#84 మానజాలరా mAnajAlarA

TitleమానజాలరాmAnajAlarA
Written By
Book#Book1911
రాగం rAgaజంఝూటిjamjhUTi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
మానజాలరా ప్రియాmAnajAlarA priyA
మానజాల నీ మాటకు మరులు మీరి యుంటిరా ప్రియాmAnajAla nI mATaku marulu mIri yumTirA priyA
చరణం
charaNam 1
నీ మానసేమో ఎంతో నే నెరుగనైతిరా
యెమ్మెకాడవని విని సొమ్మసిల్లుచుంటిరా ప్రియా
nI mAnasEmO emtO nE neruganaitirA
yemmekADavani vini sommasilluchumTirA priyA
చరణం
charaNam 2
చల్లనీ కృపాదృష్టి జల్లుమూ నా మెనా
యుల్లము యుప్పొంగీ పొంగీ సొమ్మసిల్లుచుంటిరా
challanI kRpAdRshTi jallumU nA menA
yullamu yuppomgI pomgI sommasilluchumTirA

#83 నగుమోమెత్తి nagumOmetti

Titleనగుమోమెత్తిnagumOmetti
Written By
Book#Book1911
రాగం rAgaఛత్రపురీ తోడిChatrapurI tODi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
నగుమోమెత్తి చూడవేరా యేమి నేరమయ్య నాదుపైనిnagumOmetti chUDavErA yEmi nEramayya nAdupaini
చరణం
charaNam 1
అల్ల మాయలాడి నీకు చెల్లుగాని నా బోటిని
జెల్లుదునే యెంచి మృదుసల్లాపము లాడితివి
మోమెత్తి జూడవేరా
alla mAyalADi nIku chellugAni nA bOTini
jelludunE yemchi mRdusallApamu lADitivi
mOmetti jUDavErA
చరణం
charaNam 2
మొన్న రేయి దాని ముద్దులాడుచుండగాను
కన్నులారగాంచి యపుడు మిన్నానంటిచుంటి
monna rEyi dAni muddulADuchumDagAnu
kannulAragAmchi yapuDu minnAnamTichumTi
చరణం
charaNam 3
అందరు నా గంగా నిటులాచరించలందామౌని
యందాకాడ శ్రీ కవిరాజా యజ్ఞభాస్కరాయాపోషా నిపుమో
amdaru nA gamgA niTulAcharimchalamdAmOuni
yamdAkADa SrI kavirAjA yajnabhAskarAyApOshA nipumO

#82 మాటిమాటికిటు mATimATikiTu

TitleమాటిమాటికిటుmATimATikiTu
Written By
Book#Book1911
రాగం rAgaశింహపురీ బేహాగ్SiMhapurI bEhAg
తాళం tALaచాపుchApu
పల్లవి
pallavi
మాటిమాటి కిటుల తరుచు మాటలాడనేలరా
నీటుకాడ తెలసె తెలిసె నేటికే చాలు చాలురా
mATimATi kiTula taruchu mATalADanElarA
nITukADa telase telise nETikE chAlu chAlurA
చరణం
charaNam 1
మోమువాడి నిదురకన్నుల మొనసి గ్రుమ్ముటేలరా
యేముకో కెమ్మోవి నొక్క వెసగనూ మరుగేలరా
mOmuvADi nidurakannula monasi grummuTElarA
yEmukO kemmOvi nokka vesaganU marugElarA
చరణం
charaNam 2
గొనబు చెక్కులందు జిలుగు గోటి నొక్కలేలరా
అనుబు దుప్పటిని పసుపు అంటు జాడలేలరా
gonabu chekkulamdu jilugu gOTi nokkalElarA
anubu duppaTini pasupu amTu jADalElarA
చరణం
charaNam 3
ధారుణి శింహ్వపురి రంగధామ యెంతో వింతరా
ఊరక నన్నేల మదిని యుంచు మెంచనేలరా
dhAruNi SiMhvapuri ramgadhAma yemtO vimtarA
Uraka nannEla madini yumchu memchanElarA

#81 అవురా శౌబాసూ avurA SoubAsU

Titleఅవురా శౌబాసూavurA SoubAsU
Written By
Book#Book1911
రాగం rAgaశింహపురి కమాసుSiMhapuri kamAsu
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
అవురా శౌబాసూ బాగాయె బలారే
మారూ ముమ్మారు పలుమారూ వీడకురా
avurA SoubAsU bAgAye balArE
mArU mummAru palumArU vIDakurA
చరణం
charaNam 1
కదసీ చిక్కగా గదియగా నొక్కరా
సదయుడా తడయకూ సమయమిదేరా
kadasI chikkagA gadiyagA nokkarA
sadayuDA taDayakU samayamidErA
చరణం
charaNam 2
క్రిక్కిరిసి నా చనూ ముక్కులూ నులుమరా
చక్కెర కెమ్మోవి చక్కగా నొక్కరా నొక్కారా నొక్కరా
krikkirisi nA chanU mukkulU nulumarA
chakkera kemmOvi chakkagA nokkarA nokkArA nokkarA
చరణం
charaNam 3
మైమరచెనూరా మానసూప్పొంగెరా
చెమటలూ జారెరా శింహపురీశ్వరా
maimarachenUrA mAnasUppomgerA
chemaTalU jArerA SiMhapurISwarA

