDa vIDani pUbODi vAnitODa
mATalADi temmanegava kUDu manuchunu
చరణం
charaNam 4
భాసురమగు దుర్గాడ వాసుడు ద్విభాషి
పుల్లకవీశ పోష దోషనాశ శ్రీయనుచు
bhAsuramagu durgADa vAsuDu dvibhAshi
pullakavISa pOsha dOshanASa SrIyanuchu

#318 రారా మనవి rArA manavi

Titleరారా మనవిrArA manavi
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaనాటకురంజిnATakuranji
తాళం tALaఅటaTa
పల్లవి pallaviరారా మనవి చేకోరా లేచి రారా
రారా మనవి చేకోరా మానినీ చిత్తచోరా
రాజకుమార వీరా నిన్నే కోరినదిరా
మేలౌరా లేలేరా రారా రాజాగేర
rArA manavi chEkOrA lEchi rArA
rArA manavi chEkOrA mAninI chittachOrA
rAjakumAra vIrA ninnE kOrinadirA
mElaurA lElErA rArA rAjAgEra
చరణం
charaNam 1
మోము చంద్రునితో సమము సంపెంగ నాసికము
కెమ్మోవి పగడము శంఖము కంధరము
ప్రేమము కామము దీర్పుము క్షేమము
mOmu chandrunitO samamu sampenga nAsikamu
kemmOvi pagaDamu Sankhamu kandharamu
prEmamu kAmamu dIrpumu kshEmamu
చరణం
charaNam 2
ఆరు పున్నాగమును గేరు దంతముంచి
డారు మల్లె మొగ్గలు మీరు, కన్యకామణి
డయరు కన్నుల కర్వుదీరు మై తీరు రంగారు బంగారు నుంగేరు
Aru punnAgamunu gEru damtamunchi
DAru malle moggalu mIru, kanyakAmaNi
Dayaru kannula karvudIru mai tIru ramgAru bangAru nungEru
చరణం
charaNam 3
విళ్ళు కన్బొమ్మలు పాలిళ్ళు మల్లెపువ్వుల
చెళ్ళు రిక్కలగమి గోళ్ళు బాహువుల్ తిమ్మి
తూళ్ళు మీగాళ్ళు తాబేళ్ళు చెవ్రేళ్ళు చిగుళ్ళు
viLLu kan&bommalu pAliLLu mallepuvvula
cheLLu rikkalagami gOLLu bAhuvul timmi
tULLu mIgALLu tAbELLu chevrELLu chiguLLu
చరణం
charaNam 4
ఈశా ద్విభాషి పుల్లకవీశా మానినీ మనోల్లాసా
భాస్కరసుప్రకాశా భవనాశా జగధీశా
దరహాసా లక్ష్మీశా
ISA dvibhAshi pullakavISA mAninI manOllAsA
bhAskarasuprakASA bhavanASA jagadhISA
darahAsA lakshmISA

#317 వగలాడి vagalADi

TitleవగలాడిvagalADi
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaకల్యాణిkalyANi
తాళం tALaఅటaTa
పల్లవి pallaviవగలాడి దిగులిడ నోర్వగదే వోvagalADi diguliDa nOrvagadE vO
అనుపల్లవి anupallaviచిగురుబోడిరో జాలమా యిది శీలమా
తగు తగునే యిది తగువగునె తమి
దగిలి రతులను దిగియ జేయవె ఓ
chigurubODirO jAlamA yidi SIlamA
tagu tagunE yidi taguvagune tami
dagili ratulanu digiya jEyave O
చరణం
charaNam 1
కలిగి మిటారీ లలిత బింబాధరీ
వలపుల దేర్పవే వల రాచకేళిలో నీ
వలపు నిలుపగ రాదటే మర్యాదటే కలకలమ్ముగ
నలగి మన్మధ కళల దేరగ గలయ రాగదే
kaligi miTArI lalita bimbAdharI
valapula dErpavE vala rAchakELilO nI
valapu nilupaga rAdaTE maryAdaTE kalakalammuga
nalagi manmadha kaLala dEraga galaya rAgadE
చరణం
charaNam 2
కోపము దేలే ఆపలేనే మోహము నే పగవాడన నీకు దెలియదటే
నీ రూపురేఖలు నిక్కమా తమి దక్కుమా
పాపరాధుడగామ మోహోద్దీప తాపము బాపివేయవే
kOpamu dElE ApalEnE mOhamu nE pagavADana nIku deliyadaTE
nI rUpurEkhalu nikkamA tami dakkumA
pAparAdhuDagAma mOhOddIpa tApamu bApivEyavE
చరణం
charaNam 3
పల్లవ పాణీ పుల్లాబ్జలోచనీ
యుల్లము నీపయి నల్లన నిల్పెగదే ఓ
మల్లెపువ్వుల బంతిరొ మరుదంతిరో
సల్లలిత ద్విభాషి కులభవ పుల్లకవి నుత పల్లవీమణి
pallava pANI pullAbjalOchanI
yullamu nIpayi nallana nilpegadE O
mallepuvvula bantiro marudantirO
sallalita dvibhAshi kulabhava pullakavi nuta pallavImaNi

