| Title | చలమికను | chalamikanu |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | నాదనామక్రియ | nAdanAmakriya |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | చలమికను మానీ యేలరా సామి వేగ రారా | chalamikanu mAnI yElarA sAmi vEga rArA |
| 2 | కులుకు గుబ్బలను గోరులుంచి నా వలపు దీర కౌగిలిని యొసగరా | kuluku gubbalanu gOrulumchi nA valapu dIra kaugilini yosagarA |
| 3 | చిలుక రౌతు విరిములుకురమునను బలముగ నాటగ సొలసితి నకటా | chiluka rautu virimulukuramunanu balamuga nATaga solasiti nakaTA |
| 4 | బలు చెలిమిని నిను గలయ గోరినను బలుకవు కస్తురి జిలుకవు తగునా | balu chelimini ninu galaya gOrinanu balukavu kasturi jilukavu tagunA |
| 5 | మరుడు సాక్షి యీ విరహమోర్వ నా తరము గాదు బుచ్చి తమ్మయ భూపా | maruDu sAkshi yI virahamOrva nA taramu gAdu buchchi tammaya bhUpA |
Category: Javali
#291 రారా యికను rArA yikanu
| Title | రారా యికను | rArA yikanu |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | ఫరుజు | faruju |
| తాళం tALa | ఏక | Eka |
| 1 | రారా యికను చాలును రాపులు మానీ తేరిటు జూడవేర నా సామీ | rArA yikanu chAlunu rApulu mAnI tEriTu jUDavEra nA sAmI |
| 2 | కూరిమి వేళా గోరంతా రారా ఎంతని వేడెద యేమని దెల్పెద చింత దీర్చి నను చేకోరా | kUrimi vELA gOramtA rArA emtani vEDeda yEmani delpeda chimta dIrchi nanu chEkOrA |
| 3 | ధరామరాధిపా తమ్మయ భూపా విరాళిని తాళను వేవేగ | dharAmarAdhipA tammaya bhUpA virALini tALanu vEvEga |
#290 యేల చలము రార yEla chalamu rAra
| Title | యేల చలము రార | yEla chalamu rAra |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | ?? | ?? |
| తాళం tALa | ?? | ?? |
| 1 | యేల చలము రారసామీ యేల చలము రారసామీ | yEla chalamu rArasAmI yEla chalamu rArasAmI |
| 2 | బాళిమీర నిదురరాదు పంచదార తేనె చేదు తాళిమించుకైన లేదు తామసింపవలదు వలదు | bALimIra nidurarAdu pamchadAra tEne chEdu tALimimchukaina lEdu tAmasimpavaladu valadu |
| 3 | చల్లగాలి నొల్లదాయె స్మరుని పోరు లధికమాయె మల్లెపూలు ముల్లులాయె మాటిమాటికి నిట్టూర్పులాయె | challagAli nolladAye smaruni pOru ladhikamAye mallepUlu mullulAye mATimATiki niTTUrpulAye |
| 4 | పొలతి నిటుల నేచమేలా బుచ్చి తమ్మయ్య భూపాలా కలసి రతుల దేల్చి చాలా కరుణబూని యేలవేరా | polati niTula nEchamElA buchchi tammayya bhUpAlA kalasi ratula dElchi chAlA karuNabUni yElavErA |
#289 చలమేలరా chalamElarA
| Title | చలమేలరా | chalamElarA |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | సురట | suraTa |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | చలమేలరా నా సామి వలపెట్లు నిలుపగలనికను చలమేలరా మనసు దీరగా మాటలాడగా మానితివిది తగునా | chalamElarA nA sAmi valapeTlu nilupagalanikanu chalamElarA manasu dIragA mATalADagA mAnitividi tagunA |
