| Title | మరియాదలింతైన | mariyAdalintaina |
| Written By | పల్లవి శేషయ్య | pallavi SEshayya |
| Book | unknown | |
| రాగం rAga | శంకరాభరణం | SankarAbharaNam |
| తాళం tALa | దివ్యసంకీర్ణ జంపె | divyasankIrNa jampe |
| పల్లవి pallavi | మరియాదలింతైన లేదేమిరా నీకు | mariyAdalintaina lEdEmirA nIku |
| అనుపల్లవి anupallavi | మరి రాత్రి వేళలో సుదతులను ముద్దు బెట్టేవు | mari rAtri vELalO sudatulanu muddu beTTEvu |
| చరణం charaNam 1 | పరిపరి విధముగ కౌగిటకు రమ్మనినావు పరకాంతలకు నేనే రమణు డనుచున్నావు కరమెత్తి మ్రొక్కేవా రురమునే నొక్కేవు — మధ్యమ కాలము — పర దైవము నేనేనని పరదారా సోదరుడని బొంకు లాడినావు విరిబోణుల కెల్ల పసిబిడ్డల నిచ్చిన శేషశయనుడని బిరుదా నీకు | paripari vidhamuga kaugiTaku rammaninAvu parakAntalaku nEnE ramaNu DanuchunnAvu karametti mrokkEvA ruramunE nokkEvu — madhyama kAlamu — para daivamu nEnEnani paradArA sOdaruDani bonku lADinAvu viribONula kella pasibiDDala nichchina SEshaSayanuDani birudA nIku |
Category: Lyrics
#361 ఏమి మాయమురా Emi mAyamurA
| Title | ఏమి మాయమురా | Emi mAyamurA |
| Written By | మీసు కృష్ణయ్యర్ | mIsu kRshNayyar |
| Book | unknown | |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏమి మాయమురా నన్నావరించేదేమి | Emi mAyamurA nannAvarinchEdEmi |
| అనుపల్లవి anupallavi | కామాదులెల్ల బాధించక నను ప్రేమమీర జూచి జూచి గావరాద | kAmAdulella bAdhinchaka nanu prEmamIra jUchi jUchi gAvarAda |
| చరణం charaNam 1 | హంసస్సోహ మంత్రముల నాశ్రయించి కంసాలివాని రవము జేసిన కంసాంతకుని దయ రాదేల పరమ హింసాత్మక సదాశివేంద్ర చంద్ర | hamsassOha mantramula nASrayinchi kamsAlivAni ravamu jEsina kamsAmtakuni daya rAdEla parama himsAtmaka sadASivEndra chandra |
#360 మగడూరలేడేమి magaDUralEDEmi
| Title | మగడూరలేడేడేమి | magaDUralEDEmi |
| Written By | unknown | |
| Book | unknown | |
| రాగం rAga | నాటకురంజి | nATakuranji |
| తాళం tALa | ఖండ చాపు | khanDa chApu |
| పల్లవి pallavi | మగడూరలేడేమి నే వత్తునా సుగుణుడైనాడొ గాని తెలివి లేనివాడు నీ | magaDUralEDEmi nE vattunA suguNuDainADo gAni telivi lEnivADu nI |
| అనుపల్లవి anupallavi | ఈ రేయి పెరటి వాకిలి తీయవే యే రాయియైనా కరగు చను కౌగిటకు | I rEyi peraTi vAkili tIyavE yE rAyiyainA karagu chanu kaugiTaku |
| చరణం charaNam 1 | దినకరోదయ పూర్వ పర్వమిదిగా జనులు తిరిగేవేళ నేనుండనే ఘనమేమి గాదు తనువేమి మారదు యీ పనులు తెలియనివాడు జగములో బ్రతుకడు | dinakarOdaya pUrva parvamidigA janulu tirigEvELa nEnunDanE ghanamEmi gAdu tanuvEmi mAradu yI panulu teliyanivADu jagamulO bratukaDu |
#359 చాలు చాలు పోరా chAlu chAlu pOrA
| Title | చాలు చాలు పోరా | chAlu chAlu pOrA |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ / సుబ్బారావు | dharmapuri subbarAyar / subbArAvu |
| Book | unknown | |
| రాగం rAga | అఠాణా | aThANA |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | చాలు చాలు పోరా నిర్ధనుడేల వచ్చితి కౌగలించి | chAlu chAlu pOrA nirdhanuDEla vachchiti kaugalinchi |
| చరణం charaNam 1 | రమ్మంటే వచ్చెడివాడు ఇమ్మంటే లేదనుట తరమా సొమ్ములియ్య చేతగాక కొమ్మలు కావలెనా నీకు | rammanTE vachcheDivADu immanTE lEdanuTa taramA sommuliyya chEtagAka kommalu kAvalenA nIku |
