| Title | కోపమేలరా | kOpamElarA |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | కోపమేలరా నాపైని నా మనోహరా ఆపరాని మోహ విరహ తాప మందుచుంటిరా ఇంత కోపమేలరా | kOpamElarA nApaini nA manOharA AparAni mOha viraha tApa manduchunTirA inta kOpamElarA |
| చరణం charaNam 1 | సంతతంబు నిన్నె కోరి చెంత చేరి యుంటిరా వింత కౌగిలింతతో మరింత వలపుమించెరా యింత | samtatambu ninne kOri chemta chEri yunTirA vimta kaugilimtatO marinta valapumincherA yimta |
| చరణం charaNam 2 | హెవెన్ మన్యు నుండి నీకు లెటర్స్ బంపగా నెవర్ మైండ్ లవర్ ఫ్రెండ్‌ని యువర్ విల్‌గాగ వయు రావైతివి | heven manyu numDi nIku leTars bampagA nevar mainD lavar frenD^ni yuvar vil^gAga vayu rAvaitivi |
| చరణం charaNam 3 | పొదన్ పొదన్ గదల్చి తుమ్మెదల్ రొదల్ మొదల్పగా మొదల్ మరుండెదన్ శరాల్ గుదుల్ గుదుల్ గుదుల్ గదున్చెరా | podan podan gadalchi tummedal rodal modalpagA modal marunDedan SarAl gudul gudul gudul gadun&cherA |
| చరణం charaNam 4 | ఆస బాస జేసి యీని రాస నీ విలాసమా కేశవా ద్విభాషి పుల్లకవీశ మద్వికాసమా | Asa bAsa jEsi yIni rAsa nI vilAsamA kESavA dvibhAshi pullakavISa madvikAsamA |
Category: Javali
#311 మందయాన mandayAna
| Title | మందయాన | mandayAna |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | అఠాణ | aThANa |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | మందయాన నీ పొందుగోరి నను బంపింది రార సామీ | mandayAna nI pondugOri nanu bampimdi rAra sAmI |
| చరణం charaNam 1 | మందయాన నీ పొందుగోరినది పసందు మీరిన అందగత్తెర సందడించి రతులందమంద నందరసము పొలుపొందజేయ విను గొందువనుచు నీయందు చాల భ్రమ జెంది నాతొ దెల్పింది నన్ను బంపింది వహ్వ పూసింది నిన్ను రమ్మంది సుందరరాచెందొవ విందుచే కందియుందిరా నీయందు ప్రేమచే చిందర వందర చెందం పొందర | mandayAna nI pondugOrinadi pasandu mIrina andagattera samdaDimchi ratulamdamamda namdarasamu polupomdajEya vinu gomduvanuchu nIyamdu chAla bhrama jemdi nAto delpindi nannu bampindi vahva pUsindi ninnu rammandi sundararAchendova vinduchE kandiyundirA nIyandu prEmachE chindara vandara chendam pondara |
| చరణం charaNam 2 | బాలకురులు నీలాలు కనులు మీవాలు పలువరుస జాలు మంచి ముత్యాలు మోవి పగడాలు జురిడీలు గావు మురిడీలు చేతుల పిడేలు బాడగలశీల చెవులు చెక్రాలు మాటలు వరాలు చెక్కగద వీలు నెలయు కపురాలు కవకుదగు పాలు వయసు నీపాలు తనువు జిగి జాళువా సుమీ బాల నీవు రతినేల గాదగు లీలలమరిన గోలర మేలుగ నేలర కేళిని | bAlakurulu nIlAlu kanulu mIvAlu paluvarusa jAlu manchi mutyAlu mOvi pagaDAlu juriDIlu gAvu muriDIlu chEtula piDElu bADagalaSIla chevulu chekrAlu mATalu varAlu chekkagada vIlu nelayu kapurAlu kavakudagu pAlu vayasu nIpAlu tanuvu jigi jALuvA sumI bAla nIvu ratinEla gAdagu lIlalamarina gOlara mEluga nElara kELini |
