#272 ఏటీకె యీ తగవు ETIke yI tagavu

This is the first jAvaLi from this book

Titleఏటీకె యీ తగవుETIke yI tagavu
Written Byబాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవిbAsukhaila vijayavenkaTakrishNArAya kavi
Bookbasukhaila
రాగం rAgaభయిరవిbhayiravi
తాళం tALaత్రిపుటtripuTa
1ఏటీకె యీ తగవు మాటిమాటికి నాతో
సాటివారు గేలి సలుపాగనూ
బోటీరొ నా ప్రియుని మాటాలు వింటివె
నీటీపై వ్రాతాయె నేనేమి సేతూ
ETIke yI tagavu mATimATiki nAtO
sATivAru gEli salupAganU
bOTIro nA priyuni mATAlu vinTive
nITIpai vrAtAye nEnEmi sEtU
2అక్కార దీర్చి నన్నాదరింతు నాని
చెక్కిలిబట్టి తాజేసిన బాస రొక్కాపు మూటాయె
లోకాపవాదాయె యెక్కడి స్నేహ మింకెక్కడి ప్రేమా
akkAra dIrchi nannAdarimtu nAni
chekkilibaTTi tAjEsina bAsa rokkApu mUTAye
lOkApavAdAye yekkaDi snEha mimkekkaDi prEmA
3తుంటవింటివాడు తూపూలు నా యెద
జంటనేయ సైచజాలానితరిని
కంటబడని వాని కాపురమిక నేలా
రెంటా జెడిన నావంటిదిలగలదా
tumTavimTivADu tUpUlu nA yeda
jamTanEya saichajAlAnitarini
kamTabaDani vAni kApuramika nElA
remTA jeDina nAvamTidilagaladA
4రాజా వేంకట రామారాయ భూపాలుడు
భోజరాజ రాజరాజ నిభుడనియా
రాజీవాయతనేత్రి రాయబారము సేయ
యాజీవమని నమ్మినందుల కిటులాయెనే
rAjA vEmkaTa rAmArAya bhUpAluDu
bhOjarAja rAjarAja nibhuDaniyA
rAjIvAyatanEtri rAyabAramu sEya
yAjIvamani namminamdula kiTulAyenE

#271 పొమ్మనవే వాని దానింటికి pommanavE vAni dAnimTiki

Titleపొమ్మనవే వాని దానింటికిpommanavE vAni dAnimTiki
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaకమాస్kamAs
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviపొమ్మనవే వాని దానింటికిpommanavE vAni dAnimTiki
చరణం
charaNam 1
సవతితో ఏ వేళను సరసములాడుచును
వలలో జిక్కిన వాని పిలచి పిలచి ఏమో
savatitO E vELanu sarasamulADuchunu
valalO jikkina vAni pilachi pilachi EmO
చరణం
charaNam 2
ప్రియముతో చామేంద్రుడు నన్ను దలచి అపుడు
మరచినాడు యెవతో బోధన చేత
priyamutO chAmEndruDu nannu dalachi apuDu
marachinADu yevatO bOdhana chEta
This is the last jAvaLi from the book of “Javalis of Sri Chinniah”

#270 చెలువుని రా రమ్మనవే cheluvuni rA rammanavE

Titleచెలువుని రా రమ్మనవేcheluvuni rA rammanavE
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaతిశ్రనడ ఆదిtiSranaDa Adi
పల్లవి pallaviచెలువుని రా రమ్మనవే ఓ చెలియరోcheluvuni rA rammanavE O cheliyarO
అనుపల్లవి anupallaviవారిజముఖి పగవారి బోధనచే
సారెకు నాపై నేరమెంచగ నిక
vArijamukhi pagavAri bOdhanachE
sAreku nApai nEramemchaga nika
చరణం
charaNam 1
కోరిన సామి ఈ దారి వచ్చేను గాదే
నారీమణి రారాయే పారమేమిక నిక
kOrina sAmi I dAri vachchEnu gAdE
nArImaNi rArAyE pAramEmika nika
చరణం
charaNam 2
అందరివలె నన్ను నిందలు సేయక
సుందరీ చామ రాజేంద్రుని వలచితి
amdarivale nannu nimdalu sEyaka
sumdarI chAma rAjEmdruni valachiti