#80 నేరమేమి జేసితినో nEramEmi jEsitinO

Titleనేరమేమి జేసితినోnEramEmi jEsitinO
Written By
Book#Book1911
రాగం rAgaఛత్రపురీ తోడిChatrapurI tODi
తాళం tALaత్రిశ్ర గతి – ఏకtriSra gati – Eka
పల్లవి
pallavi
నేరమేమి జేసితినో సామికేమి తెలియదూ
సారసాక్షులారా నన్ను చాలా చౌక చేసినాడే
nEramEmi jEsitinO sAmikEmi teliyadU
sArasAkshulArA nannu chAlA chouka chEsinADE
చరణం
charaNam 1
చిటుకుమంటె కోపమైతె యెటుల సైతునమ్మ చెలి
చిటుకులాడి మాయకు లోబడి దయ మరచినాడె
chiTukumamTe kOpamaite yeTula saitunamma cheli
chiTukulADi mAyaku lObaDi daya marachinADe
చరణం
charaNam 2
నిక్కముగా దాని వలలో జిక్కిచిక్కి యున్నాడేమొ
దిక్కులేని పక్షివలె మక్కువీయిడ మరచినాడే
nikkamugA dAni valalO jikkichikki yunnADEmo
dikkulEni pakshivale makkuvIyiDa marachinADE
చరణం
charaNam 3
ధరను శ్రీమద్ ఛత్రపురీ వరజగన్మోహనా
సరసనాటకేశుడె నను చాల చౌక జేసినాడే
dharanu SrImad ChatrapurI varajaganmOhanA
sarasanATakESuDe nanu chAla chouka jEsinADE

#79 మగువల నమ్మరాదు maguvala nammarAdu

Titleమగువల నమ్మరాదుmaguvala nammarAdu
Written By
Book#Book1911
రాగం rAgaఛత్రపురీ కల్యాణిChatrapurI kalyANi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
మగువల నమ్మరాదు
మంచికి మంచిలేదూ
maguvala nammarAdu
mamchiki mamchilEdU
మొగమాట ముంచరాదు
మోహము సుంత లేదూ
mogamATa mumcharAdu
mOhamu sumta lEdU
చరణం
charaNam 1
అందని మానిపండ్లు తిందురు జవరాండ్రు
ఎందరో కోడెకాండ్రు ఎంచిన మేడిపండ్లు
amdani mAnipamDlu timduru javarAmDru
emdarO kODekAmDru emchina mEDipamDlu
చరణం
charaNam 2
చేతిలో చెయ్యి వేసి చెంతకు చేరదీసి
బోదురు యెడబాసీ బుర్రకు మసిబూసి
chEtilO cheyyi vEsi chemtaku chEradIsi
bOduru yeDabAsI burraku masibUsi
చరణం
charaNam 3
వరలెడు శ్రీఛత్ర వర సూత్రధారీ గోరీ
సరసకు చేరి మీరి సరగున బ్రోచెవారి
varaleDu SrIChatra vara sUtradhArI gOrI
sarasaku chEri mIri saraguna brOchevAri

#78 చెరగూ మాశీయున్నాదా cheragU mASIyunnAdA

Titleచెరగూ మాశీయున్నాదాcheragU mASIyunnAdA
Written By
Book#Book1911
రాగం rAgaఛత్రపురీ తోడిChatrapurI tODi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
చెరగూ మాశీయున్నాదా నారసామిcheragU mASIyunnAdA nArasAmi
అనుపల్లవి
anupallavi
వెలలేని సౌఖ్యామబ్బేరా ఏ ప్రియాvelalEni soukhyAmabbErA E priyA
చరణం
charaNam 1
చలువంపు తోటలో సరసుడు నేనుండగ
సరగున చెయ్యి బట్టెరా ఏ ప్రియా
chaluvampu tOTalO sarasuDu nEnumDaga
saraguna cheyyi baTTerA E priyA
చరణం
charaNam 2
కలువాల దొర పగ నాపై సాధించెరా
కనికరముంచడాయెనే ఏరా ప్రియా
kaluvAla dora paga nApai sAdhimcherA
kanikaramumchaDAyenE ErA priyA
చరణం
charaNam 3
ధర వెలయు శ్రీ ఛత్రపుర జగన్మోహనా
వరనాటక ధీశుడే ఏరా ప్రియా
dhara velayu SrI Chatrapura jaganmOhanA
varanATaka dhISuDE ErA priyA

