#10 చానరో వాని బాసి chAnarO vAni bAsi

Titleచానరో వాని బాసిchAnarO vAni bAsi
Written By
రాగం rAgaజంజూటిjanjUTi
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
చానరో వాని బాసి నే నెటువలె సయితునే
దాని బోధనలను వినుట మానేడేమిసేతునే
chAnarO vAni bAsi nE neTuvale sayitunE
dAni bOdhanalanu vinuTa mAnEDEmisEtunE
చరణం
charaNam 1
సన్నుతాంగి సరసుడని చాలనమ్మి యుంటినే
నిన్న దాని యింటజేరి యున్న వగలు వింటినే
sannutAngi sarasuDani chAlanammi yunTinE
ninna dAni yinTajEri yunna vagalu vinTinE
చరణం
charaNam 2
సదయుడు మదనుని బారికి ముదముతోనను బ్రోచెనే
వదలక తన ప్రాయమెల్ల సుదతి బాలు చేసెనే
sadayuDu madanuni bAriki mudamutOnanu brOchenE
vadalaka tana prAyamella sudati bAlu chEsenE
చరణం
charaNam 3
వాసవసుతుడైన శ్రీనివాసుడు ననుగూడెనె
బాసలెల్ల మరచి యా దోసకారి గూడెను
vAsavasutuDaina SrInivAsuDu nanugUDene
bAsalella marachi yA dOsakAri gUDenu

#8 నీ మోహ మిదేన nI mOha midEna

Titleనీ మోహ మిదేనnI mOha midEna
Written By
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
నీ మోహ మిదేన
నెలకొక సారిందువచ్చి నిలుచుట గాన
nI mOha midEna
nelakoka sArinduvachchi niluchuTa gAna
చరణం
charaNam 1
తీర తీర మమత మదికి దెలిసెను నాడె
తీరున నే నడుచుకొందు యెప్పటి జాడా
tIra tIra mamata madiki delisenu nADe
tIruna nE naDuchukondu yeppaTi jADA
చరణం
charaNam 2
బాళితీర మమత మదిని దానేనింక
యెల బొంకితివి నాతొ ఇంత పరాక
bALitIra mamata madini dAnEninka
yela bonkitivi nAto inta parAka

#7 పో పొమ్మనే pO pommanE

Titleపో పొమ్మనేpO pommanE
Written By
రాగం rAgaసురటsuraTa
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
పో పొమ్మనే పొమ్మనె భామరొవానిpO pommanE pommane bhAmarovAni
చరణం
charaNam 1
పొలతిరో చెలువున పోగడు దానింటికి
కలకాలమునను కలసిన మోహ
తలచనవాని పొందు తగదు తగదుయిక
polatirO cheluvuna pOgaDu dAninTiki
kalakAlamunanu kalasina mOha
talachanavAni pondu tagadu tagaduyika
చరణం
charaNam 2
పగదానిని నా యెదురుగ బొగదుచు
జగడము చేయు వాని చెలిమి వలదుయిక
pagadAnini nA yeduruga bogaduchu
jagaDamu chEyu vAni chelimi valaduyika
చరణం
charaNam 3
వరభీమేశుని వంచన దెలిసెను
మరి మరి నాపయి మమత చాలునిక
varabhImESuni vanchana delisenu
mari mari nApayi mamata chAlunika

#4 ఈ విరహమెటులోర్తునె I virahameTulOrtune

Titleఈ విరహమెటులోర్తునెI virahameTulOrtune
Written By
రాగం rAgaబ్యాగ్byAg
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
ఈ విరహ మెటులోర్తునె చెలియాI viraha meTulOrtune cheliyA
చరణం
charaNam 1
నేమిసేతు నా మనోహరుండు రాడటే
సామికేమిటారిదూరు విప్పెనె చెలియా
nEmisEtu nA manOharunDu rADaTE
sAmikEmiTAridUru vippene cheliyA
చరణం
charaNam 2
యెందాక సైతు వానిబాసి యీ సుమశరుని
చిగురాకు బాకుచే కుచంబుదాకెనె చెలియ
yendAka saitu vAnibAsi yI sumaSaruni
chigurAku bAkuchE kuchambudAkene cheliya
చరణం
charaNam 3
రతికేళి వేళ నేలనో మరాళి గామిని
నే తాళజాల బాలచంద్ర సామిని బాసి
ratikELi vELa nElanO marALi gAmini
nE tALajAla bAlachandra sAmini bAsi

