#58 సామిని పోయి రమ్మనవె sAmini pOyi rammanave

Titleసామిని పోయి రమ్మనవెsAmini pOyi rammanave
Written By
రాగం rAgaకదంబంkadambam
తాళం tALaమిశ్రmiSra
పల్లవి
pallavi
సామిని పోయిరమ్మనవె
రమ్మనవె రమ్మనవె వో చెలియా
sAmini pOyirammanave
rammanave rammanave vO cheliyA
చరణం
charaNam 1
అలదాని నడతలు తెలిసి కలసి నాతో
పలుకకుండినా పాపము గదటె
aladAni naDatalu telisi kalasi nAtO
palukakumDinA pApamu gadaTe
చరణం
charaNam 2
భామరో వాడెందు బోయెనో దెల్పడె
యేమని తాళుదు యెదురాడక పోవె
bhAmarO vADemdu bOyenO delpaDe
yEmani tALudu yedurADaka pOve
చరణం
charaNam 3
వీరరాఘవ నుత వరహా ముద్రేశు
కోరినవాడేమొ వూరికె రాడమ్మా
vIrarAghava nuta varahA mudrESu
kOrinavADEmo vUrike rADammA

#57 సామికి నాపై యింత sAmiki nApai yimta

Titleసామికి నాపై యింతsAmiki nApai yimta
Written By
రాగం rAgaకదంబంkadambam
తాళం tALaమిశ్రmiSra
పల్లవి
pallavi
సామికి నాపై యింత చలమ్యేలనే
విను కోమలాంగి యిక నే తాళజాలనె
sAmiki nApai yimta chalamyElanE
vinu kOmalAmgi yika nE tALajAlane
చరణం
charaNam 1
ఈడకు నా చెలికాడ నవ్విధవిధ వేడుకతోనే
పౌఢతగా ఆడిన పాడిన వేడిగా నను జూడడే
నాతో ప్రతిమాట లాడెనో చెలి
IDaku nA chelikADa navvidhavidha vEDukatOnE
pouDhatagA ADina pADina vEDigA nanu jUDaDE
nAtO pratimATa lADenO cheli
చరణం
charaNam 2
ఇమ్ముగ తను నెరనమ్మితినని బగలు నమ్మిక లిదిగో
కొమ్మని నే పొమ్మని రమ్మని కొమ్మని మ్రొక్కుచు
ముమ్మారు బిలిచిన సమ్మతించడే చెలి
immuga tanu neranammitinani bagalu nammika lidigO
kommani nE pommani rammani kommani mrokkuchu
mummAru bilichina sammatimchaDE cheli
చరణం
charaNam 3
శ్రీసతి తిరుపతి వాసుడు అన్యుల బాసలు జేసి
పరియాసముతో ఆసలు బాసలు మోసబరిచెనని
రోసముతో యిక సంతోషపడే చెలి
SrIsati tirupati vAsuDu anyula bAsalu jEsi
pariyAsamutO Asalu bAsalu mOsabarichenani
rOsamutO yika samtOshapaDE cheli

#56 సరసకు రారా sarasaku rArA

Titleసరసకు రారాsarasaku rArA
Written By
రాగం rAgaతోడిtODi
తాళం tALaమిశ్రmiSra
పల్లవి
pallavi
సరసకు రారా సామి మ్రొక్కేరాsarasaku rArA sAmi mrokkErA
చరణం
charaNam 1
మరులుకొన్న నాకు మనసియ్యవేరా
తరుణి బెట్టిన మందు తలకెక్కేగదరా
marulukonna nAku manasiyyavErA
taruNi beTTina mamdu talakekkEgadarA
చరణం
charaNam 2
నిరతము నిన్ను నెరనమ్మి యున్నారా
కరుణతో నన్నేల రాగాడమ్యేల
niratamu ninnu neranammi yunnArA
karuNatO nannEla rAgADamyEla
చరణం
charaNam 3
పూజ సేయుదు నీకు పొందిక తోను
రాజసమ్యేలర రాజగోపాల
pUja sEyudu nIku pomdika tOnu
rAjasamyElara rAjagOpAla