#316 ఎడబాసి eDabAsi

TitleఎడబాసిeDabAsi
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaచక్రవాకంchakravAkam
తాళం tALaఅటaTa
పల్లవి pallaviఎడబాసి గడియోర్వజాలనురా జోడెడబాసిeDabAsi gaDiyOrvajAlanurA jODeDabAsi
చరణం
charaNam 1
గొడవలింతకు హెచ్చినన్ మదినొచ్చినన్ పడకకును
రాకున్న నిన్నొక గడియైనను విడువజాలనురా ||జోడెడ||
goDavalimtaku hechchinan madinochchinan paDakakunu
rAkunna ninnoka gaDiyainanu viDuvajAlanurA ||jODeDa||
చరణం
charaNam 2
ఇటులారడి సేయుట ముచ్చటగా దెతులైనను చెంగట
నుంచుట మేలు తటపటాయించుట సదా మరలుటగురా
గుటుకు గుటుకున గ్రుక్కలూరించుటలు తగవగు నటరా నీ ||జోడెడ||
iTulAraDi sEyuTa muchchaTagA detulainanu chengaTa
numchuTa mElu taTapaTAyimchuTa sadA maraluTagurA
guTuku guTukuna grukkalUrinchuTalu tagavagu naTarA nI ||jODeDa||
చరణం
charaNam 3
సరివారలు మెచ్చనీ మెచ్చకపోనీ గురివెలి జేసిన నిరసన గాదటరా
నీ సరసమెరిగిన దాన నీ దానరా
సరిసరిరా నీ మురిపెమునల గురుతెరుగుదుర నా దొరవునీ ||జోడెడ||
sarivAralu mechchanI mechchakapOnI guriveli jEsina nirasana gAdaTarA
nI sarasamerigina dAna nI dAnarA
sarisarirA nI muripemunala guruterugudura nA doravunI ||jODeDa||
చరణం
charaNam 4
కలకాలము రవ్వల పాలయినన్
చలమెల్లను నిష్ఫలములయ్యెనురా నా
వలపు తెలిసిన పాడవు వగకాడవు
పలు విధమ్ముల నలరువిలుతుని పనులలోపల మెలగునీ ||జోడెడ||
kalakAlamu ravvala pAlayinan
chalamellanu nishphalamulayyenurA nA
valapu telisina pADavu vagakADavu
palu vidhammula nalaruvilutuni panulalOpala melagunI ||jODeDa||
చరణం
charaNam 5
మకరధ్వజ జనక నాకిక ప్రాపకమైతివి తేలిక సేయకురా
చంపక ముకుళ సమవాసికా
శోభన ముఖా ప్రకటమైన ద్విభాషికుల
పుల్లకవి సన్నుతి నికర నీ ||జోడెడ||
makaradhvaja janaka nAkika prApakamaitivi tElika sEyakurA
champaka mukuLa samavAsikA
SObhana mukhA prakaTamaina dvibhAshikula
pullakavi sannuti nikara nI ||jODeDa||

