| Title | ఏమి పల్కెనే | Emi palkenE |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | రూపక | rUpaka |
| 1 | ఏమి పల్కెనే శ్రీ సఖు ||డేమి ||అల్లవా||డేమి || మోమాటమేమిలేక తెల్పగదె చెలి | Emi palkenE SrI sakhuDEmi allavADEmi mOmATamEmilEka telpagade cheli |
| 2 | నేవ్రాయుచీటి జూచెనా నిరసించి పాఱవైచెనా యేవైన నుల్లసమ్ములాడెనా చెలి | nEvrAyuchITi jUchenA nirasimchi pA~ravaichenA yEvaina nullasammulADenA cheli |
| 3 | ఆ కాంత యింటనుండెనా అన్యాలయమున నుండెనా నీకేమియైన భూషలిచ్చెనా చెలి | A kAmta yimTanunDenA anyAlayamuna numDenA nIkEmiyaina bhUshalichchenA cheli |
| 4 | ననుబాయనంచు జెప్పెనా నినుజూచి వేఱేడాగెనా మనసిచ్చి మారుజాబు వ్రాసెనా చెలి | nanubAyanamchu jeppenA ninujUchi vE~rEDAgenA manasichchi mArujAbu vrAsenA cheli |
| 5 | ఇటు నేవత్తుననియెనా అటు నన్ను రమ్మనియెనా పటు గబ్బిట శ్రీ యజ్ఞనార్చితుడు హరి | iTu nEvattunaniyenA aTu nannu rammaniyenA paTu gabbiTa SrI yajnanArchituDu hari |
Category: Javali
#301 వినవే సామి చేసిన vinavE sAmi chEsina
| Title | వినవే సామి చేసిన | vinavE sAmi chEsina |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | రూపక | rUpaka |
| 1 | వినవే సామి చేసిన పనులన్ దెలిపెద చెలి | vinavE sAmi chEsina panulan delipeda cheli |
| 2 | కనుల నిండ నే నిదురగొని నటులుండిన వేళను చనవున గడపినవన్నియు | kanula ninDa nE niduragoni naTulunDina vELanu chanavuna gaDapinavanniyu |
| 3 | నిన్న రేయి పాన్పు నిండు వెన్నెలలో వైచి పండి యున్న వేళ నాదుపైని వన్నెకాడు సన్నజాజులిన్ని చల్లె నెలనవ్వున | ninna rEyi pAn&pu ninDu vennelalO vaichi panDi yunna vELa nAdupaini vannekADu sannajAjulinni challe nelanavvuna |
| 4 | మేలైన గదంబు రోజ పాళి నలది పెదవి తేనె గ్రోలి ముద్దు బెట్టి గోపాలుడు సుఖలీలల ననుదేలించెనె నీలవేణి | mElaina gadambu rOja pALi naladi pedavi tEne grOli muddu beTTi gOpAluDu sukhalIlala nanudElimchene nIlavENi |
| 5 | ఇల గబ్బిట యజ్ఞనాఖ్యు గృపమీర నేలినట్టి నలికాక్షుడిట్లు జేసి వెలలేనివి గల మానికముల హారము నెలమి నొసగె | ila gabbiTa yajnanAkhyu gRpamIra nElinaTTi nalikAkshuDiTlu jEsi velalEnivi gala mAnikamula hAramu nelami nosage |
#300 వానిజూడు మెందున్నాడో vAnijUDu memdunnADO
| Title | వానిజూడు మెందున్నాడో | vAnijUDu memdunnADO |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | నాటకురంజి | nATakuramji |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | వానిజూడు మెందున్నాడో సఖియ | vAnijUDu memdunnADO sakhiya |
| 2 | నాణెంపు బల్కుల దేనెలొల్కువాడే | nANempu balkula dEnelolkuvADE |
| 3 | నిద్దమైన చెక్కుతద్దముల సౌరు ముద్దుగారు మోము మోవికెంపు వాడే | niddamaina chekkutaddamula sauru muddugAru mOmu mOvikempu vADE |
| 4 | బంగారు దువ్వలువ వల్లెవాటు వైచి సంగీతమ్ము జేయు చహలు గల్గువాడే | bamgAru duvvaluva vallevATu vaichi samgItammu jEyu chahalu galguvADE |
| 5 | చల్లని చూపుల సత్కవిత్కముల పెల్లైన యీవుల పేరు బొందువాడే | challani chUpula satkavitkamula pellaina yIvula pEru bomduvADE |
| 6 | అనయము గబ్బిట యజ్ఞన్న కవీంద్ర వినుతుడైన రంగ విభుడింక రాడాయె | anayamu gabbiTa yajnanna kavIndra vinutuDaina ramga vibhuDimka rADAye |
#299 వనజాక్షుని బాయలేనే vanajAkshuni bAyalEnE