| చరణం charaNam 3 | సుళ్ళు సిరులొసంకళ్ళు బొరులు దిళ్ళు దాని పాలిళ్ళు మొల్ల పూచెళ్ళు చెలువమగు వళ్ళు కెరటముల జాళ్ళు బాహువుల నీళ్ళు తామరల తూళ్ళు కిసలములు వేళ్ళు తారకలు గోళ్ళు పిక్కలు మొసళ్ళు కలికి మీగాళ్ళ సౌరు తాబేళ్ళ సరి పదారేళ్ళ వయసురా యేళ్ళ కొలది వేయి నోళ్ళ నుతించి న వల్ల గాదు పెరుమాళ్ళ కృపనయిన | suLLu sirulosamkaLLu borulu diLLu dAni pAliLLu molla pUcheLLu cheluvamagu vaLLu keraTamula jALLu bAhuvula nILLu tAmarala tULLu kisalamulu vELLu tArakalu gOLLu pikkalu mosaLLu kaliki mIgALLa sauru tAbELLa sari padArELLa vayasurA yELLa koladi vEyi nOLLa nutimchi na valla gAdu perumALLa kRpanayina |
| చరణం charaNam 4 | బోటి చక్కెరల పేటి యెల్ల రతితోవి కూటమికి సాటియై తగు వధూటి సుందరా బోటి గుబ్బలు కొనగోట మీట నెంతొ పాటమౌర నీవాటల పాటల కూటమి గూడర | bOTi chakkerala pETi yella ratitOvi kUTamiki sATiyai tagu vadhUTi sundarA bOTi gubbalu konagOTa mITa nemto pATamaura nIvATala pATala kUTami gUDara |
| చరణం charaNam 5 | కంబుకౌను సుముఖంబు చందురుని సఖంబు గళము శంఖంబు కన్నుల సుఖంబు దానియందంబు మోవి బింబంబు పలుకు మధురంబు మేని నా సంబు సుతల పుష్పంబు నుదుట తిలకంబు హొయల్ గల కంబుకంఠిరా డింబుమీర సురతంబు లందు సారంబు గలది పూనంబగు చుంబునలంబ విజృంభిత | kambukaunu sumukhambu chamduruni sakhambu gaLamu Samkhambu kannula sukhambu dAniyamdambu mOvi bimbambu paluku madhurambu mEni nA sambu sutala pushpambu nuduTa tilakambu hoyal gala kambukamThirA DimbumIra suratambu lamdu sArambu galadi pUnambagu chumbunalamba vijRmbhita |
| చరణం charaNam 6 | శేష శయన ద్విభాషి పుల్లకవి పోష సుందరీ భూషితాంగ సంతోష హృదయ మృదుభాషకు ప్రియా వాసి మీద దానితో సురతములను జేసి మెలగుము వికాస ముఖాసర నాదయారస | SEsha Sayana dvibhAshi pullakavi pOsha sundarI bhUshitAmga samtOsha hRdaya mRdubhAshaku priyA vAsi mIda dAnitO suratamulanu jEsi melagumu vikAsa mukhAsara nAdayArasa |
#310 చంచలాక్షి chamchalAkshi
| Title | చంచలాక్షి | chamchalAkshi |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | చంచలాక్షి నిన్వరించి నన్ను బంచెర | chamchalAkshi nin&varimchi nannu banchera |
| 2 | యెంచగ గ్రొమ్మించు మించు జెలి మంచి మేను | yemchaga gromminchu minchu jeli manchi mEnu |
| 3 | అంచలు భ్రమించు నడలంచు వచియించవచ్చు కాంచనాంబర దాని గాంచిన మోహించె ఔర | anchalu bhraminchu naDalanchu vachiyinchavachchu kAnchanAmbara dAni gAmchina mOhinche aura |
