| Title | ఆ నలినముఖి | A nalinamukhi |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | జంఝూటి | jamjhUTi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఆ నలినముఖీ అందమదేమీ దానికే నీకును తగు తగు సామీ | A nalinamukhI andamadEmI dAnikE nIkunu tagu tagu sAmI |
| చరణం charaNam 1 | మందుల మారుల మాట పసగడి బందములాయె భళీభళీ సామీ | mandula mArula mATa pasagaDi bandamulAye bhaLIbhaLI sAmI |
| చరణం charaNam 2 | తంతరగత్తెల తక్కులు మిగుల సంతసమాయె సరీసరీ సామీ | tantaragattela takkulu migula santasamAye sarIsarI sAmI |
| చరణం charaNam 3 | దాసు కులాంచిత రామకవి సదా ధ్యానము జేసె హరీహరీ సామీ | dAsu kulAmchita rAmakavi sadA dhyAnamu jEse harIharI sAmI |
Category: Lyrics
#341 తగుతగులేర tagutagulEra
| Title | తగుతగులేర | tagutagulEra |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | హిందుస్థానీ కాఫీ | hindusthAnI kAfI |
| తాళం tALa | రూపక (1893) రూపక / త్ర్యస్యగతి (1991) | rUpaka (1893) rUpaka/ tryasyagati (1991) |
| పల్లవి pallavi | తగుతగులేర చిన్నదాన తాళజాలరా నాతో పసంతమేలరా యింతైన నిల్వలేనురా | tagutagulEra chinnadAna tALajAlarA nAtO pasantamElarA yimtaina nilvalEnurA |
| చరణం charaNam 1 | నను గరుణింపవేర న్యాయమరసి చూడరా నా మీద కోపమేలరా నీకేల రవ్వమానరా | nanu garuNimpavEra nyAyamarasi chUDarA nA mIda kOpamElarA nIkEla ravvamAnarA |
| చరణం charaNam 2 | కోమలమగు నాదు వయసు కొనవెన్నెలాయెరా నా గుట్టు బయలు బట్టేరా నా కోరికె లీడేర్చరా | kOmalamagu nAdu vayasu konavennelAyerA nA guTTu bayalu baTTErA nA kOrike lIDErcharA |
| చరణం charaNam 3 | వేసకాడ ముద్దుసామి వేణుగోపబాలకా శ్రీ దాసురామపాలకా నా పాలిపంచ సాయకా | vEsakADa muddusAmi vENugOpabAlakA SrI dAsurAmapAlakA nA pAlipamcha sAyakA |
#338 నిలునిలు nilunilu
| Title | నిలునిలు | nilunilu |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | ఖమాసు | khamAsu |
| తాళం tALa | చాపు (1893) ఆది (1991) | chApu (1893) Adi (1991) |
| పల్లవి pallavi | నిలునిలు మటుండుమీ నాసామీ నీవు నా దరి రాకుమీ నాసామీ | nilunilu maTunDumI nAsAmI nIvu nA dari rAkumI nAsAmI |
| చరణం charaNam 1 | ఆ మాయలాడి యేమి బోధించెర సామి నాకు దెల్పర సంశయమేలర | A mAyalADi yEmi bOdhinchera sAmi nAku delpara samSayamElara |
| చరణం charaNam 2 | సన్నుతాంగిని గూడి నా సాటి వారిలో నన్ను రద్ది జేయుట న్యాయము గాదుర | sannutAmgini gUDi nA sATi vArilO nannu raddi jEyuTa nyAyamu gAdura |
| చరణం charaNam 3 | వెసగాడవుగద వేణుగోపాల సామి దాసు శ్రీరామకవి ధన్యుని జేయర | vesagADavugada vENugOpAla sAmi dAsu SrIrAmakavi dhanyuni jEyara |
#337 రమణిరో ramaNirO
| Title | రమణిరో | ramaNirO |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | కానడా | kAnaDA |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | రమణిరో సముఖాన రాయబార మేటికే నిమిషమైన తాళలేనె నేనే వాని రమ్మందునె | ramaNirO samukhAna rAyabAra mETikE nimishamaina tALalEne nEnE vAni rammandune |
| చరణం charaNam 1 | కడువేడుక వాని మేన గంధమును బూసి యాకు మడుపిచ్చి తడవేటికి మాపటికి రమ్మందునె | kaDuvEDuka vAni mEna gandhamunu bUsi yAku maDupichchi taDavETiki mApaTiki rammandune |
| చరణం charaNam 2 | కోరివాని జేరి పంనీరు పైజల్లి నను వేరుసేయ మేరగాదు వేవేగ రమ్మందునె | kOrivAni jEri pam^nIru paijalli nanu vErusEya mEragAdu vEvEga rammandune |
| చరణం charaNam 3 | భాసురాంగ వేణుగోపాల యింత పంతమేల దాసురామకవి సంనుతి జేసె నికరమ్మందునే | bhAsurAnga vENugOpAla yinta pantamEla dAsurAmakavi sam^nuti jEse nikarammandunE |
#335 సరిసరిలే sarisarilE
రెండు పుస్తకాలలో రాగం, తాళం తేడాలు గమనించగలరు. Notice the change in rAga and tALa between the two books.
