#205 నీ తోటి nI tOTi

Titleనీ తోటిnI tOTi
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
నీతోటి మాటలు నాకేలరా సామి
నాతోటి మాటలు నీకేలర
నే తాళ దానితో ఖాతలు నీకేల
ప్రీతిగల నాతియని పోతివి రాతిరి
nItOTi mATalu nAkElarA sAmi
nAtOTi mATalu nIkElara
nE tALa dAnitO khAtalu nIkEla
prItigala nAtiyani pOtivi rAtiri
చరణం
charaNam 1
పరువటరా నాతో పనులేమిరా సామి
పరువటరా నాతో పనులేమిరా
విరజాజి బంతులు విసరకురా సామి
సరసము విరసమౌ చాలుర చాలుర
paruvaTarA nAtO panulEmirA sAmi
paruvaTarA nAtO panulEmirA
virajAji bamtulu visarakurA sAmi
sarasamu virasamau chAlura chAlura
చరణం
charaNam 2
ఒయ్యార మిదియేమి యూరుకోరా సామి
యొయ్యార మెదియేమి యూరుకోర
యుయ్యల మంచము నూచకురా యిది
కయ్యాల గయ్యాళ అయ్యయ్యో అయ్యయ్యో
oyyAra midiyEmi yUrukOrA sAmi
yoyyAra mediyEmi yUrukOra
yuyyala mamchamu nUchakurA yidi
kayyAla gayyALa ayyayyO ayyayyO
చరణం
charaNam 3
వేసమా వల్లూరి వేణుగోపసామి
వేసమా వల్లూరి వేణుగోపా
దాసు శ్రీరాముని భాసుర వాక్యము
చేసెరా వెయివేలు సేబాసు సేబాసు
vEsamA vallUri vENugOpasAmi
vEsamA vallUri vENugOpA
dAsu SrIrAmuni bhAsura vAkyamu
chEserA veyivElu sEbAsu sEbAsu

#204 యెంత మోహ yemta mOha

Titleయెంత మోహ (ప్రతి)yemta mOha (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaకాంబోదిkAmbOdi
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
యెంత మోహపరచినావు
యేమి సేతుర నన్నెం
కంతుకేళిలోన నన్ను గలసి మెలసి వలపు గలిగి
yemta mOhaparachinAvu
yEmi sEtura nannem
kamtukELilOna nannu galasi melasi valapu galigi
చరణం
charaNam 1
కుక్కటాహి బంధములను గూడువేళలా
మక్కువ పెంపెక్కగ రతి స్రుక్కజేసి నిక్కముగ
kukkaTAhi bandhamulanu gUDuvELalA
makkuva pempekkaga rati srukkajEsi nikkamuga
చరణం
charaNam 2
చాల నిన్ను కనుల జూడక తాళజాల నీ
వేళ బోవుననుచు నెంతో నేర్పు మాటలాడుచు
chAla ninnu kanula jUDaka tALajAla nI
vELa bOvunanuchu nemtO nErpu mATalADuchu
చరణం
charaNam 3
రేపలె పట్టణ లలామ గోపాల బాలుడ
ఆ పడతి గూడి నేడు అయ్యయ్యో నన్ను విడనాడితి
rEpale paTTaNa lalAma gOpAla bAluDa
A paDati gUDi nEDu ayyayyO nannu viDanADiti

#203 యేమి సేతు yEmi sEtu

Titleయేమి సేతుyEmi sEtu
Written By
BookprAchIna-navIna
రాగం rAgaకాంబోదిkAmbOdi
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
యేమి సేతు యెటుల సైతు
మరులు తాళలేనుర
yEmi sEtu yeTula saitu
marulu tALalEnura
సామి ధర్మపుర నివాస
సమయము నన్నేలుకోర
sAmi dharmapura nivAsa
samayamu nannElukOra
చరణం
charaNam 1
పిలువ బిగువు చేసేది మేరగాదురా
అలుక నాటి సుఖము గోరి
చెలువుడ దయసేయు మిటుల
piluva biguvu chEsEdi mEragAdurA
aluka nATi sukhamu gOri
cheluvuDa dayasEyu miTula
చరణం
charaNam 2
రామప్రాణసఖిని బాసి
రాముడెటుల తాళెనో
ప్రేమ మాటలాడిన సామి
చేర రారా యిపుడు
rAmaprANasakhini bAsi
rAmuDeTula tALenO
prEma mATalADina sAmi
chEra rArA yipuDu
చరణం
charaNam 3
మాటిమాటికి నీయడ మట్టు విడువ బాగాయె
గట్టు విల్తుని పగతుడిపుడు
మట్టు మీరి వచ్చెనయ్యయ్యో
mATimATiki nIyaDa maTTu viDuva bAgAye
gaTTu viltuni pagatuDipuDu
maTTu mIri vachchenayyayyO