| చరణం charaNam 2 | దినమంత రతి బెనగి మతి చెడపినావే ఘనముగ ధర్మపురీశుడని పేరు పునుగు సుగంధము పూసినవాడు కొనకు తనువేగాని ధనమీయలేదు | dinamanta rati benagi mati cheDapinAvE ghanamuga dharmapurISuDani pEru punugu sugandhamu pUsinavADu konaku tanuvEgAni dhanamIyalEdu |
#358 వద్దంటినే గాని vaddanTinE gAni
| Title | వద్దంటినే గాని | vaddanTinE gAni |
| Written By | unknown | |
| Book | unknown | |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వద్దంటినే గాని వద్దంటినా ముద్దు వద్దంటినే గాని రావద్దంటినా | vaddanTinE gAni vaddanTinA muddu vaddanTinE gAni rAvaddanTinA |
| అనుపల్లవి anupallavi | ఇద్దరుండుట నొకరు జూచితె మన కిద్దరికి దెబ్బల పండగవును రావద్దంటినా | iddarunDuTa nokaru jUchite mana kiddariki debbala panDagavunu rAvaddanTinA |
| చరణం charaNam 1 | ఇంటికి వచ్చిన నా వెంటనె రానవు మంటెక్కును మా వారికి కంటిలో మాటగాని అంటుకొనే మాటలేదు బంటురీతి యుంటి మంచి దింతైన ముట్టు కొంత వద్దంటినిగా రావద్దంటినా | inTiki vachchina nA venTane rAnavu manTekkunu mA vAriki kanTilO mATagAni anTukonE mATalEdu banTurIti yunTi manchi dintaina muTTu konta vaddanTinigA rAvaddanTinA |
#357 పాలుమాలిక pAlumAlika
| Title | పాలుమాలిక | pAlumAlika |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | unknown | |
| రాగం rAga | రమా మనోహరి | ramA manOhari |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | పాలుమాలిక లేలనే గుణ శాలినీ నన్ను జేరుటకు | pAlumAlika lElanE guNa SAlinI nannu jEruTaku |
| అనుపల్లవి anupallavi | చాల కాలమేల మాటలేల పూలపాన్పు మీద పవ్వళించ | chAla kAlamEla mATalEla pUlapAn&pu mIda pavvaLimcha |
| చరణం charaNam 1 | బిగువింత తరముగాదు వగలేల రమా మనోహరీ మగువైన నన్ను జేరితే నీకే మగుతాలవనేశుని చేరుతు | biguvinta taramugAdu vagalEla ramA manOharI maguvaina nannu jEritE nIkE magutAlavanESuni chErutu |
#356 అడవి ముషిణికాయ aDavi mushiNikAya
| Title | అడవి ముషిణికాయ | aDavi mushiNikAya |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | ముఖారి | mukhAri |
| తాళం tALa | అట మిశ్రచాపు | aTa miSrachApu |
| పల్లవి pallavi | అడవి ముషిణికాయ యది నీకు ప్రియమాయె అయ్యో నేనేమందురా పడుచుతనము చేత భ్రమ జెందుటే గాని పడతి సుఖము లేదు పదరా నీలివార్త | aDavi mushiNikAya yadi nIku priyamAye ayyO nEnEmandurA paDuchutanamu chEta bhrama jenduTE gAni paDati sukhamu lEdu padarA nIlivArta |
| చరణం charaNam 1 | వింతవింతల మారి సంతమెరుగులాడి తంతర గొట్టుదిరా సంతోషమున దాని సరస జేరుటె గాని యింతి మంతనములు ఎంమావుల నీళ్ళు | vintavintala mAri santamerugulADi tantara goTTudirA santOshamuna dAni sarasa jEruTe gAni yinti mantanamulu em^mAvula nILLu |
| చరణం charaNam 2 | చేసితివౌ లేరా చెలియతో స్నేహము చేతి సంచి వెచ్చము ఆస చేత దాని నంట బోవుటె కాని కాసు జేయదు వట్టి కట్టు గారిడి సామీ | chEsitivau lErA cheliyatO snEhamu chEti sanchi vechchamu Asa chEta dAni nanTa bOvuTe kAni kAsu jEyadu vaTTi kaTTu gAriDi sAmI |
| చరణం charaNam 3 | కోపమెంచకు తోట్ల వల్లూరి శ్రీ వేణుగోపాల బాగాయెరా శ్రీ పూర్ణుడగు దాసు శ్రీరామకవి వాక్య వ్యాపారములు వేదాక్షరములు నమ్ము | kOpamenchaku tOTla vallUri SrI vENugOpAla bAgAyerA SrI pUrNuDagu dAsu SrIrAmakavi vAkya vyApAramulu vEdAksharamulu nammu |
This is the last jAvaLi from dAsu SrIrAmulu collection. We have access more works by him, but each one is marked as padamu or SringAra padyamu.