| Title | సరిసరిలే | sarisarilE |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | హిందుస్థానీ కాఫీ (1893) కాఫి (1893) | hindusthAnI kAfI (1893) kAfi (1991) |
| తాళం tALa | అట (1893) ఆది (1991) | aTa (1893) Adi (1991) |
| పల్లవి pallavi | సరిసరిలే మంచిది సరిసరిలే మంచిది మరు శరములకు బెదరి దరి జేరిన అరమరిక లేమిరా అరమరిక లేమిరా | sarisarilE manchidi sarisarilE manchidi maru Saramulaku bedari dari jErina aramarika lEmirA aramarika lEmirA |
| చరణం charaNam 1 | పలుమరు నే నిను బతిమాలితినని పాటింపురా వేణుగోపాలా కలకాలంబును ఘనమా నీకిది | palumaru nE ninu batimAlitinani pATimpurA vENugOpAlA kalakAlambunu ghanamA nIkidi |
| చరణం charaNam 2 | మ్రొక్కగ వచ్చిన మోడిసేతురా మోహనరూపా వేణుగోపాలా దక్కితి దాసు శ్రీరామపాలకా | mrokkaga vachchina mODisEturA mOhanarUpA vENugOpAlA dakkiti dAsu SrIrAmapAlakA |
#333 తెలియదే teliyadE
| Title | తెలియదే | teliyadE |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | హిందుస్థానీ కాఫీ (1893) కాఫి (1991) | hindusthAnI kAfI (1893) kAfI (1991) |
| తాళం tALa | అట (1893) ఆది (1991) | aTa (1893) Adi (1991) |
| పల్లవి pallavi | తెలియ దెలియదె తెలియదె మాయ వలపులొ సొలపులొ వాని గుణమేమొ కాని | teliya deliyade teliyade mAya valapulo solapulo vAni guNamEmo kAni |
| చరణం charaNam 1 | వలపించుటే కాని వలచుట లేడే దాని కలనైన మరువడే కానీ పని చేసినాడే | valapinchuTE kAni valachuTa lEDE dAni kalanaina maruvaDE kAnI pani chEsinADE |
| చరణం charaNam 2 | చెలియరో నేనేమందు బలమగు దానిమందు తలకెక్కెనేమో నందువలన రాడే యిందు | cheliyarO nEnEmandu balamagu dAnimandu talakekkenEmO nanduvalana rADE yindu |
| చరణం charaNam 3 | వేమరు ననుగూడి వాడు నింత మాటలాడినాడు భామా దాసు శ్రీరామ పాలుడె గోపాలుడె | vEmaru nanugUDi vADu ninta mATalADinADu bhAmA dAsu SrIrAma pAluDe gOpAluDe |
#332 నే గాననా సామీ nE gAnanA sAmI
Both books note this as a jAvaLi, but rAga is different
| Title | నే గాననా సామీ | nE gAnanA sAmI |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | హిందుస్థానీ కాఫీ (1893) కాఫి (1991) | hindusthAnI kAfI (1893) kAfi (1991) |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | నే గాననా సామీ నే గాన శ్రీ గల వాడవు నీవని చిన్నతనము సుందరుండవని కౌగిట నెనబది నాలుగు విధముల గరడీలు గరపినది | nE gananA sAmI nE gAna SrI gala vADavu nIvani chinnatanamu sundarunDavani kaugiTa nenabadi nAlugu vidhamula garaDIlu garapinadi |
| చరణం charaNam 1 | వేడుక కాడవు నీవని వీధిలొ నినుగని పోకుమని కోడెకాడ రారారా రమ్మని కోడిగము లాడినది | vEDuka kADavu nIvani vIdhilo ninugani pOkumani kODekADa rArArA rammani kODigamu lADinadi |
| చరణం charaNam 2 | చక్కనివాడవు నీవని చనువుగలదు వెరపేమియని చెక్కిలిగింతలు గొలుపుచు మోవి చురుక్కు నను నొక్కినది | chakkanivADavu nIvani chanuvugaladu verapEmiyani chekkiligintalu golupuchu mOvi churukku nanu nokkinadi |
| చరణం charaNam 3 | వాసిగ వల్లూరి వాసుడని భాసుర వేణుగోపాలుడని దాసు రామకవిపాలుడని దరహాసమును జేసినది | vAsiga vallUri vAsuDani bhAsura vENugOpAluDani dAsu rAmakavipAluDani darahAsamunu jEsinadi |
#331 ఇద్దరి పొందేలరా iddari pondElarA
| Title | ఇద్దరి పొందేలరా | iddari pondElarA |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఇద్దరి పొందేలరా సామి దానింటికే పోపోపోరా సద్దేల జేసెదవు సామి నే నోర్వ నా వద్దికి నీవు రావద్దుర వద్దుర | iddari pondElarA sAmi dAninTikE pOpOpOrA saddEla jEsedavu sAmi nE nOrva nA vaddiki nIvu rAvaddura vaddura |