#3 ఇందుముఖి indumukhi

Titleఇందుముఖిindumukhi
Written By
రాగం rAgaబ్యాగ్byAg
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
ఇందుముఖి వానికీ మన సిందులేదాయ
ఏమందునె మాయవాడిందు రాడాయ
indumukhi vAnikI mana simdulEdAya
Emamdune mAyavADimdu rADAya
చరణం
charaNam 1
చక్కెర విలుకాని పోరు యెక్కువలాయ
చక్కనగాదని దెలిసే చానలేదాయ ఏమందునె మాయ
chakkera vilukAni pOru yekkuvalAya
chakkanagAdani delisE chAnalEdAya Emamdune mAya
చరణం
charaNam 2
ఆశతో మును పాటినట్టి బాసలేమాయ దోసకారి
బోధన విని మోసములాయ యేమందునెమాయ
ASatO munu pATinaTTi bAsalEmAya dOsakAri
bOdhana vini mOsamulAya yEmandunemAya
చరణం
charaNam 3
వెంకటరమణునికి నాపై బింకములాయ
పొంకముతో నన్ను గూడ వా
డింకరుదాయ యేమందు నెమాయ
venkaTaramaNuniki nApai binkamulAya
ponkamutO nannu gUDa vA
DinkarudAya yEmandu nemAya

#2 చెలి మనక్యాల cheli manakyAla

Titleచెలి మనక్యాలcheli manakyAla
పుస్తకం Book#Book1900
Written By
రాగం rAgaఇందుస్తాని కాపిimdustAni kApi
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
చెలి మనక్యాల వానితోను పొందు చాలునే
వాని పొందు చాలునే వానితోను పొందు చాలునే
cheli manakyAla vAnitOnu pomdu chAlunE
vAni pomdu chAlunE vAnitOnu pomdu chAlunE
చరణం
charaNam 1
అక్కర మరి తీరిన పక్కకు రానివ్వడే
పక్కకు రానివ్వడలవాని పక్కకు మరిజేర్చడే
akkara mari tIrina pakkaku rAnivvaDE
pakkaku rAnivvaDalavAni pakkaku marijErchaDE
చరణం
charaNam 2
ఎంగిలి కొనియాడువాని రంగు విడమ్యాలనే
రంగువీడమ్యాలనే వాని యెంగిలి మనక్యాలనే
engili koniyADuvAni ramgu viDamyAlanE
ramguvIDamyAlanE vAni yemgili manakyAlanE
చరణం
charaNam 3
కనికర మెంచిన కౌగలింపు యాలనే
ఉగ్గలింపు యాలనే వానికవుగిట మనక్యాలనే
kanikara menchina kaugalimpu yAlanE
uggalimpu yAlanE vAnikavugiTa manakyAlanE
చరణం
charaNam 4
మర్మమెల్ల యెరిగిన శ్రీధర్మపురీవాసుడే
ధర్మపురివాసుడె ఆ కన్యల కేకాంతుడే
marmamella yerigina SrIdharmapurIvAsuDE
dharmapurivAsuDe A kanyala kEkAmtuDE

#1 ఓ రమణీ మణీ O ramaNI maNI

Titleఓ రమణీ మణీO ramaNI maNi
పుస్తకం Book#Book1900
Written By
రాగం rAgaహరి కాంభోజిhari kAmbhOji
తాళం tALaచాపుchApu
పల్లవి
pallavi
ఓ రమణీ మణీ సామిని త్యావేO ramaNI maNI sAmini tyAvE
అనుపల్లవి
anupallavi
సామిని త్యావే కామిని పోవేsAmini tyAvE kAmini pOvE
చరణం
charaNam 1
చక్కనివాడే అక్కరో వీడే
మక్కువ తోడనే పక్కకు త్యావే
chakkanivADE akkarO vIDE
makkuva tODanE pakkaku tyaavE
చరణం
charaNam 2
చల్లని సోముడు పల్లవి పాణుల
ఉల్లము రంజిల్ల వెన్నెల కాసెనే
challani sOmuDu pallavi pANula
ullamu ramjilla vennela kAsenE
చరణం
charaNam 3
భామామణి కాముని పోరున
వేమరు బాణము వేయగ తాళనె
bhAmAmaNi kAmuni pOruna
vEmaru bANamu vEyaga tALane
చరణం
charaNam 4
ధయరధ ధర్మ దురయందు నా
దొరయౌ పరవాసుని వేగమే
dhayaradha dharma durayamdu nA
dorayou paravAsuni vEgamE