| 2 | కోరినట్ల నీ కోర్కె దీర్చినా కోపగించ తగునా | kOrinaTla nI kOrke dIrchinA kOpagimcha tagunA |
| 3 | కమ్మని విల్తుని గాసి దీర్చరా తమ్మయ భూపాలా | kammani viltuni gAsi dIrcharA tammaya bhUpAlA |
#288 నేరము లెంచక nEramu lemchaka
| Title | నేరము లెంచక | nEramu lemchaka |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | బిళహరి | biLahari |
| తాళం tALa | అట | aTa |
| 1 | నేరము లెంచక కూరిమి తోడను కీరవాణి నేలరా రారా సామి | nEramu lemchaka kUrimi tODanu kIravANi nElarA rArA sAmi |
| 2 | ఘోరమారుని బాధల కోరువలేకను వారిజాక్షి బంపెరా సారెకు మ్రొక్కి | ghOramAruni bAdhala kOruvalEkanu vArijAkshi bamperA sAreku mrokki |
| 3 | మోవి యాననిచ్చి మోహతాపమార్చి ముచ్చటలను దీర్చ రావే వేగమే | mOvi yAnanichchi mOhatApamArchi muchchaTalanu dIrcha rAvE vEgamE |
| 4 | ధరణీ నాయక బుచ్చి తమ్మయ్య ధీరా తరుణిమణీ మదనా సరసాగ్రణి | dharaNI nAyaka buchci tammayya dhIrA taruNimaNI madanA sarasAgraNi |
#287 రమ్మని దెల్పవే rammani delpavE
| Title | రమ్మని దెల్పవే | rammani delpavE |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | రమ్మని దెల్పవే రమ్మని దెల్పవే రమ్మని దెల్పవె రామరో వేగము మారుత మొలసెనే కీరము గూసెనే మారుడు రాసె నేడు మానిని తాళనే | rammani delpavE rammani delpave rammani delpavE rAmarO vEgamu mAruta molasenE kIramu gUsenE mAruDu rAse nEDu mAnini tALanE |
| 2 | ఆ పగరాని నా కోపము చేతను రాపులు జేసిన రాకడ మానెనే | A pagarAni nA kOpamu chEtanu rApulu jEsina rAkaDa mAnenE |
| 3 | సమ్మతిచే బుచ్చి తమ్మయ సామికి కమ్మని వా తెర కానుక యిచ్చెద | sammatichE buchchi tammaya sAmiki kammani vA tera kAnuka yichcheda |
#286 ఏమానెనేమనెనే EmAnenEmanenE
| Title | ఏమానెనేమనెనే | EmAnenEmanenE |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | ఏమానునేమనెనే సామి నీతో ఏమనెనేమానెనే కామినీ నీచేతి కానుక బూనెనే ప్రేమ గలదనెనా | EmAnunEmanenE sAmi nItO EmanenEmAnenE kAminI nIchEti kAnuka bUnenE prEma galadanenA |
| 2 | వేడుకచే నను గూడిన వేళలో నోడినదని చెప్పెనా సామి | vEDukachE nanu gUDina vELalO nODinadani cheppenA sAmi |
| 3 | మచ్చకంటిరొ నేడు బుచ్చి తమ్మయేంద్రుడు విచ్చేతునని బల్కెనా సామి | machchakamTiro nEDu buchchi tammayEmdruDu vichchEtunani balkenA sAmi |
#285 తాళుము వగలేలా tALumu vagalElA
| Title | తాళుము వగలేలా | tALumu vagalElA |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | ఫరుజు | faruju |
| తాళం tALa | ఏక | Eka |
| 1 | తాళుము వగలేలా తామస మింతేలనే చాలుచాలునే ఓ తరుణీ తాళిమి లేకను బాలిక తీరున బాళిని జెంది నన్నేలను దూరెద ఓ లలనా గేలి గాదె యిపుడేలనె యీ తమి | tALumu vagalElA tAmasa mimtElanE chAluchAlunE O taruNI tALimi lEkanu bAlika tIruna bALini jemdi nannElanu dUreda O lalanA gEli gAde yipuDElane yI tami |