| చరణం charaNam 1 | నా జోలి నీకేలరా ఆ బ్రహ్మ నిన్నిట్లు పుట్టించెరా యే జాము దానింట నీ జాడ నే జూడ చేజారుగా జాల నే జెల్ల నే జెల్ల | nA jOli nIkElarA A brahma ninniTlu puTTincherA yE jAmu dAninTa nI jADa nE jUDa chEjArugA jAla nE jella nE jella |
| చరణం charaNam 2 | కన్నుల యెరుపేమిరా చెక్కుల కాటుక నలుపేమిరా కన్నుల విలుకాని కయ్యాల మెలగిన చిన్నెలతో చేరా చెప్పరా చెప్పరా | kannula yerupEmirA chekkula kATuka nalupEmirA kannula vilukAni kayyAla melagina chinnelatO chErA chepparA chepparA |
| చరణం charaNam 3 | శ్రీ పావల్లూరి పుర శ్రీ వేణుగోపాల బాగాయెరా రాపేల దాసు శ్రీరామకవిపాల యీ పటనీ పనులింతాయె వింతాయె | SrI pAvallUri pura SrI vENugOpAla bAgAyerA rApEla dAsu SrIrAmakavipAla yI paTanI panulimtAye vintAye |
#330 నను విడనాడుట nanu viDanADuTa
| Title | నను విడనాడుట | nanu viDanADuTa |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | హిందుస్థాని భైరవి | hindusthAni bhairavi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | నను విడనాడుట న్యాయమా సామీ న్యాయమ సామీ న్యాయమా సామీ | nanu viDanADuTa nyAyamA sAmi nyAyama sAmI nyAyamA sAmI |
| కనికరమేలా లేదు కారణమేమిరా కారణమేమిరా కారణమేమిరా | kanikaramElA lEdu kAraNamEmirA kAraNamEmirA kAraNamEmirA | |
| చరణం charaNam 1 | నను మరుబారి ద్రోయ న్యాయమా సామీ న్యాయమా సామీ న్యాయమా సామీ | nanu marubAri drOya nyAyamA sAmI nyAyamA sAmI nyAyamA sAmI |
| చరణం charaNam 2 | విను తోట్ల వల్లూరి వేణుగోపాలా వేణుగోపాలా వేణుగోపాలా | vinu tOTla vallUri vENugOpAlA vENugOpAlA vENugOpAlA |
| చరణం charaNam 3 | ఘనదాసు రామావనా కరుణించవేమిరా కరుణించవేమిరా కరుణించవేమిరా | ghanadAsu rAmAvanA karuNimchavEmirA karuNimchavEmirA karuNimchavEmirA |
#329 నీతోటి మాటలు nItOTi mATalu
First jAvaLi from a book by SrI dAsu SrIrAmulu from a book published in 1893. Some of these were reprinted in 1991 again.
In some cases, like this one, rAga or tALa were noted differently in the books. Sometimes, a jAvaLi in one book was marked as padam, or, vice versa too.
| Title | నీతోటి మాటలు | nItOTi mATalu |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 dAsu1991 | |
| రాగం rAga | హిందుస్థాని కాఫి (1893) కాఫి (1991) | hindusthAni kAfi(1893) kAfi (1991) |
| తాళం tALa | మధ్యాది (1893) ఆది (1991) | madhyAdi (1893) Adi (1991) |
| పల్లవి pallavi | నీతోటి మాటలు నాకేలరా సామీ నాతోటి మాటలు నీకేలరా నే తాళ దానితో ఖాతాలు నీకేల ప్రీతిగల నాతియని పోతివి రాతిరి | nItOTi mATalu nAkElarA sAmI nAtOTi mATalu nIkElarA nE tALa dAnitO khAtAlu nIkEla prItigala nAtiyani pOtivi rAtiri |
| 1 | పరువటరా నాతో పనులేరా సామీ పరువటరా నాతో పనులేమిరా విరిజాజి బంతులు విసరకురా సామి సరసము విరసమౌ చాలుర చాలుర | paruvaTarA nAtO panulErA sAmI paruvaTarA nAtO panulEmirA virijAji bantulu visarakurA sAmi sarasamu virasamau chAlura chAlura |
| 2 | ఒయ్యార మిదియేమి యూరుకోరా సామి ఒయ్యార మిదియేమి యూరుకోరా ఉయ్యల మంచము నూచకురా యది కయ్యాల గయ్యాళి అయ్యయ్యో అయ్యయ్యో | oyyAra midiyEmi yUrukOrA sAmi oyyAra midiyEmi yUrukOrA uyyala manchamu nUchakurA yadi kayyAla gayyALi ayyayyO ayyayyO |
| 3 | వేసమా వల్లూరి వేణుగోపాల సామి వేసమా వల్లూరి వేణుగోపాల దాసు శ్రీరాముని భాసుర వాక్యము చేసెరా వేయివేలు సబాసు సబాసు | vEsamA vallUri vENugOpAla sAmi vEsamA vallUri vENugOpAla dAsu SrIrAmuni bhAsura vAkyamu chEserA vEyivElu sabAsu sabAsu |