#202 వచ్చితె vachchite

Titleవచ్చితె (ప్రతి)vachchite (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaఫరజుfaraju
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
వచ్చితె మేలాయర
వహ్వవా మెచ్చవచ్చుర
vachchite mElAyara
vahvavA mechchavachchura
మచ్చికతో మదివచ్చి యిచ్చోటికిmachchikatO madivachchi yichchOTiki
చరణం
charaNam 1
అలదానిగూడి నీవట కాపురముగా
నిలిచెదవని నిన్నెదబూని దలచితి
పలుమరు వలపు గలిగి యిటు
aladAnigUDi nIvaTa kApuramugA
nilichedavani ninnedabUni dalachiti
palumaru valapu galigi yiTu
చరణం
charaNam 2
చక్కని మోవిని నొక్కుచు వేగమే
పక్కను జేరి చెక్కులు జీరి
యక్కున జేర్చి రతి స్రుక్కించిన మక్కువచే
chakkani mOvini nokkuchu vEgamE
pakkanu jEri chekkulu jIri
yakkuna jErchi rati srukkinchina makkuvachE
చరణం
charaNam 3
ధైర్య పిఠాపురి ధాముడవౌ శ్రీ
సూర్యరాయసుగుణ విధేయ
చర్యనుతించిన నీ పర్యాయమాశ్చర్యమాయ
dhairya piThApuri dhAmuDavau SrI
sUryarAyasuguNa vidhEya
charyanutimchina nI paryAyamAScharyamAya

#201 వలచితే valachitE

TitleవలచితేvalachitE
Written By
BookprAchIna-navIna
రాగం rAgaఫరజుfaraju
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
వలచితే యింత చలమేల రారా సామిvalachitE yimta chalamEla rArA sAmi
చెలువుడనుచు మది దలచి దలచి నినుcheluvuDanuchu madi dalachi dalachi ninu
చరణం
charaNam 1
మక్కువతో నా మనసిటు నిల్వక
మిక్కిలి వేడితి తామసమేలర
యెక్కువ మమతతొ బిలచిన బలుకవు
makkuvatO nA manasiTu nilvaka
mikkili vEDiti tAmasamElara
yekkuva mamatato bilachina balukavu
చరణం
charaNam 2
వెన్నెల రేయిని వేడిని తాళను నిన్నటి మాటలు సేయకురా సామి
నిన్నెడబాసి నే నిముసము తాళర
vennela rEyini vEDini tALanu ninnaTi mATalu sEyakurA sAmi
ninneDabAsi nE nimusamu tALara
చరణం
charaNam 3
ధర భీమేశుడ నేరము లెంచకు
సారస నేత్రుడ సమ్మతమా సామి
యేర సుందరాకార నిన్నే నేమముతో
dhara bhImESuDa nEramu lemchaku
sArasa nEtruDa sammatamA sAmi
yEra sumdarAkAra ninnE nEmamutO

#200 యెంత మోహ yemta mOha

Titleయెంత మోహ (ప్రతి)yemta mOha (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
యెంత మోహాపరచినాడే యేమి సేతునే
నన్నింత సంతతము విడనిబాస సల్పి కాంతుడు
yemta mOhAparachinADE yEmi sEtunE
nannimta samtatamu viDanibAsa salpi kAmtuDu
చరణం
charaNam 1
పట్టిరట్టు కెట్టవద్దు గట్టు గుబ్బెత నన్నిట్టులాడి తానట్టెజేరి చన్నుగవ బట్టి నవ్వుచుpaTTiraTTu keTTavaddu gaTTu gubbeta nanniTTulADi tAnaTTejEri channugava baTTi navvuchu
చరణం
charaNam 2
మక్కువ పెంపెక్కగ రతిస్రుక్క జేయుచు నా
పక్కడాయుచు చక్కని కెమ్మోవి పంట నొక్కి స్రొక్కుచు
makkuva pempekkaga ratisrukka jEyuchu nA
pakkaDAyuchu chakkani kemmOvi pamTa nokki srokkuchu
చరణం
charaNam 3
రావు సూర్యరాయ మహరాజధీరుడే
భావజాకారుడే ఆ వనిత గూడి నేడు అయ్యయో రాడే
rAvu sUryarAya maharAjadhIruDE
bhAvajAkAruDE A vanita gUDi nEDu ayyayO rADE

