| Title | చంచలాక్షి | chamchalAkshi |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | చంచలాక్షి నిన్వరించి నన్ను బంచెర | chamchalAkshi nin&varimchi nannu banchera |
| 2 | యెంచగ గ్రొమ్మించు మించు జెలి మంచి మేను | yemchaga gromminchu minchu jeli manchi mEnu |
| 3 | అంచలు భ్రమించు నడలంచు వచియించవచ్చు కాంచనాంబర దాని గాంచిన మోహించె ఔర | anchalu bhraminchu naDalanchu vachiyinchavachchu kAnchanAmbara dAni gAmchina mOhinche aura |
| 4 | పంచశర రూపశర పంచకముల బల్మరు పంచబాణుదించు బోడి బొంచి యేసి ముంచెనుర | panchaSara rUpaSara panchakamula balmaru panchabANudimchu bODi bonchi yEsi munchenura |
| 5 | చంచరీక వేణి దొడ్డి పంచాది గదిలో పట్టి మంచమున శయనించి తపించెను రకింతచేత | chancharIka vENi doDDi panchAdi gadilO paTTi manchamuna Sayanimchi tapinchenu rakintachEta |
| 6 | అంచితముగ నిన్ను బూజించు యజ్ఞన్నకవి గాంచి పోషించు కృష్ణ వేంచేసి కరంచుమిక | anchitamuga ninnu bUjinchu yajnannakavi gAmchi pOshinchu kRshNa vEmchEsi karamchumika |
Category: Javali
#309 చాలు చాలు chAlu chAlu
| Title | చాలు చాలు | chAlu chAlu |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| 1 | చాలు చాలు నీదు చెల్మి జాడదెలిసె మానినీ | chAlu chAlu nIdu chelmi jADadelise mAninI |
| 2 | వ్రాలబోకు కాళ్ళపైని లేలే హంసగామినీ | vrAlabOku kALLapaini lElE hamsagAminI |
| 3 | గులాబి పువ్వు విడచి మోదుగు విరి గొన్నరీతిగా బలారె వాని గూడితిగ భామా నే నీకేటికే | gulAbi puvvu viDachi mOdugu viri gonnarItigA balAre vAni gUDitiga bhAmA nE nIkETikE |
| 4 | అల్ల వయసు ఠీపులు నీయందె మొల్చినవటే యెల్ల చానలకు లేవే యీ గోటు నీకేటికే | alla vayasu ThIpulu nIyamde molchinavaTE yella chAnalaku lEvE yI gOTu nIkETikE |
| 5 | ఇందిరేశ్వరుండ నీ నా పొందు నీకు గల్గునే అందులకే యేగు యజ్ఞనాప్తునకు తగుదువే | imdirESvarumDa nI nA pomdu nIku galgunE amdulakE yEgu yajnanAptunaku taguduvE |
#308 అయ్యయో ayyayO
| Title | అయ్యయో | ayyayO |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | హిందూస్తానీ కాఫీ | himdUstAnI kAfI |
| తాళం tALa | చాపు | chApu |
| 1 | అయ్యయో సైపగలేనే | ayyayO saipagalEnE |
| 2 | చయ్యన నేగి రమాసఖునిటు రమ్మనే | chayyana nEgi ramAsakhuniTu rammanE |
| 3 | మదిరాక్షి వినవే మకరాంకుడురువడి పదునగు శరముల నెదపై గ్రుచ్చెనే | madirAkshi vinavE makarAmkuDuruvaDi padunagu Saramula nedapai gruchchenE |
| 4 | అల్లజాబిల్లి వేడి మంతకంతకు నొడలెల్ల గ్రాగుచు విస్తరిల్లుచు నుండెనే | allajAbilli vEDi mamtakamtaku noDalella grAguchu vistarilluchu numDenE |