#315 నాణెమైన వలపుల nANemaina valapula

Titleనాణెమైన వలపులnANemaina valapula
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaఆదిAdi
1నాణెమైన వలపుల చెలిరా నిను జాణవనుచు పిలువమనెరా
ఆణిముత్తియంబులు పలుతీరు అందమైన నూగారు
పాణులు పల్లవ మది రుచులూరు వాణిని తేనెలుగారు
nANemaina valapula chelirA ninu jANavanuchu piluvamanerA
ANimuttiyambulu palutIru amdamaina nUgAru
pANulu pallava madi ruchulUru vANini tEnelugAru
2కాముక హృత్కల్పము తనువల్లి మోము పండుజాబిల్లి
శ్రీమించిన సుగుణ గణముతల్లి హేమగదర యిదితొల్లి
kAmuka hRtkalpamu tanuvalli mOmu panDujAbilli
SrIminchina suguNa gaNamutalli hEmagadara yiditolli
3గోరులు తారలచాలగ నేలు గోలు పల్కులవరాలు
బారు కురులు నిగ నిషనీలాలు బాలవయసు నీపాలు
gOrulu tAralachAlaga nElu gOlu palkulavarAlu
bAru kurulu niga nishanIlAlu bAlavayasu nIpAlu
4తావి చనురబరిణెల బిరడాలు మోవికెంపు పగడాలు
నీవు గవదయగు సఖి మెయిడాలు లేవు గదర తేడాలు
tAvi chanurabariNela biraDAlu mOvikempu pagaDAlu
nIvu gavadayagu sakhi meyiDAlu lEvu gadara tEDAlu
5కాంచిన మును నిరసించుర యొడలు అంచనేరు దానడలు
మించు రంభల హసించుర తొడలు యెంచితి విరనలడలు
kAmchina munu nirasimchura yoDalu anchanEru dAnaDalu
minchu rambhala hasimchura toDalu yemchiti viranalaDalu
6మున్ను నుంచి కాపురమీయూరు ముద్దుగుమ్మరా పేరు
కన్నెను జూడ తయారగు తేరు కన్నులకు కరువులేదు
munnu numchi kApuramIyUru muddugummarA pEru
kannenu jUDa tayAragu tEru kannulaku karuvulEdu
7భామా హృత్పంకజ హర్షా ద్విభాషి పుల్లకవి పోషా
కామిత ఫలదాయక గత రోషా భూమిజా మనోల్లాసా
bhAmA hRtpankaja harshA dvibhAshi pullakavi pOshA
kAmita phaladAyaka gata rOshA bhUmijA manOllAsA

#314 చెలువుని తోడితేవె cheluvuni tODitEve

Titleచెలువుని తోడితేవెcheluvuni tODitEve
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaకేదారగౌళkEdAragauLa
తాళం tALaఅటaTa
1చెలువుని తోడి తేవె కలహంస గమనరొ
వల రాచకేళికి వలపించి పూశయ్యకు
cheluvuni tODi tEve kalahamsa gamanaro
vala rAchakELiki valapimchi pUSayyaku
2దవ్వుల జూచినానే నవ్వు మొగము వాడే
జవ్వనమయిన వాడే వహ్వరి తగిన జోడే
davvula jUchinAnE navvu mogamu vADE
javvanamayina vADE vahvari tagina jODE
3కామిని వాని మోము శోమునితో సమము
కాముని సుందరము కనగల్గెనే మోహము
kAmini vAni mOmu SOmunitO samamu
kAmuni sumdaramu kanagalgenE mOhamu
4తారక వేగోరులు హారాణి పల్తీరులు
చేరావె కన్బారులు నీరదముల్ కురులు
tAraka vEgOrulu hArANi paltIrulu
chErAve kan&bArulu nIradamul kurulu
5తీరైన పలుకులు తేనియ లొలుకులు
తోరంపు చూడ్కులు మారుని పూముల్కులు
tIraina palukulu tEniya lolukulu
tOrampu chUDkulu mAruni pUmulkulu
6కాపాడుమా దేహము కాకున్న చేద్రోహము
చూపగదే స్నేహము ఆపలేనే మోహము
kApADumA dEhamu kAkunna chEdrOhamu
chUpagadE snEhamu ApalEnE mOhamu
7ద్విభాషి పుల్లకవి ప్రాభవుడౌ భారవి
శోభిత గుణ పద్మనాభునీ శ్రీవిభుని
dvibhAshi pullakavi prAbhavuDau bhAravi
SObhita guNa padmanAbhunI SrIvibhuni

#313 పంతమా నాపై pamtamA nApai

Titleపంతమా నాపైpamtamA nApai
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaబిళహరిbiLahari
తాళం tALaఅటaTa
పల్లవి pallaviపంతమా నాపై వన్నెకాడా
కాంతుడెంతో గాసిజేసె
pamtamA nApai vannekADA
kAmtuDemtO gAsijEse
చరణం
charaNam 1
వలచి నిను కోరి వచ్చినందుకా
పలుచ జేసి పలుకకున్నావు
valachi ninu kOri vachchinamdukA
palucha jEsi palukakunnAvu
చరణం
charaNam 2
అల్లదాని యిల్లు చేరిన నీ
యెల్ల రెరుగు నీ యుల్లాసిల్లేవు
alladAni yillu chErina nI
yella rerugu nI yullAsillEvu
చరణం
charaNam 3
కమ్మ కెమ్మోవి కందిన గురుతులు
కమ్మ దలచి యిట్లు గారడి చేసేవు
kamma kemmOvi kamdina gurutulu
kamma dalachi yiTlu gAraDi chEsEvu
చరణం
charaNam 4
శేషశయన ద్విభాషి పుల్లకవిపోషా
గోపాల పోరాటమేరా
SEshaSayana dvibhAshi pullakavipOshA
gOpAla pOrATamErA