#116 వెలదిరో నాధుని veladirO nAdhuni

Titleవెలదిరో నాధుని (ప్రతి)veladirO nAdhuni (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaశుధ్ధకాంభోజిSudhdhakAmbhOji
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
వెలదిరో నాధుని వేగమె దేవేveladirO nAdhuni vEgame dEvE
జలజాక్షి వానికి శరణని యున్నదనిjalajAkshi vAniki SaraNani yunnadani
చరణం
charaNam 1
మారుడు శరములు మచ్చరించి వేయగ
కోరి నమ్మి యుంటిని కోమలాంగుని మదిని
mAruDu Saramulu machcharimchi vEyaga
kOri nammi yumTini kOmalAmguni madini
చరణం
charaNam 2
చిన్ననాడె వలశున్న దాననని
కన్నెరొ విన్నవించి కాముని కేళికిని
chinnanADe valaSunna dAnanani
kannero vinnavimchi kAmuni kELikini
చరణం
charaNam 3
రాజిల్ల శ్రీ మాణిక్య రాట్కులసింధు
ద్విజ రాజవెంకట గోపాలరాయ పృధ్వీశుని
rAjilla SrI mANikya rATkulasimdhu
dwija rAjavemkaTa gOpAlarAya pRdhwISuni

#115 మునుపటి బాసలు munupaTi bAsalu

Titleమునుపటి బాసలుmunupaTi bAsalu
Written By
BookprAchIna-navIna
రాగం rAgaశుద్ధకాంభోజిSuddhakAmbhOji
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
మునుపటి బాసలు మనకేలనే చెలీ కోరిన కోరికల్
కొనసాగగానే నీరజ నయనరో నీ మది నిజముగాదే
munupaTi bAsalu manakElanE chelI kOrina kOrikal
konasAgagAnE nIraja nayanarO nI madi nijamugAdE
చరణం
charaNam 1
పాన్పుపైని పవళించిన వేళలో
మోము మోమున జేర్చి ముద్దుబెట్టి వేడ
pAn&pupaini pavaLimchina vELalO
mOmu mOmuna jErchi muddubeTTi vEDa
చరణం
charaNam 2
ఆడిన మాటకు అతివరొ వానితో
చాడి చెప్పి నను చౌక జేసితివి
ADina mATaku ativaro vAnitO
chADi cheppi nanu chauka jEsitivi

#114 సామీ నిను వేడ sAmI ninu vEDa

Titleసామీ నిను వేడ (ప్రతి)sAmI ninu vEDa (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaనాదనామక్రియnAdanAmakriya
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
సామీ నిను వేడ బ్రోవవేమి జాలమిదేమి
కాముని బారికి నే గాసి నొందజాలననీ
sAmI ninu vEDa brOvavEmi jAlamidEmi
kAmuni bAriki nE gAsi nomdajAlananI
చరణం
charaNam 1
ఆసతోడ మున్ను నను బాసి యోర్వలేననీ
జేసిన బాసలేమి జేసి కోపగించేవు
AsatODa munnu nanu bAsi yOrvalEnanI
jEsina bAsalEmi jEsi kOpagimchEvu
చరణం
charaNam 2
చిన్ననాడె జేసి యున్న చిన్నెలన్ని దలచుకొనీ
వన్నెకాడ విరహము నే నోర్వలేర రార మేర
chinnanADe jEsi yunna chinnelanni dalachukonI
vannekADa virahamu nE nOrvalEra rAra mEra
చరణం
charaNam 3
సదయుడౌ శ్రీదిన వహి సద్వంశజ పురుషోత్తమ
ముదమున నెరనమ్మినార కదశి గౌగలించవేర
sadayuDou SrIdina vahi sadwamSaja purushOttama
mudamuna neranamminAra kadaSi gougalimchavEra