| 5 | వరగబ్బిట యజ్ఞన వంద్యుని బాయజాల హరినిటు దేవే మణీహారమిచ్చెదనే | varagabbiTa yajnana vandyuni bAyajAla hariniTu dEvE maNIhAramichchedanE |
#307 చిన్న ముద్దీరా chinna muddIrA
| Title | చిన్న ముద్దీరా | chinna muddIrA |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | హిందూస్తాని కాఫీ | himdUstAni kAfI |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | చిన్నముద్దీరా నాసామి | chinnamuddIrA nAsAmi |
| 2 | కన్నుల పండువుగా నిను గనగనె వెన్నవలెను మది వేగ గరగురా | kannula panDuvugA ninu ganagane vennavalenu madi vEga garagurA |
| 3 | సరసత నీవొకసారి మాటాడిన బొరి బొరి మేన బులక లెచ్చురా | sarasata nIvokasAri mATADina bori bori mEna bulaka lechchurA |
| 4 | అమ్మకచెల్ల నిన్నంటిన మాత్రనె కమ్మని కోర్కెలు గలుగుచుండురా | ammakachella ninnanTina mAtrane kammani kOrkelu galuguchumDurA |
| 5 | కమలా ప్రియ శ్రీ గబ్బిట యజ్ఞన నమిత చరణ విడనాడజాలరా | kamalA priya SrI gabbiTa yajnana namita charaNa viDanADajAlarA |
#306 ఇంత వేగపడిన imta vEgapaDina
| Title | ఇంత వేగపడిన | imta vEgapaDina |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | కమాచి | kamAchi |
| తాళం tALa | రూపక | rUpaka |
| 1 | ఇంత వేగపడిన కార్యమెట్టులౌనురా రవంతవేళజూచి ముద్దులాడ దగునురా | imta vEgapaDina kAryameTTulaunurA ravamtavELajUchi muddulADa dagunurA |
| 2 | మెత్తని పానుపున మగని మెల్లనె నిద్రింపజేసి యత్తమామ లెఱుగకుండ వత్తును పోరా | mettani pAnupuna magani mellane nidrimpajEsi yattamAma le~rugakunDa vattunu pOrA |
| 3 | మరదులు గ్రామాంతరమ్ములరిగి రాడబిడ్డలింక పొరుగిండ్లకు నాటలాడబోదురు గదరా | maradulu grAmAmtarammularigi rADabiDDalimka porugimDlaku nATalADabOduru gadarA |
| 4 | దాపున మా పూలదోట లోపల నీవుండుము గడెసేపులోనె బాగాల్ గొని చేరవత్తురా | dApuna mA pUladOTa lOpala nIvumDumu gaDesEpulOne bAgAl goni chEravatturA |
| 5 | చెన్ను మీర గబ్బిట యజ్ఞన్న కవి నేలినట్టి చిన్ని కృష్ణ మదిని నేర మెన్నబోకురా | chennu mIra gabbiTa yajnanna kavi nElinaTTi chinni kRshNa madini nEra mennabOkurA |
#305 వాల్‌గంటి vAl^gamTi
| Title | వాల్‌గంటి | vAl^gamTi |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | ముఖారి | mukhAri |
| తాళం tALa | రూపక | rUpaka |
| 1 | వాల్‌గంటి సోయగంబునెన్న వశముగాదురా ఘల్ ఘల్ రవంపు నడలు హంసగతుల గేరురా | vAl^gamTi sOyagambunenna vaSamugAdurA ghal ghal ravampu naDalu hamsagatula gErurA |
| 2 | తొగవిందునకు నెమ్మోమునకతి దూరము గదరా వరకుందనంపు జాయ ముద్దుగుల్కు మేనురా | togavimdunaku nemmOmunakati dUramu gadarA varakundanampu jAya muddugulku mEnurA |