దాసు శ్రీరాములు గారిచే రచింపబడిన జావళీలలో ఇది ఆఖరిది. మాకు దొరికిన మరి కొన్ని రచనలు జావళీలుగా కాక, పదాలుగా లేదా శృంగార పద్యాలుగా చెప్పబడ్డాయి.
#355 మొట్టమొదట moTTamodaTa
| Title | మొట్టమొదట | moTTamodaTa |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | మొట్టమొదలు నట్టనడుము తుట్టతుదయు నెరుగనే యిట్టె వచ్చి విభుడు రాత్రి యేమి పనులు జేసెనో | moTTamodalu naTTanaDumu tuTTatudayu neruganE yiTTe vachchi vibhuDu rAtri yEmi panulu jEsenO |
| చరణం charaNam 1 | మోము మోము గదియ విభుడు ముద్దు పెట్టినంతలో భామ యేమొ కాని నేను పరవశమై యుంటినే | mOmu mOmu gadiya vibhuDu muddu peTTinamtalO bhAma yEmo kAni nEnu paravaSamai yunTinE |
| చరణం charaNam 2 | అట్టె విభుడు చన్నుదోయి బట్టి వచ్చినంతనే యెట్టి మాయయేమొ నాదు హృదయమైక్య మాయెనే | aTTe vibhuDu channudOyi baTTi vachchinamtanE yeTTi mAyayEmo nAdu hRdayamaikya mAyenE |
| చరణం charaNam 3 | భాసుర శ్రీ వేణుగోప బాలుడంతటి నంతనే దాసురామదాస చిత్త వాసి యనుకొంటినే | bhAsura SrI vENugOpa bAluDamtaTi nantanE dAsurAmadAsa chitta vAsi yanukonTinE |
#354 మనసిచ్చి నాతో manasichchi nAtO
| Title | మనసిచ్చి నాతో | manasichchi nAtO |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మనసిచ్చి నాతో మాటాడవేమిరా | manasichchi nAtO mATADavEmirA |
| చరణం charaNam 1 | మనవి వినరాదా మమత యింత లేదా మునుపటి చెల్మి కాదా మోదము కాదా | manavi vinarAdA mamata yinta lEdA munupaTi chelmi kAdA mOdamu kAdA |
| చరణం charaNam 2 | విను నేను బాలా విడనాడుట మేలా చనువుంచుమీ చాలా జాలమిదేలా | vinu nEnu bAlA viDanADuTa mElA chanuvunchumI chAlA jAlamidElA |
| చరణం charaNam 3 | వరదాసు శ్రీరామా వన సుగుణ ధామా శరణు నన్నేలు ప్రేమ శ్యామాభిరామా | varadAsu SrIrAmA vana suguNa dhAmA SaraNu nannElu prEma SyAmAbhirAmA |
#353 కోపమా సామి kOpamA sAmi
| Title | కోపమా సామి | kOpamA sAmi |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | హిందుస్థాని కాఫీ కాఫి | hindusthAni kAfI kAfi |
| తాళం tALa | అట చాపు | aTa chApu |
| పల్లవి pallavi | కోపమా సామి యేమిర కోపమా అపరాదుర మోహము పరితాపమొందెర దేహము నను రాపుజేయుట ద్రోహము నీ రూపమైన జూపనేమిర | kOpamA sAmi yEmira kOpamA aparAdura mOhamu paritApamomdera dEhamu nanu rApujEyuTa drOhamu nI rUpamaina jUpanEmira |
| చరణం charaNam 1 | వాదమా సామి నాతో వాదమా లేదురా బలవంతము యిది కాదురా యొక పంతము సరికాదురా యత్యంతము నీమీది తమి చేసేది తోచదు | vAdamA sAmi nAtO vAdamA lEdurA balavantamu yidi kAdurA yoka pantamu sarikAdurA yatyantamu nImIdi tami chEsEdi tOchadu |
| చరణం charaNam 2 | వీడరా మోడి నాపై వీడరా ఆడుదానర దోసము కాపాడరా పరిహాసము నను గూడని నా వేసము మాటాడనైన గూడదటరా | vIDarA mODi nApai vIDarA ADudAnara dOsamu kApADarA parihAsamu nanu gUDani nA vEsamu mATADanaina gUDadaTarA |
| చరణం charaNam 3 | దోసమా సామి నాపై దాసు రామ కవీంద్రుడు కృతి జేసె మృదు గుణ సాంద్రుడు పైగాసె వెన్నెల చంద్రుడు సేబాసురా యెంత మోసమాయెరా | dOsamA sAmi nApai dAsu rAma kavIndruDu kRti jEse mRdu guNa sAndruDu paigAse vennela chandruDu sEbAsurA yenta mOsamAyerA |