#113 యేరా మోడిసేయ yErA mODisEya

Titleయేరా మోడిసేయyErA mODisEya
Written By
BookprAchIna-navIna
రాగం rAgaనాదనామక్రియnAdanAmakriya
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
యేరామోడి సేయ మేర మనోహరyErAmODi sEya mEra manOhara
రారా నీకొగి వీరా నన్నేలుకోరrArA nIkogi vIrA nannElukOra
చరణం
charaNam 1
బాలప్రాయము నుండి బాళి నిను బెంచి
మేలుగన నెంచు నన్ను మేలమాడెద వౌర
bAlaprAyamu numDi bALi ninu benchi
mElugana nemchu nannu mElamADeda vaura
చరణం
charaNam 2
ఏట బెరిగెడు వాని పూట బెంచి తుదిని
నోటి మాటలకేను నోచనైతి నా సామి
ETa berigeDu vAni pUTa bemchi tudini
nOTi mATalakEnu nOchanaiti nA sAmi
చరణం
charaNam 3
నిలయమున నినుగానను నింటగల పనులెల్ల మరచి
తల వాకిలిల్లు గలచి యుందుగదరా
nilayamuna ninugAnanu nimTagala panulella marachi
tala vAkilillu galachi yumdugadarA
చరణం
charaNam 4
కరిగిరి వరదుని మరిదివైన నీకు
హరి హరి సుంతైన గరుణలేక నాపైని
karigiri varaduni maridivaina nIku
hari hari sumtaina garuNalEka nApaini

#112 భామిని నీ విందు bhAmini nI vimdu

Titleభామిని నీ విందు (ప్రతి)bhAmini nI vimdu (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaపూరి కల్యాణిpUri kalyANi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
భామిని నీ విందు రాగదె గౌరిశెట్టి
శ్రీరామునిందు దోడి తేగదే
bhAmini nI vimdu rAgade gauriSeTTi
SrIrAmunimdu dODi tEgadE
చరణం
charaNam 1
కామకోటి రూప కరుణాసాగరునీ కాముకేళికినిkAmakOTi rUpa karuNAsAgarunI kAmukELikini
చరణం
charaNam 2
పంచశరుడు యెంచి బాణములు నెద
నించెనే మించి యోర్వజాలనే
pamchaSaruDu yemchi bANamulu neda
nimchenE mimchi yOrvajAlanE
చరణం
charaNam 3
కరుణ విడచి యే తరుణినొ
మరుకేళిని గూడెనె సరసుడు నన్వీడెనే
karuNa viDachi yE taruNino
marukELini gUDene sarasuDu nanvIDenE
చరణం
charaNam 4
భామరొ విను తంగేళ్ళమూడి పురధాముడే సోమసమానుడేbhAmaro vinu tamgELLamUDi puradhAmuDE sOmasamAnuDE

#111 ప్రాణనాధా prANanAdhA

Titleప్రాణనాధాprANanAdhA
Written By
BookprAchIna-navIna
రాగం rAgaపూరి కల్యాణిpUri kalyANi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
ప్రాణనాధా మనవీ విను బాలు నిటుల జేయకుprANanAdhA manavI vinu bAlu niTula jEyaku
చరణం
charaNam 1
దీనురాలనగుచు నిన్ను వేడెదను తనయునికై నేనుdInurAlanaguchu ninnu vEDedanu tanayunikai nEnu
చరణం
charaNam 2
చాన నేను వీని జంపెదను గానలోలు దలచినchAna nEnu vIni jampedanu gAnalOlu dalachina
చరణం
charaNam 3
మానమెంచడిందుకు నేనేమందు వీని విడువనందుmAnamemchaDimduku nEnEmamdu vIni viDuvanamdu
చరణం
charaNam 4
క్షత్రమలర రక్షింపుము నీవికను పుత్ర భిక్షమిమ్ముkshatramalara rakshimpumu nIvikanu putra bhikshamimmu
చరణం
charaNam 5
గోత్రధరుడు రామానుజపుర వరుని స్తోత్రము సేయు వీనిgOtradharuDu rAmAnujapura varuni stOtramu sEyu vIni