#269 జానరో ఈ మోహము jAnarO I mOhamu

Titleజానరో ఈ మోహముjAnarO I mOhamu
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaకమాస్kamAs
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviజానరో ఈ మోహము సహింపలేనేjAnarO I mOhamu sahimpalEnE
అనుపల్లవి anupallaviమానిని జాలమేల మారుబారి కోర్వలేనేmAnini jAlamEla mArubAri kOrvalEnE
చరణం
charaNam 1
సరసాంగి సామికేమో మరులు జేసేవు
పరవశము డెదయ జేసి పోయిరమ్ము ముద్దుగుమ్మ
sarasAmgi sAmikEmO marulu jEsEvu
paravaSamu Dedaya jEsi pOyirammu muddugumma
చరణం
charaNam 2
తరుణిరో చామ రాజేంద్రుని బుధ్ధికి తోచదు గాని
కరుణ లోలుడైన వాడు కాంతుడు నేడు గూడ రాడు
taruNirO chAma rAjEmdruni budhdhiki tOchadu gAni
karuNa lOluDaina vADu kAmtuDu nEDu gUDa rADu
See also709
Audio Linkhttps://www.youtube.com/watch?v=Txjsw3ysX-M

#268 చెలి బలవంతమేలరా cheli balavamtamElarA

Titleచెలి బలవంతమేలరాcheli balavamtamElarA
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaఫరజ్faraj
తాళం tALaమిశ్రచాపుmiSrachApu
పల్లవి pallaviచెలి బలవంతమేలరా ఓ
చెలువుడు ఈ రీతి చలము జేసితే
cheli balavamtamElarA O
cheluvuDu I rIti chalamu jEsitE
అనుపల్లవి anupallaviభావజూచి కేళిలో నన్నేలినట్టి ముచ్చు
ఈ విధము జేసితే మన దేవుడున్నాడు
bhAvajUchi kELilO nannElinaTTi muchchu
I vidhamu jEsitE mana dEvuDunnADu
చరణం
charaNam 1
దాని బోధలకు లోనై యున్నాను ఇక
మానాభిమానము వానితే అలవానితే పోపో
dAni bOdhalaku lOnai yunnAnu ika
mAnAbhimAnamu vAnitE alavAnitE pOpO
చరణం
charaNam 2
చంచలాక్షి చామ రాజేంద్రుడు ఈ రీతి
వంచన జేసితే మంచిదే బలు మంచిదే
chamchalAkshi chAma rAjEmdruDu I rIti
vamchana jEsitE mamchidE balu mamchidE

#267 తెలిసే వగలెల్ల telisE vagalella

Titleతెలిసే వగలెల్లtelisE vagalella
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaబిలహరిbilahari
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviతెలిసే వగలెల్ల బాగాయెరా
బల్కేవు ఏలాగు సహింతురా
telisE vagalella bAgAyerA
balkEvu ElAgu sahimturA
అనుపల్లవి anupallavi
చరణం
charaNam 1
నన్నే నిరాకరించి ఏ వేళ సవతితో
ఉల్లాస సల్లాప మోహ మాట పాట చాలు
nannE nirAkarimchi E vELa savatitO
ullAsa sallApa mOha mATa pATa chAlu
చరణం
charaNam 2
చుక్కల రవముల పిక్కల కలకల
రవ్వల నే తాళ చామరాజ ఈ పలుకు
chukkala ravamula pikkala kalakala
ravvala nE tALa chAmarAja I paluku

#266 ముట్టవద్దురా muTTavaddurA

Titleముట్టవద్దురాmuTTavaddurA
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaసావేరిsAvEri
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviముట్టవద్దురా మోహనాంగ నన్నిపుడుmuTTavaddurA mOhanAmga nannipuDu
అనుపల్లవి anupallaviకట్టు జేసి యుండగ వట్టి వాదులాడుచుkaTTu jEsi yumDaga vaTTi vAdulADuchu
చరణం
charaNam 1
ఆ సవతి పైట దీసి జూచుచు
సంతోషము మాటలాడుచు
బాసలిచ్చి నా చేత
A savati paiTa dIsi jUchuchu
samtOshamu mATalADuchu
bAsalichchi nA chEta
చరణం
charaNam 2
మందయాన మోవి విందులాడిన నా
బంధము తీరిన గంధములంది నా చేత
mamdayAna mOvi vimdulADina nA
bamdhamu tIrina gamdhamulamdi nA chEta
చరణం
charaNam 3
కాముకేళిలోనే కామి నిన్నే చాల
ప్రేమతో గూడేలిన చామభూపాలుని చేత
kAmukELilOnE kAmi ninnE chAla
prEmatO gUDElina chAmabhUpAluni chEta