#77 లేచి రారా lEchi rArA

Titleలేచి రారాlEchi rArA
Written By
Book#Book1911
రాగం rAgaఛత్రపురీ బేహాగ్ChatrapurI bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
లేచి రారా మా చెలి నేలుకోరాlEchi rArA mA cheli nElukOrA
చరణం
charaNam 1
పెంచూ రతికేళి ముప్పించు
చాలగా వలపించూ సరసము దేలించూ
మెప్పించు మేలించు లాలించు
pemchU ratikELi muppimchu
chAlagA valapimchU sarasamu dElimchU
meppimchu mElimchu lAlimchu
చరణం
charaNam 2
నారీ మారునిచే కఠారి వాలుచూపుల దారి
నడతల వయ్యారి చిన్నారి పొన్నారీ కన్నారీ
nArI mArunichE kaThAri vAluchUpula dAri
naDatala vayyAri chinnAri ponnArI kannArI
చరణం
charaNam 3
నాతీ సంపూర్ణ చంద్రవతీ నిడతతొ గుణవతి
జాతిలొ కాళవతి మదవతి నాదాతి సుదాతి
nAtI sampoorNa chamdravatI niDatato guNavati
jAtilo kALavati madavati nAdAti sudAti
చరణం
charaNam 4
ఈశా శ్రీఛత్రపురీశ శ్రీజగన్మోహన సంకాశ
సరస నాటక విధీశ వద్దేశ ప్రాణేశ లోకేశ
ISA SrIChatrapurISa SrIjaganmOhana samkASa
sarasa nATaka vidhISa vaddESa prANESa lOkESa

#76 సరివారిలో sarivArilO

TitleసరివారిలోsarivArilO
Written By
Book#Book1911
రాగం rAgaఛత్రపురీ హిందుస్తాని కాఫీChatrapurI hindustAni kAfI
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
సరవారిలో సరసము లాడకురాsaravArilO sarasamu lADakurA
చరణం
charaNam 1
సరసము లాడకు సైగలు శాయకు
తరచుగ బిల్వబోకు తప్పించకూ
సరసము లాడకురా
sarasamu lADaku saigalu SAyaku
tarachuga bilvabOku tappimchakU
sarasamu lADakurA
చరణం
charaNam 2
కొత్తగా నే వచ్చి కొన్ని నాళ్ళాయెరా
సద్దు శాయక పోరా చాల్ చాలురా
సరసము లాడకురా
kottagA nE vachchi konni nALLAyerA
saddu SAyaka pOrA chAl chAlurA
sarasamulADakurA
చరణం
charaNam 3
వరలెడు శ్రీఛత్రపుర జగన్మోహనా
వరనాటక ధీశ వద్దు ప్రాణేశా
సరసము లాడకురా
varaleDu SrIChatrapura jaganmOhanA
varanATaka dhISa vaddu prANESA
sarasamulADakurA

#75 సరసకు వేలరా sarasaku vElarA

Titleసరసకు వేలరా sarasaku vElarA
Written By
Book#Book1911
రాగం rAgaఛత్రపురీ బేహాగ్ChatrapurI bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
సరసకు వేలరా
సమి ఏర మేర గాదురా
sarasaku vElarA
sami Era mEra gAdurA
చరణం
charaNam 1
మరులుకున్న నాపై ఇంత మర్మమేల దెలుపరా
తరుణి బెట్టినట్టి మందు తలకెక్కెనటరా
marulukunna nApai imta marmamEla deluparA
taruNi beTTinaTTi mamdu talakekkenaTarA
చరణం
charaNam 2
నిరతము నీవనుచును నెరనమ్మి యుంటిరా
సరగున నన్నేలుకోరా సమి నీకు మ్రొక్కెరా
niratamu nIvanuchunu neranammi yumTirA
saraguna nannElukOrA sami nIku mrokkerA
చరణం
charaNam 3
పరుల వలెనె నా వలపు భరియింపజాలరా
మారు నిల్లు చమ్మగిల్లి మైమరువసాగెరా
parula valene nA valapu bhariyimpajAlarA
mAru nillu chammagilli maimaruvasAgerA
చరణం
charaNam 4
ధరను శ్రీ ఛత్రపుర వరజగన్మోహనా
సరస నాటకానిలయ సమయమాయె గూడరా
dharanu SrI Chatrapura varajaganmOhanA
sarasa nATakAnilaya samayamAye gUDarA