| 4 | పంచశర రూపశర పంచకముల బల్మరు పంచబాణుదించు బోడి బొంచి యేసి ముంచెనుర | panchaSara rUpaSara panchakamula balmaru panchabANudimchu bODi bonchi yEsi munchenura |
| 5 | చంచరీక వేణి దొడ్డి పంచాది గదిలో పట్టి మంచమున శయనించి తపించెను రకింతచేత | chancharIka vENi doDDi panchAdi gadilO paTTi manchamuna Sayanimchi tapinchenu rakintachEta |
| 6 | అంచితముగ నిన్ను బూజించు యజ్ఞన్నకవి గాంచి పోషించు కృష్ణ వేంచేసి కరంచుమిక | anchitamuga ninnu bUjinchu yajnannakavi gAmchi pOshinchu kRshNa vEmchEsi karamchumika |
#309 చాలు చాలు chAlu chAlu
| Title | చాలు చాలు | chAlu chAlu |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| 1 | చాలు చాలు నీదు చెల్మి జాడదెలిసె మానినీ | chAlu chAlu nIdu chelmi jADadelise mAninI |
| 2 | వ్రాలబోకు కాళ్ళపైని లేలే హంసగామినీ | vrAlabOku kALLapaini lElE hamsagAminI |
| 3 | గులాబి పువ్వు విడచి మోదుగు విరి గొన్నరీతిగా బలారె వాని గూడితిగ భామా నే నీకేటికే | gulAbi puvvu viDachi mOdugu viri gonnarItigA balAre vAni gUDitiga bhAmA nE nIkETikE |
| 4 | అల్ల వయసు ఠీపులు నీయందె మొల్చినవటే యెల్ల చానలకు లేవే యీ గోటు నీకేటికే | alla vayasu ThIpulu nIyamde molchinavaTE yella chAnalaku lEvE yI gOTu nIkETikE |
| 5 | ఇందిరేశ్వరుండ నీ నా పొందు నీకు గల్గునే అందులకే యేగు యజ్ఞనాప్తునకు తగుదువే | imdirESvarumDa nI nA pomdu nIku galgunE amdulakE yEgu yajnanAptunaku taguduvE |
#308 అయ్యయో ayyayO
| Title | అయ్యయో | ayyayO |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | హిందూస్తానీ కాఫీ | himdUstAnI kAfI |
| తాళం tALa | చాపు | chApu |
| 1 | అయ్యయో సైపగలేనే | ayyayO saipagalEnE |
| 2 | చయ్యన నేగి రమాసఖునిటు రమ్మనే | chayyana nEgi ramAsakhuniTu rammanE |
| 3 | మదిరాక్షి వినవే మకరాంకుడురువడి పదునగు శరముల నెదపై గ్రుచ్చెనే | madirAkshi vinavE makarAmkuDuruvaDi padunagu Saramula nedapai gruchchenE |
| 4 | అల్లజాబిల్లి వేడి మంతకంతకు నొడలెల్ల గ్రాగుచు విస్తరిల్లుచు నుండెనే | allajAbilli vEDi mamtakamtaku noDalella grAguchu vistarilluchu numDenE |
| 5 | వరగబ్బిట యజ్ఞన వంద్యుని బాయజాల హరినిటు దేవే మణీహారమిచ్చెదనే | varagabbiTa yajnana vandyuni bAyajAla hariniTu dEvE maNIhAramichchedanE |
#307 చిన్న ముద్దీరా chinna muddIrA
| Title | చిన్న ముద్దీరా | chinna muddIrA |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | హిందూస్తాని కాఫీ | himdUstAni kAfI |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | చిన్నముద్దీరా నాసామి | chinnamuddIrA nAsAmi |