| 3 | ప్రోయాలు తళ్కుమేల్ పాలిండ్లు పూలచెండ్లురా ప్రాయంపుటింతి మధ్యము గన్పట్టదు గదరా | prOyAlu taLkumEl pAlinDlu pUlachenDlurA prAyampuTimti madhyamu gan&paTTadu gadarA |
| 4 | అర చందమామ నేలు నెన్నుదురు గల చెలిరా మరువంపు మొల్ల మొగ్గల పల్వరుస పొలతిరా | ara chandamAma nElu nennuduru gala chelirA maruvampu molla moggala palvarusa polatirA |
| 5 | జలజాతనేత్ర గబ్బిట యజ్ఞన్న కవినుతా వలరేని గన్న మేల్పుమిన్న వనిత నేలరా వాల్‌గంటి సోయగంబుల | jalajAtanEtra gabbiTa yajnanna kavinutA valarEni ganna mElpuminna vanita nElarA vAl^gamTi sOyagambula |
#304 కోమలాంగి kOmalAmgi
| Title | కోమలాంగి | kOmalAmgi |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | కేదారగౌళ | kEdAragauLa |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | కోమలాంగి తాళకున్నదిరా తామరస విలోచన | kOmalAmgi tALakunnadirA tAmarasa vilOchana |
| 2 | సామిరాగదర కామినిక గనగ నా మనోజుని శరానలంబునకు | sAmirAgadara kAminika ganaga nA manOjuni SarAnalambunaku |
| 3 | చందనగంధి నీయందనురాగము జెందియున్నదిర సుందర శరీర యెందరైన నిన్ను బోలరంచు నీ యందంబు చందంబు డెందంబునందలచి | chandanagandhi nIyamdanurAgamu jemdiyunnadira sumdara SarIra yemdaraina ninnu bOlaramchu nI yamdambu chamdambu Demdambunamdalachi |
| 4 | కూరిమి మీరగ వారిజముఖిని జేరి సుఖింపర శ్రీ రుక్మిణీలోల వేరు సేయ మేరగాదు వేవేగమే రార సారెకు నీ రాక నారయుచు | kUrimi mIraga vArijamukhini jEri sukhimpara SrI rukmiNIlOla vEru sEya mEragAdu vEvEgamE rAra sAreku nI rAka nArayuchu |
| 5 | వావిగ గబ్బిట వంశజ యజ్ఞన సేవిత నీకై యాసించి యున్నదిర యే విధాననైన దాని గ్రీడింపు భావింప మీవేళ శ్రీవేణుగోపాలక | vAviga gabbiTa vamSaja yajnana sEvita nIkai yAsimchi yunnadira yE vidhAnanaina dAni grIDimpa bhAvimpu mIvELa SrIVENugOpAlaka |
#303 హాయికల్గెనురా hAyikalgenurA
| Title | హాయికల్గెనురా | hAyikalgenurA |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | బిలహరి | bilahari |
| తాళం tALa | రూపక | rUpaka |
| 1 | హాయికల్గెనురా చాలగ ||హా|| నామది ||హా|| నీయొయ్యారంపు పాటల | hAyikalgenurA chAlaga ||hA|| nAmadi ||hA|| nIyoyyArampu pATala |
| 2 | నీయెడ బాళిని నేను రాగానెరా వేయని ముద్దిడి యెదను జేర్చి వేయి మోరీలు జేయు బిగికౌగిలీయ నీవెంతో | nIyeDa bALini nEnu rAgAnerA vEyani muddiDi yedanu jErchi vEyi mOrIlu jEyu bigikaugilIya nIvemtO |
| 3 | మారశతోజ్వలాకార నేనయ్యెడ కోరి సుగంధము కూర్మిబూయ గారామున నీ తీరౌ మోవిసుధారసమీయ | mAraSatOjvalAkAra nEnayyeDa kOri sugamdhamu kUrmibUya gArAmuna nI tIrau mOvisudhArasamIya |
