| Title | మాటలేల (ప్రతి) | mATalEla (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | సురట | suraTa |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | మాటలేల చాలుచాలుర నా సామి | mATalEla chAluchAlura nA sAmi |
| బోటి తోడను పొందుగాను భోగించినావేమిర | bOTi tODanu pomdugAnu bhOgimchinAvEmira | |
| చరణం charaNam 1 | మాటికి కుంకుమ మైజారెనురా కాటుక రెప్పల కంటినదేరా యేటికి భ్రమ మదియేరా జాడ దెల్పర | mATiki kumkuma maijArenurA kATuka reppala kamTinadErA yETiki bhrama madiyErA jAda delpara |
| చరణం charaNam 2 | చిందిన గంధపు పూతలవేరా చెక్కిట చెమటలు బుట్టునదేరా సుందర నీ యధరమందు పలునొక్కులుర | chimdina gamdhapu pUtalavErA chekkiTa chemaTalu buTTunadErA sumdara nI yadharamamdu palunokkulura |
| చరణం charaNam 3 | కన్నుల నిద్దుర మబ్బులవేరా కరుణాకర సూర్యప్రభువౌర చిన్నెలు జూచి సంతసించితినేర పోపోరా | kannula niddura mabbulavErA karuNAkara sUryaprabhuvaura chinnelu jUchi samtasimchitinEra pOpOrA |
Category: Javali
#193 మాయలాడి mAyalADi
| Title | మాయలాడి | mAyalADi |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | సురట | suraTa |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | మాయలాడి బోధనచే మయిమరచితి వేమొ మాటలాడ రావదేమిరా నా సామి | mAyalADi bOdhanachE mayimarachiti vEmo mATalADa rAvadEmirA nA sAmi |
| చరణం charaNam 1 | కాయజు బారికి తాళగలేరా కౌగిట జేర్చి నన్ను గారవించరా న్యాయమటరా నీకిది తగదుర సరగున | kAyaju bAriki tALagalErA kaugiTa jErchi nannu gAravimcharA nyAyamaTarA nIkidi tagadura saraguna |
| చరణం charaNam 2 | కలకాలము నన్ను గాసిబెట్టకురా కాంతల నేచుట కార్యము గాదుర చెలువుడవని నిను నెరనమ్మినందుకిక | kalakAlamu nannu gAsibeTTakurA kAmtala nEchuTa kAryamu gAdura cheluvuDavani ninu neranamminandukika |
| చరణం charaNam 3 | సరివారిలో నన్ను చౌక సేయకురా చాల నమ్మితి రతికేళి గూడర వరదుడ మువ్వపురి నిలయుడ చనువున | sarivArilO nannu chouka sEyakurA chAla nammiti ratikELi gUDara varaduDa muvvapuri nilayuDa chanuvuna |
#192 కాంతుడేమొ kAmtuDEmo
| Title | కాంతుడేమొ (ప్రతి) | kAmtuDEmo (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | కాంతుడేమొ రాకపోయె కాంత నేనెటు సైతునే | kAmtuDEmo rAkapOye kAmta nEneTu saitunE |
| పంతమేల మర్త్యలోక భూపాల వరుని రమ్మనే | pamtamEla martyalOka bhUpAla varuni rammanE | |
| చరణం charaNam 1 | మరుడు క్రూరుడై సారెకు విరిశరముల నేసెనే సురుచిర మధుకరములగమి జుమ్మని రొదజేసెనే | maruDu krUruDai sAreku viriSaramula nEsenE suruchira madhukaramulagami jummani rodajEsenE |
| చరణం charaNam 2 | శుకపికములు కలకలమని సుదతి మిగుల గూశెనే మకరాంకుని మామయు సెగ మైసోకగ గాశెనే | Sukapikamulu kalakalamani sudati migula gUSenE makarAmkuni mAmayu sega maisOkaga gASenE |
| చరణం charaNam 3 | ధరణి పీఠపుర నిలయుని తరుణి సూర్యనృపవరుని మరుని దురమొనరసేయుట కరమరేల దోడితేవే | dharaNi pIThapura nilayuni taruNi sUryanRpavaruni maruni duramonarasEyuTa karamarEla dODitEvE |
#191 అంతలోనె amtalOne