#110 కరుణించర karuNimchara

Titleకరుణించర (ప్రతి)karuNimchara (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaమాంజిmAmji
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
కరుణించర కఠినమేర కామకోటి సుందర
మరుబారికి తాళజాల మహనీయ సుజనపాల
karuNimchara kaThinamEra kAmakOTi sumdara
marubAriki tALajAla mahanIya sujanapAla
చరణం
charaNam 1
చిన్ననాట నుండి నీదు చిన్నెలన్ని జూచి మదిని
వన్నెకాడ వనుచు గోరి యున్నదాన నౌట నెరిగి
chinnanATa numDi nIdu chinnelanni jUchi madini
vannekADa vanuchu gOri yunnadAna nauTa nerigi
చరణం
charaNam 2
మున్ను నీదు కౌగిటను నన్ను జేర్చి ముద్దులాడు
కొన్న ప్రేమ యిపుడు లేక యున్న నోర్వజాలనుర
munnu nIdu kaugiTanu nannu jErchi muddulADu
konna prEma yipuDu lEka yunna nOrvajAlanura
చరణం
charaNam 3
వసుధ వెలయు శ్రీ కొరళ్ళవంశాబ్ధి సుధాకర
రసికుడ నిను బాయ సుబ్బారాయ వర నామధేయా
vasudha velayu SrI koraLLavamSAbdhi sudhAkara
rasikuDa ninu bAya subbArAya vara nAmadhEyA

#109 రఘువీర రణధీర raghuvIra raNadhIra

Titleరఘువీర రణధీరraghuvIra raNadhIra
Written Byత్యాగరాజtyAgarAja
BookprAchIna-navIna
రాగం rAgaమాంజిmAmji
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
రఘువీర రణధీర రారా రాజకుమారraghuvIra raNadhIra rArA rAjakumAra
భృగు సూన మదవిదార బృందారకాధారbhRgu sUna madavidAra bRndArakAdhAra
చరణం
charaNam 1
రావణఘట కర్ణబల రాత్రించర దనుజారీ
స్థావర జంగమరూప త్యాగరాజ పాదార్చిత
rAvaNaghaTa karNabala rAtrimchara danujArI
sthAvara jamgamarUpa tyAgarAja pAdArchita

Not a jAvaLi! Available on YouTube and other web sites, but mentioned as a different rAga

#108 సామజయాన sAmajayAna

Titleసామజయాన (ప్రతి)sAmajayAna (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
సామజయాన ప్రాణసఖుని దోడి తేవేsAmajayAna prANasakhuni dODi tEvE
చరణం
charaNam 1
కాముకేళి లోనం గలసిన నాధుని
భామిని బాగుగ బ్రోవుమని
kAmukELi lOnam galasina nAdhuni
bhAmini bAguga brOvumani
చరణం
charaNam 2
చందురు వెన్నెల పొందుగ గాయగ
సుందరీ మందర ధీరుని
chamduru vennela pomduga gAyaga
sumdarI mamdara dhIruni
చరణం
charaNam 3
పవనుడు మార్కొని బాధలు బెట్టగ
యువిదరో కవి బుధలోలుని
pavanuDu mArkoni bAdhalu beTTaga
yuvidarO kavi budhalOluni
చరణం
charaNam 4
గౌరిశెట్టి కుల ఘన కమలాకర
సారసారిని శ్రీరాముని
gauriSeTTi kula ghana kamalAkara
sArasArini SrIrAmuni

#106 సుందరి నేలుముర sumdari nElumura

Titleసుందరి నేలుముర (ప్రతి)sumdari nElumura (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్తాని కాపిhindustAni kApi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
సుందరి నేలుముర సామిsumdari nElumura sAmi
కుందరదనమో మిందుని బోలురkumdaradanamO mimduni bOlura
చరణం
charaNam 1
అంగన కురులు సారంగము నేలు
శోభాంగిని బొగడగ పద్మజుని వశమె
amgana kurulu sAramgamu nElu
SObhAmgini bogaDaga padmajuni vaSame
చరణం
charaNam 2
చెలియ పయోధరములు లికుచ ఫలంబుల మీరును యా లలనను కలియరcheliya payOdharamulu likucha phalambula mIrunu yA lalananu kaliyara
చరణం
charaNam 3
సుమశరు బారికి సుదతి తాళనని
కమలనయన నీ కరుణను గోరిన
sumaSaru bAriki sudati tALanani
kamalanayana nI karuNanu gOrina
చరణం
charaNam 4
సరవితో శ్రీపీఠి సద్వంశజమణి
గరితనేలు చారుస్మర రాఘావాచార్య
saravitO SrIpIThi sadvamSajamaNi
garitanElu chArusmara rAghAvAchArya