| Title | వాని యెడబాసి | vAni yeDabAsi |
| Written By | ||
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వాని యెడబాసి నేనెటు లోర్తునే చెలి కాని వారితో గూడి కనబడడె చెలి | vAni yeDabAsi nEneTu lOrtunE cheli kAni vAritO gUDi kanabaDaDe cheli |
| చరణం charaNam 1 | ఇచ్చలతో నన్ను నిండు కౌగలించి మచ్చిక చేసినది మరచెగదే చెలి | ichchalatO nannu nimDu kaugalimchi machchika chEsinadi marachegadE cheli |
| చరణం charaNam 2 | చిన్న వయసు నుండి జేరి నాతో తన చిన్నెలు జూపినను చిన్నబుచ్చెనే చెలి | chinna vayasu numDi jEri nAtO tana chinnelu jUpinanu chinnabuchchenE cheli |
| చరణం charaNam 3 | ధరవెలయు శ్రీరంగధాముడు ననుగూడి నిరతము బాయనని ఆనబెట్టెనే చెలి | dharavelayu SrIramgadhAmuDu nanugUDi niratamu bAyanani AnabeTTenE cheli |