| Title | అంతలోనె | amtalOne |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | అంతలోనె తెల్లవారె అయ్యో నేనేమి సేతునే | amtalOne tellavAre ayyO nEnEmi sEtunE |
| కాంతుని మనసెంత నొచ్చెనో ఇంతి యెట్లు సైతునే | kAmtuni manasemta nochchenO imti yeTlu saitunE | |
| చరణం charaNam 1 | కొమ్మ గుబ్బ వెదను గదియ నదుముకొనుచు చాలా పెదవి తేనె వాన నా మదిని తోచు వేళ | komma gubba vedanu gadiya nadumukonuchu chAlA pedavi tEne vAna nA madini tOchu vELa |
| చరణం charaNam 2 | పంతమున తటాన లేచి పైట కొంగు జారగా కాంత దొంతర విడమొసంగి కౌగిలింపుచుండగా | pamtamuna taTAna lEchi paiTa kongu jAragA kAmta domtara viDamosamgi kaugilimpuchunDagA |
| సోమభూపాల రమ్మని భామ ప్రేమమీరగా కాముకేళి లోన మిగుల కలసి మెలసి యుండగా | sOmabhUpAla rammani bhAma prEmamIragA kAmukELi lOna migula kalasi melasi yumDagA | |
#190 చాలు చాలిక chAlu chAlika
| Title | చాలు చాలిక (ప్రతి) | chAlu chAlika (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | చాలు చాలిక పోరా నా సామి నీ జాడలు జక్కగ గానవచ్చెరా | chAlu chAlika pOrA nA sAmi nI jADalu jakkaga gAnavachcherA |
| చరణం charaNam 1 | కేళిజేసేదందు కేరడమిందు బాళి చూపేదందు బాసలిందు చాలులేరా సరసుడౌర యిది మేలవుర యెంతో వింతలాయర | kELijEsEdamdu kEraDamimdu bALi chUpEdamdu bAsalimdu chAlulErA sarasuDaura yidi mElavura yemtO vimtalAyara |
| చరణం charaNam 2 | దయనేలెదందు తామసమిందు బయలు నాటలందు భయమిందు దయలేదా నా తోడ వాదా చలమిడరాదా ఓ నయగుణ విశారదా | dayanEledamdu tAmasamimdu bayalu nATalamdu bhayamimdu dayalEdA nA tODa vAdA chalamiDarAdA O nayaguNa viSAradA |
| చరణం charaNam 3 | ఘన పాటలందు కయ్యము నిందు మనవి జేసే దందు మాదీవిందు వినుము సూర్యభూపతివర్య సురగిరి ధైర్య శ్రీ ఘన సమౌదార్య చాలు చాలిక పోరా | ghana pATalamdu kayyamu nimdu manavi jEsE damdu mAdIvimdu vinumu sUryabhUpativarya suragiri dhairya SrI ghana samoudArya chAlu chAlika pOrA |
#189 యిన్నాళ్ళవలె yinnALLavale
| Title | యిన్నాళ్ళవలె | yinnALLavale |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | యిన్నాళ్ళ వలెగాదె వాని గుణమెంతని నే విన్నవింతునే ఓ చెలియ | yinnALLa valegAde vAni guNamentani nE vinnavimtunE O cheliya |
| చరణం charaNam 1 | నన్నెడబాయడు అన్యుల జూడడు మన్నన వీడడు మానిని మణిరో వన్నెకాడే వాడెందున్నాడే వాడన్నిట నెరజాణుడే | nanneDabAyaDu anyula jUDaDu mannana vIDaDu mAnini maNirO vannekADE vADemdunnADE vADanniTa nerajANuDE |
| చరణం charaNam 2 | తామస మేలనె తాళగజాలనె కోమలి నీ మది కోరిన సొమ్ములు చేకొనవే వేగరావే వేగ తోడి తేవే నా సామినిటు రమ్మనవే | tAmasa mElane tALagajAlane kOmali nI madi kOrina sommulu chEkonavE vEgarAvE vEga tODi tEvE nA sAminiTu rammanavE |
| చరణం charaNam 3 | ఆందముగా రతి ముందుగ నేలిన సుందర శ్యామల వేంకటరమణుడు నెనరున కలిశిన నేదానగాన ఓ మదగజగమనరో | AmdamugA rati mumduga nElina sumdara SyAmala vEmkaTaramaNuDu nenaruna kaliSina nEdAnagAna O madagajagamanarO |
#188 బాగాయెనిక bAgAyenika
| Title | బాగాయెనిక (ప్రతి) | bAgAyenika (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | బాగాయెనిక చాలుర సామి | bAgAyenika chAlura sAmi |