| 4 | మక్కువ నేను నీ చెక్కిలి గొట్టగ చక్కలిగింతలు చాలగొల్పి చొక్కింపు గోట నొక్కుచు బాలిండ్లెక్కుడు బెనగ | makkuva nEnu nI chekkili goTTaga chakkaligimtalu chAlagolpi chokkimpu gOTa nokkuchu bAlimDlekkuDu benaga |
| 5 | ఆరసి గబ్బిట యజ్ఞన సత్కవి వారక బ్రోచెడి శౌరి నేడు చారు నానా బంధోచాతురీ మారునికేళి | Arasi gabbiTa yajnana satkavi vAraka brOcheDi Sauri nEDu chAru nAnA bamdhOchAturI mArunikELi |
#302 ఏమి పల్కెనే Emi palkenE
| Title | ఏమి పల్కెనే | Emi palkenE |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | రూపక | rUpaka |
| 1 | ఏమి పల్కెనే శ్రీ సఖు ||డేమి ||అల్లవా||డేమి || మోమాటమేమిలేక తెల్పగదె చెలి | Emi palkenE SrI sakhuDEmi allavADEmi mOmATamEmilEka telpagade cheli |
| 2 | నేవ్రాయుచీటి జూచెనా నిరసించి పాఱవైచెనా యేవైన నుల్లసమ్ములాడెనా చెలి | nEvrAyuchITi jUchenA nirasimchi pA~ravaichenA yEvaina nullasammulADenA cheli |
| 3 | ఆ కాంత యింటనుండెనా అన్యాలయమున నుండెనా నీకేమియైన భూషలిచ్చెనా చెలి | A kAmta yimTanunDenA anyAlayamuna numDenA nIkEmiyaina bhUshalichchenA cheli |
| 4 | ననుబాయనంచు జెప్పెనా నినుజూచి వేఱేడాగెనా మనసిచ్చి మారుజాబు వ్రాసెనా చెలి | nanubAyanamchu jeppenA ninujUchi vE~rEDAgenA manasichchi mArujAbu vrAsenA cheli |
| 5 | ఇటు నేవత్తుననియెనా అటు నన్ను రమ్మనియెనా పటు గబ్బిట శ్రీ యజ్ఞనార్చితుడు హరి | iTu nEvattunaniyenA aTu nannu rammaniyenA paTu gabbiTa SrI yajnanArchituDu hari |
#301 వినవే సామి చేసిన vinavE sAmi chEsina
| Title | వినవే సామి చేసిన | vinavE sAmi chEsina |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | రూపక | rUpaka |
| 1 | వినవే సామి చేసిన పనులన్ దెలిపెద చెలి | vinavE sAmi chEsina panulan delipeda cheli |
| 2 | కనుల నిండ నే నిదురగొని నటులుండిన వేళను చనవున గడపినవన్నియు | kanula ninDa nE niduragoni naTulunDina vELanu chanavuna gaDapinavanniyu |
| 3 | నిన్న రేయి పాన్పు నిండు వెన్నెలలో వైచి పండి యున్న వేళ నాదుపైని వన్నెకాడు సన్నజాజులిన్ని చల్లె నెలనవ్వున | ninna rEyi pAn&pu ninDu vennelalO vaichi panDi yunna vELa nAdupaini vannekADu sannajAjulinni challe nelanavvuna |
| 4 | మేలైన గదంబు రోజ పాళి నలది పెదవి తేనె గ్రోలి ముద్దు బెట్టి గోపాలుడు సుఖలీలల ననుదేలించెనె నీలవేణి | mElaina gadambu rOja pALi naladi pedavi tEne grOli muddu beTTi gOpAluDu sukhalIlala nanudElimchene nIlavENi |
| 5 | ఇల గబ్బిట యజ్ఞనాఖ్యు గృపమీర నేలినట్టి నలికాక్షుడిట్లు జేసి వెలలేనివి గల మానికముల హారము నెలమి నొసగె | ila gabbiTa yajnanAkhyu gRpamIra nElinaTTi nalikAkshuDiTlu jEsi velalEnivi gala mAnikamula hAramu nelami nosage |