| Title | వనజాక్షుని బాయలేనే | vanajAkshuni bAyalEnE |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | హిందుస్తానీ కాఫీ | hindustAnI kAfI |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | వనజాక్షుని బాయలేనే సఖీ | vanajAkshuni bAyalEnE sakhI |
| 2 | వెనుకనె వచ్చి నా కనుదోయిని మూసి తను నన్నెఱుంగమన్నాడే | venukane vachchi nA kanudOyini mUsi tanu nanne~rungamannADE |
| 3 | కడు ముద్దు పాటల గరగించి నన్ను తన తొడపైని నుంచుకొన్నాడే | kaDu muddu pATala garagimchi nannu tana toDapaini nunchukonnADE |
| 4 | మమతమీర నాతో మనసిచ్చి మాటాడుచు తమలంబు నొసంగినాడే | mamatamIra nAtO manasichchi mATADuchu tamalambu nosamginADE |
| 5 | ఘన సన్నిభాంగుడే గబ్బిట యజ్ఞన్న హృద్వనజ ప్రపూజితాంగుడే | ghana sannibhAmguDE gabbiTa yajnanna hRdvanaja prapUjitAmguDE |
#298 ఈ మోహమెట్టోర్తురా I mOhameTTOrturA
| Title | ఈ మోహమెట్టోర్తురా | I mOhameTTOrturA |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | ఈ మోహమెట్టోర్తురా వేగ ప్రేమ జూచి యేలుకోర | I mOhameTTOrturA vEga prEma jUchi yElukOra |
| 2 | నీ మీదను నా మానసమేమారక చిక్కెగదరా మేనున గరుపాటులు వేమారును గల్గెనుర | nI mIdanu nA mAnasamEmAraka chikkegadarA mEnuna garupATulu vEmArunu galgenura |
| 3 | పిక్కటాలు వక్షోజము లెక్కుడుగ పొంగారెర మక్కువగ నీ కౌగిలి యొక్కపరి నీగదర | pikkaTAlu vakshOjamu lekkuDuga pomgArera makkuvaga nI kaugili yokkapari nIgadara |
| 4 | దట్టమగు చెమ్మటలు బుట్టి మదిగట్టి చెడి గుట్టు విడి వెచ్చనగు నిట్టూర్పులు వచ్చెనుర | daTTamagu chemmaTalu buTTi madigaTTi cheDi guTTu viDi vechchanagu niTTUrpulu vachchenura |
| 5 | ఇంతంతనని కోర్కెలు స్వాంతమున గంతులిడె వింతలుగ శ్రీ గబ్బిట యజ్ఞేశనుత | imtamtanani kOrkelu svAmtamuna gamtuliDe vimtaluga SrI gabbiTa yajnESanuta |
#297 చాలు పోపోరా chAlu pOpOrA
| Title | చాలు పోపోరా | chAlu pOpOrA |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | చాలు పోపోరా యేరా నీ చందమెల్ల దెలిసెరా జాడలెల్ల దెలిసెరా | chAlu pOpOrA yErA nI chandamella deliserA jADalella deliserA |
| 2 | నీ నయ వినయమెల్ల నేడు దెలిసె మ్రొక్కకు నీకే నిష్టమటరా | nI naya vinayamella nEDu delise mrokkaku nIkE nishTamaTarA |
| 3 | ఎందుకు నన్నంటెదు నా డెందము పరిశోధింప నిందు వచ్చితే యేరా | enduku nannamTedu nA Dendamu pariSOdhimpa nindu vachchitE yErA |
| 4 | ఆ లతాంగి మైత్రి సౌఖ్య లీలలిందు జూపింప గోపాల వచ్చితే యేరా | A latAMgi maitri soukhya lIlalimdu jUpimpa gOpAla vachchitE yErA |
| 5 | బిసరుహలోచన గబ్బిట యజ్ఞనాప్త దాని బసకె వేంచేయరా | bisaruhalOchana gabbiTa yajnanApta dAni basake vEmchEyarA |
#296 మారుబారి కోర్వజాలరా mArubAri kOrvajAlarA
| Title | మారుబారి కోర్వజాలరా | mArubAri kOrvajAlarA |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | శృంగార జావళ్ళు | SRmgAra jAvaLLu |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | మారుబారి కోర్వజాలరా శ్రీమానినీ మనోహరా | mArubAri kOrvajAlarA SrImAninI manOharA |
| 2 | నీరేజు సూన కఠోర బాణమ్ములురోరుహముం దాకెరా | nIrEju sUna kaThOra bANammulurOruhamum dAkerA |
| 3 | ఇందీవరాప్తుని యెండ వేడిమికి కందుచు మేనెల్ల గ్రాగుటె కాకయా మందానిలుడు పల్మారు గగుర్పాటు లొందింప సాగించెరా | indIvarAptuni yenDa vEDimiki kanduchu mEnella grAguTe kAkayA mamdAniluDu palmAru gagurpATu lomdimpa sAgimcherA |