| 2 | కన్నుల పండువుగా నిను గనగనె వెన్నవలెను మది వేగ గరగురా | kannula panDuvugA ninu ganagane vennavalenu madi vEga garagurA |
| 3 | సరసత నీవొకసారి మాటాడిన బొరి బొరి మేన బులక లెచ్చురా | sarasata nIvokasAri mATADina bori bori mEna bulaka lechchurA |
| 4 | అమ్మకచెల్ల నిన్నంటిన మాత్రనె కమ్మని కోర్కెలు గలుగుచుండురా | ammakachella ninnanTina mAtrane kammani kOrkelu galuguchumDurA |
| 5 | కమలా ప్రియ శ్రీ గబ్బిట యజ్ఞన నమిత చరణ విడనాడజాలరా | kamalA priya SrI gabbiTa yajnana namita charaNa viDanADajAlarA |
#306 ఇంత వేగపడిన imta vEgapaDina
| Title | ఇంత వేగపడిన | imta vEgapaDina |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | కమాచి | kamAchi |
| తాళం tALa | రూపక | rUpaka |
| 1 | ఇంత వేగపడిన కార్యమెట్టులౌనురా రవంతవేళజూచి ముద్దులాడ దగునురా | imta vEgapaDina kAryameTTulaunurA ravamtavELajUchi muddulADa dagunurA |
| 2 | మెత్తని పానుపున మగని మెల్లనె నిద్రింపజేసి యత్తమామ లెఱుగకుండ వత్తును పోరా | mettani pAnupuna magani mellane nidrimpajEsi yattamAma le~rugakunDa vattunu pOrA |
| 3 | మరదులు గ్రామాంతరమ్ములరిగి రాడబిడ్డలింక పొరుగిండ్లకు నాటలాడబోదురు గదరా | maradulu grAmAmtarammularigi rADabiDDalimka porugimDlaku nATalADabOduru gadarA |
| 4 | దాపున మా పూలదోట లోపల నీవుండుము గడెసేపులోనె బాగాల్ గొని చేరవత్తురా | dApuna mA pUladOTa lOpala nIvumDumu gaDesEpulOne bAgAl goni chEravatturA |
| 5 | చెన్ను మీర గబ్బిట యజ్ఞన్న కవి నేలినట్టి చిన్ని కృష్ణ మదిని నేర మెన్నబోకురా | chennu mIra gabbiTa yajnanna kavi nElinaTTi chinni kRshNa madini nEra mennabOkurA |
#305 వాల్‌గంటి vAl^gamTi
| Title | వాల్‌గంటి | vAl^gamTi |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | ముఖారి | mukhAri |
| తాళం tALa | రూపక | rUpaka |
| 1 | వాల్‌గంటి సోయగంబునెన్న వశముగాదురా ఘల్ ఘల్ రవంపు నడలు హంసగతుల గేరురా | vAl^gamTi sOyagambunenna vaSamugAdurA ghal ghal ravampu naDalu hamsagatula gErurA |
| 2 | తొగవిందునకు నెమ్మోమునకతి దూరము గదరా వరకుందనంపు జాయ ముద్దుగుల్కు మేనురా | togavimdunaku nemmOmunakati dUramu gadarA varakundanampu jAya muddugulku mEnurA |
| 3 | ప్రోయాలు తళ్కుమేల్ పాలిండ్లు పూలచెండ్లురా ప్రాయంపుటింతి మధ్యము గన్పట్టదు గదరా | prOyAlu taLkumEl pAlinDlu pUlachenDlurA prAyampuTimti madhyamu gan&paTTadu gadarA |
| 4 | అర చందమామ నేలు నెన్నుదురు గల చెలిరా మరువంపు మొల్ల మొగ్గల పల్వరుస పొలతిరా | ara chandamAma nElu nennuduru gala chelirA maruvampu molla moggala palvarusa polatirA |