| 2 | మారుని బారికి నోరువ లేదని కోరిన సామిని గూరిచినందుకా కీరవాణీ నేరమయ్యె సరివారలు నవ్వెదర | mAruni bAriki nOruva lEdani kOrina sAmini gUrichinamdukA kIravANI nEramayye sarivAralu navvedara |
| 3 | దంతి గమనరో తమ్మయ భూపతి కంతుని కేళిని గలసిన వేళలో వంతులేలా గిలిగింతవేళా అతి వింతలు బల్కెదవు | damti gamanarO tammaya bhUpati kamtuni kELini galasina vELalO vamtulElA giligimtavELA ati vimtalu balkedavu |
#284 పణతీరో వినవమ్మ paNatIrO vinavamma
| Title | పణతీరో వినవమ్మ | paNatIrO vinavamma |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | ద్విజావంతి | dvijAvamti |
| తాళం tALa | అట | aTa |
| 1 | పణతీరో వినవమ్మ పతినీ కేలుబట్టి పాన్పుదార్చు వేళ భయము చేత బెనగి యాతని వెనుక జనరాదుసుమ్మ మనమున దిటమూని మన్నించవలెనమ్మ | paNatIrO vinavamma patinI kElubaTTi pAn&pudArchu vELa bhayamu chEta benagi yAtani venuka janarAdusumma manamuna diTamUni mannimchavalenamma |
| 2 | కపురంపు విడెమిడి కౌగలించరాగ కుపితవై మోముద్రిప్ప గూడదు సుమ్మా కపటమునిడి వేగకదియుట మేలమ్మ నెపమెంచరాదు నీవెపుడు నాధుని పైని | kapurampu viDemiDi kaugalimcharAga kupitavai mOmudrippa gUDadu summA kapaTamuniDi vEgakadiyuTa mElamma nepamemcharAdu nIvepuDu nAdhuni paini |
| 3 | సామి నీ గుబ్బల చందన మలదిన భామా రోరవ శేయ బాడిగాదమ్మ బ్రేమాను వేసవిని విరులు గట్ట రాగ తామసించి తగవు తగదు తగదమ్మా | sAmi nI gubbala chamdana maladina bhAmA rOrava SEya bADigAdamma brEmAnu vEsavini virulu gaTTa rAga tAmasimchi tagavu tagadu tagadammA |
| 4 | ధరణీ నాధుడు బుచ్చి తమ్మయేంద్రుడు మిగుల సరసాగ్రేసరుడె చానరో యతడు దరిజేరి యల్లన తావులంటి సుమశరుని పనులు సేయు తరినిక సరరాదు | dharaNI nAdhuDu buchchi tammayEmdruDu migula sarasAgrEsaruDe chAnarO yataDu darijEri yallana tAvulamTi sumaSaruni panulu sEyu tarinika sararAdu |
#283 జాలమేలరా jAlamElarA
| Title | జాలమేలరా | jAlamElarA |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | దేశీయ తోడి | dESIya tODi |
| తాళం tALa | ఏక | Eka |
| 1 | జాలమేలరా సామి యేలరా పూలవింటి వాని పోరు యేలా సైతురా | jAlamElarA sAmi yElarA pUlavimTi vAni pOru yElA saiturA |
| 2 | మోము జూపరా వేగ మోవి యివ్వరా తామసింపనేల మోహ తాప మార్చరా | mOmu jUparA vEga mOvi yivvarA tAmasimpanEla mOha tApa mArcharA |
| 3 | కౌగిలివ్వరా నాదు కాంక్ష దీర్చరా నాగరాది బంధగతుల నన్ను దేల్చరా | kaugilivvarA nAdu kAmksha dIrcharA nAgarAdi bandhagatula nannu dElcharA |
| 4 | భూమి నాయకా రాజా బుచ్చి తమ్మయా నా మనంబులోన నిన్నే నమ్మి యుంటిరా | bhUmi nAyakA rAjA buchchi tammayA nA manambulOna ninnE nammi yumTirA |