| 4 | శారికా కీర మయూర మధు వ్రత పారావతనిక రారావములకు తోరంబుగా మది తృళ్ళిపడుచు మహారాటమున్ జెందెరా | SArikA kIra mayUra madhu vrata pArAvatanika rArAvamulaku tOrambugA madi tRLLipaDuchu mahArATamun jemderA |
| 5 | చయ్యన గబ్బిట సత్కుల జని యజ్ఞయ్యను బ్రోచెడి జలజనయన యా గయ్యాళి జేరి నన్నెయ్యడ నేచుట లయ్యయ్యొ యిది మేరా | chayyana gabbiTa satkula jani yajnayyanu brOcheDi jalajanayana yA gayyALi jEri nanneyyaDa nEchuTa layyayyo yidi mErA |
#295 సామాజాయా sAmAjAyA
| Title | సామాజాయా | sAmAjAyA |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | బిలహరి | bilahari |
| తాళం tALa | అట | aTa |
| 1 | సామాజాయా నారో సామినిటకు రమ్మనవె చన వెడయ | sAmAjAyA nArO sAminiTaku rammanave chana veDaya |
| 2 | చలం బిటులమిది దలంచ వలదని | chalam biTulamidi dalamcha valadani |
| 3 | మారుని విరిశర బారి కోర్వదని | mAruni viriSara bAri kOrvadani |
| 4 | జాలామేల రతికేళీ నేలుటకు | jAlAmEla ratikELI nEluTaku |
| 5 | చిన్నారాయ రామ చిన్నారాయ నృప శీలుని కడువడి | chinnArAya rAma chinnArAya nRpa SIluni kaDuvaDi |
#294 ఏరసామి పలుమారు ErasAmi palumAru
| Title | ఏరసామి పలుమారు | ErasAmi palumAru |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | సింధు కమాచి | sindhu kamAchi |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | ఏరసామి పలుమారు వేడినను కూరుమి రాదా కోమలి మీదా | ErasAmi palumAru vEDinanu kUrumi rAdA kOmali mIdA |
| 2 | స్మరుడురువడి విరిశరములురము దూయా మారుత మొలయా మానిని సైచక మంద మారుత మొలయా మానిని సైచక | smaruDuruvaDi viriSaramuluramu dUyA mAruta molayA mAnini saichaka mamda mAruta molayA mAnini saichaka |
| 3 | సరసిజముఖి నిటు సరకు గొనవిదేరా సరగున రారా సమయమురా యిది సరగున రారా సమయమిదేరా | sarasijamukhi niTu saraku gonavidErA saraguna rArA samayamurA yidi saraguna rArA samayamidErA |
| 4 | చెలియ నిను వలసి దలచి సొలసె గదరా చిన్నారాయా భూపాలా రామచిన్నారాయా భూపాలా | cheliya ninu valasi dalachi solase gadarA chinnArAyA bhUpAlA rAmachinnArAyA bhUpAlA |
#293 పాకశాసనదేవ pAkaSAsanadEva
| Title | పాకశాసనదేవ (కృతి) | pAkaSAsanadEva (kRti) |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| 1 | పాకశాసనదేవ లోకార్చిత పాద లోకాబాంధవ చంద్రా లోచన యుగళా గోకుల వర్ధన గోపీచేలన చోర మాకభయమొసగి మాధవ బ్రోవరా | pAkaSAsanadEva lOkArchita pAda lOkAbAndhava chandrA lOchana yugaLA gOkula vardhana gOpIchElana chOra mAkabhayamosagi mAdhava brOvarA |
| 2 | ఘోర సురారిని గూల్చి ప్రహ్లాదుని కోర్కెలెల్లను కొనగూర్చకలేదా పోరున ధీరకుంభీరమును బట్టి జీరి వారణమును జేరి గావగలేదా | ghOra surArini gUlchi prahlAduni kOrkelellanu konagUrchakalEdA pOruna dhIrakumbhIramunu baTTi jIri vAraNamunu jEri gAvagalEdA |
| 3 | పక్షపాతము మాని రక్షణ సేయుము కక్ష బూనుట బాడి గాదు దాసునిపై పక్షివాహన లోకాధ్యక్షౌ కౌస్తుభ పక్షపాండవ పుత్ర పక్షా నినుగొల్తు | pakshapAtamu mAni rakshaNa sEyumu kaksha bUnuTa bADi gAdu dAsunipai pakshivAhana lOkAdhyakshau kaustubha pakshapAnDava putra pakshA ninugoltu |
| 4 | జాలమేల కనక చేలా నను వేగ పాలనసేయుము పావనశీలా యాలగాసరిమునుకు చేలుని కరుణను నేలిన విజయ గోపాలా గానలోలా | jAlamEla kanaka chElA nanu vEga pAlanasEyumu pAvanaSIlA yAlagAsarimunuku chEluni karuNanu nElina vijaya gOpAlA gAnalOlA |