#55 కాశికి పొయ్యేనే kASiki poyyEnE

Titleకాశికి పొయ్యేనేkASiki poyyEnE
Written By
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaమిశ్రmiSra
పల్లవి
pallavi
కాశికి పొయ్యేనే నీ వల్లనే
కాశికి పొయ్యేనే వోశోశి నా
kASiki poyyEnE nI vallanE
kASiki poyyEnE vOSOSi nA
మదియున్నదంట నీదు ఆశలెల్ల
నిరాశ జేసుకుంటినే
madiyunnadamTa nIdu ASalella
nirASa jEsukumTinE
చరణం
charaNam 1
యే తీరునైనాను ప్రీతి సేయుదువని
పాతకి నే చాలభ్రమసి తిరుగుచుంటి
రాతి మనసుగల
నాతి నీవనుచును నే తెలియక
మోసపోతి వేసారితి
yE tIrunainAnu prIti sEyuduvani
pAtaki nE chAlabhramasi tiruguchumTi
rAti manasugala
nAti nIvanuchunu nE teliyaka
mOsapOti vEsAriti
చరణం
charaNam 2
చక్కగాను నీవు సంతోషముగ నాతొ
వొక్క మాటాడిన తక్కువటే నాతొ
ఇక్కడి భ్రాంతిచే ఇల్లాలిని బాసి
దిక్కు దెసయులేక తిరిగి తిరిగి రోసి
chakkagAnu nIvu samtOshamuga nAto
vokka mATADina takkuvaTE nAto
ikkaDi bhrAmtichE illAlini bAsi
dikku desayulEka tirigi tirigi rOsi
చరణం
charaNam 3
ముద్దుగుమ్మ మనమిదరముంగూడి
ముద్దునటేశ్వర మూర్తికి తెలుసును
నుధ్ధరించుటకైన సుదతిరో తలచక
పద్దుజేసి నాతో పలుకవు మదిచెడి
muddugumma manamidaramumgUDi
muddunaTESwara mUrtiki telusunu
nudhdharimchuTakaina sudatirO talachaka
paddujEsi nAtO palukavu madicheDi

#54 ఎంతొ నెరజాణుడమ్మా emto nerajANuDammA

Titleఎంతొ నెరజాణుడమ్మాemto nerajANuDammA
Written By
రాగం rAgaచామరంchAmaram
తాళం tALaఏకEka
పల్లవి
pallavi
ఎంతొ నెరజాణుడమ్మా
యశొదా నీ కొడుకెంతొ నెరజాణుడమ్మా
emto nerajANuDammA
yaSodA nI koDukemto nerajANuDammA
చరణం
charaNam 1
ఎక్కడివి యీ కమ్మలు చక్కగను లేదనుచు
టక్కుగ నా చెంతచేరి చెక్కిలిని నొక్కెగదె
ekkaDivi yI kammalu chakkaganu lEdanuchu
Takkuga nA chemtachEri chekkilini nokkegade
చరణం
charaNam 2
కాటుక కన్నుల నులగడు
నీటుగ లేదనుచును
గోట కనుగీటి పట్టు నోట ముద్దు బెట్టెగదే
kATuka kannula nulagaDu
nITuga lEdanuchunu
gOTa kanugITi paTTu nOTa muddu beTTegadE
చరణం
charaNam 3
తామిచ్చె రమ్మని తలుపు వోరగ జేసియా
బాయను నా చనుదోయి చయ్యన నను బట్టెగదె
tAmichche rammani talupu vOraga jEsiyA
bAyanu nA chanudOyi chayyana nanu baTTegade
చరణం
charaNam 4
మానినుల నిట్టు సేయమాన్యయని పలుక
మానమేది చూపుమని మానిని కొంగీడ్వాసాగె
mAninula niTTu sEyamAnyayani paluka
mAnamEdi chUpumani mAnini komgIDvAsAge

#53 అలవాని alavAni

TitleఅలవానిalavAni
Written By
రాగం rAgaకాపిkApi
తాళం tALaమిశ్రmiSra
పల్లవి
pallavi
అలవాని నేరాలేమే అతివరోalavAni nErAlEmE ativarO
చరణం
charaNam 1
తొలుత తొలుత నే నాదను వలపించుక లేక యున్న
చెలి నా బలవంతమునను చెలువుని పైకొనియుండగ
toluta toluta nE nAdanu valapimchuka lEka yunna
cheli nA balavamtamunanu cheluvuni paikoniyumDaga
చరణం
charaNam 2
దుడుగు మనము వానిపైని
ముడివడ దడబడి వానితో
కడువడి నేస్తము చేసితి
ఘనుని సేతలే నెరుగక
duDugu manamu vAnipaini
muDivaDa daDabaDi vAnitO
kaDuvaDi nEstamu chEsiti
ghanuni sEtalE nerugaka
చరణం
charaNam 3
సందు దొరికినప్పుడు నా సరసునికీ వాసవతీ
యెవతొ మందు
యెందు బెట్టెనొ నీ మనసిటు
గొంతయు గూడదు
samdu dorikinappuDu nA sarasunikI vAsavatI
yevato mamdu
yemdu beTTeno nI manasiTu
gomtayu gUDadu