| చరణం charaNam 1 | నాయక యొక్క ముద్దు నాకిడుమనిన రోసి యా యువిదను జూచితి యా యువిదను జూచితి | nAyaka yokka muddu nAkiDumanina rOsi yA yuvidanu jUchiti yA yuvidanu jUchiti |
| చరణం charaNam 2 | యింటికి రమ్మనియెనని నగసరి దా నింటికేగ జూచితి యింటికేగ జూచితి | yimTiki rammaniyenani nagasari dA nimTikEga jUchiti yimTikEga jUchiti |
| చరణం charaNam 3 | యిసుమంత ననుగూడి యింటికి బొమ్మని యా కుసుమ గంధిని గూడితి ఆ కుసుమగంధిని గూడితి | yisumamta nanugUDi yimTiki bommani yA kusuma gamdhini gUDiti A kusumagamdhini gUDiti |
| చరణం charaNam 4 | సుస్థిర రావుకుల సూర్యభూపతి వర స్వస్థత జెందితిర స్వస్థత జెందితిర | susthira rAvukula sUryabhUpati vara swasthata jemditira swasthata jemditira |
#187 ప్రొద్దాయె proddAye
| Title | ప్రొద్దాయె | proddAye |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ప్రొద్దాయె నికజాలుర సామి యిక | proddAye nikajAlura sAmi yika |
| చరణం charaNam 1 | అత్తరు మెడబూసి అడ్డగించేవు సామి అత్తింటి కోడాలురా నిజముగ అత్తింటి కోడాలురా | attaru meDabUsi aDDagimchEvu sAmi attimTi kODAlurA nijamuga attimTi kODAlurA |
| చరణం charaNam 2 | పావడ నీ చేతితో బట్ట వచ్చేవురా పోవలెను మ్రొక్కేనుర నిజముగ | pAvaDa nI chEtitO baTTa vachchEvurA pOvalenu mrokkEnura nijamuga |
| చరణం charaNam 3 | కోపగించకు నాపై బాలచంద్రసామి రేపు వస్తానులేర నిజముగ | kOpaginchaku nApai bAlachandrasAmi rEpu vastAnulEra nijamuga |
#186 యేమందునె yEmandune
| Title | యేమందునె (ప్రతి) | yEmandune (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | యేమందునె చెలియా నా సామిని యేమరదే మనసిక | yEmandune cheliyA nA sAmini yEmaradE manasika |
| చరణం charaNam 1 | నామనవాలించి నాధుడు గృపతో భామిని యేలినది దలచి యిక | nAmanavAlinchi nAdhuDu gRpatO bhAmini yElinadi dalachi yika |
| చరణం charaNam 2 | గుబ్బలు చెణకుచు గోరి నా యధరము గొబ్బున పంట నొక్కిన యది దలచి | gubbalu cheNakuchu gOri nA yadharamu gobbuna pamTa nokkina yadi dalachi |
| చరణం charaNam 3 | కేళీగృహమున కీరవాణి రతి కేళిగూడిన హొయలు దలచి యిక | kELIgRhamuna kIravANi rati kELigUDina hoyalu dalachi yika |
| చరణం charaNam 4 | రావు కులజ సూర్యరాయ మహీపతి భావము నెంచిన నే తాళుదునే | rAvu kulaja sUryarAya mahIpati bhAvamu nemchina nE tALudunE |
#185 పోపొమ్మనే pOpommanE
| Title | పోపొమ్మనే | pOpommanE |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | పోపొమ్మనే పొమ్మనే వాని పొందేలనే మనకు అచటికి | pOpommanE pommanE vAni pomdElanE manaku achaTiki |
| చరణం charaNam 1 | పాపపు మోహము పాలుజేసి యా పాపిల్లు జేరెనే ప్రొద్దాయనె | pApapu mOhamu pAlujEsi yA pApillu jErenE proddAyane |
| చరణం charaNam 2 | యిన్ని దినములు వాడెందు రాకుండినన్ చిన్నబుచ్చినాడే నిర్దయుడే | yinni dinamulu vADendu rAkunDinan chinnabuchchinADE nirdayuDE |
| చరణం charaNam 3 | రేయి పగలతని రాక జూచి నా రాత యనుకొంటినె యేమందునె | rEyi pagalatani rAka jUchi nA rAta yanukomTine yEmandune |
| చరణం charaNam 4 | రంగనాథుడునే రంగుగ గూడి రంగము నెలకొననే అంతటనే | ranganAthuDunE ramguga gUDi ramgamu nelakonanE amtaTanE |