#265 వాని పొందు vAni pomdu

Titleవాని పొందుvAni pomdu
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaకానడkAnaDa
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviవాని పొందు చాలు వద్దనే
వనితామణి అల
vAni pomdu chAlu vaddanE
vanitAmaNi ala
అనుపల్లవి anupallaviచాన మాటలెల్ల దాని సదనమే
సతమనుచుడుండిన
chAna mATalella dAni sadanamE
satamanuchuDumDina
చరణం
charaNam 1
కమ్మ విల్తుడేయు అమ్ముల పోటున
రొమ్మున నాటిన కమ్మ వ్రాసిచ్చిన
కొమ్మనంపి వేగ తోడి తెమ్మ
నిన్నే దాని పొమ్మని బల్కిన
kamma viltuDEyu ammula pOTua
rommuna nATina kamma vrAsichchina
kommanampi vEga tODi temma
ninnE dAni pommani balkina
చరణం
charaNam 2
కామకేళి యందు నన్ను కౌగలించేలిన
కోమలాంగుడౌ మా చామ భూపాలుడు
ఏమో నేరమించినాడు
నామమంటిగాక ప్రేమ మరచిన
kAmakELi yamdu nannu kaugalimchElina
kOmalAmguDau mA chAma bhUpAluDu
EmO nEramimchinADu
nAmamamTigAka prEma marachina
Amma knows this one. Search in Google

#264 మోస జేసేనే వాడు mOsa jEsEnE vADu

Titleమోస జేసేనే వాడుmOsa jEsEnE vADu
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమోస జేసేనే వాడు బలుmOsa jEsEnE vADu balu
అనుపల్లవి anupallaviపలుమారు నాతో బాసలాడుచు బలుpalumAru nAtO bAsalADuchu balu
చరణం
charaNam 1
విరిశయ్యపై సరసంబుతో
కరమిచ్చి కౌగిట జేర్చి యా
విరిబోణి నెంచి వో లేచి నేగుచు
viriSayyapai sarasambutO
karamichchi kaugiTa jErchi yA
viribONi nemchi vO lEchi nEguchu
చరణం
charaNam 2
కామకేళిలో సరసమివ్వగనే
రమ్యమించి రంజిల్లు చుండె
సమయమెరిగి చామ రాజసోముడు
kAmakELilO sarasamivvaganE
ramyamimchi ramjillu chumDe
samayamerigi chAma rAjasOmuDu
చరణం
charaNam 3
కడు ప్రీతి నా యెడజేర్చి జాడల మాటలాడుచు
నుండగా నెడబాసి ఈడ చెడ పాలు జేసి బలు
kaDu prIti nA yeDajErchi jADala mATalADuchu
numDagA neDabAsi IDa cheDa pAlu jEsi balu

#263 వెగటాయెగదే vegaTAyegadE

TitleవెగటాయెగదేvegaTAyegadE
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaజంజుటిjamjuTi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviవెగటాయెగదే చెలి వానికిvegaTAyegadE cheli vAniki
అనుపల్లవి anupallaviమగువ యెవతె బోధించెనో తెలియదుగాmaguva yevate bOdhimchenO teliyadugA
చరణం
charaNam 1
పాపపు మారుడు పూశరముకైనను
బాయకనె నహి పాడుపడు
ప్రియుడౌ మనమోహనాంగునికి
pApapu mAruDu pUSaramukainanu
bAyakane nahi pADupaDu
priyuDau manamOhanAmguniki
చరణం
charaNam 2
ధరణిలో నృప చామేంద్రుడు
సారెకు నను జేరి వుచందరిలో
నులక జేయ మనను
dharaNilO nRpa chAmEmdruDu
sAreku nanu jEri vuchamdarilO
nulaka jEya mananu
చరణం
charaNam 3
బాల సుధాకరుడు చాన నీ మోమని వాలకయే
నన్ను జూచుచును కలకాలము ద్రోసిన దొరకు
bAla sudhAkaruDu chAna nI mOmani vAlakayE
nannu jUchuchunu kalakAlamu drOsina doraku