#52 కామిని నిను గోరెనా kAmini ninu gOrenA

Titleకామిని నిను గోరెనాkAmini ninu gOrenA
Written By
రాగం rAgaహిందుస్తానిhindustAni
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
కామినినిను గోరెనా
కాదనక చేకోరా
kAminininu gOrenA
kAdanaka chEkOrA
చరణం
charaNam 1
ఘనమగు తమిచెంది
కాసిలు అలచలువ చెలువ
ghanamagu tamichemdi
kAsilu alachaluva cheluva
చరణం
charaNam 2
మదన ప్రదరకర మెదగురి కొన
విదళిత మతియయి
madana pradarakara medaguri kona
vidaLita matiyayi
చరణం
charaNam 3
సిక రాజచంద్ర
ప్రసిధ్ధి ముసరు మోహమున
sika rAjachamdra
prasidhdhi musaru mOhamuna

#51 మోడిసేయ mODisEya

TitleమోడిసేయmODisEya
Written By
రాగం rAgaజంఝూటిjamjhUTi
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి
pallavi
మోడిసేయ న్యాయమా
చాడి దండి సవితిమాట చవిగొని నెలరెల్ల వదలి
mODisEya nyAyamA
chADi damDi savitimATa chavigoni nelarella vadali
చరణం
charaNam 1
మారు బారిబారి నీదు మరుగు గోరి మమత మెయిని
సారె సారెకు నిను వేడిన చాలు చాలు నను గూడక
mAru bAribAri nIdu marugu gOri mamata meyini
sAre sAreku ninu vEDina chAlu chAlu nanu gUDaka
చరణం
charaNam 2
నెలవెన్నెల వేడిమిచే
విలుతతి వెదల జెంది
చలువుడు రా భాగ్యమబ్బ
గలద నీ మది నెంచి బల్
nelavennela vEDimichE
vilutati vedala jemdi
chaluvuDu rA bhAgyamabba
galada nI madi nemchi bal

#47 కాసాని చెలి kAsAni cheli

Titleకాసాని చెలిkAsAni cheli
Written By
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
కాసాని చెలినే గాదటరా నీ
బాసలెల్ల యే మాయనురా
kAsAni chelinE gAdaTarA nI
bAsalella yE mAyanurA
చరణం
charaNam 1
సారెకు నా సరివారి యెదుట నిన్ను
రారా రాయని బిలచి
sAreku nA sarivAri yeduTa ninnu
rArA rAyani bilachi
చరణం
charaNam 2
ఆ సతులతో బరియాసము సలుపక
రోసముతో యోరోరి యని బిలిచిన
A satulatO bariyAsamu salupaka
rOsamutO yOrOri yani bilichina
చరణం
charaNam 3
రేపగలని భేదములెంచక
నీపైగొని ఉపరతులను సలుపక
rEpagalani bhEdamulemchaka
nIpaigoni uparatulanu salupaka
చరణం
charaNam 4
ధర్మపురిని నెలకొన్న శ్రీపరవాసు
నిర్మలమగు వేంకటేశుని సాక్షిగ
dharmapurini nelakonna SrIparavAsu
nirmalamagu vEmkaTESuni sAkshiga

#46 మనకేలానె manakElAne

TitleమనకేలానెmanakElAne
Written By
రాగం rAgaకాపిkApi
తాళం tALaమిశ్రmiSra
పల్లవి
pallavi
మనకేలానె లేని పోని మాటలు మనకేలానేmanakElAne lEni pOni mATalu manakElAnE
చరణం
charaNam 1
కనికరమున తా వినయము నెంచక
మనసున ప్రియింప
kanikaramuna tA vinayamu nemchaka
manasuna priyimpa
చరణం
charaNam 2
కాముని కేళిలొ సోమజ చంద్రుని
తలచినదేయల
kAmuni kELilo sOmaja chamdruni
talachinadEyala
చరణం
charaNam 3
వేమరొ సురపురి వేణుగోపాలుని
కలసినదేయల
vEmaro surapuri vENugOpAluni
kalasinadEyala