#199 ముద్దుబెట్టి muddubeTTi

Titleముద్దుబెట్టి muddubeTTi
Written By
BookprAchIna-navIna
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
ముద్దుబెట్టి పోయినాడే
మోహనంగిరో నాకొక
muddubeTTi pOyinADE
mOhanangirO nAkoka
చరణం
charaNam 1
సద్దుసేయ వద్దనుచు సైగ జేయుచు
నాడొక టక్కులొల్క వాడు
నాదుపక్కలో జేరి వలపెక్కగ గోరి
చెక్కులోన చెక్కు జేర్చి
మ్రొక్కివేడుచు నాకొక
saddusEya vaddanuchu saiga jEyuchu
nADoka Takkulolka vADu
nAdupakkalO jEri valapekkaga gOri
chekkulOna chekku jErchi
mrokkivEDuchu nAkoka
చరణం
charaNam 2
కప్పురంపు విడెమిచ్చి కొప్పును బెట్టి తల
త్రిప్పగ తట్టి సర్పవేణి యేరితోడ చెప్పవద్దని నాకొక
kappurampu viDemichchi koppunu beTTi tala
trippaga taTTi sarpavENi yEritODa cheppavaddani nAkoka

#198 కోపము జేసేవేలర kOpamu jEsEvElara

Titleకోపము జేసేవేలర (ప్రతి)kOpamu jEsEvElara (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
కోపము జేసేవేలర సామిగా యింతkOpamu jEsEvElara sAmigA yimta
ప్రాపుగోరి నే యుంటిరprApugOri nE yumTira
చరణం
charaNam 1
చిన్ననాటనుండి నిన్ను
నమ్మి యున్న కన్నెను గానటర
chinnanATanumDi ninnu
nammi yunna kannenu gAnaTara
చరణం
charaNam 2
వన్నెకాడ వలచియున్న
చిన్నదియని కన్నడ శాయకుర
vannekADa valachiyunna
chinnadiyani kannaDa SAyakura
చరణం
charaNam 3
యెన్నడు నిన్ను బాసియున్న
దానగాను సన్నుతి గైకొనరా
yennaDu ninnu bAsiyunna
dAnagAnu sannuti gaikonarA
చరణం
charaNam 4
ధరణిశ్రీ సూర్యరాయ దానరాధేయ
సరసుడనయ విధేయా
dharaNiSrI sUryarAya dAnarAdhEya
sarasuDanaya vidhEyA

#197 మాట్లాడవెందుకురా mATlADavendukurA

Titleమాట్లాడవెందుకురాmATlADavendukurA
Written By
BookprAchIna-navIna
రాగం rAgaకమాసు kamAsu
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
మాట్లాడవెందుకురా సామిగ నాతోmATlADavendukurA sAmiga nAtO
అరమర యిక యేలర సామిaramara yika yElara sAmi
చరణం
charaNam 1
చిరుత ప్రాయమునాడు చేసిన చెలిమిని
మరచుట తగునటరా సామి
chiruta prAyamunADu chEsina chelimini
marachuTa tagunaTarA sAmi
చరణం
charaNam 2
సొగసుగ నిను జూచి సోలి వచ్చినదాని
అగడేల జేసేవుర సామి
sogasuga ninu jUchi sOli vachchinadAni
agaDEla jEsEvura sAmi
చరణం
charaNam 3
వరభీమేశుని వలచిన దానర
సరసతో నన్నేలరా సామి
varabhImESuni valachina dAnara
sarasatO nannElarA sAmi

#196 జాలమిదేర jAlamidEra

Titleజాలమిదేర (ప్రతి)jAlamidEra (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
జాలమిదేర సరసకు రార
బాలామణి నిను బ్రార్థించెనుర
jAlamidEra sarasaku rAra
bAlAmaNi ninu brArthinchenura
చరణం
charaNam 1
యెమ్మెకాడ నిను రమ్మని ముద్దుల
గుమ్మ రమ్మ నీకిమ్మని బంపెను
yemmekADa ninu rammani muddula
gumma ramma nIkimmani bampenu
చరణం
charaNam 2
కమ్మవిల్తుడు శరమ్ము వేయు
మది నమ్మి నిన్ను పొమ్మనరమ్మనే
kammaviltuDu Sarammu vEyu
madi nammi ninnu pommanarammanE
చరణం
charaNam 3
యింతి రావిరుల బంతి రామరుని
దంతి రాడగు పొలంతిరా వినర
yimti rAvirula banti rAmaruni
damti rADagu polamtirA vinara
చరణం
charaNam 4
రావుకులజ మహరాజ కుమార
పావన సూర్యనృపాలక యేరా
rAvukulaja maharAja kumAra
pAvana sUryanRpAlaka yErA