| 5 | జలజాతనేత్ర గబ్బిట యజ్ఞన్న కవినుతా వలరేని గన్న మేల్పుమిన్న వనిత నేలరా వాల్‌గంటి సోయగంబుల | jalajAtanEtra gabbiTa yajnanna kavinutA valarEni ganna mElpuminna vanita nElarA vAl^gamTi sOyagambula |
#304 కోమలాంగి kOmalAmgi
| Title | కోమలాంగి | kOmalAmgi |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | కేదారగౌళ | kEdAragauLa |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | కోమలాంగి తాళకున్నదిరా తామరస విలోచన | kOmalAmgi tALakunnadirA tAmarasa vilOchana |
| 2 | సామిరాగదర కామినిక గనగ నా మనోజుని శరానలంబునకు | sAmirAgadara kAminika ganaga nA manOjuni SarAnalambunaku |
| 3 | చందనగంధి నీయందనురాగము జెందియున్నదిర సుందర శరీర యెందరైన నిన్ను బోలరంచు నీ యందంబు చందంబు డెందంబునందలచి | chandanagandhi nIyamdanurAgamu jemdiyunnadira sumdara SarIra yemdaraina ninnu bOlaramchu nI yamdambu chamdambu Demdambunamdalachi |
| 4 | కూరిమి మీరగ వారిజముఖిని జేరి సుఖింపర శ్రీ రుక్మిణీలోల వేరు సేయ మేరగాదు వేవేగమే రార సారెకు నీ రాక నారయుచు | kUrimi mIraga vArijamukhini jEri sukhimpara SrI rukmiNIlOla vEru sEya mEragAdu vEvEgamE rAra sAreku nI rAka nArayuchu |
| 5 | వావిగ గబ్బిట వంశజ యజ్ఞన సేవిత నీకై యాసించి యున్నదిర యే విధాననైన దాని గ్రీడింపు భావింప మీవేళ శ్రీవేణుగోపాలక | vAviga gabbiTa vamSaja yajnana sEvita nIkai yAsimchi yunnadira yE vidhAnanaina dAni grIDimpa bhAvimpu mIvELa SrIVENugOpAlaka |
#303 హాయికల్గెనురా hAyikalgenurA
| Title | హాయికల్గెనురా | hAyikalgenurA |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | బిలహరి | bilahari |
| తాళం tALa | రూపక | rUpaka |
| 1 | హాయికల్గెనురా చాలగ ||హా|| నామది ||హా|| నీయొయ్యారంపు పాటల | hAyikalgenurA chAlaga ||hA|| nAmadi ||hA|| nIyoyyArampu pATala |
| 2 | నీయెడ బాళిని నేను రాగానెరా వేయని ముద్దిడి యెదను జేర్చి వేయి మోరీలు జేయు బిగికౌగిలీయ నీవెంతో | nIyeDa bALini nEnu rAgAnerA vEyani muddiDi yedanu jErchi vEyi mOrIlu jEyu bigikaugilIya nIvemtO |
| 3 | మారశతోజ్వలాకార నేనయ్యెడ కోరి సుగంధము కూర్మిబూయ గారామున నీ తీరౌ మోవిసుధారసమీయ | mAraSatOjvalAkAra nEnayyeDa kOri sugamdhamu kUrmibUya gArAmuna nI tIrau mOvisudhArasamIya |
| 4 | మక్కువ నేను నీ చెక్కిలి గొట్టగ చక్కలిగింతలు చాలగొల్పి చొక్కింపు గోట నొక్కుచు బాలిండ్లెక్కుడు బెనగ | makkuva nEnu nI chekkili goTTaga chakkaligimtalu chAlagolpi chokkimpu gOTa nokkuchu bAlimDlekkuDu benaga |
| 5 | ఆరసి గబ్బిట యజ్ఞన సత్కవి వారక బ్రోచెడి శౌరి నేడు చారు నానా బంధోచాతురీ మారునికేళి | Arasi gabbiTa yajnana satkavi vAraka brOcheDi Sauri nEDu chAru nAnA bamdhOchAturI mArunikELi |